தமிழ்| telugu

» Archive

గోపికల భావము

దివ్యాభరణములను, వస్త్రములను దాల్చి పరమాత్మతో కలిసి పరమాన్న భోగము పంచుకోవలెనని గోపికలు కోరినారు. అందుకు శ్రీకృష్ణుడు అంత ఉన్నత ఫలమునందుటకు మీకున్న యోగ్యత (అధికారము) ఏమిటో చెప్పండి అనగా గోపికలు ఇట్లు తమ ఆకించిన్యమును విన్నవించుకుంటున్నారు. ”పశువులను మేపుకుంటూ అడవికి పోయి, తినుటే మా బ్రతుకుగా తిరిగెదము. ఏమియు తెలియని గోపవంశమున పుట్టిన మాకు తోడుగా నీవు జన్మించుటయే మాకు గల పుణ్యము. మాకెన్ని లోపములున్ననను తీర్చగలిగినంతగా, ఏ లోపము లేనివాడవు కదా! గోవిందా! మా స్వామీ! నీతో మాకున్న సంబంధము పోగొట్టుకుందమన్నను పోవునది కాదు. లోక మర్యాద తెలియని పిల్లలము. గాన, నిన్ను చిన్న పేరుతో ప్రేమతో పిలిచాము. దానికి కోపగించి మాపై కృప చూపుట మానకుము! మేము కోరిన పరను ఇమ్ము!” గోపికల భావములో వారికి ఆవులే ఆచార్యులు. అడవే వారికి గురుకులము. తినే తిండే వారి విద్య! కావున భగవత్‌ ప్రాప్తికి అర్హత (సాధన) తమకు లేదని భావము. వారి అమాయకత్వమును చూచి పశువులే వారికి దారి చూపుచుండగా వారు వాటిని అనుసరించి పోవుచుందురు. అవి పాలిస్తాయి కాబట్టి, వారి స్వార్ధము కోసమే వాటిని మేపుతారు. గోపికల ఈ భావాలను కృష్ణుడు ఇట్లన్నాడు. ”అదేమి? పశువులను మేపుతూ అడవికి పోవుట మీకు కులధర్మమే కదా! … Read entire article »

Filed under: హిందూ పురాణములు

భారతదేశపు భవిష్యత్తు ఏమిటి?

జన గన మన అధినాయక జయహే! భారత భాగ్య విధాతా! జయహే! జయహే!! జయహే!!! జయ జయ జయ జయహే!!! భారతదేశపు భవిష్యత్తు నిర్ణయించిన భారత భాగ్యవిధాత శ్రీమన్నారాయణునికే విజయం, విజయం, విజయం. భారతదేశపు భవిష్యత్తు ఏ రాజకీయనాయకుని చేతిలోనో లేదు గాని శ్రీమన్నారాయణుని చేతిలో మాత్రమే వున్నది. భారతదేశము అందువలననే పుణ్యభూమి అనియు పిలువబడుచున్నది.  భారతదేశమునకు ఒక పురాతన చరిత్ర కూడా వున్నది. అనేక మంది రాజులు, సూల్తాన్‌లు, బ్రిటిష్‌వారు భారతదేశమును కైవసము చేసుకోవాలని ప్రయత్నము చేసినప్పటికి దాని నుండి తప్పించి స్వాతంత్య్రమును అందించినది శ్రీమన్నారాయణుడే తప్ప అది ఒక మనుష్య ప్రయత్నము కాదు. అందువలననే రవీంధ్రనాథ్‌ ఠాగూర్‌ భారత భాగ్యవిధాతా నీకే విజయం అని ఆ భగవంతుని ధృష్టించి పాడుచున్నాడు. ఒక మహాకవి ఆనందస్వతంత్రతను గురించి పాడియున్నాడు. ఆ ఆనంద స్వతంత్రమును  అందించుటకు ఆ నారాయణుడే దిగిరావాలి. శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ గారు తన ఏలూరు సందేశములో ” మన దేశము గొప్ప దేశము. అహింసను పాటించే దేశము యిది మాత్రమే. ఈ రోజున భారతదేశము ఎవరిపై నమ్మకము వుంచియున్నది? ధర్మయుగమును స్థాపించుటకు ఆ నారాయణుడే రావాలి. భారతదేశములోని జనులకు సహాయము చేయుటకే ఆయన రహస్యముగా భారతదేశములో వచ్చియున్నారు.  భారతదేశము ఒక సుభిక్షమైన దేశముగా మారును. లోక … Read entire article »

