தமிழ்| telugu

» కవితలు » మకరజ్యోతి

మకరజ్యోతి

దీపం వెలిగించి కుంచం క్రింద పెట్టరు

ఇంటనుండు వారందరికీ వెలుగిచ్చుటకై

దీపస్థంభం మీద పెట్టెదరు

దీపం అనగా ఈ మనుజ్యోతి పత్రికయే!

ఈ మనుజ్యోతి అనే దీపం మీ గృహములో వెలుగించుకొనవలెను

ఇది క్రొవ్వొత్తి కాదు, క్రొవ్వొత్తి వలే వెలుగిచ్చును

క్రొవ్వొత్తి కరిగిపోవును గాని ఈ మనుజ్యోతి కరిగిపోదు!

ఈ మనుజ్యోతియే నిజమైన మకరజ్యోతి

ఇది మనుష్యులకు వెలుగినిచ్చు దివ్యమైన జ్యోతి

ధర్మయుగంలో శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణయే నిజమైన మకరజ్యోతి

మనుజ్యోతి ఆశ్రమంలో కల్కిజయంతి ఉత్సవములలో

శ్రీలహరికృష్ణ తన దైవీక పిల్లలతో దర్శనమిచ్చుటయే

నిజమైన మకరజ్యోతి!

ఈ మనుజ్యోతి పత్రికను తరుచుగా చదివి, వెంబడించి, నాశనం లేకుండా,

ధర్మయుగంలో అడుగుపెట్టి మనమంతా ఆ దర్శనమునకై వేచియుందాం!

మనుజ్యోతి ఆశ్రంలో మకరజ్యోతియైన

శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ దర్శనం పొంది ధన్యులమగుదాం!

ఎవరు ఎవరు నీవారెవరు!

పంతముకై నిలిచే వారెవరు!

అంతమున నీతో రానివారు!

కారెవ్వరు నీకు సొంతవారు!

నవ్వగా నిలిచే నలుగురు!

నువ్వు నలిగిపోగా రారు ఒక్కరు!

మరి మారెదెవరు?

మార్చెదెవరు?

మార్చలేరు ఏ ఒక్కరిని ఎవరూ!

సదా మారని వాడు ఒక్కరే!

ఆయనే

శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ!!!

సుదా మధుర కిరణాల అరుణోదయం

లహరికృష్ణయ్య కరుణామయుని శరణు తరుణోదయం

తెరవెనుక హృదయీలు వెలుగైనవి…. మరణాల చెరసాల మరుగైనది.

దివి రాజుగా భూమికి దిగినాడని… రవి రాజుగా యిలను మిగిలాడని

నవలోక గగనాలు తెరిచాడని … పరలోక భవనాలు పిలిచాయని

ఆరని జీవన జ్యోతిగా…. వెలిగే తారొకటి వచ్చింది

ఆ జన్మ నామమే – ఒక మర్మ – లహరి బంధం

ఆ బంధమే అనుభంధం…

నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడై సీయోనులో వున్నాడు

నిత్యసుఖాల జీవజల పెన్నిధి లహరికృష్ణయ్యే….

నీతో పోల్చుటకు సర్వేశా- ఎవరును లేరు ప్రకాశా…

నిఖిల లోక పాలకుడా -ఓ నీతి సూర్యుడా;

సకల జీవధారుడా – ఓ సత్య స్వరూపుడా!

నీ పరిశుద్ధ నామమే – లహరికృష్ణ నామము!

శ్రీలహరికృష్ణ ఆ నామములోనే సర్వశుభిక్షం!!!

Filed under: కవితలు