தமிழ்| telugu

» Archive

నన్నెరిగినవాడే నాకు ప్రియుడు. వానిని ప్రేమింతును

నా మహిమ లెరింగిన నా భక్తులు జాగ్రత్తగానే నన్ను పూజించుదురు. వారిని బిడ్డను తల్లి పోషించు విధముగా పోషించుదును. నా రాకడకై నా భక్తులు ఎదురు చూచుచుందురు. నా భక్తులైన వారికి యెప్పటికప్పుడే నిదర్శనము కనబడుచుండును. అరణ్యములన్నియు ఫలవంతములగును. శ్మశాన భూములందు భక్తులండెదరు. నిలువున ఆజానుబాహువులు వచ్చి మేమే వీరభోగ వసంతరాయులమని చెప్పుదురు. నా భక్తులెంత మాత్రమును నమ్మరు. – శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి ప్రవచనముల నుండి… శ్రీరామానుజుల వారి ప్రవచనములు శ్రీరామానుజులు ఆద్యాపిపద్య లహరీ యాకాంతిపూర లహరీ నిహతాంధకారా లావణ్యపూర లహరీ భిరివాహృతాని మత్రపరత్రాపి తే సమృద్దయన్ని (తామ్రపర్ణిత్రాపి) శ్రీరామానుజ మందహాస లహరీ తవమందహస లహరీ తవముఖ కమల సముత్ధా మునిశేకర మందహస లహరీ తవ మందహస లహరీం విజేతు మాగత్య చంధ్ర మహా ప్రసభమ్‌! అమృతార్ణవీయ లహరీ! మృజ్యా ద్యోగిన్ధ్ర మన్దస్మిత ఝర లహరీ వ్యాప్నువన్తీ దిగన్తా! శ్రీ మందహాస లహరీ మవవర్ణ దేవమ్‌!! శ్రీ రామచంధ్ర తుష్ణే శ్రీరామానుజ మందహస లహరీయమ్‌! కౌండిన్య వంశ జనుషా వ్యరచి విదా వీరవల్లి నరహరిణా!! యుగదహన గగనశరయుజి కల్యబ్దే శ్రీముఖాహ్వయే చలతి! కన్యా కృష్ణ చతుర్ధ్యో బుధస్య వారే సమాపదియమ్‌!! భావము : పరలోక మతము స్థాపించడానికి వచ్చిన సముద్ర శయనుడైన శ్రీమన్నారాయణుడు తామ్రపర్ణి నది దగ్గర నివాసము స్థాపించి లహరి జ్యోతి పురంవాడు నిశ్చలుడు, నిర్మలుడు, అంధకారాన్ని పారద్రోలువాడు అయిన భగవంతుడు, చిరు మందహాసము కమలములాంటి ముఖము కలవాడు, మునులలో శేఖరుడు చంద్రుని … Read entire article »

Filed under: హిందూ పురాణములు

మానవ విజ్ఞానమా! – భగవంతుని జ్ఞానమా!

విశ్వ ఆవిర్భావ ప్రారంభకాలమునకు చెందినదిగా భావిస్తున్న అతి పెద్ద నక్షత్ర సముదాయాన్ని ఖగోళ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారీ టెలిస్కోప్‌లు సేకరించిన సమాచారం, దృశ్యాల ఆధారంగా పరిశోధకులు ఈ నక్షత్ర సముదాయాన్ని కనుగొన్నారు. ‘హెచ్‌ ఎఫ్‌ ఎల్‌ ఎస్‌-3’గా పిలువబడుచున్న ఈ నక్షత్ర సమూహం భూమికి 1280 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని, అది ఏటా 3వేల సూర్యులకు సమానమైన క్రొత్త నక్షత్రాలను అంటే మన పాలపుంతకన్నా రెండువేల రెట్లు ఎక్కువ నక్షత్రాలను పుట్టించగలదని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. అంతే కాదు కొత్త నక్షత్రాలు ఏర్పడడానికి కారణమయ్యే వివిధ రకాల వాయువులు భారీ ప్రమాణంలో ఈ నక్షత్ర సముదాయంలో ఉన్నట్లుకూడా వారు చెప్తున్నారు. అంత దూరంలో వున్న నక్షత్ర సముదాయానికి చెందిన భౌతికపరమైన ఆస్తులను ఇంత వివరంగా గుర్తించడం ఇదే మొదటిసారని కార్నెల్‌ యూనివర్సిటికీ చెందిన డొమినిక్‌ రీచర్చ్‌ చెప్పారు. విశ్వ ఆవిర్భావ సమయంలో పాలపుంతలు, నక్షత్ర సమూహాల కూటములు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవడానికి ఇలాంటి గెలాక్సీలకు సంబంధించిన వివరాలు సంపాదించడం చాలా ముఖ్యమని కూడా ఆయన చెప్పారు. ప్రస్తుతం కనుగొన్న నక్షత్ర సమూహంలో మన సౌరమండలంలో వున్న నక్షత్ర సమూహాలకన్నా దాదాపు 4వేల కోట్ల రెట్లు ఎక్కువ నక్షత్ర సమూహాలున్నట్లు, అలాగే … Read entire article »

