» ఇతరములు » కాబా నిర్మాణం
కాబా నిర్మాణం
కాబా అనేది మక్కాలోని ఒక పవిత్ర ఆలయము. కాబా కట్టడంలో మునుపు కేవలం నాలుగు గోడలుండేవి. పై కప్పు లేదు. ఆ గోడలు కూడా నిలువెత్తుకు మించి వుండేవి కావు. ఇంకా కట్టడం పల్లపు భూభాగంలో ఉండడం మూలాన వానాకాలంలో కురిసే నీరంతా నగరం నలుమూలలా నుండి ప్రోగయి అక్కడకు చేరేది. దాన్ని ఆపడానికి కట్ట ఒకటి కట్టారు. కాని అది తెగిపోయి కాబా వద్ద నీరు నిండుకు పోయేది. అందుచేత కట్టడాన్ని పూర్తిగా పడగొట్టి గట్టి పునాదులతో పటిష్టమయిన కట్టడం నిర్మించాలని తీర్మానించుకున్నారు. కురైష్ ప్రజలంతా కలిసి నిర్మాణ కార్యాన్ని మొదలుపెట్టారు. వివిధ తెగల ప్రజలు కట్టడంలోని విభిన్న భాగాల్ని పంచుకున్నారు. కాబా గృహ నిర్మాణ భాగ్యాన్ని ఎవరు వదులుకుంటారు? అయితే హజ్రె అస్వద్గా (ఒక నల్లని శుభప్రదమైన శిల. ఇది కాబా గోడలో అమరి ఉంటుంది / మక్కాలో ఉంచబడిన లింగం. దానినే హిందువులు మక్కేశ్వరుడుగా భావిస్తారు). దానిని ప్రతిష్టింపచేయవలసి వచ్చినప్పుడు పెద్ద వివాదం బయల్దేరింది. ప్రతి తెగవారు దాన్ని ప్రతిష్టించే ఘనత తమకి దక్కాలని వాదించారు. వివాదం చిలికి చిలికి గాలివానయింది. ఖడ్గాలు, కరవాలాలు చేతుల్లోకి వచ్చాయి. వివాదం నాలుగు దినాలవరకు సాగింది. వివాదం పోరాటంలోకి మారే ముందు, అయిదవ రోజున కురైష్లోని ఓ వృద్ధనాయకుడు ఒక సలహా యిచ్చాడు. దాని ప్రకారం ”రేపు ప్రొద్దున ప్రపధమంగా ఇటువైపుకు వచ్చే వ్యక్తిని న్యాయనిర్ణేతగా అంగీకరించి ఆయన చేసే తీర్పును అందరూ సహృదయంతో స్వీకరించాలి” అని నిర్ణయించుకున్నారు. ఈ తగాదాను పరిష్కరించమని అర్థించారు. ఆయన ఒక పెద్ద దుప్పటిని తెప్పించారు. హజ్రె అస్వద్ ప్రతిష్ట చేయాలని కోరుకునే వారందరిలో అగ్ర నాయకులయిన వారిని ఆ దుప్పటి చుట్టూ పట్టమని ఆదేశించారు. తానే స్వయంగా హజ్రె అస్వద్‌ను ఆ దుప్పటిలో పెట్టారు. అందరూ ఆ దుప్పటిని లేవనెత్తి ఆ శిలను అమర్చవలసిన చోటికి తెచ్చారు. తిరిగి ముహ్మమ్మద్ (సఅసం) ఆ శిలను ఎత్తి గోడలో అమర్చివేశాడు. ఈ విధంగా గొప్ప రక్తపాతంగా పరిణమించగల వివాదాన్ని తన వివేచనాశక్తితో ఆయన అతి సులువుగా పరిష్కరించారు. అప్పుడు నిర్మించిన కాబా గృహానికి కప్పు కూడా వేశారు. నిర్మాణ సామాగ్రి సమృద్ధిగా లేనందువల్ల క్రొత్త పునాదుల్ని త్రవ్వేటప్పుడు ఒకవైపు కొంత భాగాన్ని వదలవలసి వచ్చింది. ఆ వదిలిన భాగాన్ని నేడు హతీమ్ అని అంటారు.
