தமிழ்| telugu

» Archive

కాలజ్ఞాన తత్వము

అనాధి నుండి దైవ భక్తితోనూ దైవ చింత తోనూ ధార్మిక దేశముగ ప్రసిద్ది చెందిన భారతదేశములో కూడ నేటి నవనాగరికత వలన ప్రజలలో చాలామంది దైవ భయమును కోల్పోయినారు. ఇది చాలా శోచనీయమైన విషయము. దీనికి కారణముగ మూఢ నమ్మకాలు, మూఢ ఆచారములు, దిన దినాభివృద్ది చెందుతున్న శాస్త్ర విజ్ఞానము అని చెప్పవచ్చును. ఇదే నాస్తికత్వమునకు, దౌర్జన్యమునకు హింసాకాండకు దోహదమిచ్చుచున్నది. ప్రజలలో ధర్మ అధర్మ విచక్షణ నశించిపోయినది. పాపభీతి ధర్మచింతన దైవభక్తి శూన్యమైనది. అయితే ఈనాటి ప్రజల దృష్టిలో దైవభక్తి హేళనమై పోయినది. నేటి జ్ఞానవంతులైన ప్రజలు కూడ ధనమే ధ్యేయమని నిరంతరము నిత్యజీవిత అవసరముల సుఖసంపదల ప్రాప్తికై పరుగులిడుచున్నారు. ఇది యే మాత్రం ఆత్మ వికాసాన్ని కలిగించదు. ఈ నాటి కలియుగ వైపరీత్యముల గురించి, ఇప్పుడు పెరుగుచున్న శాస్త్ర విజ్ఞానము గురించి అనేక మంది మునిపుంగవులు, కవులు, ప్రవక్తలు అనేకమంది దక్షిణభారతదేశము నుండి అనేకమైన ప్రవచనములను ప్రవచించియున్నారు. అయితే ప్రతి ఒక్కరు ప్రవచించిన గ్రంధములను పరిశీలించినప్పుడు ఒకే దేవుడు – ఒకే దేశము గురించియు, భగవంతుడు ఒక్కడే అనియు, కులమత బేధములు లేవనియు మనము ఎక్కువగా కనుగొనవచ్చును. ఆంధ్రదేశమునకు చెందిన పోతులూరి వీరబ్రహ్మం గారు కూడా తన ప్రవచన కాలజ్ఞాన తత్వ గ్రంధములో భగవంతుడు … Read entire article »

Filed under: వేదములలోని మర్మములు

భగవంతుని ఆరాధన

ప్రతి మతము వారు భగవంతుని పలువిధములుగా ఆరాధించుచున్నారు.  ఆరాధన అనునది స్తుతించుట, ఆరాధించుట అని అర్ధమును ఇచ్చుచున్నది.  ఆరాధన అంటే మార్గమును అనుసరించి నడుచుట అని అర్ధము.  ఆరాధన అనునది కొన్ని శాస్త్ర సంప్రదాయములతో  కలిసిపోకుండా భగవంతుని పరిపూర్ణముగా ఆరాధించి నడుచునప్పుడు జనులకు నిజమైన సమాధానము కలుగును.  లోకానుసారము జనులచే వెంబడించబడుచున్న కొన్ని శాస్త్ర సంప్రదాయములకు పేరు ఆరాధన అని జనులలో చాలామంది అనుకొనుచున్నారు. ఇది పూర్తిగా తప్పైన సిద్దాంతము. ఆరాధన అంటే లోకపనులను విడిచిపెట్టి ఒక ప్రక్కన కూర్చుని భగవంతుడా! భగవంతుడా! అని చెప్పడము కాదు. ఈ లోకములో మీరు ఏమి చేసినప్పటికి భగవంతుని ఆజ్ఞను అనుసరించి చేయుటయే నిజమైన భగవంతుని ఆరాధన గావున్నది. మీరు నిద్రపోవుట, లేచుట, తినుట, త్రాగుట, నడవడము, తిరుగుట అంతా భగవంతుని ఆజ్ఞను అనుసరించి మాత్రమే వుండాలి. ఈ లోకములో వున్న జనులు భగవంతుని ఏవిధముగా వెంబడించుచున్నారు అని కొంచెం పరిశీలించినట్లయితే  చాలా మంది వారి ఆరాధన పద్దతులు అన్నియు వేదములకు వ్యతిరేకముగా బయటకు వేషదారణగా మాత్రమే కనబడుచున్నవి. భగవంతునితో సన్నిహితముగ ఐక్యతను ఏర్పాటుచేసుకొనుటకు బదులుగా భగవంతుని అందని దూరములో పెట్టి, మనము ఏవిధముగానూ ఆయనతో ఐక్యతకలిగియుండలేము అను స్థితిలో వున్నది. మనము ఉదయము లేచినది మొదలుకొని రాత్రి నిద్రపోయేంతవరకూ భగవంతుని … Read entire article »