Filed under: హిందూ పురాణములు

”ఓం నమో భగవతే శ్రీలహరికృష్ణాయ నమః”

ప్రియమైన ఆత్మీయ సహోదర, సహోదరీలారా! శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ నామములో మీకు మా యొక్క శుభాకాంక్షలు. గతసంచికలో తెలిపినట్లుగా 2013 మే 5వ తేదీ నుండి 26వ తేదీ వరకు చిన్న పిల్లలకు ‘వేసవి విడిది శిక్షణా తరగతులు’ మనుజ్యోతి ఆశ్రమములోను, ఆంధ్రాలోనున్న అసరాడలో మే 3వ తేదీ నుండి 19వ తేదీ వరకు, శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ మహిమసన్నిధిలో చాలా బ్రహ్మాండముగా జరిగినవి. ఈ సమ్మర్‌క్యాంప్‌లో భగవంతునియందు ఏవిధముగా భయభక్తులు కలిగియుండాలి, వేదములను ఏవిధముగా చదివి వాటిని ఏవిధముగా ఆచరించాలి, ఇంకనూ మన హిందూ పురాణముల గురించియు ఉపాధ్యాయులు పిల్లలకు బోధించుట జరిగినది. ఒక వృక్షమునకు ఎన్నో ఆకులు, కొమ్మలు వుంటాయి. కాని ఆ ఆకులకు, కొమ్మలకు ఎటువంటి కులబేధము, భాషా బేధము, మత బేధము, జాతి బేధము వుండదు. ఒక ఆకు యింకొక ఆకుతో గొడవ పడదు. ఒక కొమ్మ యింకొక కొమ్మతో దెబ్బలాడదు. గాలి వీచినప్పుడు ఒకటిగా వీస్తాయి. లేనట్లయితే ప్రశాంతముగా వుంటాయి. వాటన్నిటికి జీవము వృక్షము యొక్క వేరుల నుండి మాత్రమే వచ్చును. అదే సమయములో వృక్షములు మనుష్యులకు తగినవిధముగా సహాయపడతాయి. అదేవిధముగా మనుజ్యోతి ఆశ్రమములో జరిగిన సమ్మర్‌క్యాంప్‌లో పాలుపంచుకొన్న పిల్లలు పలు ప్రాంతముల నుండి, పలువిధ కుటుంభముల నుండి వచ్చియున్నారు. కాని వారు మనుజ్యోతి … Read entire article »

Filed under: సంపాదకీయం

హిందువులు దేని కొరకు కాచుకొని వున్నారని తెలుసా? వారి కృష్ణుని కొరకు వేచియున్నారు. ఆ కృష్ణుడు కృష్ణునిలాగ అంటే పెద్ద జుట్టు అదీ పెట్టుకొని వస్తాడని ఎదురు చూడవద్దు. ఆ కాలమున తన జనులను కాపాడడానికి అతను ఆ విధముగ వచ్చాడు. అవతార పురుషుడు అంటే మొదటి క్రీస్తుయేసు, అనగా నారాయణుడు తన ఆత్మను ఆ మనుష్యునిలో వుంచుచున్నాడు. అతనే అవతార పురుషుడు. అతను మరణించాలి. తను వచ్చిన పని పూర్తి అయినప్పుడు అది మరణించి వెళ్ళిపోతుంది! ఇప్పుడు … యేసు ఈ లోకమునకు వచ్చినప్పుడు అతను బాప్తీస్మము తీసుకొనినప్పుడు అతని పరిశుద్దాత్మ అతనిలో పెట్టబడినది. కాని అది నారాయణుని శరీరము కాదు. అతనిలో లోపల అది వుండినది. ఒక బీజము లాగ అది నేలలో వేయబడినది. అందుకే ఈ రెండువేల సంవత్సరములుగ ఏసును విశ్వసించిన వారందరి కర్మ ఆ విధముగ పోయినది. విత్తనము కూడ తోటమాలి దగ్గరికి వెళ్ళినది. ఇప్పుడు ఆ సమయము గతించిపోయినది. ఇప్పుడు నారాయణుడు తన స్వంత శరీరముతో భూమిపైకి వచ్చియున్నాడు.  –  శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ … Read entire article »

