தமிழ்| telugu

» మనుజ్యోతి ఆశ్రమము » పరిశుద్ద బైబిలు గ్రంధము

పరిశుద్ద బైబిలు గ్రంధము

హెబ్రీయులకు వ్రాసిన గ్రంధము 4:12  అనుసరించి.,

”దేవుని వాక్యమనే ఆయన” సజీవముగలవాడై బలము గలవాడై

రెండంచులుగల యెటువంటి ఖడ్గము కంటెను వాడిగా వుండి,

ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు,

హృదయము యొక్క తలంపులను  ఆలోచనలను శోధించుచున్నాడు.”

బైబిలు అంటే ప్రభువైన దేవుడు ఒక వ్యక్తిగా నేరుగా ప్రవక్తలకు ఆజ్ఞాపించి, వారి ద్వారా వ్రాయబడిన వాక్యముగా వున్నది. ‘ఏడు ఉరుముల సందేశములు’ అనేవి ప్రకటన 10వ అధ్యాయములో చెప్పిన బలమైన దూతగా ప్రభువైన దేవుడు చివరి దినములలో శ్రమలకాలమునకు ముందుగా ఒకగుంపు ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడిన వాక్యమగును.

యెహెజ్కేలు 12:21-28. ”21వ వా. మరియు ప్రభువు వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. 22వ వా. -నరపుత్రుడా దినములు జరిగిపోవుచున్నవి, ప్రతి దర్శనము నిరర్థకమగుచున్నది అని ఇశ్రాయేలీయుల దేశములో మీరు చెప్పుకొను సామెత యేమిటి? 23వ వా. కావున నీవు వారికి ఈమాట తెలియజేయుము – ప్రభువైన దేవుడు సెలవిచ్చునదేమనగా – ఇకమీదట ఇశ్రాయేలీయులలో ఎవరును ఈ సామెత పలుకకుండ నేను దానిని నిరర్థకము చేసెదను గనుక నీవు వారితో ఇట్లనుము – దినములు వచ్చుచున్నవి. ప్రతి దర్శనము నెరవేరును. 24వ వా. వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదెగాండ్రమాటలైనను ఇశ్రాయేలీయులలో ఇకను వుండవు. 25వ వా. ప్రభువునైన నేను మాట యిచ్చుచున్నాను, నేనిచ్చు మాట యికను ఆలస్యము లేక జరుగును. తిరుగుబాటు చేయువారలారా, మీ దినములలో నేను మాట యిచ్చి దాని నెరవేర్చెదును, ఇదే ప్రభువైన దేవుని వాక్కు. 26వ వా. మరల ప్రభువు వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. 27వ వా. నరపుత్రుడా – వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరుగవలెననియు బహుకాలము జరిగిన తరువాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇశ్రాయేలీయులు చెప్పుకొనుచున్నారు గదా. 28వ వా. కాబట్టి నీవు వారితో ఇట్లనుము – ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నియు జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండ జరుగును. ఇదే ప్రభువు వాక్కు.”

బైబిలు గ్రంధము భగవంతుని దైవీక ఉత్తేజము ద్వారా వ్రాయబడియున్నది.  బైబిలు అనే పదము గ్రీకు భాషలో బిబ్లియా అను పదమునుండి పుట్టినది. బిబ్లియా అను పదమునకు పుస్తకములు అని అర్ధము. నిజముగా బైబిల్‌ అనేది పలు పుస్తకముల యొక్క సమీకరణగా వున్నది. వివిధ రకములైన చాలా మంది ప్రజలచే వ్రాయబడినది. దాని ప్రతులను విశిదముగా పరీక్షించినచో గ్రంధకర్తలు వేర్వేరు పనికి చెందినవారిగా వున్నారు అని చూడగలము.

