தமிழ்| telugu

» Archive

చిలిపి కృష్ణుఇ రాక్షస ఆటలు

శ్రీకృష్ణుని కధలు ఏదో చిన్నపిల్లలు ఆటలవలెను లేదా రాక్షసులను అంతం చేసే విధముగానే కనబడును. కాని కొద్దిగా లోతుగా ఆలోచించినట్లయితే, ఈ రాక్షస సంహారములన్నియు గొప్ప తత్వములను తెలియపరుస్తున్నవి. రాక్షసి అయిన భూతనను శ్రీకృష్ణుడు మొదటిగా హతము చేసెను. ఆమె ఒక అందమైన అమ్మాయి రూపమును తీసుకొని శ్రీకృష్ణునికి విషముతో కలిసిన పాలను యివ్వడానికి వచ్చింది. కాని శ్రీకృష్ణుడు పాలుతో కలిపి ఆమె ప్రాణమును కూడా తీసివేసెను. భక్తుడు ప్రారంభములోనే మంచి, చెడు అని వివేచించే జ్ఞానమును నిశ్చయముగా పొందుకొనియుండవలెను. అదే సమయములో మేలు చేసే విధముగా వస్తున్న కీడును వేరుతో సహా పెరికివేయాలి అనే దానిని ఈ భూతన హతము తెలియపరుస్తుంది. తరువాత శ్రీకృష్ణుడు దృణావర్దుడు అనే రాక్షసుని హతము చేసెను. వీడు గాలి రూపములో వచ్చి, ఊయలలో పడుకొనియున్న శ్రీకృష్ణుని ఆకాశములోనికి తీసుకొని వెళ్ళి చంపడానికి ప్రయత్నించెను. కాని అతను పైకి ఎగురగా ఎగురగా శ్రీకృష్ణుని భారమును తట్టుకోలేక ఆ రాక్షసుడు క్రిందపడి మరణించెను. మనస్సును ఆధీనములో వుంచుకొనుట చాలా కష్టము. అది గాలిని ఆధీనములో వుంచుటకు ఎడతెగని ప్రయత్నమును దృఢమైన మనఃస్థిరత్వముతో మాత్రమే వీలు అగును అని శ్రీకృష్ణుడు గీతలో చెప్పెను.  మనస్సును ఏ రీతిగా ఆధీనములో వుంచవలెను? శ్రీకృష్ణుని యొక్క రూపమును, ఆయన … Read entire article »

Filed under: హిందూ పురాణములు

‘ఓం నమో భగవతే శ్రీలహరికృష్ణాయ నమః”

ప్రియమైన ఆత్మీయ సహోదర, సహోదరీలారా! శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ నామములో మీకు మా యొక్క శుభాకాంక్షలు. గడిచిన జనవరి నెలలో విశాఖపట్నంలో వి.జి.పి. తమిళ్‌సంఘం వారు ఏర్పాటు చేసిన ”తిరుక్కురళ్‌ మహాసభలో” నేను, నా సహోదరుడు మరియు మనుజ్యోతి ఆశ్రమమునకు చెందిన కొంతమంది సభ్యులు అందరము ఆ కార్యక్రమములో కలుసుకొన్నాము. ఆ సభలో శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి ఆత్మీయ సందేశముల పుస్తకములు, కరపత్రికలు, సి.డి.లు సామాన్య జనులందరికీ ఉచితముగా పంచిపెట్టాము. ఆ కార్యక్రమమునకు అనేకమంది ప్రముఖులు, ముఖ్యులు, రాజకీయ వేత్తలు వచ్చి కలుసుకొన్నారు. మరీ ముఖ్యముగా ప్రస్తుత తమిళ్‌నాడు రాష్ట్ర గవర్నర్‌, మరియు ఆంధ్రా మాజీ ముఖ్య మంత్రివర్యులు అయిన గౌ|| శ్రీ కె. రోశయ్యగారు ముఖ్య అతిధిగా ఈ కార్యక్రమమునకు విచ్చేశారు. ఆయనను మనుజ్యోతి ఆశ్రమ ఆధ్వర్యములో సన్మానించినందుకు మేము చాలా సంతోషించు చున్నాము. ఈ కార్యక్రమము అంతా శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి కృపవలననే సంభవించినది. ఇంకనూ అనేకమంది ఆత్మీయ స్నేహితులు ఈ కార్యక్రమములో మాకు నూతనముగా పరిచయమయ్యారు. అదేవిధముగా ”ఒకే దేవుడు! ఒకే దేశము!” అను సిద్దాంతమును ఉత్తర భారతదేశమునందలి అస్సాం, మేఘాలయ, షిల్లాంగ్‌ ప్రాంతాలలో వున్న జనులకు శ్రీలహరికృష్ణగారి సందేశములను అందజేయుటకు ఆత్మీయ పర్యటనగా ఒక బృందంగా బయలుదేరి వెళ్ళియున్నాము. ఆ ప్రాంతములలో కూడా అనేకమంది ఆత్మీయులను కలుసుకొన్నాము. గడిచిన … Read entire article »