కలము ద్వారా జ్ఞానాభివృద్ధి చెందెడి యుగము రానున్నదని ప్రప్రధమ ‘భవిష్యవాణి’ ద్వారా తెలుపబడియున్నది. (ఇప్పుడ మనము అదే కలము ద్వారా జ్ఞానము పొందెడి యుగములో జీవించుచున్నాము). పవిత్ర ఖురాన్లో చెప్పబడినట్లు ఈ గ్రంధము యొక్క మరి యొక నామము ‘భవిష్యవాణి’ అని పిలువబడుచున్నది. ఖురాన్ అనగా చదువవలసిన గ్రంధము లేక సువార్త అని కూడా అర్ధము.
మహ్మద్ కాలములో అల్లాహు ఒక్కడే మా ‘రబ్’ అని అతను అంటే వినేవారు అలా పలికేవారు. అప్పటి కాలములో కలము ద్వారా చదివి గ్రహించే జ్ఞానము వారికి యివ్వబడలేదు. అల్లాహ్‌ా తప్ప మరే పోషకుడూ, దాత లేడు. అలాంటప్పుడు మానవుడు ఆయనకే కృతజ్ఞుడై యుండాలి. ఆయన్నే ప్రార్థించాలి. ప్రేమాభిమానాలతో పవిత్రతా భావంతో, విశ్వాసంతో ఆయన ముందే తలవంచాలి. మోకరిల్లాలి. ఆయన తప్ప మరొకరు పూజా పురస్కారాలకు అర్హులు కారు. కాజాలరు. మానవులకు అల్లాహ్‌ా తప్ప మరెవ్వరూ స్వామి, యజమాని కాడు. మానవులంతా ఆయనకే దాసులుగా, విధేయులుగా మెలగాలి. మానవుడు తోటి మానవుల సమక్షంలో మాత్రమే స్వేచ్ఛాజీవి. ఎవరికి దాసుడు కాడు. కాని దైవానికి అభిముఖంగా తాను సర్వాధికారినని, సర్వ స్వతంత్రుడనని మనిషి భావించకూడదు. ఆలాగే ఇతరుల్ని సయితం సర్వాధికారులని సర్వ స్వతంత్రులని ఎంచకూడదు. మానవులందరికీ దైవం తప్ప మరెవ్వరి ధ్యానము, విధేయతా తగవు. అల్లాహ్‌ా తప్ప మరో వ్యక్తి, మరో శక్తి, మనిషికి అధికారి, పాలకుడు కాడు. కనుక విధేయత, ఆజ్ఞాపాలన ఆయన పట్ల మాత్రమే చెయ్యాలి. మానవుడు స్వయంగా తానే ప్రభువై కూర్చోరాదు మరియు దైవం తప్ప ఇతరులెవ్వరి ఆధిపత్యాన్ని అంగీకరించరాదు.
తోరాత్ (మూసా గ్రంధము)నందు, బైబిల్లోనూ సువార్తయందు, ఖురాన్ గ్రంధము నందు అల్లా స్వయముగా ఈ పై ప్రమాణములను చేసియున్నాడు. ఆ ప్రకటనలో ఈ భావాలు ఇమిడి వుండటం మూలానే ఒక వైపు తాత ముత్తాతల నాటి నుంచి ఆరాధించబడే ఆరాధ్య దైవాల ‘దైవత్వం’ అంతమయిపోతుందని, మత గురువులు, తెగల నాయకులు సహించలేకపోయారు. కానీ వారు పూర్వపు రోజులలో ఇబ్రహీమ్, విగ్రహారాధనను తీవ్రముగా ఖండించాడు అని వారు గ్రహించకపోయారు.
