தமிழ்| telugu

» ఇతరములు » ఆ ది బ లి

ఆ ది బ లి

ఆదియందు నారాయణుడు ఆకాశమును భూమిని సకల జగత్తును సృష్టించెను. ఆ సమయమున సముద్రముగాని మరణము గాని పాతాళము గాని లేదు. అది ఒక దైవీక పరిపాలన! శ్రీమన్నారాయణుడు వైకుంఠములో జ్యోతిలో ఆసీనుడై, రాజులకు రాజుగ, ప్రభువులకు ప్రభువుగ పరిపాలించుచుండెను. ఆ సమయములో ఆయనకు విరోధులుగాని శత్రువులుగాని ఎవ్వరూ లేరు. ఆ దేవలోక ప్రజలు ఆ జ్యోతిని చూచుచు ఆయన ఒక్కడే పరిశుద్దుడని స్తుతించుచుండెడివారు. వారందరూ ఒకే దేవుడు ఒకే జాతి అనే సిద్ధాంతములో వుండెడివారు. అప్పుడు జాతి, కుల, మత, వర్ణ బేధములు ఏమీ లేవు. మనుష్యులందరూ ఇతరులను ప్రేమించు చుండెడివారు. చాలా రాజ్యములు వుండెను. కాని యుద్ధములు లేవు. భూలోక వాసులకు, భగవంతుని జ్యోతి గురించి తెలుసు గాని ఆ జ్యోతిలో నివసించుచున్న పరమపురుషుడు ఎవరో వారికి తెలియదు. వారు శ్రీమన్నారాయణుని చూడలేదు. ఆ సమయముననే శ్రీమన్నారాయణుడు దేవలోక ప్రజల క్షేమం కొరకై ఒక బలిని నిర్వహించెను. దాని ద్వారా చిరకాలము జీవించి అమరత్వము పొందుడని వారికి చెప్పి, వారిని దీవించెను. అది మాత్రమే కాకుండా శ్రీమన్నారాయణుడు ఒక మనుష్యునిగ వారికి కనిపించి, ”నేనే వైకుంఠమునకు, భూమికి రాజునని” ప్రకటించెను. దీనికి దేవలోక ప్రజలు నీవు మానవునిగ ఎట్లు రాగలవు అని ప్రశ్నించితిరి. ”నేను నా జీవమును యిచ్చి తిరిగి తీసుకొనగలనని” ఆయన చెప్పెను. అప్పుడు దేవలోక ప్రజలు తన శక్తిని నిరూపించి జీవమునిచ్చు అమరత్వమును యివ్వమని ప్రార్థించితిరి. ఆ సమయముననే శ్రీమన్నారాయణుడు ఆదిబలిని నిర్వహించెను. అదే ఆదియజ్ఞమని కూడా పిలువబడుచున్నది. దీనినే భగవద్గీతలో బ్రహ్మయజ్ఞము అనియు, పరిశుద్ద బైబిలు గ్రంధములో వధింపబడిన గొఱ్ఱెపిల్ల అనియు, పవిత్ర ఖురాన్‌లో బక్రీదు అనియు పిలుచుచున్నారు.

భగవంతుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ స్థాపనకై శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ నామములో అవతరించి, ఒకే దేవుడు! ఒక దేశము! అనే సత్యమును ఈ లోకానికి చాటంచి, 03-10-1987వ తేదీన ఈ భూమిలో ఆదిబలి ప్రేమ పతాకమును ఎగురవేసి, ”ఆకాశానికి, భూమికి, సముద్రమునకు, సృష్టంతటికీ నేనే రాజాధిరాజునని” తన ధర్మమును స్థాపించెను.

శ్రీమన్నారాయణునికి వున్న ఇటువంటి మహాత్తరమైన శక్తి వేరే ఇతర బాబాలకు గాని, తామే దైవములని చెప్పుకొంటున్న వారికి గాని లేదు. ఒక రోజున వారంతా శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ వద్దకే రావలసియున్నది. అందుచేత భగవంతుడైన శ్రీమన్నారాయణుని మరియు ఆయన మన కొరకై చేసిన ఆ మహాత్తరమైన బలిని నిరంతరము జ్ఞాపకము చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం!

– డి. తిరుపతి రావు, వన్నాయపాలెం.

Filed under: ఇతరములు