1. Home
  2. »
  3. ఇతరములు
  4. »
  5. నటరాజ లహరిలోని తత్వ రహస్యం
నటరాజ లహరిలోని తత్వ రహస్యం
”ఓం బూర్‌ బృహస్వహా తత్సవితుర్‌ వరేణ్యం బర్గోదేవా స్వదీమహి ద్వియో యోన ప్రచోద యత్‌” స్వయంభుగా వెలసిన జీవదాత అయిన పరమేశ్వరుడు జీవమును ఇచ్చి తిరిగి తీసుకొనే శక్తి సామార్థ్యాలు ఆది నుండి కలిగినవాడై యున్నాడు. పరమపురుషుడు తప్ప స్వర్గలోకములోకి ఎక్కి పొయిన వాడు ఎవడూ లేడు. ఈయనే ఆది మధ్యాంత రహితుడు అనే పరమార్థం. మన భారతీయులు ఈశ్వరుడిని లింగరూపంలో ఆరాధిస్తారు. దాని పరమార్థం స్త్రీ పురుషుల కలయికలో రానైయున్న పరమపురుషుడు. అదే శివుడిని నటరాజ దక్షిణా మూర్తిగా కొలుస్తారు. నటరాజ నృత్యభంగిమ నాట్యం కాదు ఇది, ఆనంద నటనా తత్వ భావం. ఈ ఆనంద నటనా భంగిమ వెనుక సృష్టి రహస్యం దాగి ఉంది. ఈ జగత్‌ అంతా సృష్టి స్థితి లయ నాట్య విన్యాసం. ఈ సమస్త విశ్వ ప్రక్రియలు ఆ నీతి సూర్యుడైన పరమ పురుషునిలోని ఒక భాగమే. ఆయనే అన్నింటికీ మూలం. ఎటువంటి ప్రసరణ లేకుండా జీవము లేదు అనుట అందరికి తెలిసిన సిద్ధాంతము. ఈ ప్రపంచంలోని సమస్త పద్ధతులు కూడ ఎల్లప్పుడు వృత్తాకార కదలికను కలిగియున్నది. మనుష్య శరీరం సజీవముగా ఉండుటకు శరీరమంతయు రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో అలాగే అన్ని గ్రహములు తమ తమ గ్రహ పదములలో సూర్యుని చుట్టు తిరుగుచున్నవి. ఈ విధముగా తిరగడం వలన సూర్య కుటుంబంలో (గ్రహములు) ఎటువంటి అవ్యక్త స్థితి కలగడం లేదు. భూమి కూడ తన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వలననే పగలు రాత్రి కాలములు ఏర్పడుచున్నవి. అన్ని ఎలక్ట్రానులు సిస్టమ్స్‌ మున్నగునవి ముక్కోణము చుట్టూ వృత్తాకారములో కదులుచున్నవి. సృష్టి పరమాణువులతో నిండి ఉంటుంది. పరమాణువులలో అనంతమైన శక్తి దాగి ఉంది. అది నిరంతరం ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారుతుంటుంది. పరమాణువులలోని పదార్థం శక్తిగానూ, శక్తి పదార్థంగానూ మారుతూ నిరంతరం తన స్థితిని కోల్పుతుంటాయి. ఈ సృష్టి సమస్తం ఒక లయబద్ద కదలికగా కనిపిస్తుంది. ఆధునిక క్వాంటమ్‌ థియరీ దీనినే వివరిస్తుంది. ఈ లయబద్ద కదలికలను నటరాజ తత్వ జ్ఞానంతో సరిపోల్చి భావించమని శ్రీమన్నారాయణుడైన శ్రీలహరికృష్ణ ఒకే దేవుని విన్యాసమును ఆత్మీయరీతిలో ఆత్మీయ దృష్టితో పోల్చుకోమన్నారు. శివతాండవం యొక్క ప్రాముఖ్యం వృత్తాకార లయబద్దమైన ఈ జగత్‌కదలికకు రూపం. తలపైన ఐదు తలల పాము అనగా పంచేంద్రియములను ఆదిలోనే జయించిన ఆది పురుషుడు అని అర్ధం. నటరాజ మూడవ నేత్రం ఆదిజ్ఞాన నేత్రానికి మూలం. తలలో ఓవైపు జీవజలధారను వధువు తాగుతున్నది అనే మూలార్థం. ఓవైపు అర్ధచంద్రాకారం అంటే మానవుడు తన హద్దుమీరి భూమి నుండి చంద్రుని ఆగమనంలో పయనించినప్పుడు తన నటనను పరమపురుషుడు పరిపూర్ణ మనుష్యునిగా ఆరంభించి విశ్వాసంతో