‘మలక్’ అనే పదమునకు ‘వార్తాహరుడు లేదా ప్రతినిధి’ అని అర్ధము. దేవదూతలను సృష్టించిన ధ్యేయము మనకు స్పష్టమగుచున్నది. వారు దేవుని యొక్క వార్తలను తెచ్చి వాటి ప్రకారము దేవుని యొక్క ఇచ్ఛను ఈ విశ్వమునందు అమలు జరిపెదరు. పరమాత్మ తన ఇష్టమును భౌతిక, ఆధ్యాత్మిక ప్రపంచ రంగములందు అమలుపరచు నిమిత్తము ఏర్పాటు చేసిన విధానములో దేవ దూతలు ఒక భాగమైయున్నారు. ఆధ్యాత్మిక ప్రపంచమునందు దేవదూతల ప్రభావము ముఖాముఖిగ నుండును. ఏ తదితర ప్రతినిధి యొక్క ప్రభావము లేకుండా పని చేయుదురు. దేవదూతలను విశ్వసింపనిచో దేవుని వెలుగు మానవుని యొద్దకు చేరెడి మార్గమును మూసియుంచునట్లగును. ప్రవక్తల యొద్ద నుండియు నోవా, ఇబ్రహీమ్, ముసాజు ఇంకను మరియ కుమారుడైన ఇసా నుండియు ఒక గట్టి వాగ్ధానము తీసుకుంటిమని మీరు గుర్తునందుంచుకొనుడి.
దేవదూతలలో ఒకడైన జిబ్రాయీలూ/మిఖాయేలు/ఇంధ్రుడు (జిబ్రీల్ అస్సలామ్) అంటే ఆత్మ అని అర్థము. ఆయన తన ఔన్నత్యం చేత ఇతర దైవదూతలకంటే ప్రత్యేకంగా పేర్కొనబడ్డారు. (దేవతలలో నన్ను ఇంధ్రునిగా చూడవచ్చును అని పరమాత్మ పలికెను). ఈ విషయము ముతషాబిహాత్ ఆయత్తులలోనిది (సందిగ్ధ వాక్యాలు). దాని అర్ధము రూఢిగా అని చెప్పడానికి ఇది వీలు పడదు. దైవదూతల స్థితి గతులు ఎట్టివో మనకు తెలియవు. వారు పైకి పోయే స్థితి ఎటువంటిదో మనకు అర్ధం కాదు. ఈ దైవదూతలు ఎక్కిపోయే మెట్లు (యాకోబు చూచిన పరలోకపు ఏడు మెట్లు) ఎటువంటివో అనే విషయము కూడా మన జ్ఞానమునకు అందదు. అల్లాహ్‌ా ఒక ప్రత్యేకమైన తావులో వుంటాడనే విషయము ఊహించడానికి వీలు లేనిది. ఎందుకంటే ఆయన దేశ కాల పరిమితులకు అతీతుడు.
సజ్దహ్ా (సజ్దా అంటే మోకాలు వేయడం లేదా సాగిలపడడం) సూరాలోని 5వ ఆయతులో వేయి సంవత్సరాలు అంటే పరమాత్మ దృష్టిలో ఒక రోజు అని పేర్కొనబడినది. పరిశుద్ధ గ్రంధములోని కీర్తనలు 90:4 ప్రభువైన దేవుని దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటివలే యున్నవి. రాత్రియందలి ఒక జామువలే నున్నవి. మొదటి ఆదామును (జేష్టకుమారుని జగత్తు పునాధి వేయబడక మునుపు) సృష్టించిన సంధర్భమున ఆయనకు సజ్దా చేయమని పరమాత్మ దేవదూతలకు ఆజ్ఞనిచ్చినప్పుడు వారందరూ అట్లే సజ్దా చేసిరి. కాని ఇబ్లీసు అతని సహచరులు నిరాకరించిరి. జిబ్రీయేలు దూతకు అతని సహదూతలకు విరోధులైరి. పరమాత్మ దేవదూతల నుండియు మానవుల నుండియు వ్రక్తలను నిర్ణయించుకొనును. నిజముగా అల్లా స్వరము వినెడివాడు ”అల్లాను చూచువాడునై యున్నాడు” అల్లాను, ఆయన దూతలను, ఆయన ప్రవక్తలను, అంత్యదినమునందును విశ్వాసముంచనివారు నిజముగా దారి తప్పి దూరమై పోయెదరు. ప్రవక్తల ద్వారా ప్రజల నుండి ఒక వాగ్ధానము అల్లా తీసుకొనియున్నాడనే విషయమును గుర్తునందుంచుకొనండి. అల్లా అయిన మా గ్రంధము ద్వారా, జ్ఞానము ద్వారా మీకు తెలియపరచినట్లుగా మీ యొద్దకు ఒక ప్రవక్త వచ్చును. అతడు మీతో కలిసియుండును. అంత్యకాలములో విశ్వసించి (ఇమామ్ మెహదీకి) అతనికి సహాయపడండి. ఇందులకు మీరు ఒప్పుకొనెదరా? అని దేవదూతలను అల్లా అడిగెను. ఈ విషయమై మీపై నుంచిన భారమును మీరు స్వీకరించెదరా? అందులకు మానవులలోని దేవదూతల సమాధానముగా ఇట్లు పలికెదరు. ‘మేము ఒప్పుకొందుము’ దానిపై ఆయన ఈ విధముగా పలికెను. ‘అంత్యకాలమున ఇందుకు సాకక్షులుగా నిలబడియుండుడి.’ పరమాత్మ స్వరము ‘అంత్యకాలములో నేను కూడ అట్టి సాకక్షులలో ఒకనిగా ఉంటాను’ అని అనెను.
