தமிழ்| telugu

» Archive

లోకమంతటనూ వున్న క్రైస్తవులకు

కొన్ని ప్రశ్నలు 21. ఏసు ప్రధాన యాజకుడు అయితే దేవుడు ఎవరు? అతను దేవుడైతే ప్రధానయాజకుడు ఎవరు? రెండూ అతనే అయితే అది అతను నెరవేర్చడానికి వచ్చిన వాక్యమునకు వ్యతిరేకము కాదా? 22.  ప్రసిద్ధి చెందిన ప్రసంగీకులు అందరూ ఒకప్పుడు యింటి కప్పులపైన నిలబడి ప్రభువైన యేసు యొక్క రెండవ రాకడ గురించి కేకలు వేసేవారు. కాని యిప్పుడు నిశ్శబ్దముగా దానినివదిలి పెట్టి, ఓలీవ కొండపై బహిరంగమై ప్రభువు యొక్క మూడవ రాకడను గురించి మాత్రమే మాటలాడుచున్నారు. ఆలాగైతే యేసు యొక్క రహస్యమైన రెండవ రాకడ జరిగిపోయినదా? 23. మోషే దేవుని యొక్క మహిమను చూడాలని ఆశించినప్పుడు అతడు మనుష్యుని వెనుక భాగములాగ వున్న తన వెనుక భాగమును మాత్రమే చూపించెను. ఒక మనుష్యుని యొక్క వెనుక భాగమే దేవుని యొక్క మహిమనా? 24. ప్రకటన 13:8వ వాక్యములో చెప్పబడినట్లు 666 అను సంఖ్య – మృగము యొక్క ముద్ర క్రిందుగ ప్రపంచములోని సంఘములనన్నిటిని ఐక్యపరచడము సాతాను యొక్క ముఖ్య వుద్దేశ్యమైయున్నది. ఈ ప్రసిద్ది చెందిన ప్రసంగీకులకు యిది తెలియదా? మరి దానికెందుకు ఆదరణ చూపుచున్నారు? వారూ సాతాను యొక్క సంఘస్థులేనా? 25. ఆదికాండము 1వ అధ్యాయములో దేవుడు లోకమును సృష్టించెను అనుటకును, ఆదికాండము రెండవ అధ్యాయములో ప్రభువైన దేవుడు దానిని … Read entire article »

Filed under: శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు

వేదములను అనుసరించి కలియుగము యొక్క సూచన

నాలుగు వేదములు, అష్టాథ పురాణములను వ్రాసిన వేదవ్యాసుడు కలియుగ  ముగింపులో సంభవించు కార్యములను గురించి భాగవతం, భవిష్యపురాణం, కల్కిపురాణం అను గ్రంధములలో ఖచ్చితముగా చెప్పియున్నారు. వాటిలో నుండి కొన్ని భాగములను యిక్కడ యిచ్చుచున్నాము. భాగవతం, ద్వాథ స్కంధం — 2వ అధ్యాయం  కలి ప్రభావం  వలన ధర్మము, సత్యము, విదృత్తియం, సహనం, దయ, ఆయుష్షు, బలము జ్ఞాపకశక్తియు కొన్ని దినములలో నాశనమగును. కలియుగములో మనుష్యులు పుట్టుటకు ఆచారములకు, గుణములకు ఆదారమైనది సంపద. ధర్మమునకు సాధనమైనది బలము మాత్రమే. ఒకరిపై యొకరికి ఉన్న ప్రేమయే స్త్రీ, పురుషుల సంబంధమునకు  కారణముగా వున్నది. కొనుట లోను ఆమ్ముటలోను, మోసం ఎక్కువగా వుండును. పన్నాగం, చాతుర్యం  స్త్రీ పురుషుల అభివృద్దికి కారణం. జంజం బ్రాహ్మణులకు గుర్తు. దండము, లేడి చర్మము సన్యాసికి గుర్తు. అంతేగాని నడత ఎవరూ గమనించరు. డబ్బు ఇవ్వడానికి శక్తి లేకపోతే అది న్యాయమైనను ఓడిపోవును. నోటి సామర్ధ్యమే విద్యకు సూచన. ధనము లేని వాడు నీచుడు. ఆడంబరము లేనివాడు సాధువు. సమ్మతమైన ఆంగీకారమే వివాహము. స్నానమే శరీరమునకు ఒక అలంకారము. దూరదేశములో ఉన్న చెరువు ఒక పుణ్యతీర్ధం. తలపై జుట్టు పెంచుకొనుటయే ఒక అలంకారము. కడుపు నింపుకొనుట పురుషధర్మం. అక్రమమే సత్యవ్రతం, తన కుటుంబమును పోషించుకొనుటయే సామర్ధ్యం. కీర్తి గురించియే … Read entire article »

