தமிழ்| telugu

» కవితలు » సౌందర్య లహరి కవితామాల

సౌందర్య లహరి కవితామాల

లహరి నరహరియే నరసింహునిగా తిరుగాడిన కరుణగిరి నిలయం ఇది!

వధుఘణ నాయకా మధురపాలదాయకా నీ పదసేవ నిత్యామృతపానం

కలి వెలివేసిన మమ్ము వలచి కైవల్యమిచ్చావు

మధుర మోహన సుందర సుభాషిత సూర్య తేజో ప్రతాప, దేశమంతా నీ ఆదేశమిచ్చావు

పర పట్టుపరుపులపైన పవళించు స్వామి వసుధ నిశీధిలోన వెలుగిస్తున్నావు

భక్తులందరూ నిన్ను భగవంతుడని వేడ చిరునవ్వులొలుకుచు సిరులు కురిపిస్తున్నావు

ఈ ఎడారిలో నాడారులవలే నున్నావు ఎంత వేడైనా కాని కలనైన కనరావు

అయ్యా నీ వొస్తావని నీవేసిన విత్తనం నూరంతలు చిగురించి ఎదురు చూస్తుంది

లహరి నీవెందెందు వెతికినా నీవందు వుందువే! శషితేజకిరణమై సరిగా కనబడు హరి

కనులార నిను గాంచి  తరియింతుమయ్యా! మణులవలే పరమున వెలిగించవయ్యా

జ్యోతి స్వరూపుండు మనుజ్యోతి నందుండ,

తిండి అరగక బండలకు, కొండలకు దండములేలా?

జ్ఞానులు, కవులు, పండితులు కరుకు రాళ్ళకు మ్రొక్క, పూజారులందరు పొట్ట పూజించుకనగా

దేవుని దయ కలుగునా దయ్యపు జనులకు! పుణ్యతీర్థములని యమలోకమెళతారు.

నరనారాయణ శ్రీలహరి ప్రేమతో నవ్వితే నవ్విస్తాడు, వ్యంగపు నవ్వుకు ఏడిపిస్తాడు.

ఈ వనం బృందావనం. గోపాలుడే శ్రీపాలుడుగా నడయాడిన ముకుంధుని నందనవనం

ఈ వనంలో కొబ్బరాకుల పొదరిండ్లే గోపికల పూజా మందిరాలు

అయ్యా లహరికృష్ణా ఎక్కడెక్కడో వున్న చుక్కలన్నీ యిక్కడే చేర్చి వధువు అన్నావు!

వాక్యమనే మధువు మత్తెంకించి, మరలుగొలిపి మహిమనిచ్చిన మాయగాడు లహరి!

పంచేంద్రియాల పామును పడగొట్టి, అహం వీడి, ఆర్తితో లహరయ్యా అని పిలవండి.

అడవిలో వున్నా అనుగ్రహించి అవతరించి, అవసరమైనది యిస్తాడు.

ఈ అందాల సుంధర బృందావనంలో సౌందర్యలహరి అనే పుష్ప మాధుర్యం కొరకు…

ఎక్కడెక్కడ నుండో ఎగిరివచ్చిన తేనేటీగలం మనం…

దూరదేశములోన నారి మాట విని దివినుండి భువిని ఈ కారడివిలో పడి

ఊరు ఊరు తిరిగి మనలను చేరదీసి కరకురాళ్ళపైన గురక తీసే లహరి

హరిషడ్వర్గములను నసిమర్కటముల వలె నున్న మనకు మహిమనిచ్చిన లహరి

నాడు దూరమైన మనం నేడు చేరువైనామని అయ్య ఆనంద కన్నీరై కారింది

ఆ కన్నీరే పరిమళ పన్నీరై మనలను పరము చేర్చింది.

– ఎం. కోటయ్య, ఖమ్మం.