Filed under: వేదములలోని మర్మములు

క్రైస్తవ మార్గములో వున్న తప్పులను తీసి చూపించి లోకమంతటనూ వున్న క్రైస్తవులకు కొన్ని ప్రశ్నలు అను శీర్షికలోని ప్రశ్నలకు జవాబులు

క్రైస్తవ మార్గములో వున్న తప్పులను తీసి చూపించి లోకమంతటనూ వున్న క్రైస్తవులకు కొన్ని ప్రశ్నలు అను శీర్షికలోని  ప్రశ్నలకు జవాబులు లోకమంతటిలోనూ ఉన్న క్రైస్తవులందరికి ఒక గొప్ప సవాల్‌ అను అంశములో గతసంచికలలో వెలువడిన ప్రశ్నలు చదివి కొంతమంది క్రైస్తవ స్నేహితులు మేము వారికి విరోధముగా నడుచుచున్నాము అని అనుకొనుచున్నారు. అది పూర్తిగా తప్పైయున్నది. నేను  క్రైస్తవుడను అని చెప్పుకొనుటకు ఆత్మీయఫలములు అయిన తొమ్మిది గుణములు వారి వద్ద వున్నవా అని పరిశీలించి చూచుకొనవలెను. క్రైస్తవుడను అని చెప్పుకొనుచున్న ఒక్కొక్క క్రైస్తవుడు క్రీస్తుబోధలో నడుచుకొనువాడై యుండవలెను. యోహాను 1: 9 నుండి 11 వాక్యములు. ”క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించు వాడు. ఎవడైనను ఈభోదను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును.” అంటే క్రీస్తు అనే వ్యక్తి ఎవరు? ఆయన ఆది నుండే క్రీస్తుగా వున్నాడా? లేక 2000 సంవత్సరములకు ముందు మాత్రమే క్రీస్తుగా అయియున్నాడా?అనేది ముఖ్య ప్రశ్న. కనబడనటువంటి దేవుడు రక్తమును, మాంసమును కలిగిన తన యొక్క పిల్లలకు తనను బయలుపరచుకొనుటకు చివరి దినములలో అన్యజనుల … Read entire article »

Filed under: వేదములలోని మర్మములు

దైవీక స్వభావమునకు అసుర స్వభావమునకు గల వ్యత్యాసమును గురించిన రహస్యము

దైవీక స్వభావమునకు అసుర స్వభావమునకు గల వ్యత్యాసమును గురించిన రహస్యము భగవంతునికి వంథాతం సమర్పించుకొనుట వలనను మరియు జీవాత్మచే నింపబడుట వలన అది వేదగ్రంధములకు, భగవంతునికి విధేయత చూపుట వలన ఒక వ్యక్తికి దైవీక లక్షణములు వచ్చుచున్నవి. దానిని మీ స్వంత పరిశుద్దత వలన పొందలేరు. మానవుడు పంచేంద్రియములతో చూచి విశ్వసించు స్వభావము అసురలక్షణమునకు దారితీయును. ఈ రెండింటి వ్యత్యాసమును, వారి లక్షణములను ఈ సంభాషణలో వివరించబడినవి. భగవానుడు పలికెను :-నిర్భయము, చిత్తశుద్ది, సర్వోన్నత బలి లేదా జగత్పునాది నుండి వధింపబడిన గొఱ్ఱెపిల్ల (అక్షయమైన యోగము) గూర్చి నిరంతరము గతజీవిత లోతైన ధ్యానము, దానము, పంచేంద్రియములను అదుపులో వుంచుకొనుట, బలియర్పణము గురించిన విధులు, వేదములను అర్ధము చేసుకొనుట, భగవంతుని స్తుతించుట సరళమైన నిష్కపటమైన ప్రవర్తన కలిగియుండుట, మనోవాక్కాయ కర్మలలో అహింసను పాటించుట, యదార్థత, కోపము లేకపోవుట నేను క్రియచేయుచున్నానను భావము లేకపోవుట, శాంతము, వ్యర్ధమైన నిందారోపణలతో కూడిన సంభాషణచేయకపోవుట, అన్ని ప్రాణులయందు దయకలిగి యుండుట, పంచేంద్రియములతో క్రియచేయుచున్నను వాటియందు అనురాగము లేకపోవుట, సౌమ్యము, శాస్త్ర విరుద్దమైన కర్మాచరణముల యందు  లజ్జ, చంచలత్వము లేకపోవుట, తేజస్సు, క్షమ, ధైర్యము,శుచిత్వము, ద్వేషము లేకపోవుట ఇవన్నియు నా వేదముల ప్రకారము పరిశుద్దాత్మ లేదా ఆత్మ ద్వారా జన్మించిన వ్యక్తి యొక్క లక్షణములు. ఓ అర్జునా! కపటము, … Read entire article »