యెష్షయి వంటి ప్రవక్తలు, వ్యవసాయ కూలియైన ఆమోసు, చేపలు పట్టేవారైన యోహాను, పేతురు మరియు రాజులైన దావీదు మరియు సొలొమోను వీరంతా దానిని వ్రాసియున్నారు. ప్రధానమంత్రి అయిన దానియేలు, యిర్మియా, జెకర్యా వంటి గురువులు – ఒక వైధ్యుడైన లూకా, సైన్యాధిపతియైన యెహోషువ – గొప్ప న్యాయాధిపతియైన సమూయేలు – సుంకపు అధికారి అయిన మత్తయి – న్యాయవాదియు గుడారములు కుట్టువాడునైన పౌలును బైబిల్‌ రచించినవారి పట్టికలో వున్నారు.

కాని ఈ పుస్తకము యొక్క గ్రంధకర్తల వివరముల గురించి మాత్రమే లెక్కకు తీసుకొంటే మనము బైబిల్‌ గ్రంధమును తప్పుగా అర్ధము చేసుకొనుచున్నాము. ఎందుకంటే నిజమైన బైబిల్‌ గ్రంధ కర్త ప్రభువైన దేవుడే. తనను బయలుపరచుటకు తన సంకల్పమును బయలుపరచుటకు ఈ మనుష్యులను గ్రంధ కర్తలుగా, ఆయన పనిముట్లుగా ఉపయోగించెను.

ఒక విశాలమైన మనస్సుతో ప్రభువైన దేవుని యొక్క వాక్యమైన బైబిలును చదివినచో, దేవునిచే ఎన్నుకొనబడిన వారికి ఈ దైవీక ప్రేరేపణవలన వ్రాయబడినదియు, చివరిది లేక పరిపూర్ణమైన అధికార పత్రంగాను వున్నది.

ఇంగ్లీషు బైబిల్‌ ఆవిర్భావం :  ఇప్పుడు మనము ఇంగ్లీషు బైబిలు దొరికిన కధను చూద్దాము. ఆంగ్లేయుల యొక్క భాషలో బైబిల్‌ను తర్జుమా చేయు మొదటి ప్రయత్నము చాలా కాలమునకు ముందే జరిగినది. కాని గ్రంధములో కొద్ది భాగము మాత్రమే తర్జుమా చేయబడినది.

సుమారుగా క్రీ.శ 670వ సంవత్సరమున విడ్పీ అను స్థలములో వున్న హిల్డా అనే ఆమెయు గురుమఠంనకు చెందిన కేడ్మోన్‌ అతను సహోదరుడు, పాత క్రొత్త నిబంధన మరియు క్రొత్త నిబంధనలలోని కొన్ని భాగములను ఇంగ్లీషు వాక్యములుగా కూర్చి వ్రాసెను.

బైబిలు గ్రంధములోని ఒక భాగమును ఇంగ్లీషులోనికి తర్జుమా చేసిన మొదటి వ్యక్తి ఆల్దెలామ్‌. ఈయన సర్బాన్‌లో బిషప్‌గా వుండిరి. ఆయన కీర్తనలను ఇంగ్లీషులోనికి అనువదించెను. క్రీ.శ. 709వ సం||లో మరణించెను.

తరువాత పేర్కొనదగిన తర్జుమా చేసినవారు బిడే అనే వ్యక్తి ఆంగ్ల చరిత్రను చదువుకొనుచున్న విద్యార్థులకు ఈయన తెలిసివుండవచ్చును. ఆయన క్రీ.శ 735వ సంవత్సరమున ఆయన తన మరణశయ్యపై వుండి యోహాను సువార్తను ఇంగ్లీషులోనికి తర్జుమా చేసెను. ఆయన తర్జుమాచేసినవి ఇప్పుడు లేవు.

