தமிழ்| telugu

» Archive

శ్రీమన్నారాయణుడు ఎవరి మధ్యలో వున్నాడు?

భగవంతుడే ఉపాయమని విశ్వసించు వారలకు ప్రధానముగా ఉండవలసినవి – ఆకించన్యము, అనన్యగతిత్యము. పరమాత్మను పొందుటకు తాను సంపాదించిన సాధనము ఇది అని చెప్పుకొనదగినది ఏదీ లేదని భావించుట ఆకించన్యము. భగవంతుడు తప్ప వేరొక ఉపాయము లేకుండుట, వేరొక ఫలము లేకుండ ఉండుట అనన్యగతిత్వము. కృష్ణ పరమాత్మ కేశి అను రాక్షసుని చంపెనని ‘మావాయ్‌ పిళన్దానై’ అనుచున్నారు. ఈ కేశియే ”అహంకారము”. అహంకార మమకారములనే రెండు గుర్రపు దౌడులను పట్టి చీల్చవలసినది ఆయనే కదా! అదేవిధముగా మనలోని కామ క్రోధములను బలిష్టమైన మల్లురను ఆ పరమాత్మయే తొలగించవలెను. భగవదనుభవములో మునిగిపరున్న పదిమంది గోపికలే పదిమంది ఆళ్వారులని మనము గుర్తించవలెను. ఆ ముదలాళ్వార్లను గురించి ఒక మరుపురాని దివ్య ఘట్టమును మనము స్మరింపవలసియున్నది. పొయ్‌గ ఆళ్వారు (సరో యోగి) ఒక తమ దివ్య దేశ పర్యటనలో తిరుక్కోవలూరుకు చేరిరి. అప్పుడు చీకటి పడుచున్నది. ఆకాశము మేఘామృతమై ఉరుములు మెరుపులతో వర్షము పడుచున్నది. సరోయోగి ఒక ఇంటికి చేరి, ఆ రాత్రికి తల దాచుకొనుటకు  కొంత చోటు అడిగెను. ఆ ఇంటివారు ముందు ఇరుకు వసారాగది చూపించగా అచట భగవంతుడైన శ్రీమన్నారాయణుని నామ సంకీర్తనము చేయుచు పరుండెను. ఇంతలో పూదత్తాళ్వార్‌ (భూతయోగి) భగవన్నామ కీర్తనం విని ఆ ఇంటికి వచ్చి, సరోయోగిని చూచి, … Read entire article »

Filed under: వేదములలోని మర్మములు

కర్మను తొలగించు వరము

మనుష్యునిగా జన్మించిన ప్రతీ వారికి కర్మ అనునది వుంటుంది. కర్మ అంటే మనము భగవంతునికి విరోధముగా చేసిన తప్పులు. అది మనము కావచ్చు. మన పితరులు కావచ్చు. ఎవరైనను సరే! ఆ కర్మే గనుక మన జీవితము నుండి వదిలిపోలేదంటే, మనకు కష్టములు తప్పవు. దానికి శ్రీ మన్నారాయణ శ్రీలహరికృష్ణగారు చెప్పిన సందేశము నుండి కొంత భాగమును చూద్దాము! ”మీ కర్మ మిమ్ములను వదిలిపోవాలంటే దానికి నారాయణుడే దిగిరావాలి. భగవంతుడే వచ్చి మీ పాపములను తీసివేయాలి. మన స్వంత ప్రయత్నములతో కర్మ మనలను వదిలిపెట్టిపోదు. మీరు కావాలంటే మీ శక్తి కొలది ప్రయత్నించి చూడండి! దేవుడు తీసివేస్తేనే గాని అది మనలను వదిలిపోదు. అతడు దానిని తీసివేస్తే మీరు విడుదల పొందుకొంటారు. ఇప్పుడు వినండి! ”ఏసు మన పాపముల కొరకై మరణించెను” అని వారు అంటూ వుంటారు. అతను మనకోసం మరణించినట్లయితే యిక మనమెందుకు మరణించాలి? మనము మరణమును జయించివుండాలి కదా! ‘ఏసు నా పాపముల కొరకై మరణించెను’ అని క్రైస్తవులు అంటూవుంటారు. అతను మీ పాపముల కొరకు మరణించినట్లయితే యింకనూ మీలో ఎందుకు పాపము వుండాలి? కాని ముందుకన్న యింకా నీచమైన పాపములను మీరు చేయుచున్నారే! ప్రతిసారి ‘ఏసు నా కొరకై మరణించెను. ఏసు … Read entire article »