Filed under: శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు

జీవితమునకు రధసారధి

అర్జునునికి రధసారధి ఎవరు? అతనే రధమును నడుపుచుండిన యెడల అతను ఏదో ఘనకార్యమును అక్కడ చేయుచున్నట్టే కదా! రథసారధి అర్జునుడు కాదు. అదే అక్కడ ముఖ్యము. రథసారధి చాలా ముఖ్యమైనవాడు. లేనియెడల అర్జునుడే రథమును నడుపుకుంటూ అక్కడ నుండి పారిపోయేవాడు. నడపడము కృష్ణుని చేతిలో వున్నది. అందుకే అతను పారిపోలేదు, కృష్ణుని మాటలను విన్నాడు అది అర్జునుని మనస్సును మార్చినది. అతను కృష్ణుని యొక్క సంకల్పమును నెరవేర్చినాడు. అతను కృష్ణుని చిత్తమును నెరవేర్చినప్పుడు మహిమ కృష్ణునికే వెళ్తుంది గాని అర్జునునికి రాదు. అదే విధముగ మీరు మీ కొరకు జీవిస్తున్నారా? లేక భగవంతుని కొరకు జీవిస్తున్నారా? మీరు భగవంతుని కొరకు జీవించుచున్నట్లయితే మీరు దేవుడు చెప్పినట్లు చేస్తారు. మీరు మీ కొరకు జీవించుచున్నట్లయితే మీరే మీ జీవితమును ప్లాను చేసుకుంటారు. ఈ లోక ప్రకారమైన వాటి కొరకు ప్లాను వేసుకొంటారు. ఈ లోకములో మీరు ఫలితముల కొరకు లాభముల కొరకు మాత్రమే వేచియున్నారు. ఒకవేళ మీరు ఒక ఫుట్‌బాల్‌ అటగాడు అయిన యెడల, మేరు మేచ్‌లో (ఆటలో) జయించాలి అని ఆశిస్తారు. ఆ ఆటలో జయించాలని మీరు అన్ని ప్రయత్నములు చేస్తారు. ఆ మేచ్‌లో జయిస్తే మీరు చాలా సంతోషిస్తారు. ఒకవేళ మేచ్‌లో ఓడిపోతే యిక … Read entire article »

Filed under: శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు

సప్త మహర్షులు -2

ముందు శీర్షిక యొక్క తరువాయి భాగము : ముందు సంచికలో సప్త మహర్షులలో ముగ్గురు మహర్షుల గురించి చూచియున్నాము. వారి తరువాత నాలుగవ మహర్షి : పులస్త్యుడు : ఇతడు మహాధర్మ పరాయణుడు. తపస్వి, తేజస్వి. ఇతడు యోగశాస్త్రనిష్ణాతుడు. ఆచార్యవతంసుడు. రాక్షస సంహారమునకై పరాశరుడొక మహాయజ్ఞమును ఆచరించుచుండగా వసిష్ఠుని సూచన మేరకు యజ్ఞము నాపుమని పులస్త్యుడాతనితో పల్కెను. పరాశరుడాయన మాటను ఆదరించి యజ్ఞమును నిల్పెను.దానితో ప్రసన్నుడై పులస్త్యుడు ఆ పరాశరుని ఆశీర్వదించెను. తత్ప్రభావమున పరాశరుడు సమస్త శాస్త్ర పారంగతుడయ్యెను. ఐదవ మహర్షి పులహుఁడు : ఇతడు మహాప్రభావశాలి, మహాజ్ఞాని. ఇతడు సనందన మహర్షి కడ దివ్యజ్ఞానమును పొంది, దానిని గౌతమునికి అందించెను. దక్ష ప్రజాపతి కూతురైన ‘క్షమ’, కర్దమ ఋషి పుత్రికయైన ‘గతి’ అనువారు ఈయన యొక్క భార్యలు. వారియందు ఈతడు పెక్కుమంది పుత్రులను పుత్రికలను (సంతానమును) పొందెను. విష్ణు కూర్మ పురాణములయందును శ్రీమద్భాగవతమునందును అతని వృత్తాంతము గలదు. ఆరవ మహర్షి క్రతువు : ఈ మహర్షియు గొప్ప ఆధ్యాత్మిక తేజస్సంపన్నుడు. ఇతడు కర్దమ మహర్షి పుత్రికయైన ‘క్రియ’ను దక్షకన్యయైన ‘సన్నతి’ని వివాహమాడెను. ఇతని వలన ‘వాలఖిల్యులు’ అను పేరుతో ప్రసిద్ధిగాంచిన 60వేల మంది ఋషులు జన్మించిరి. వీరు సూర్యుని రధమునకు అభిముఖులై అతనిని స్తుతించుచు నడుచుచుందురు. పురాణములయందు … Read entire article »