Filed under: సంపాదకీయం

ఈ రోజున అనేకులు వేదములు మరియు భగవద్గీత మొదలగు వాటికి వివరణ చెప్పుచున్నారు. కాని వారు సంస్కృత భాగములను ముట్టుకొనుట లేదు. ఎందుకంటే వారు రహస్యమును మరుగుచేసి చెప్పి వెళ్ళిపోతున్నారు. కావుననే భవిష్యపురాణములో అనేక రహస్యములు మరుగైయున్నవి. అందులో 6000 సంవత్సరములకు కావలసిన ప్రవచనములు వున్నవి. మన యొక్క సంస్కృత పండితులు వాటిని అనువాదము చేసినప్పుడు అందులో అనేకమైన రహస్యములను ప్రజలకు మరుగుచేసియున్నారని మేము కనుగొన్నాము. కావున మతనాయకులు అనేకమైన రహస్యములను మరుగుచేసియున్నారు. ‘వలంగై’ అని పిలువబడు తమిళపురాణము ఒకటి వున్నది. అది దొంగలింపబడి ఒక దేవాలయములో పెట్టబడియున్నది. ఒక మనుష్యుడు దానిని చదివినట్లయితే ఈ దినములలో ఏమి జరుగుచున్నదని అతను తెలుసుకుంటాడు. కాని వారు దానిని ఎందుకు పెట్టుకొనియున్నారు? ఇతరులు దానిని పొందుకొనకూడదు అని వారు దానిని వారిదగ్గరే పెట్టుకొనియున్నారు. కావున ఈ దినమున అనేకమైన పుస్తకములు వున్నవి. అనేకమైనవి నాశనము చేయబడియున్నవి. ఇప్పుడు ‘మృత సముద్రం నుండి గ్రంధపు చుట్టలు’ దొరికినవి. వాటిలో అనేకమైన రహస్యములు వున్నవి. యాజేరు అని పిలువబడే ఒక పుస్తకము వున్నది. అబ్రహాము భారతదేశము నుండే వెళ్ళాడు అని అందులో చెప్పబడియున్నది. ఆంగ్లంలో అబ్రహాము అని చెప్పబడినదానిని, ఇస్లామీయులు ఇబ్రహీము అని అంటున్నారు. హిందువులు అభిరాము (బ్రహ్మ) అని అంటున్నారు. … Read entire article »

Filed under: వేదములలోని మర్మములు

పొందుకొనుటకు మరి యిక ఏమియు లేదు

భగవంతునిపై మనము వుంచే పవిత్రమైన ప్రేమయే మనము పొందుకొనే ప్రతిఫలము అని స్వామి ప్రభుపాదం అన్నారు. భగవంతుని మీద ప్రేమను చెల్లించే ఉద్దేశ్యం మనము ఆర్థిక పరిస్థితుల్లో ఉచ్ఛస్థాయికి వెళ్ళుట కొరకే. గాని ఆర్థిక బంధము నుండి విడిపించబడుటకు కాదు. నిజమైన ఉద్దేశ్యము ఏమిటంటే మనము భగవంతునికి భక్తితో సేవ చేసి, ఆనందము పొందుటయే. – చైతన్య చరితామృత – మత్స్యలీల 20:141. మనము భగవంతునికి భక్తి అనే ప్రేమ పుష్పముతో పూజించుట వలననో లేదా సేవ చేయుట వలననో మన ఆర్థిక పరిస్థితులు పెరుగుతాయని, ఆర్థికము కొరకు మనము చేసే పనుల నుండి విడుదల పొందుతామనియు తలంచకూడదు. ఈ విధముగ తలంచడం మన లౌకిక యిచ్ఛల కొరకు చేయబడుచున్నది. యోగులు, జ్ఞానులు అయితే ఆర్థిక చిక్కుల నుండి విడుదల పొందుటకు ప్రయత్నిస్తారు. అదే వారి యొక్క ఆశగా వున్నది. కాని భక్తితో దేవునికి సేవ చేసినప్పుడు అటువంటి ఆశ కలుగుటలేదు. ఎందుకంటే భక్తితో భగవంతునికి సేవ చేసినప్పుడు అది పవిత్రమైన ప్రేమగా వుంటుంది. మనము ఈ రీతిగా లాభము పొందుకొనవచ్చును గాని ప్రతిఫలమును ఆశించుట లేదు. భగవంతునికి భక్తితో సేవ చేసేది లాభం యిచ్చే ఒక వ్యాపారం కాదు. నాకు లాభం కలిగినట్లయితే నేను భగవంతునిపై భక్తిని, … Read entire article »

