தமிழ்| telugu

మా గురించి

మనుజ్యోతి ఆశ్రమము

1963వ సంవత్సరమున స్థాపింపబడిన మనుజ్యోతి ఆశ్రమము తిరునల్వేలి జిల్లా, ముక్కూడల్‌కు సమీపముగా 7 కి.మీ దూరములో 62 ఎకరముల స్థలములో స్థాపించబడినది. తిరునల్వేలి జంక్షన్‌ నుండి మనుజ్యోతి ఆశ్రమమునకు ప్రతి రోజు టవున్‌ బస్సు సౌకర్యము కలదు. బస్సు నెం.34డి, 34జి, ఉ|| 7.00, 9.00; మ|| 12.30, 2.30; సా|| 5.30, 6.00; రాత్రి 9.30 గంటలకు కలవు.

ఈ మనుజ్యోతి ఆశ్రమమును స్థాపించిన వేదముల నాయకుడైన పరమపురుషుడును కలిని సంహిరించుటకు వచ్చిన కల్కిమహావతారమైన శ్రీమన్నారాయణుడు శ్రీలహరికృష్ణయే అని ప్రజలకు ఖచ్చితముగా ప్రకటించుచున్నాము. ఈయనే బైబిలులో చెప్పబడిన మనుష్యకుమారుడు, మహ్మదీయులు ఎదురుచూచే ఇమామ్‌ మెహదీ కూడా ఈయనే.
బైబిలు, పరిశుద్ద ఖురాన్‌, శ్రీమద్భగవద్గీత, భాగవతము నుండి తనను బయలుపరచుకొని ఆయన ఇచ్చిన శుభసందేశమును మేము లోకమంతటా ప్రచారము చేయుచున్నాము.

మేము క్రైస్తవ మతమునకు చెందినవారము కాదు. దానిలో వున్న 1,800 విభాగములలో దేనికి మేము చెందినవారము కాదు. కాని పరిశుద్ధగ్రంధము యొక్క సారాంశమును మేము వెంబడించుచున్నాము. మేము మహ్మదీయులము కాదుగాని పరిశుద్ద ఖురాన్‌ మార్గమున నడుచుచున్నాము. దాని యొక్క ముఖ్య సారాంశమును వెంబడించుచున్నాము. కాని ముస్లీములకు చెందిన సంఘములకును మాకును ఎటువంటి సంబంధము లేదు. మేము ఇస్లామును వెంబడించుచున్నాము అని చూపించుటకు బహిరంగముగా ఎటువంటి గురుతులు వుంచుకొనుట లేదు. మేము హిందుత్వమును వెంబడించుట లేదు, శ్రీమద్భగద్గీతను పరిపూర్ణముగా వెంబడించుచున్నాము.
శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ యొక్క నామము వలననే మీ కర్మపాపములు నశించిపోవును అనేది నిశ్చయము.

భగవంతుడు మనకు సమస్తమును ఉచితముగా యిచ్చియున్నాడు. గాలి, నీరు, వెలుతురు మొదలగునవి ఆయన ఉచితముగా యిచ్చియున్నాడు. మీరు వాటిని ఉచితముగా పొందుకొంటున్నారు. అందువలన ఉచితముగా యివ్వండి అని ఆయన చెప్పియున్నాడు. దాని నిమిత్తము మేము సందేశములను ఉచితముగా ప్రచురించుచున్నాము. కానీ జనులు ఇతర దేశముల యొక్క డబ్బుతో దీనిని చేయుచున్నట్లుగా తలంచుచున్నారు. భారతదేశములో వున్న ఆత్మీయ జనుల ద్వారా యివ్వబడే సహాయముతో ఈ సందేశములను ప్రచురించుచున్నాము. మీరు దీనిని అంగీకరించలేక పోయినట్లయితే తేలికగా మాత్రం మాట్లాడవద్దు. ఎప్పటికైనా ఒక దినమున యిది సత్యము అని తెలుసుకొంటారు.