Filed under: వేదములలోని మర్మములు

పాఠకుల అభిప్రాయాలు

మీ మెయిల్‌ – మీ మాట మనుజ్యోతి పత్రికా సంపాదకులకు నమస్కారం, శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి దివ్యోపదేశాలతో కూడిన మనుజ్యోతి అక్టోబరు పత్రిక అందుకున్నాను, వీరభోగవసంతరాయులు గూర్చిన వ్యాసం చాలా బాగున్నది. ఈ గొప్ప సందేశములను అందరికీ తెలియజేయుటకు, ఈ ప్రాంతములోని ఆధ్యాత్మిక జిజ్ఞాసులకు ప్రదర్శించుటకు ‘తూర్పున ఉదయించిన మెరుపు-మనుష్యకుమారుని దినములు’ సి.డిను పంపించండి. ఆశ్రమ ప్రచురణలను పంపిస్తే చదివి నా ప్రక్కవారికి కూడా వాటిని పరిచయం చేస్తాను. ఇట్లు మీ ఆధ్యాత్మిక జిజ్ఞాసి. -ఎస్‌.డి. అమర్‌నాథ్‌, దాచేపల్లి. గౌరవనీయులైన మనుజ్యోతి ఆశ్రమం వారికి  మీ యొక్క అభిమాని వ్రాయునది. మీ ప్రచురణల గురించి మా స్నేహితుని వద్ద చదివితిని, అవి చాలా ఆసక్తి కల్గించాయి, నేను మీరు రాసిన విషయములను పాటిస్తూ ఉదయం (5గంటల నుండి 6 గంటల వరకు) ప్రతిరోజు ధ్యానము చేసితిని నాకు చాలా లాభాలు జరిగాయి. అంతకు ముందు నేను ఏదో ఒక వ్యాధితో బాధపడుతూ ఉండేవాడిని కాని ఇప్పుడు నేను క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నాను క్లాస్‌ఫస్ట్‌ వస్తున్నాను. ఇదంతా మీరు చెప్పిన విషయములను పాటిస్తేనే జరుగుతున్నాయి అని నేను గ్రహించాను. పెద్దలకు కూడా ఈ విషయములను తెలిపాను, వారు కూడా మిమ్ములను కొలుస్తున్నారు. కాబట్టి నాకు మీ గురించి పూర్తిగా తెలుసుకోవాలని వున్నది. … Read entire article »

Filed under: పాఠకుల అభిప్రాయాలు

ఓ! పరమపురుషుడా! శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణా నీవే!

ఓ! పరమపురుషుడా! శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణా నీవే! ఎటుచూచిన నీవే,  ఎందెందు వెదికినా నీవే! ఎగిసిపడే సాగర తరంగాల సవ్వడి నీవే! ప్రశాంతముగా పయనించే నదీ జలముల కదలిక నీవే! సెలయేరులో పరవళ్ళు త్రొక్కుతూ పారే జల సవ్వడి నీవే! మధురమైన సంగీతములోని సరిగమల సవ్వడి నీవే! వేకువ జామున కూసిన కోకిలగానము నీవే! నెమలి చేసిన అందమైన నాట్యములోని ఆ కదలికలు నీవే! ప్రతి ఉదయమున కేరింతలు చేసే పకక్షుల కిలకిలలు నీవే! విశాలము దట్టముగా క్రమ్ముకొనిన కారుమబ్బులు నీవే! ఆకాశములో అతివేగముతో పుట్టిన మెరుపుకాంతివి నీవే! ఉరుములలో భయంకరముగా ధ్వనించిన ఆ శబ్ధము నీవే! హరివిల్లులోని ఆహ్లాదకరమైన ఆ ఏడు రంగులలోను నీవే! జడివానలోని చిటపట చినుకుల సవ్వడి నీవే! వడి వడిగా దడ దడమని పడిన ఆ వడగళ్ళు సవ్వడి నీవే! ఈ విశాల విశ్వములో వీచిన చిరుగాలుల కదలిక నీవే! పుష్పములో పుట్టిన అతి తీయని మకరందము నీవే! ఈ ప్రకృతిలోని చెట్ల రెమ్మల ఆనందసవ్వడి నీవే! ఇందుగలడందు లేడని ఎందెందు వెదికినా గలడా చక్రకిరీటధారి. ఆహా ఓ! శ్రీమన్నారాయణా శ్రీలహరికృష్ణా నీవే, ఎటుచూచినానీవే, సర్వవాప్తివి నీవే!!! – జి.వి. రమణ, పెందుర్తి … Read entire article »

Filed under: కవితలు