ప్రవక్త మహ్మద్ వారు క్రీస్తు శకము 570వ సంవత్సరమున ఆగస్టు నెలలో మక్కా నగరములో జన్మించెను. ‘మహ్మద్’ అనగా పొగడదగినవాడని అర్థము. ప్రవక్త యొక్క వయస్సు 30 సంవత్సరములు దాటినప్పటి నుండి ‘దేవుని ప్రేమ’ క్రమక్రమముగా ఆయనను ఆవరించుచు వచ్చినది. మక్కావాసులలో వున్న అనేక దుష్టాచారములకు, బహు దేవతారాధన విధానముకు ఆయన వ్యతిరేకుడాయెను. మక్కా నుండి మూడుమైళ్ళ దూరములో గుహలోనికి ప్రతిదినము వెళ్ళుచు, అచట ధ్యానము చేయ ప్రారంభించెను. తన 40వ యేట ఆ గుహలో ఆయనకు ప్రపధముగా దేవుని వాక్కు అందింపబడినది. ఆ వాక్కు నందు అనగా ఖురాన్‌లోని ప్రధమ వాక్యములందు (96:2,6) ఆయనకిట్లు తెలియజేయబడినది. ఏకైక దేవుని నామము వెదజల్లుము. ఆయనే (ఇమామ్ మెహది/ఈసానభి) ఆది మానవుని తన స్వీయ ప్రేమ అనెడి విత్తనము నాటి (ఆదిబలిలో/జగత్తు పునాది వేయబడక మునుపు) ఆయన ద్వారా కడవరికాలములో/అంత్యకాలములో ‘తోటి మానవుడనేడి’ (నల్లటి మనుష్యుడు/నల్లటి పరలోకపు జ్యేష్టకుమారుడు) స్వభావమును సృష్టియందుంచెను. ఆయన ద్వారా అన్ని విధములైన పరమాత్మ జ్ఞానమును ప్రపంచమునకు/లోకములకు తెలియపరచవలసినదని ముందుగా ఆకాశవాణి ద్వారా/భవిష్యవాణి. పవిత్ర ప్రవక్త దూతలలో మేలైనవాడు, జ్యేష్టకుమారుడు, ఇమామ్ మెహదీ. ఇతని మాటలను వినని యెడల నిర్లక్ష్య భావమును ప్రదర్శించుచు వెనుదిరిగిపోయినచో మీ స్థానములో మరొక జనాంగమును ఆయన అంత్యకాలములో తెచ్చి ఉంచగలడు. కొత్తగా వచ్చినవారు మీ వలే ప్రవర్తింపరు. రాజ్యాధికారమును చేతియందుంచుకొనిన ఆయనే (ఇమామ్ మెహదీ) ధన్యుడు. సర్వస్వంపై ఆయనకే అధికారము గలదు. అప్పుడు ఒక జనాంగము మానవులలో నుండి దేవదూతలు సాకక్షులై ఇలా పలికెదరు. ”ఓ మా దేవా! మమ్ములను పిలిచెడి ఒక వ్యక్తి యొక్క పిలుపుని మేము వినియుంటిమి.” ”మీరు ప్రభువును విశ్వసింపుడు. విశ్వాసులై యుండుడి” అనునదే అతని (కడవరి కాలపు ఇమామ్ మెహది) పిలుపు. ఆయత్తులు 69:10-11. ప్రజలలో ఇమామ్ మెహది అనే ఒక వ్యక్తి వున్నాడు. కాని అతడు పరమాత్మ మార్గములో హింసింపబడినప్పుడు, లోకులు పెట్టిన పరీక్షను పరమాత్మ విధించిన శిక్షగా అంత్యదినమందు భావిస్తాడు. ఇప్పుడు ఒకవేళ మీ ప్రభువు తరుపు నుండి