ఆల్‌ఫ్రెడ్‌ రాజు పది ఆజ్ఞలను మోషే ధర్మశాస్త్రములోని మిగతా భాగములను తర్జుమా చేసాడని చూడవచ్చును. ఆయన మరణకాలములో కీర్తనలు తర్జుమా చేయుటలో నిమగ్నుడై యుండెను. క్రీ.శ 700వ సం||లో ప్రతి ఒక్క వాక్యమును కెంట్‌ మాటలలో తర్జుమా చేయబడి యున్నది. లాటిన్‌ భాషలో వ్రాయబడిన కీర్తనలు వున్న చేతివ్రాత పత్రిక చాలా పురాతనమైనది. పూర్తిగా ఇంగ్లీషులో వ్రాయబడిన పురాతన ప్రతి క్రీ.శ. 1000వ సం||లో బాత్‌లో ఏయిల్‌ప్రిక్‌ తర్జుమా చేసిన సువార్తలు. ఇది కేంబ్రిడ్జ్‌లోని కోరపస్‌ – క్రిష్టి కాలేజిలోని లైబ్రెరీలో వున్నది.

13వ శతాబ్దం మధ్య కాలములో కీర్తనలు వచనములుగా తర్జుమా చేయబడినవి. మొట్టమొదటిగా ఆంగ్ల పరిశుద్ద గ్రంధమును పూర్తి తర్జుమా చేసిన గొప్ప ఘనత, అదృష్టము జాన్‌ వైక్లిఫ్‌కి చెందును. సామాన్య ప్రజల కొరకు వారి శ్రేయస్సు కొరకు ఆయన ధైర్యముతో వాదించి, ఇంగ్లీషులో ఆ గ్రంధమును తర్జుమా చేయుటకు పూనుకొనెను. దానికి ఫలితముగా ఆయన పరిశుద్ద సంఘము నుండి వెలివేయబడెను. ఆయన క్రీ.శ. 1380లో వల్‌గేట్‌ నుండి తర్జుమా చేసెను.

గ్రీకు భాషను నేర్చుకొను ఆశక్తి కలిగియుండుట వలన పరిశుద్ద గ్రంథము అమలులోనికి వచ్చినది. అప్పుడు గ్రీకు భాషనుండి నేరుగా తర్జుమా చేయుటకు సాధ్యమైనది. దేవుడు ఈ గొప్ప కార్యమును చేయుటకు ఎన్నుకొనిన ఏకైక వ్యక్తి విలియమ్‌ టిన్‌డేల్‌. ఈ గొప్పవ్యక్తి మార్టిన్‌ లూథర్‌ జన్మించిన ఒక సంవత్సరము తరువాతను, విక్లీపి మరణించిన వంద సంవత్సరములు తరువాత జన్మించాడు.

ఈయనను ఇంగ్లీషు బైబిలుకు నిజమైన తండ్రి అని పిలువవచ్చును. ఆక్స్‌ఫర్డ్‌లో ఆయన మాష్టర్‌ పట్టాను తీసుకొని తరువాత కేంబ్రిడ్జ్‌లో చేరాడు. అక్కడనే బైబిల్‌ గ్రంధము ఇంగ్లీషులో తర్జుమా చేయుటకు నిర్ణయించబడెను. లండన్‌కు చెందిన బిషప్‌ ద్వారా అతని ఆలోచనలకు ఆటంకము కలిగెను. మరియు సహాయము చేయుటకు నిరాకరించి ప్రోత్సాహమును యివ్వలేదు. కనుక అతను హేంబర్గ్‌కు ప్రయాణమై అక్కడ 1525వ సం||లో క్రొత్త నిబంధనను తర్జుమా చేసి ముగించెను. అది గొప్ప ఎదిరింపు సమయములో రహస్యముగా అచ్చుచేయబడినది.  ఆంగ్లములో బైబిల్‌ తర్జుమా చేయుట కొరకు ఆయన హతసాక్షిగా మరణించి ఆయన యొక్క విజయమునకు విలువ చెల్లించవలసివచ్చినది.

– సేకరణ : ప్రభువు ధర్మశాస్త్రము నుండి….

Filed under: మనుజ్యోతి ఆశ్రమము