Filed under: వేదములలోని మర్మములు

మనుజ్యోతి

మనుజ్యోతి ఆశ్రమం వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు మీ రచనలను కొన్నింటిని నా స్నేహితుని వద్ద చదివాను చాలా బాగున్నాయి,. వాటిని చదివిన తరువాత మాకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కల్గించాయి, ఆ పుస్తకాలలో భగవద్గీత అను పుస్తకము నాకు చాలా బాగా నచ్చింది. ఎన్ని అడ్డంకులు వచ్చినాసరే మనుజ్యోతి పత్రికను చదవకుండా వుండకూడదు అని పిస్తుంది. మీ అమూల్యమైన రచనలతో ఆకర్షించిన మీకు నా ధన్యవాదములు, ఒకే దేవుడు – ఒకే దేశము అను చైతన్యము అభివృద్ది చెందాలని కోరుచున్నాను. మీ ప్రచురణలను అన్నింటిని తప్పని సరిగా పంపించండి. -కె. శివప్రసాద్‌, నల్గొండ శ్రీశ్రీశ్రీ లహరికృష్ణ శ్రీమన్నారాయణ గార్కి వందనాలు, మీకు మా శుభాకాంక్షలు. అయ్యా! ఈ రోజులలో మతాలు, అనేక రకరకాలు గా వున్నాయి, ప్రతి మతం నా మతం గొప్ప, మాదేవుడు గొప్ప అని ప్రచారం చేయుచున్నారు. హిందూమతాన్ని హేళన చేస్తున్నాయి, మా దేవుడు గొప్ప ఎటువంటి కష్టము వచ్చిన మా దేవుడు కాపాడుతాడు అని ప్రచారం చేయుచున్నారు. ఇది ఎంతవరకూ నిజము, పూర్తి వివరాలు మాకు తెలియజేయవలసినదిగా కొరుతూ వున్నాము.   -సి.హెచ్‌. పైడుపునాయుడు, విజయనగరం. ప్రియమైన మనుజ్యోతి ఆశ్రమం వారికి నమస్కరించి వ్రాయునది. నాకు  మీ గురించి తెలుసుకోవాలని చాలా ఆశగా వున్నది. … Read entire article »

Filed under: పాఠకుల అభిప్రాయాలు

లహరికృష్ణయ్యా మహవిష్ణువయ్యా

లహరికృష్ణయ్యా మహవిష్ణువయ్యా – కల్కిమహదేవుడవు మా అందరి సమీప బంధువుగాను నరనరాయణునిగాను మనుజ్యోతిలో సీయోనులో వెలసిన ద్రావిఢ జ్యోతివి నీవు పరిశుద్ధ పల్లెయందు లక్ష్మీ తేయాకు తోటయందు జన్మించావు నీవు నిన్ను నమ్మిన భక్తులను వైకుంఠమునకు చేర్చె రాజాధి రాజువు నీవు దేవ నరునిగ వచ్చావయ్యా ధర్మమును స్థాపించి నీ మహిమను మాకిచ్చావయ్యా కొక్కొండ ఆంజనేయులు, అంభర్‌పేట్‌. ****** … Read entire article »

Filed under: కవితలు

కృష్ణా! లహరికృష్ణా మీరు మా మదిలో మెదలుతున్న

కృష్ణా! లహరికృష్ణా  మీరు మా మదిలో మెదలుతున్న ఒక అపురూపమైన దైవీక శక్తివి! కృష్ణా! లహరికృష్ణా మా కనుల ముందర నిలిచియున్న రత్నాల మూటవు! మా నేత్రములలో మెదలుతున్న ముత్యాల ముత్తుకృష్ణవు!  మాకనుల యందు మీ ముఖబింబం బంగారుకాంతివలే మెరయుచున్నది! అన్నింటని మించిన మీ భావమును మూడు వేదములు గీతాంజలి కళగ వివరించేను! మీరు కట్టించిన ఈ మనుజ్యోతి నగరం ఒక అతి సుందర ఆధ్యాత్మిక నందనవనం! ఈ సువిశాల అరణ్యవనములో నీ యొద్దకు చేర్చుకొన్నావు మమ్మును! లహరికృష్ణా ఇవే మా యొక్క హృదయపూర్వక గులాబీలు !!! -ఇబ్రహీం, వినుకొండ ****** … Read entire article »

Filed under: కవితలు

చేతితో తీయబడని రాయి

చేతితో తీయబడని రాయి – ఇది చేతితో తీయబడని రాయి! చేతి సహయము లేక తీయబడిన ఈ రాయి! ఇదియే మూలరాయి -ఇదియే మూలకు తలరాయి! ఇదియే సీయోనులో వుంచబడిన అడ్డురాయి! దానియేలు ప్రవక్త దర్శనములో చూచిన ఈ రాయి! మతములను రాజకీయములను ముక్కలు ముక్కలుగా చేయును ఈ రాయి! సర్వ భూతలమంతా మహా పర్వతమాయెను ప్రతిమను విరుగగొట్టిన ఈ రాయి! ఈ రాయితో కలసి దొర్లిన వారికి సంభవించును గొప్ప హాయి! ఈ రాయితో కలసి వెళ్ళని వారికి కలుగును నాశనమోయి! మన దేశము సుభిక్షముగా వుండాలనుకుంటే మీరోయి! ఈ రాయితో కలసి నడవండోయి! ‘ఒకే దేవుడు-ఒకే దేశము’ అను ఈ చైతన్యములో మీరు సాగండోయి! ప్రేమతో ఏక మనస్సుతో మనమందరమూ కలపాలి చేయి చేయి! హిందూ ముస్లిము క్రైన్తవులకు అదే భాయి భాయి! మతములను విడిచి మీ మనసులను తెరచి ఈ రాయితో కలసి నడవండోయి! ఈ రాయితో కలసి నడువని వారు అవుదురు తప్పక పిండి పిండోయి! ఆ తలరాయి ఎవరో తెలుసా మీకోయి! శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణయే ఆ తల రాయి! ఈ చైతన్యమే చేతి సహయయము లేక తీయబడిన గొప్ప రాయి! – జి.వి. రమణ, పెందుర్తి ****** … Read entire article »

Filed under: కవితలు