தமிழ்| telugu

» కవితలు » కవితలు

కవితలు

నమ్మరా ఓ జీవుడా!

వింతైన ఈ లోక సంతలో

నీవెంత, నీ బ్రతుకెంతరా? ఓ జీవుడా?

బుడగవంటి వాడవురా! నీవు!

అందలి వాయువు వంటిదేరా నీలోని ఆయువు!

అది ఉన్నంత వరకే నీవు!

ఎవరికీ అణిగిపోలేని ఏనుగువు!

అది పోతే చాలు ఇక నీవు ఒక చచ్చిన పీనుగువు!

ఇట్టి నీ జీవితము ఓ పుస్తకమురా! – నమ్మరా ఓ జీవుడా! ఇది వాస్తవమురా!

దినము ఓ కాగితముగా ఎంచరా – అందలి నీ క్రియలు బ్రహ్మ లిఖితమని గాంచరా!

అది శ్రీమహావిష్ణువుకి సొంతమని గ్రహించరా!

నీకు నీవుగా ఆ పరమేశ్వరుడికి అంకితముగా నీ జీవితమర్పించరా!

వీరు ముగ్గురు కాదు ఒక్కరేనని!

ఆ ఒక్కరే దిగివచ్చిన శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణుడని

ఆయనే నీ జీవ కారకుడని విశ్వసించరా జీవుడా! ఓ జీవుడా!

నమ్మరా ఓ జీవుడా!

నీవు లేని జీవితం శూన్యం

ఈ సీయోను ఒక అరణ్యం – అందమైనది ఈ మన్యం

లహరికృష్ణయ్యా! నిను చూచిన కనులు ధన్యం

నీవు లేని ఈ జీవితం శూన్యం

అద్భుతమైనది నీ కరం, నీవు మాకు యిచ్చావు మహిమ వరం

నీ జీవ సందేశములు నిత్య అమృతం

ఓ లహరికృష్ణా! నీవే మా కిష్టం-నీవు మాతో వుండగా మాకు రాదు ఏ కష్టం

నీకు విరోధంగా వచ్చినవారికి తప్పగా వస్తుంది నష్టం

నీవు యిచ్చిన శ్రీమంత్రంతో కలిగేను మాకు విజయం

నీ మంత్రం జపిస్తే చాలు కలిగేను కలితంత్రం

నీవు మాపై వేసావు ప్రేమ బాణం – ఓ దేవ దేవా! నీవే మా ధనం

మేము ఎలా తీర్చుకోగలను నీ ఋణం – ఓ లహరికృష్ణా! మేమే నీ భక్త జనం.

– జి. దివ్యజ్యోతి, పెందుర్తి.

నీ ఆలయం మా దేహం

నీలో ఉన్న మాకు మరిపించు ”ఇహం” – మా నుండి తొలగించు ”అహం”

నీ హృదయమే మాదు నిత్య గృహం

నీ మాట ద్వారా తీర్చావు మా ఆత్మీయ దాహం

నీ వాక్యం ద్వారా మార్గం చూపి తీర్చావు మా సందేహం

విరుగగొట్టు మా నుండి స్వయం అను విగ్రహం

ఆత్మీయ జనులకు నీ సన్నిధిలో వుండుటయే ఉత్సాహం

కలి తంత్రాలకు లోబడకుండా నీవు యివ్వు నిగ్రహం

సర్వసృష్టి తట్టుకోలేనిది నీ ఆగ్రహం – మాపై ఎల్లప్పుడూ చూపు నీ అనుగ్రహం

నీకు నిలయమై యున్నది మా ఈ ”దేహం”.

– పాలీనా ఉదయకుమారి

గోపాలపట్నం

Filed under: కవితలు