Filed under: వేదములలోని మర్మములు

సిక్కు మత ప్రవచనములు

నానక్‌ చెప్పుచున్నాడు, నీ భక్తులు నిన్ను పొగడుటకు ఆకలిగొనియున్నారు. నీ సత్య నామమే వారి యొక్క ముఖ్య నివాసము. పగలు రాత్రి వారు ఒక అందమైన స్థితియందు వున్నారు. నేను ఆ గొప్ప వారి యొక్క పాద ధూళినై యున్నాను. పి.55 ఆసా. ది. వర్‌ ఎమ్‌ 1. పి 466 ఎవని యందు ప్రభువు నివసించునో వాడు ఒక్కడే జీవించును మిగిలిన వారు ఎవరూ జీవించరు ఓ! నానక్‌.     పి. 56. మజ్‌. హ్‌ా. ఎమ్‌ 1-1 పి 141 ఆ ప్రభువునందు ఎవరు తనకు తానే పోగొట్టుకొనునో ఆమె మాత్రమే నిజమైన భార్య. పి. 66. తుఖారి ఎమ్‌ – 1. పి 1168 ఓ నా యొక్క మూర్ఖపు మరియు అమాయకపు మనసా! నీవు ఆయన ఇంటిలో నివసింపుము. ఆ ప్రభువు నామమును తిరిగి మరల చెప్పుము. ఆయన నుండి వచ్చితివి. ఆయనను తెలుసుకొని ఆయనలోనికి చేరుము.   పి. 76. మరు ఎమ్‌ వి.పి 1080 ఆ సత్య స్వరము సత్యమైన గౌరవమును తీసుకొని వచ్చును. ఆ నామము లేనిదే ఎవరును రక్షణను పొందలేరు. సత్యమైన గురువు లేనిదే ఎవరును ఆ నామమును పొందలేరు. ఆ నామము అటువంటిది. అది నిజమైన ఏర్పాటు అది ప్రభువుచే విధింపబడినది. ఆయన … Read entire article »

Filed under: వేదములలోని మర్మములు

పరిశుద్ధ ఖురాన్‌లోని ముఖ్యాంశములు

గ్రంథ ప్రజలారా మీరు తౌరాతునూ, ఇంజీలునూ మీ ప్రభువు తరపునుండి మీ వైపునకు అవతరింప చెయ్యబడిన ఇతర గ్రంథాలనూ పఠించనంత వరకు అసలు మీరు ఏ పునాదిపైనా లేనట్లే.        (111:ఙ 66-69 వా) దేవుడు ఒక్కడే! మరొక దేవుడు లేడు.         (111:ఙ 73-74 వా) వాస్తవముగా మీ ప్రభువు అల్లాహ్‌ాయే. ఆయన ఆకాశాలనూ, భూమినీ ఆరు దినములలో సృష్టించాడు. తరువాత తన రాజ్యపీఠాన్ని అలంకరించాడు.      (ఙ||:54) మేము సృష్టించిన వారిలో ఖచ్చితముగా సత్యం ప్రకారం ఉపదేశించే, సత్యం ప్రకారం న్యాయం చేసే ఒక వర్గం కూడా వుంది.           (ఙ||:182) విశ్వసించి అల్లాహ్‌ా మార్గములో ఇల్లు వాకిలీ వదిలిపెట్టి తమ ప్రాణాలతో తమ సంపదలతో పోరాడినవారి అంతస్తే ఆయన దృష్టిలో గొప్పది.                  (|ఒ:20) ప్రతి దేశానికి (జాతికి) ఒక ప్రవక్త వుంటాడు. కనుక వారి ప్రవక్త వచ్చినప్పుడు (న్యాయతీర్పు దినమున) వారు దాని ననుసరించి తీర్పు తీర్చబడుదురు. వారికి రవ్వంత అన్యాయం కూడా జరుగదు.                              (ఒ:47) మేము మానవుణ్ని కుమ్మరివాని నల్లమట్టితో సృష్టించాము. దీనికి పూర్వము జిన్నాను అగ్ని జ్వాలలతో సృష్టించాము. నీ ప్రభువు దేవదూతలతో యిలా అన్న సమయాన్ని జ్ఞాపకము తెచ్చుకో. ”నేను కుమ్మరివాని నల్లమట్టితో ఒక మానవున్ని సృష్టిస్తున్నాను. నేను అతనిని పూర్తిగా తయారుచేసి … Read entire article »