Filed under: వేదములలోని మర్మములు

దీర్ఘాయుష్మంతులు

ఎవ్వరికీ కూడా జీవితముపై నున్న ఆసక్తి అనేది వదిలిపెట్టిపోదు. రోజు రోజుకు అది ఎక్కువగుచున్నది. ఆ ఆసక్తి కలుగుట వలన కష్టపడి విజయమును పొందుకొంటున్నారు. ఈ కలియుగములో భగవంతునియందలి భయభక్తి లేని జనుల సంఖ్య అధికమగుచున్నది. వారే ఎటువంటి కష్టము లేనివారుగా సంతోషముగా వున్నారు. ధనమును సంపాదించుకొని సుఖముగా జీవించుచున్నారు. కాని నిజమైన భగవంతుని కనుగొని ప్రార్థించి చూడండి. వారి వద్ద ఎటువంటి ధనము కూడా వుండుట లేదు. కారణం అధిక ధనవంతుడినే (భగవంతుడిని) వారు స్వతంత్రించుకొనుట ద్వారా ధనము అనేది ఒక లెక్క కాదు. ప్రియుల యొక్క హృదయము అనే తామర పుష్పములో ఆసీనుడైయున్న భగవంతుని, కీర్తినీయుడైన ఆయన యొక్క పాద పద్మమును ఎడతెగక పట్టుకొనివున్నవారు, సమస్త లోకములో కంటెను ఉన్నతమైన ముక్తి లోకములో ఎల్లప్పుడూ జీవిస్తారని తిరువళ్ళువార్‌ (తమిళ ప్రవక్త) చెప్పియున్నారు. ఆ ముక్తి లోకములో జీవించుటకు ఆశించేవారికి ఈ లోకములో జీవించే జీవితము పెద్దదిగా కనబడదు. ఈ మాయ లోకములో జీవించుటకు అందరికీ ఆశగా వున్నది. కాని ఎలా జీవించాలి అనే ఆలోచన మాత్రం కలుగుట లేదు. భగవంతుడు మాత్రమే సమస్త కష్టముల నుండి మనలను తప్పించగలడని ప్రజలు ఎరుగుదురు. అయినను కన్నులను మూసియున్న మాయను తొలగించుకొనుటకు యిష్టము లేక అన్నింటినీ తప్పుగా కనుగొంటున్నారు. … Read entire article »

Filed under: పాఠకుల అభిప్రాయాలు

నిజమైన అందము

ఒక రాజు అష్ట ఐశ్వర్యములతో జీవించేవాడు. రాణి చాలా సౌందర్యవంతురాలు. అదిగాక రాజ్యములో అనేకమంది దాసులు, ఆయనకు ఒకే ఒక కుమార్తె. స్త్రీలను కామము తీర్చుకొనే యంత్రముగా తలంచే తండ్రి యొక్క కార్యములు ఆమెకు నచ్చేవి కావు. ఆమెకు జీవితముపై విరక్తి కలిగినది. కుమార్తె యొక్క వివాహము గురించి తండ్రి మాట్లాడుట ప్రారంభించెను. అనేకమైన దేశపు రాజులు అమ్మాయిని అడిగి, వర్తమానములు పంపారు. అన్నింటిని త్రోసివేసిన యువరాణి దైవభక్తిలో మునిగిపోయింది. కృష్ణుని భక్తురాలైన ఆమెకు తండ్రి కొన్ని ఆలోచనలను చెప్పాడు. ‘కుమార్తె! నీవు పూజించే ఆ కృష్ణుడు కూడా అనేకమైన అమ్మాయిలకు నాయకుడిగా వున్నాడు. ఆయన కూడా దాంపత్య జీవితమునకు యిష్టపడి, రుక్మిణి భామను వివాహము చేసుకొన్నాడు. నీవు కూడా దాంపత్య జీవితమును అంగీకరించు. చింతించవలదు’ అని చెప్పాడు. అందుకు యువరాణి తండ్రి వద్ద, ‘తండ్రిగారు! మన బుద్ధిహీనత వలన భగవంతునిపై నింద మోపవద్దు. కృష్ణుడు భగవంతుడు. సర్వలోకములోనున్న జీవరాశులు కూడా తమను స్త్రీలుగా భావించుకొని, ఆయనను పొందుకొనుటకు యిష్టపడుచున్నారు. ప్రేమ కారణముగా ఆయన మీద మోహం కలిగినవారుగా నటించుచున్నారు. ఆ నటననే రచయితలు అందరూ ప్రేమ కావ్యములుగా రచించియున్నారు. రాధా కృష్ణులు ప్రేమించుకొనుటలో ఎటువంటి కామము లేదు. అక్కడ దైవత్వము మాత్రమే కనిపించును. మనుష్యుల … Read entire article »

Filed under: పాఠకుల అభిప్రాయాలు