தமிழ்| telugu

» కవితలు » భక్త మందార

భక్త మందార

సర్వాధిపతియైన శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణను భూలోకవధువు స్తుతించు విధము.

అరవింద ధళాక్ష, భక్తలోక వత్సల, నాధా నీవు అనంత తేజోమూర్తివి. భక్తవత్సలుడవు. నీవు పలికిన వాక్కులు సత్యములు. అమిత జ్ఞానము, సుఖము, బలము, ఐశ్వర్యము, శక్తి మున్నగు సద్గుణములతో ప్రకాశించు స్వామివి. సచ్చిదానంద మూర్తివి. అట్టి నీకు, నేను తగినవాడను కాను. మహాత్మా! ప్రశస్తమైన ప్రకృతి పురుషుల కాలమునకు ఈశ్వరుడవు. లలిత కళాకౌశళము. దివ్యమంగళ తేజో రూపముతో ప్రకాశించునట్టి నీ ఉన్నతమైన రూపమెక్కడ! సత్యాధి గుణములతో కూడిన మూఢులము మేమెక్కడ? నీ మంగళ గుణ సంపద దానము చేయబడినను భీతితో కాబోలు అతీతుడవై పాలకడిలో పవళించెదవు.

మహాత్మా! నీవు శబ్ద, స్పర్శ, రూప రస గంధములనెడు గుణములచే పరిగ్రహింపబడిన మంగళ సుందర స్వరూపుడవు. అజ్ఞానాంధకారము తొలగించు రూపము గైకొని నీ సేవకులకు అనుభవింపదగని వాడవైతివి. నీ పాద పద్మ మకరంద మాధుర్యము గ్రోలి లీలాత్ములైన యోగీంద్రులకైనను ముక్తిమార్గము గోచరము కాదు. ఈ మనుజ పశువులకు గోచరమగునా? అట్టి ఈశ్వరుడవైన నీవు స్వతంత్రుడవు. అదియే నాకు మహాప్రసాదం.

కావున నేను నిన్ను సేవించుచుంటిని. దేవా! నీవు సమస్తమునకు మూలధారుడవు. నీవే శ్రీమన్నారాయణుడవు. నేను నిన్ను వరించితిని. నీవు ధనుష్టకారంతో సమస్త శత్రురాజులను జయించి మృగరాజువై మృగములను పారద్రోలి నన్ను తెచ్చితివి. లహరికృష్ణా నీకు ఏదియు అసాధ్యము కాదు. సర్వము నీ మాయాలీలతో నడుస్తుంది. నీకు భక్తులైన నరేంద్రులు, సంతోషము చెందు రాజ ఋషులును ధన్యులు. రాజ్యములు విడిచి అడువులకేగి హృదయమునందు నీ పాదబ్జములు నిలిపి వాయు జలములు ఆహారముగా గైకొనుచూ ఉగ్ర నేమములతో తపములు సలుపుచున్నారు.

దేవా లహరికృష్ణా! విమల జ్ఞానులు చూచుచుండగా నీ పాద పద్మము మకరంధ దివ్య పరిమళము నాస్వాదించుచు మోక్షపధము, శుభము చేకూర్చునట్టి నీ దివ్యమంగళరూపమైన నీ సౌమ్యరూపమును సేవింపక మానవాధములను, దుర్మర్గాందులను జీవింతురా? నీ నిత్యనివాసమైన భూలోకవైకుంఠమనబడు మనుజ్యోతి ఆశ్రమమునందును, సకల ప్రదేశములందును నీ భక్తులు జగదీశ్వరుడవైన నిన్నే భజింతురు.

భక్తమందార దుర్భర భయ విధూర, విమాలాకారా! మేఘముల నుండి వెలువడు జలమును పానము చేయు వానకోయిల, చవిటిగుంట నీటికై ఆశపడునా? పరిపక్వమైన మామిడి రసములు గ్రోలు చిలుకలు, ఉమ్మెత్తలను ఆశ్రయించగలవా? నీలమేఘ ధ్వనులు విని ఉప్పొంగు నెమలి, గుడ్లగూబ మూలుగును విన కోరుకొనునా? ఏనుగు కుంభ స్తంభమందలి మాంసమును భుజించి సంతోషించు సింహము, శునక మాంసము కొరకు ఆశపడునా? అట్లే లహరి భవదీయ పాదపద్మముల నాశ్రయించి ఆనందించు మా చిత్తము మరొకరినేలా కోరుకొనగలదు? ఇంద్రునిచే స్తుతింపబడు దేవదేవా! కైలాసమునందును బ్రహ్మలోకమందును నీ దివ్య చరితములు సదా మధురముగా గానము చేయబడుచుండును.

లహరికృష్ణా! నీ వచనములు అసత్యములుకావు. తల్లి వచనములు తనయకు అభిమతములు కావా? నీవెరుగనిదేది పరమాత్మా! లహరికృష్ణా ఇంక ఎంతకాలము నీకై మా అన్వేషణ? సర్వజ్ఞుడవని భూలోక స్వర్గమైన మనుజ్యోతి ఆశ్రమమే సత్యనగరమని వధుగణములు ప్రార్థించగా లహరివాణి ప్రత్యక్షమగును, ప్రియ ప్రియతములారా! చింతించకండి.

– కూర్పు : ఎం. కోటయ్య, ఖమ్మం.

Filed under: కవితలు