1. Home
  2. »
  3. మనుజ్యోతి ఆశ్రమము
  4. »
  5. ఆత్మ యొక్క నియమము
ఆత్మ యొక్క నియమము
రోమా 8:2. ”క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను.” క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అంటే గడచిన కాలములో యివ్వబడిన కఠినమైన కట్టడలు ఆజ్ఞలు కాదు గాని, స్వచ్ఛమైన దేవుని ప్రేమతో నిండియున్న ఆత్మీయ ఆజ్ఞలై యున్నవి. గలతీ 5:18. ”మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కాదు.” తిరిగి 5:1 చదువుదాము. ”ఈ స్వాతంత్య్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, మరలా దాస్యమను కాడిక్రింద చిక్కుకొనకుడి.” తండ్రికి సమస్తకార్యములలో క్రీస్తు చివరకు మరణమగునంతగా పరిపూర్ణ విధేయత కలిగియుండుటవలన ‘పాపమరణముల’ నియమమునకు బదులుగా కృపను తీసుకొనివచ్చినది. కాబట్టి దేవుని పిల్లలకు ఆత్మలో యివ్వబడిన ఈ స్వాతంత్య్రమును ఎవరూ కాదనలేరు. ఎందుకంటే వారు వారి జీవితముల వలన సాక్షివచనములతోను తమను పాత్రులుగా చేసుకొనుచున్నారు. నిజముగా ఆత్మననుసరించి జీవించుట అనేది మన జ్యేష్టపుత్రుని భాగముగా వున్నది. అదే మన జన్మహక్కు. ఎందుకంటే మనము ఆత్మవలన జన్మించియున్నాము. ఆత్మలో మన జీవితములను ప్రారంభించుట ద్వారా దేవుని ఆత్మచేత నడిపింపబడుదుము. దేవుని యొక్క ఆత్మచేత పోషింపబడి, నడిపింపబడుదుము. మనము ఏవిధముగా వుండాలని దేవుడు ఆశించుచున్నాడని తెలుసుకొని, దేవుని యొక్క జ్ఞానము క్రిందకు వచ్చుచున్నాము. వ్యక్తిగతముగా గాని, సామూహికముగా గాని ఆయన కొరకు మనము ఏమి చేయాలని తెలుసుకొంటాము. ”క్రీస్తుయేసునందు మనకు యివ్వబడిన కృపా బాహుళ్యము, నీతిదానము ప్రభువు మనము ఆయన కొరకు చేయవలసినది సమర్థవంతముగా చేయుటకు మనకు సహాయము చేయును. రోమా 5:17. ”మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆయన యొకని ద్వారానే యేలినయెడల కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువారు జీవముగలవారై మరినిశ్చయముగా యేసుక్రీస్తు అను ఒకని ద్వారానే యేలుదురు.” ఇదే పరలోక సంబంధమైన జీవితము. చివరిలో మనలను పరిపూర్ణమైన పరిశుద్దతకు నడిపించుచున్నది. క్రీస్తుయేసునందు జీవము నిచ్చు ఆత్మ యొక్క నియమము అనేది స్వాతంత్య్రమునిచ్చు నియమముగా వున్నది. గలతీ 5:1,13. ”1వ వా. ఈ స్వాతంత్య్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, మరలా దాస్యమను కాడిక్రింద చిక్కుకొనకుడి. 13వ వా. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా వుండుటకు పిలువబడితిరి. అయితే ఒకమాట. ఆ స్వాతంత్య్రమును శారీరక్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగినవారౖౖె యొకనినొకడు దాసులైయుండుడి.”. క్రీస్తునందున్న ఆత్మీయ స్వాతంత్య్రము అనేది విధేయత నందలి కృప యొక్క జీవితముగా వున్నది. సమస్తముపైన క్రీస్తును హెచ్చించి, దేవుని వాక్యముతో స్థిరముగా జీవించి, పరిశుద్దాత్మ యొక్క శక్తిలో నింపబడి, దాని ఆధీనములో నడిపించబడు జీవితమగును. మొదటి శతాబ్దములో జీవించిన శిష్యులు పరిశుద్దాత్మచే నడిపింపబడి ఇటువంటి జీవితమునకు సాక్షులుగా వున్నారు. అన్ని విషయములలో వ్యక్తిగతముగాను సంఘపరముగాను వారు ప్రభువు మనస్సుపై ఆధారపడ్డారు. పరిశుద్దాత్మయైన వాడు క్రీస్తు యొక్క మనస్సును మనకు యిచ్చుచున్నాడు. వారి మధ్యన మాట్లాడి, ప్రభువు యెదుట ప్రార్థనలలో వుంచబడిన సమస్త కార్యములలోను దేవుని జ్ఞానముతో వారిని నడిపించెను. దయచేసి అపొ.కా. 13:3-4. 15:28 చదవండి. ఉద్దేశ్యము : మనకు జగత్పునాధికి ముందు క్రీస్తుయేసునందు యివ్వబడిన కృపయందు నిలిచియుంటేనే దేవుడు మన జీవితములలో తన సంకల్పము నెరవేర్చును. 2 తిమోతి 1:9,10. ”మన క్రియలనుబట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాధికాలముననే క్రీస్తుయేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తుయేసను మన రక్షకుని ప్రత్యక్షత బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు మనలను రక్షించి, పరిశుద్దమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు మరణమును నిరర్థకము చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను.” దేవుడు తన పిల్లలకొరకు ఖచ్చితమైన సంకల్పమును, ఉద్దేశ్యమును కలిగియుండెనని తెలుసుకొనని అనేకమంది అధైర్యపడి కొందరు వెనుకకు వెళ్ళిపోతున్నారు. కొందరు లోలోపల దు:ఖించుచుండిరి. ఇతరులు కొందరు మేము దేవునికి పనికిరామని బహిరంగముగా ఒప్పుకొనుచున్నారు. దానికి జవాబు ఏమిటంటే, వారు దేవుని రాజ్యములో వుండినప్పటికినీ, వారు వారి జీవితములలో దేవుని యొక్క మనస్సును తెలుసుకొని, ఆత్మీయముగా నడుచుటను నేర్చుకొనలేకపోయిరి. వారు క్రీస్తునందు చిన్న పిల్లలవలే వుండిరి. 1 కొరింధి 3:1-3. ”సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీరసంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాటలాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలాకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరు యింకను శరీరసంబంధులై యుండుటవలన ఇప్పుడును మీరును బలహీనులై యున్నవారు కారా? మీలో అసూయయు, కలహమును వుండగా మీరు శరీరసంబంధులై మనుష్యరీతిగా నడుచుకొన్నవారు కారా!” ఆత్మయొక్క నియమముతో మనము కలిసియున్నప్పుడు మనలో నివసించుచున్న పరిశుద్దాత్మయైనవాడు మన జీవితములలో దేవుని సంకల్పమును మనకు బయలుపరచి దానిని సమర్థవంతముగా నెరవేర్చునట్లు చేయుచున్నాడు. అప్పుడు క్రీస్తు శరీరమునందలి ప్రతీ ఒక్కరు, దేవునికి, ఇతరులకు గొప్ప సేవచేయు వారిగా వుంటారు. -సేకరణ: ప్రభువు ధర్మశాస్త్రము నుండి….
Scroll to Top