Filed under: వేదములలోని మర్మములు

హాతీస్‌ సాహి బుకారి ప్రవచనములు

జాఫర్‌ వ్రాసిన యీ పుస్తకము ప్రవచనముల మీద అధికారము కలదిగ ఎంచబడుచున్నది. నభి తరువాత రాబోయే దూత అయిన ఇమామ్‌మెహది రాకడను గురించిన ప్రవచనములు యీ పుస్తకములో వ్రాయబడియున్నవి. మోషే అంత ప్రాచీనమైనవాడుగాను, క్రీస్తువంటి జ్ఞానిగాను, అయూబ్‌ (యాకోబు) వంటి ధైర్యవంతుడుగాను ఇమామ్‌ మెహది వుండును. అతని అనుచరులందరు (భక్తులు) అతని కాలములోనే అనమానపరచబడెదరు. వారి తలలు సొమ్ము చేసుకొనబడును. వారి తలలు నరికివేయబడును. వారు ఎల్లప్పుడు భయముతో కలతచెంది యుందురు. వారి రక్తముచేత భూమి నిండియుండును. వారి భార్యలు తమ భర్త వలన కష్టము పొందుదురు. వారు హతసాకక్షులుగ మరణించెదరు. అటువంటి జనులే నా నిజమైన భక్తులు. ”మహిమపరచబడుటకు ముందు అతనిని విశ్వసించు శిష్యులు అతనితోబాటే మహిమ పొందుదురు. కాని శ్రమలకాలములో అతనిని విశ్వసించే శిష్యులు సాకక్షులుగ ఉండి హతసాకక్షులుగ మరణించెదరు.” దానిని గురించే ఇక్కడ ప్రవచింపబడినది. హజరత్‌ మహమ్మద్‌ నభి ‘నిజాతా’ అనే పుస్తకములో తన తరువాత ఒక దూత భూమిమీద ప్రత్యక్షమగును. అతను తను నివసించే పరలోకము నుండే తన మార్గమునకు కాలసిన వాటిని సిద్ధము చేసుకొనును. ఆ తరువాత ఒక రోజున తిరిగి పరలోకమునకు ఎక్కిపోవును. ఆ రోజు మీ లెక్క ప్రకారము వెయ్యి సంవత్సరములుగ వుండును. ఆ సర్వోన్నత దేవుడు. … Read entire article »

Filed under: వేదములలోని మర్మములు

మనుజ్యోతి ఆశ్రమము

శ్రీ లహరికృష్ణగారి సందేశములను లోకమంతటను తెలియజెప్పాలి అనుటయే మనుజ్యోతి ఆశ్రమములో జరుగు ముఖ్యమైన పని. శ్రీలహరికృష్ణగారి ప్రసంగములు వీడియో కేసట్లుగాను, ఆడియో కేసట్లగాను. పుస్తక రూపములలోను, కరపత్రికలుగాను ఆంగ్లములో నుండి యితర భాషలలో, అనగా జర్మనీ, హిందీ, తెలుగు, తమిళము, కన్నడము, మళయాళము భాషలలో తర్జుమా చేయబడి జనులకు అందజేయబడుచున్నది. రికార్డింగు, కంప్యూటర్‌, టైపింగ్‌ పనులన్నియు ఆశ్రమములోనే జరుగుతూ వుంటాయి. ఆశ్రమములో వున్నవారు ఎవరూ సోమరులుగ వుండరు. ప్రతి ఒక్కరు వారికి తెలిసిన, చేతనైన పనులు చేస్తుంటారు. ఈ సమిష్టి జీవితములో, వంటపని, కట్టడములు కట్టేపని, వడ్రంగిపని, కుట్టుపని, కాయగూరలు తరగడం, పాత్రలు కడగటం, ఆశ్రమ పరిసర ప్రాంతములను శుభ్రముగ వుంచుకోవటము, తోటపనులు అన్నిటిని ఆశ్రమవాసులే వంతులు వారిగ చేస్తుంటారు. అందరూ కలిసి ఒకే కుటుంభముగ జీవిస్తూవుంటారు. ఆశ్రమవాసులందరూ శాఖాహారులే! అతి సాధారణమైన భోజనమే వడ్డించబడుతుంది. ఎంత చదువుకున్నను, ఎంతధనికులైనను, ఎంత పెద్ద వుద్యోగస్తులుగ వుండినను, ఎటువంటి తారతమ్యము లేక నిరాడంబరముగా, అతి కొద్ది సౌకర్యములతో ఆశ్రమములో దిగివచ్చిన పరమపురుషుని సేవిస్తూ మహిమలో వెళ్ళటమే తమ ధ్యేయముగా వుంటున్నారు. బైబిలులో చెప్పబడిన సీయోను పర్వతము, వేదములలో చెప్పబడిన మేరు పర్వతము యీ సీయోను అయిన మనుజ్యోతి ఆశ్రమమే! పరిశుద్ధబైబిలు గ్రంధములో యెషయా 4:5లో చెప్పబడిన విధముగ … Read entire article »

Filed under: మనుజ్యోతి ఆశ్రమము