தமிழ்| telugu

» కవితలు » కవితలు

కవితలు

కష్టములలో కాపాడే కలియుగ కృష్ణా!
భగవంతుడా! శ్రీమన్నారాయణ! అణువు అణువున నిండియున్నది నీవే!
అఖిలమును సృజించినది నీవే! ఆదిలో బలియైనది నీవే!
సీయోనులో రాజువు నీవే! నిత్యము వున్నవాడు నీవే!
జలములలో సంచరించువాడవు నీవే! కల్కి మహావతారము నీవే!
ఇహలోకములు ఏలువాడవు నీవే! మా సృష్టికర్తవు నీవే!
జీవమును యిచ్చువాడవు నీవే! మాలో జీవించేది నీవే!
మమ్ములను నడిపించేవాడు నీవే!
మా యొక్క విశ్వాసము నీవే! మా కష్టములలో కాపాడే కలియుగ కృష్ణుడవు నీవే!
మాకు ఆనందమిచ్చినన ఆనంద లహరివి నీవే
మమ్ములను ప్రేమించేవాడవు నీవే
మా ప్రాణ ప్రియుడవు నీవే! మా హృదయములో నివసించేవాడవు నీవే!
మమ్ములను వరించే వరుడవు నీవే! నీవు లేని మా జీవితం శూన్యం!

– హవీలా, మనుజ్యోతి ఆశ్రమము.

మనుజ్యోతి
మతములేని మనుజ్యోతి – ప్రజల మనస్సును దోచే మనుజ్యోతి
లహరికృష్ణ స్థాపించిన మనుజ్యోతి – లక్ష్యం కాపాడి నిలిచే మనుజ్యోతి
బైబిలు చూపించు ఏదేను మనుజ్యోతి – భగవద్గీత చెప్పిన బృందావనం మనుజ్యోతి
ఖురాన్ తెలిపే స్వర్గం మనుజ్యోతి – ఇమామ్ మెహదీ వుండే చోటు మనుజ్యోతి
ఒకే దేవుడు! ఒకే దేశం! అనే మనుజ్యోతి – మానవులకు వెలుగును యిచ్చే మనుజ్యోతి
ఆదిబలి జనులు ఒకటిగా చేరే మనుజ్యోతి – నిజమైన సత్యనగరం యీ మనుజ్యోతి
లోకానికి వెలుగైయున్నది మనుజ్యోతి – ఆనందాశ్రమమే యీ మనుజ్యోతి
ఇంద్రాదుల దివ్యలోకం మనుజ్యోతి – జీవముగల పట్టణము మనుజ్యోతి
ఎత్తైన పర్వతమే యీ మనుజ్యోతి – భూలోక వైకుంఠం యీ మనుజ్యోతి
నూతన యెరూషలేము యీ మనుజ్యోతి
రాజాధి రాజు లహరికృష్ణయే వెలసిన చోటు ఈ మనుజ్యోతి

– కె. మధులత, మనుజ్యోతి ఆశ్రమము.

చతుర్దిశల నాకు ప్రభావిత లహరి – సుచిత్య గుణాతిశయ కీర్తి వ్యాపిత
సుందర రూపా శ్రీలహరికృష్ణా – నా ఆనందక్షణ అల్లి మాలవు నీవే లహరి
నను లాలించు పలుకుల వానవు నీవే – శుభప్రద నీ నామం జయప్రదమే శ్రీలహరికృష్ణ
నీ నామ వర్ణనకు మాటలు చాలునా – లహరి నీ స్తుతి కీర్తనకు రాగాలు సరిపోవునా
ప్రభు నీ భజన ఎంత చేసినా కొంతేగా అది
ఓర్వలేకున్నా నన్ను నేనే నీ ప్రేమ తలచిన క్షణాన
సకల జగతికైనా త్యాగం నీది – లహరి సర్వజన యోగముకైనా యాగమది
అర్పణం నీ జీవం ఆదిలో – అమరం మా ప్రాణం ఈ భువిలో
దయ నేత్ర ధరిత – నీ త్యాగ చరితం
వింటున్నా మాకు ఆనంద భరితం – వందనం మా పతినాధ
నీకే మా అభినందనం శ్రీలహరికృష్ణ

– రంజిత్, కొరుట్ల.

భగవంతుడు మనిషిగా రాగలడు అనునదే నిజమైన ధర్మం – సత్యం!
కలి అనగా సాతాను అయిన ఇబ్లీసు యొక్క అబద్దమైన అధర్మం!
భగవానులం అని చాటుకుంటున్న గురువులను హతమార్చుటకై,
అబద్ద ప్రవక్తలను రూపుమాపుటకై
మనిషిగా వచ్చిన దేవుడు శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణయే నిజమైన ధర్మం!
పరలోకానికి, భూలోకానికి, సమస్త సృష్టికే అధిపతిని అని
చాటిచెప్పిన రాజులరాజు శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణయే!
సకల సృష్టికే రాజుల రాజును అని సత్యం చాటిన సత్యవంతుడు!
బ్రహ్మయజ్ఞం జరిపి విశ్వమండలానికి ఆధారం అయిన
ఆదిబలి త్యాగి శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణా!
దేవ దేవుడు, మహా దేవుడు, రాజుల రాజు, జనాధిపతిగా
అల్లా, క్రీస్తుయేసు అయిన శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణయే!

– బి. రమేష్, గోదావరి ఖని

Filed under: కవితలు