தமிழ்| telugu

» Archive

భగవంతుని యొక్క మహాత్తరమైన సంకల్పము

మీ దేవుడు ఎవరు? మీరు ఏ దేవుని పూజించుచున్నారు? అని సాధారణముగ ప్రతి మనిషి ఎదుర్కొనే ప్రశ్నలు. మీరు హిందువులైతే నారాయణుడు, వినాయకుడు, శివుడు మున్నగు పేర్లను చెబుతారు. మీరు మహ్మదీయులైతే ‘అల్లా’ అంటారు. క్రైస్తవులైతే ఏసు, క్రీస్తు అని అంటారు. యూదుడైతే ‘యెహోవా’ అని అంటారు. మీరు ఎవరైనప్పటికిని పైన చెప్పబడిన పేర్లన్నియు ఆయన వ్యక్తిగత, సొంత పేరు కాదనియు, ఆయన గుణాతిశయములను తెలిపే పేర్లని మీరు తప్పక గ్రహించాలి. లెక్కలేనన్ని పేర్లు వున్నట్లుగా అసంఖ్యాకులైన దేవుళ్ళు వున్నారు. కాని మనకు నిశ్చయముగా తెలుసు దేవుడు ఒక్కడేనని, ఆయన గుణములను బయలుపరుస్తూ మానవులు వారు కలిగియున్న పరిమితమైన ఆత్మ జ్ఞానముతో వారికిష్టమైన దేవుళ్ళను వేవ్వేరు పేర్లతో పిలుచుచున్నారు. ఉదాహరణకు గణపతి అంటే గణములకు, సైన్యములకు అధిపతి, అల్లా అంటే బలమైన వృక్షములాంటివాడు. క్రీస్తు అనగా అభిషక్తుడు, ఏసు అంటే రక్షకుడు. ఈ విధముగ యివి అన్నీ యీ దేవుని యొక్క గుణములను తెలియజెప్పు అలంకారమైన పేర్లు కాని దేవుని వ్యక్తిగతమైన, నిజమైన పేరు సామాన్యముగ ఎవరికీ తెలియదు. యుగ యుగములుగ దేవుడు తన వ్యక్తిగతమైన పేరును రహస్యముగ వుంచియున్నాడు. తను విధించిన నిబంధనలను నెరవేరుస్తూ విశ్వాసము ప్రేమ యదార్ధతలను కలిగియున్నవారికి తప్ప మరెవరికి … Read entire article »

Filed under: ఆత్మీయ బోధనలు

ఆనందైశ్వర్యము – 3

”అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు” అని దీవిస్తూ ఉండటం సాధారణంగా మనం చూస్తూ వుంటాము. నేటి మానవుని యొక్క నిరంతర శ్రమ, నిర్విరామ కృషి, అసలు జీవిత పరమార్థమే లోక సంపదలను ఆనందించడానికి అనేది ఈ రోజు అందరికీ విదితమైన విషయం. అసలు మనిషికి కావాల్సిందేమిటి? ఐశ్వర్యమా? ఆనందమా? నిజం ఏమిటంటే మనిషికి కావాల్సింది ఐశ్వర్యం కాదు. ఆనందమే! ఆ ఆనందం అష్టైశ్వర్యాలైన ధనం, ధాన్యం, సంతానం, వాహనం, దాసదాసీజనం, బంధువులు, మిత్రులు, భృత్యులు మొదలగు వాటి వలన లభిస్తుంది అని కొంతమది అనుకుంటారు. అయితే ఐశ్వర్యం అనేది ఆనందానికి ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు. ఆనందానికి ఉపయోగపడని లక్ష ఐశ్వర్యాలున్నా అవన్నీ వ్యర్థమే. సమృద్దిగా అన్ని రకాలైన ఐశ్వర్యాలు వుండి నిత్యం సమస్యలతో మనఃశ్శాంతి కరువై భగవంతుడు యిచ్చిన నిద్రాహారాలకు సైతం దూరమై ఎల్లప్పుడూ సతమతమవుతూ భయాందోళనలతో భౌతిక ఐశ్వర్యాన్ని కాపాడుకొనే ప్రయ్నతంలో అనారోగ్యంపాలై ఈ లోకంలో జీవిస్తున్న వారిని మనం చాలా మందిని చూస్తున్నాం. భౌతిక ఐశ్వర్యం నష్టపోతామనే భయం లేనివాడు, ధన సంపాదనా తాపత్రయం లేనివాడు, సంపద, వ్యాపార, వ్యాపనా కాంక్ష లేని స్థిత ప్రజ్ఞుడే ఆనందాన్ని పొందగలడు. స్థిత ప్రజ్ఞత అనేది – భగవదనుగ్రహం వలన మాత్రమే పొందగలడు. ఇలాంటి వ్యక్తికి అష్టైశ్వర్యాలున్నా లేకపోయినా ఆనందమే! ఇతనికి … Read entire article »

Filed under: ఆత్మీయ బోధనలు

ఓం నమో భగవతే శ్రీలహరికృష్ణాయ నమః -3

ప్రియమైన ఆత్మీయ సహోదర, సహోదరీలారా! శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ నామములో మీకు మా యొక్క శుభాకాంక్షలు. గత సంచికలో తెలియజేసిన విధముగా శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ మహిమ సన్నిధిలో 2014 జూలై 15 నుండి 22వ తేదీ వరకు 45వ కల్కిజయంతి ఉత్సవములు మనుజ్యోతి ఆశ్రమ ప్రాంగణములో అద్భుతముగా జరిగినవి. దానిలో పాల్గొనుటకు శ్రీలహరికృష్ణగారి భక్తులు అనేక ప్రాంతములనుండియు మరియు దేశవిదేశముల నుండియు వచ్చియున్నారు.  జూలై 1వ తేది నుండియే జనులు రావడము ప్రారంభమైనది. 1వ తేదిన శ్రీమన్నారాయణుని ప్రేమపతాకమును ఎగురవేసి ఆశ్రమము చుట్టూ ఊరేగింపును నిర్వహించి ఈ ఉత్సవములు ప్రారంభించబడినవి. వారందరికీ ఒక గొప్ప ఉత్తేజమును కలిగించినది. ఈ ఉత్సవములలో స్త్రీలకు ప్రత్యేక మీటింగు జరిగినది. అది స్త్రీలకు చాలా ప్రయోజనముగా వుండినది. దానిలో భగవంతుడు వారి జీవితములలో చేసిన అద్భుతములను, సహాయములను అందరితో పంచుకొని భగవంతుని స్తుతించి కీర్తించిరి. దాని తరువాత సర్వమత సమావేశము తెలుగు భాషయందే గాక, తమిళము, హిందీ భాషలలో కూడా జరిగినది. తెలుగులో జరిగిన సర్వమత సమావేశమునకు  ఆంధ్రదేశమునుండి అనేకమంది విద్వాంసులు, కవులు, అనుభవ వక్తలు మతములకు అతీతముగా అన్ని మతముల వారు దానిలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమమునకు తెనాలికి చెందిన శ్రీనోరినారాయణ మూర్తిగారు అధ్యక్షత వహించగా విశాఖపట్టణమునకు చెందిన శ్రీ కె. నరశింహనాయుడు … Read entire article »

Filed under: సంపాదకీయం