మానవులలోని భ్రమలన్నింటినీ తొలగించి భువికి అరుదెంచిన మంగళ మోహన లహరిరూపం. కుడి చేతిలో డమరకం అంటే సంకేతాత్మక సందేశం, ఎడమ వైపున మరో చేతిలో అగ్ని అంటే ద్వంసానికి సందేశం. ఈ సందేశమునకు విరుద్దముగా వచ్చేవారిని నాశనము చేసే శక్తిని కలిగినవాడు. ఆయనకు విసుగు వచ్చినప్పుడు ఆయన తన నోటితో ఏదో అంటాడు. అప్పుడు వారు నాశనము అవుతారు. అందుకే ఆయన నమఃశివాయన్‌(నమచ్చివాయన్‌) అని పిలువబడుచున్నాడు. కుడి చేయి ముడిచి గజహస్థాన్ని పోలి ఉంటుంది. పైవాడను, క్రిందివాడను నేనే, ఆదిలో బలియైన వాడను నేనే! కడపటిగా వచ్చిన వాడను నేనే, జీవంను ఇచ్చి తిరిగి తీసుకొనే శక్తిని ఆదిలోనే కలిగినవాడను నేనే! నడుముకు పులి చర్మం అంటే విమోచన వస్త్రం (ప్రత్యక్ష గుడారపు నమూనా ప్రకారం తన మాంసపు భూవస్త్రాన్ని వదలి జల మహిమ శరీరాన్ని పొందుకోవడం). ఒక పాదం మీద ఆన్చిన భంగిమ జీవన్‌ ముక్తిని సూచిస్తుంది. కలి పురుషుడు ఆది దేవుని మరచి భూమిపై తానే దేవుడనని చెప్పుకొనును. జీవులందురు దేవుడు కాగలరని రాక్షస జ్ఞానంతో మంచి చెడుల విజ్ఞానంతో ఉన్న అసురుని నాశనార్థం తాండవ మూర్తిగా అవతరించిన శివానంద లహరి నటరాజ తత్వం యొక్క సృష్టి రహస్యం. ఇది తామర పుష్పంపై ఈ భంగిమ అంటే భూమిపై కడపటివాడైన అవతార పరమపురుషుడు పరిపూర్ణ మనుష్యునిగా దేవుని ఖడ్గంగా అవతరించడం. ఆయన దక్షిణ భారతదేశములో తొమ్మిదవ శతాబ్దపు ఛోళులచే స్థాపించబడిన చిధంబరం నజరాజ ఆలయానికి తూర్పులో, పాలపుంత అనే నక్షత్ర మండలం నుండి దేవకుమారుని (ఆదాము) వంశావలిలో తామ్రపర్ణి నది ప్రాంతవాసుడై ప్రత్యక్షమవుతాడని ప్రవక్తలు చెప్పియున్నారు. ఆయనే శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ. తామ్రపర్ణి నదీ సమీపాన ఆయన స్థాపించినదే ఈ మనుజ్యోతి ఆశ్రమము. కలియుగములో భగవంతుడు భూమికి దిగివచ్చి, ఆయన నివసించిన ఈ మనుజ్యోతి ఆశ్రమమును ప్రతీవారు వారి జీవితములో ఒక్కసారైనా దర్శించినట్లయితే, వారి జీవితములో తప్పక భగవంతుని ఆశీర్వాదములను చూడగలరు. వారి కర్మను పోగొట్టుకొనవలెనంటే, ఈ ఆశ్రమమును ఒకసారి దర్శించవలసినదే. అదేవిధముగా జీవితములో శాంతి, సమాధానమును పొందుకొనుటకు మనుష్యునికి తప్పనిసరిగా ఆధ్యాత్మిక ఆలోచన వుండాలి. భగవంతుని గురించిన ఆశక్తి వుండాలి. భగవంతునిచే యివ్వబడిన వేదములను కనీసం ఒకసారైన చదివాలి. చదివి వాటిలోని అర్థమును తెలుసుకోవాలి. మనము తెలుసుకొనిన దైవజ్ఞానమును నలుగురికి పంచాలి. అందువల్లనే జాతి, కుల, మత బేధముల లేకుండా ”ఒకే దేవుడు! ఒకే దేశము!” అనే సత్యమును ప్రపంచమంతా చాటుతుంది ఈ మనుజ్యోతి ఆశ్రమము. ఈ ఆశ్రమము గురించియు మరియు శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి గురించియు తెలుసుకొనవలెనని ఆసక్తి గలవారు మమ్ములను సంప్రదించగలరు. – కూర్పు : టి. హేమేంధర్‌, బొంబాయి.
Scroll to Top