Filed under: శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు

కనబడని దేవుడు సర్వవ్యాప్తియై యున్నాడు. రాతిలో, దీపములో, జంతువులో, కోడిపిల్లలో, చేపలో, గాలిలో సమస్తములోనూ, సర్వవ్యాప్తిగ దేవునిచే నిండియున్నది. భగవంతుని ఆత్మ మీలో వున్నది. కాని మనము భగవంతుని ఆత్మతో మాటలాడలేము. నేను గాలితో మాటలాడలేను. ”ఓ దేవుడా!” అని మీరెందుకు పైకి చూస్తున్నారు? భూమి గుండ్రముగ వున్నది. ఇక్కడ ఒక తమాషా అయిన కార్యము మీకు చెప్పాలని అనుకొంటున్నాను. నేను పైన చూచి ‘దేవుడా’ అని అంటున్నాను. అమెరికాలోవున్న అతను ఆ విధముగానే చూచి ‘దేవుడా’ అని అంటున్నాడు. భూమి గుండ్రముగ వున్నందున నేను యిక్కడ దేవుడా అని పిలుచుచున్నాను. ఇంకొక వైపున వున్న అతను ‘దేవుడా’ అంటే అది క్రింద చూచినట్లవుతుంది. తూర్పున వున్నవాడు యీ వైపున చూచి దేవుడా అంటాడు. పశ్చిమములో వున్నవాడు ఆవైపు చూచి పిలుస్తాడు. ఆలాగైతే దేవుడు పైన మాత్రమే వున్నాడా? ఆలా కాదు. దేవుని ఆరాధించే జనులకు అది అవసరం లేదు. వారు భూమిపైన తలా ఒక దిక్కున వుండి భగవంతుని  పిలుచుచున్నారు. ఎక్కడ నుండి పిలిచినా ఆ పిలుపు నిజమైనదైతే వెంటనే అది ఆయనను తాకుతుంది. దేవుడు ఎప్పుడు భూమిపైన దిగివచ్చాడు? జూలై 21వ తేదీన దిగివచ్చాడు. కాని అమెరికాలో అది జూలై 20వ తేది. … Read entire article »

Filed under: శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు

ఇస్లాం ఏమి చెప్తుంది?

”చేయి చాచితే వరం అనుగ్రహించుతావు. హరి అంటే సరి అని అంటావు! ప్రభువు అంటే అర్థం నీవే! అల్లా అంటే నీవు కాకుండా వేరే ఎవరు? కాదు అని అంటారు కొందరు. ఆ ‘కాదు’ అనేదికూడా నీ పేరే! స్వంత పేరు అని లేకుండా, ఏ పేరులో నిన్ను పిలవాలి?” ఇస్లాం అంటే పూర్తిగా భగవంతుని వద్ద తనను సమర్పించుకొన్నవాడు అని అర్థము. భగవంతుడా! నీవు వింటున్నావు. మమ్ములను నడిపించుచున్నావు. నేను నడుచుచున్నాను. దుఃఖము కలిగినను నేను ఓర్చుకొంటాను. ఎందుకంటే అది కూడా నీవు అనుగ్రహించే ఒక వరమే అని పవిత్ర ఖురాన్‌ చెప్తుంది. ఈ విధముగా అనుకొంటే, సుఖము లేదు, దుఃఖము లేదు అనే సమానమైన స్థితికి వచ్చెదరు. ఒకడు సమస్తమును చేయువాడను నేనే అని అనుకొనుటవలననే దుఃఖము కలుగుచున్నది. చూపులేనివారు ఏనుగును చూచిన కధ మనకు తెలుసు. వారు వారు వారికి తెలిసిన స్థలములలో నిల్చొని, భగవంతుని దర్శించుచున్నారు. మన యొక్క గ్రహింపుకు అది అంతుచిక్కనిది. సృష్టించబడిన గ్రహింపును, సృష్టించినవానిని పూర్తిగా చూడలేము. పరిపూర్ణ సత్యమును మనుష్య జ్ఞానము అనేది గ్రహించలేదు. మతములలో వ్యత్యాసములను ఇస్లాం చెప్పనే లేదు. భగవంతుడు అన్ని దేశములకు, అన్ని సమయములకు, అన్ని కాలములకు వేదముల ద్వారాను, పరిశుద్ధ దూతల ద్వారాను మార్గమును చూపించుచూ వచ్చెను. … Read entire article »

Filed under: వేదములలోని మర్మములు