సహాయం, విజయం వచ్చినట్లయితే ఈ వ్యక్తియే ‘నేను మీతో వున్నాను’ అని అంటాడు. భూలోకవాసుల హృదయాల స్థితి అల్లాహ్‌ాకు తెలియదా? ”భూమిపై ఇమామ్ మెహదీకి విశ్వాసులెవరో, కపటులెవరో తప్పనిసరిగా చూడవలసి వుంది. అందుచే మేము విశ్వసించితిమి. కావున ఓ మా ప్రభువా! మా పాపములను మన్నింపుము. మా యొక్క చెడును దూరపరుచుము. మేము మరణము నొందిన తరువాత పవిత్రులతో కలిసియుండెడి భాగ్యము నొసగుము. ప్రళయ దినమునందు మమ్ములను పరాభింపకుము” అని అన్నారు.
ప్రభువైన పరమాత్మ వారికి ఈ విధముగా సమాధానమిచ్చెను. ”అంత్యకాలములో నా నామము నిమిత్తమై ఎవరు తమ గృహముల నుండి తమ మతము నుండి వెళ్ళగొట్టబడిరో, హింసింపబడిరో, పోరాటములలో మరణించిరో అట్టివారి తప్పులను నేను నిజముగా క్షమించెదను. ప్రవహించెడి సెలయేరుల యొడ్డున నుండెడి ఉద్యానవనములోనికి (భూలోక వైకుంఠమైన మనుజ్యోతి ఆశ్రమమునకు) ప్రవేశించునట్లు చేయుదును. ఇది పరమాత్మ ఒసంగెడి ప్రతిఫలము. పెద్ద బహుమానము (నిత్యజీవము / మోక్ష మార్గము) అల్లా యొద్ద స్థిరమైయున్నది.”
అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన అల్లా పలికెను. ‘మానవ జాతికి ప్రభువైన వాని ఆశ్రయమును కోరెదను. మానవజాతికి రాజైనట్టియు, మానవులకు దేవుడై యున్నట్టియు ప్రభువును శరణు వేడెదను. ఆయనే ఏకైక దేవుడై యున్నాడు. ఆయనకు అనేక నామములు కలవు. ప్రజలతో ఇలా చాటింపుము. ”ఓ అవిశ్వాసులారా మీరు పూజించు విధముగా నేను పూజింపను. నేను ఆరాధించు విధముగ మీరును ఆరాధింపరు. మీరు పూజించువాటిని నేను పూజింపను. నేను ఆరాధించెడి ప్రభువును మీరు ఆరాధింపరు. అందుకే మీ మతము మీది నా మతము నాది. అంత్యకాలములో ఇమామ్ మెహది యొక్క మతమునందు ప్రజలు గుంపులుగా వచ్చి చేరుటను నీవు చూచెదవు. నీ ప్రభువును నీవు స్తోత్రింపుము. ఆయన యొక్క ఘనతను స్తోత్రపరచుము. ఆయనను క్షమాపణ వేడుము. వాస్తవముగా ఆయన త్వరితగతిని నీపై, నీ ఇంటివారిపై కరుణను కుమ్మరించువాడు. నిత్యజీవమును మోక్షమార్గమును సూక్ష్మముగా బోధించువాడు.
సేకరణ: మహ్మద్ మహా ప్రవక్త గ్రంధము నుండి…
పవిత్ర ఖురాన్ వాక్యమూల విషయ ధృఢీకరణ.
– కూర్పు : టి. హేమేందర్, తిరుపతి
Filed under: ఇతరములు