కల్కిమహావతారము శ్రీలహరికృష్ణ గురించి యింకనూ ఆ విధముగా తెలుసుకొనవలెనని ఆశించినట్లయితే మీరు మా ఆశ్రమమును ఎప్పుడైననూ సందర్శించవచ్చును. ప్రతీ సంవత్సరము జూలై 15వ నుండి 22వ తేదీ వరకు కల్కిజయంతి ఉత్సవములు ఇక్కడ జరుగుతాయి. ఈ పండుగలలో మీరును కలుసుకొనవచ్చును.

ప్రార్థనా సమయములు

భగవంతుని ప్రార్థించుటకు పగలు, రాత్రి అనేది లేదు. 24 గంటల సమయము భగవంతుడు మనకు చేసిన మేలులను తలంచి పాడి, స్తోత్రము చేసి ఆయనను ఎవరైనను ఏ సమయమునందైను పూజింపవచ్చును. మా ఆశ్రమములో గడిచిన 24 సంవత్సరములుగా ప్రతిదినము 24 గంటలు శ్రీలహరికృష్ణగారి యొక్క నామములో పాటలు, పాడి, లోక జనుల యొక్క మేలు గురించి ప్రార్ధిస్తున్నాము.
ముఖ్య ఆరాధన సమములు:- ఉదయము 4.50 నుండి 6.00 వరకు, సాయంత్రము 6 గంటల నుండి 7 గంటల వరకు మరియు రాత్రి 8.00 గంటల నుండి ఉదయము 4.50 గంటల వరకు జరుగును. మీరు కూడా మీ గృహములలో ఈ సమయములలో శ్రీలహరికృష్ణగారి యొక్క ఉపన్యాసములను ధ్యానించి కీర్తనలు పాడి, ప్రార్ధన చేసి ప్రతిఫలమును పొందుకొనుడి. అంతే కాకుండా కుటుంబముల వారిగా గొలుసు స్తోత్రములు 24 గంటలు జరుగుతూనే వుంటాయి.

విశ్రాంతి దినము

వేదముల ప్రకారము శనివారమే భగవంతుని ద్వారా ఇవ్వబడిన విశ్రాంతి దినము. అది యూదుల మతము కాదు. మీ గృహములలో ఈ విశ్రాంతి దినమును ఆచరించినట్లయితే శ్రీమన్నారాయణుడు శ్రీలహరికృష్ణగారి యొక్క పూర్తి ఆత్మీయ ఆశీర్వాదములను పొందుకొనగలరు. భారతదేశమంతా ఈ దినమును విశ్రాంతిదినముగా ఆచరించేరోజు గురించి ఎదురుచూస్తున్నాము.
శుక్రవారము సాయంత్రము 6 గంటల నుండి శనివారము సాయంత్రము 6 గంటల వరకు మీ స్వంత పనులు చేయకుండుట ఉదాహరణకు నీళ్ళు తీయడము, వంటచేయుట, దుకాణమునకు వెళ్ళుట, బట్టలు ఉతుకుట, స్వంత మాటలు మాట్లాడుట, సినిమా చూచుట, మొదలైనవి మానుకొని మీ గృహములో మౌనముగా వుండుట వలన మీరు కలియైన సాతాను క్రియలను మీ గృహములో మౌనముగా వుండుట వలన మీరు కలియైన సాతాను క్రియలను నాశనము చేయుచున్నారు. శనివారమునకు అవసరమైన ఆహారమును ముందుగానే సిద్దము చేసి ఉంచుకొనుడి. ఈ విశ్రాంతి దినమును గురించి పూర్తిగా తెలుసుకొనుటకు ఆశక్తిగలవారు మాకు వ్రాసి పుస్తకములను పొందుకొనవచ్చును.

ప్రజలు ఆచరించవలసిన ముఖ్యమైన మూడు పండుగలు.

1. కల్కి జయంతి – జూలై 21
2. నీతియుగ (ధర్మయుగ) స్థాపన పండుగ – అక్టోబరు 3
3. మహిమదిన ఉత్సవములు – ఫిబ్రవరి 24