Filed under: కవితలు, వేదములలోని మర్మములు

విలియమ్‌ మారియన్‌ బ్రన్‌హాము

20వ శతాబ్దపు ప్రవక్త లోకమునంతటిని హెచ్చరించి దేవుని నామమున ప్రవచించుటకు అమెరికాలో దేవుడు లేపిన ప్రవక్త సహోదరుడు విలియమ్‌ మారియాన్‌ బ్రన్‌హాము అని ఎటువంటి వివాదము లేక చెప్పబడుచున్నది. ఎటువంటి భయము లేక యీ 20వ శతాబ్దములోని మత సంస్థలకు ఎదురునిల్చి పోరాడుటయేగాక అబద్దముగా విజ్ఞానము అని పిలువబడుదానికి విరోధముగ ఆత్మీయ పోరాటమును పోరాడినాడు. 2000 సంవత్సరముల క్రితము ప్రభువైన యేసు రాకడను గురించి ప్రవచించుటకును, అతనిని పరిచయము చేయుటకును వచ్చిన బాప్తీస్మమిచ్చు యోహానులాగ 1933లో గొప్ప సూచనలతోనూ, వరములతోనూ ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రహస్య రాకడ (రెండవ రాకడ)ను గురించి పరిచయము చేయుటకును ప్రవచించుటకును సహోదరుడు బ్రన్‌హాము దేవునిచే నియమింపబడెను. అతను క్రీస్తు కాదుగాని క్రీస్తు రాకడను ముందుగా తెలియజేయుటకై వచ్చెను. వరుడైన క్రీస్తు ఏసును కలుసుకొనుటకు ముందుగా మనుష్యకుమారుని రాకడగురించియు, అతని జన్మస్థలము, పేరు, శరీరరంగు, బరువు మున్నగువాటి గురించి వివరముగ ప్రవచించియున్నాడు. ఆ ప్రవక్త మనుష్యరూపములో వచ్చిన తన ప్రభువును గుర్తించి ఆయనను కలుసుకొనినప్పుడు ”అమెరికాలోని ఏ సంఘములోను చేరవద్దు” అని తెలియచెప్పెను. ఆ తరువాత 1965 డిసెంబరులో ఒకకారు ప్రమాదములో బ్రనహామ్‌ మరణించినాడు. కాని అతను ప్రవచించిన ప్రవచనములన్నియు నెరవేరినవి. అతని బోధనలలోను, పుస్తకములలోనూ మనుష్యకుమారుడు రాకడ గురించి … Read entire article »

Filed under: వేదములలోని మర్మములు

సప్త మహర్షులు

మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా ౖ| మద్భావ మానసా జాతా యేషాం లో ఇమాః ప్రజాః ||    – శ్రీమధ్బవద్గీత 10:6. భావము : సప్తమహర్షులును, వారికంటెను పూర్వలైన సనకాది మహామునులు నలుగురును, స్వాయంభువాది చతుర్ధశ మనువులును మొదలగు వీరందఱును నా భక్తులే. అందరూ నాయెడల సద్భావముగలవారే. వీరు నా సంకల్పమువలననే జన్మించిరి. ఈ జగత్తునందలి సమస్త ప్రాణులును వీరి ప్రజలే. సప్త మహర్షులు అనగా ఎవరు? వీరి లక్షణము లెట్టివి? అనునవి తెలుసుకుందాము. సప్తమహర్షుల లక్షణములు ఈ విధముగా తెలుపబడినవి. దేవర్షుల యొక్క లక్షణములను, భావములను అధ్యయనము (స్మరణము) చేయువారు ఋషులుగా భావింపబడిరి. ఈ ఋషులలో దీర్ఘాయులు, వేదమంత్ర కర్తలు, దివ్యశక్తి సంపన్నులు, దివ్యదృష్టి గలవారు, సద్గుణ సముపేతులేగాక, వేథాస్త్రాది వివిధ విద్యాసమంచితులైన వయోవృద్ధులు,సర్వధర్మ మర్మజ్ఞులైన, ధర్మ స్వరూపులు, గోత్రప్రవరక్తకులు, ఈ గుణములు గల ఏడుగురు మహర్షులు ‘సప్తర్షులు’గా ప్రసిద్ధి వహించిరి. వీరినుండియే వంశములు వృద్ధి చెందినవి. ధర్మవ్యవస్థ సుప్రతిష్టితమై సాగుచున్నది. ఈ సప్తర్షులునే భగవానుడు మహర్షులుగా వర్ణించెను. వీరు భగవత్సంకల్ప మాత్రమున జన్మించుచుందురు. ఇట్టి వీరు ఋషులకంటె ఉచ్ఛస్థాయికి చెందినవారు. సప్తర్షులను గూర్చి మహాభారతమున శాంతిపర్వము నందు ఉల్లేఖించబడినది. సాక్షాత్తుగా పరమేశ్వరుడే బ్రహ్మాది దేవతలతో వీరిని గూర్చి ఇట్లు చెప్పెను. ”మరీచిరంగిరాశ్చాత్రిః పులస్త్యః పులహః క్రతుః | వసిష్ట … Read entire article »

Filed under: వేదములలోని మర్మములు