 

మధురమైనది లహరికృష్ణ ప్రేమ

ఓ దేవా! నీ చిరునవ్వుతో మమ్మును నీ గుండె గూటిలో బందిస్తివి

వెన్నెలలాంటి నీ ఒడిలో మమ్ములను సమకూర్చితివి

మల్లెకన్న తెల్లని నీ హృదయంలో నివసించడానికి చోటిస్తివి

నీ వధువుగా మమ్ములను ఎన్నుకొంటివి – నీ పాదాల అడుగు బాటలలో మమ్ములను నడిపిస్తివి

వాడిపోయిన మమ్ములను వికసింపజేస్తివి – మేము చూడని వింతలను మాకు చూపిస్తివి

చీకటిలో వున్న మాకు వెలుగుగా నీవుంటివి – దొంగవలే మా మనస్సును దోచుకుంటివి

మా పాపాలను మా నుండి తొలగించితివి – నీ ఆదిబలి రక్తముచేత మమ్ములను కడిగితివి

మాకు ఆయుధముగా నీ శ్రీమంత్రం మాకిచ్చితివి

మమ్మును నీ ప్రియురాలిగా ఎన్నుకుంటివి – మా జీవితంలో తోడుగా నీవుంటివి

ఓ దేవా! లోక ప్రేమను మరిపించిన నీ ప్రేమ మరువలేము

ఎన్నడూ నీ ప్రేమను విడువలేము ఇక నిన్ను – మమ్మును విడనాడకయ్య లహరికృష్ణ

                                                – హవీలా, మనుజ్యోతి ఆశ్రమం….

 

ఓ సర్వంలో వున్న సర్వేశ్వరుడా! ఇహపర పాతాళ మూడు లోకముందు నీవయ్యా

దివిని విడిచి యీ భువికరుదెంచిన దివ్య తేజుడవయ్యా

వధువును బ్రోవ యిల వరునిగా నీవు రావయ్య

మహిమ వస్త్రములిచ్చు సృష్టికర్తను నీవయ్యా – మహిమోన్నత రాజ లహరికృష్ణయ్య

నీ మహిమను చూడ మా కనులు తెరిచావయ్యా

కనులు గాంచని విశ్వాసమును మాకిచ్చావయ్యా

విశ్వాసమనే పయనంబులో పయనింపజేసావయ్యా

ఆ విశ్వాసమే కలిని జయించే ఆయుధమని తెలిపావయ్యా

కలినే అంతమొందించగా కల్కిమహావతారముగా నీవు రావయ్యా

పరమందు సింహాసనాసీనుడవు కావయ్యా – మనుజ్యోతి వనమునందు నివసించినావయ్యా

మహిమగల రాజ లహరికృష్ణయ్య

బక్రీదు, పస్కా, బ్రహ్మయజ్ఞం, ఆదిబలి ఒటేనని అది నీ మహిమగా మాకు తెలిపావయ్యా

సర్వసృష్టి విమోచనకై త్యాగమైన త్యాగనీయుడవయ్యా

దివియందు జరిగినదే భువియందు జరుపగా

ఇలకరుదెంచిన ఆదిదైవము నీవయ్యా – జరిగించినావయ్యా ఓ సర్వంగల లహరయ్యా

నీ యొక్క ఆదిబలి బ్రహ్మయజ్ఞమును

– మధులత, మనుజ్యోతిఆశ్రమం.

 

శరణు శరణు మా లహరికృష్ణా నీకే శరణం!

శరణమన్న వారికి మరణం లేదన్నావు! మహిమకై మమ్ము ఈ లోకంలోనికి తీసుకువచ్చావు!

లోకములో మేము వున్నాము కాని మాలో లోకం లేకుండా చేసావు!

మార్పు నిచ్చావు మాకు! మారు మనస్సు పొందాము మేము!

నిత్యమూ నిన్ను కోరి నిన్నే శరణు వేడెదం!

ఆదిబలిలో ఆదరించావు! కరుణతో కరుణించావు!

నీతితో నింపావు! మా స్వనీతిని అంతా తీసివేసావు!

మా గర్వము నంతయు పోగొట్టావు! నీ మనస్సుతో మమ్ము నింపావు!

మరి నిను వర్ణించడానికి నావద్ద ఏమియు లేదయ్యా! నీవచ్చిన ఈ ఊపిరి తప్ప!

సృష్టికర్తా, లహరికృష్ణయ్యా నీవే మాకు శరణం!

                                – సుబ్రమణ్యం, హైదరాబాద్‌

 

 

Filed under: కవితలు