தமிழ்| telugu

» Archive

మనుజ్యోతి ఆశ్రమములో బ్రహ్మాండముగ జరిగిన 45వ కల్కిజయంతి ఉత్సవములు

పాఠకులకు ముందుగానే తెలిపినట్లు జూలై నెల 15వ తేదీ నుండి 22వ తేదీ వరకు చాలా ఘనంగా 45వ కల్కిజయంతి ఉత్సవములు మనుజ్యోతి ఆశ్రమములో జరిగాయి. ప్రతీరోజూ ప్రత్యేక కార్యక్రమములతో వివిధ ప్రాంతాల నుండియు, దేశముల నుండియు వచ్చిన శ్రీలహరికృష్ణ గారి భక్తుల సవ్వడితో, చల్లని వాతావరణంలో ఎంతో వైభవంగా ఉత్సవములు నిర్వహించబడినవి. వీటిలో ముఖ్యంగా 17వ తేదీన ”సర్వమత సమావేశము మరియు దేశీయ సమైక్యతా సమావేశము” అను తెలుగు కార్యక్రమము జరిగినది. దీనికి ఆంధ్ర దేశము నుండి పేరుగాంచిన పలు వక్తలు, కవులు వచ్చి వారి వారి శైలిలో భగవంతుని యొక్క కీర్తిని, గుణములను వర్ణించుతూ శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి ఆశీస్సులను పొందుకొని వెళ్ళారు. వారు ఆ కార్యక్రమములో ఉపన్యసించిన కొన్ని సందేశములను యిప్పుడు మనము యిక్కడ చూద్దాము. మొదటిగా ఈ కార్యక్రమమునకు అధ్యకక్షులుగా తెనాలి నుండి గాన కళాప్రపూర్ణ సుందర సామ్రాట్‌ ప్రవచక బ్రహ్మ అయిన శ్రీ నోరినారాయణమూర్తి, ఎం.ఎ. పి.హెచ్‌.డి. గారు మరియు ముఖ్య అతిధులుగా విశాఖపట్నం నుండి శ్రీ కె. నరసింహనాయుడు, అధికార భాషా సంఘం అధ్యకక్షులు వచ్చియున్నారు. శ్రీ పణుగు శేషగిరి రావు, కాంగ్రెస్‌ లీడర్‌, విజయవాడ, శ్రీ కాజా రామకృష్ణ రావు, భగవద్గీత వర్షిణి, విజయవాడ నుండియు, విశాఖజిల్లాకు … Read entire article »

Filed under: మనుజ్యోతి ఆశ్రమము

Letters

మనుజ్యోతి ఆశ్రమము వారికి మా నమస్కారములు. మీరు ప్రచురించే ‘మనుజ్యోతి’ త్రైమాసిక పత్రికను చదివాము.  అది మాకు చాలా నచ్చింది.  దాని వలన మంచి కార్యములను, వేదములలో నున్న రహస్యములను తెలుసుకొన్నాము. ఈ పత్రికను మాకు తరుచుగా పంపిస్తూ వుండండి. మాకు యింకా భగవద్గీత, భిలాయి సందేశములు యింకా తెలుగు పుస్తకములను పంపించగలరు. ధన్యవాదములు. ఇట్లు… – ఎ. సన్నీ, రాయ్‌పూర్‌. శ్రీ మనుజ్యోతి ఆశ్రమము వారికి వ్రాయునది. అయ్యా మాకు పంపించిన జూన్‌ జూలై ఆగష్టు – మనుజ్యోతి త్రైమాసిక పత్రిక అందినది. ఆ పుస్తకములో మీరు ప్రచురించిన అన్ని విషయములను మేము చదువు కున్నాము. అన్ని వేదములలోనున్న విషయములనన్నిటిని ఈ ఒక్క పత్రికలో పొందుపరచి అందరికీ ఉచితముగా పంపుచున్నారు. ఆ భగవంతుని కరుణా కటాక్షములు మీకు ఎల్లప్పుడూ వుంటాయి. మాకు యింకా శ్రీలహరికృష్ణగారి గురించి తెలుసుకోవాలని ఆసక్తి వున్నది. కావున దానికి సంబంధించిన పుస్తకములను మాకు పోస్టల్‌ ద్వారా పంపించగలరని ఆశించుచున్నాము. మీకు మా యొక్క నమస్కారములు.  ఇట్లు – కె.వి. భద్రం, ఖమ్మం.. మనుజ్యోతి అధ్యక్షులకు నమస్కార ములు. మీరు పంపించిన ‘మనుజ్యోతి’ – సమస్త వేదముల సారాంశము అను పత్రికను చదివాము. అందలి విషయములు చాలా బాగున్నాయి. మేము ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక విషయములను … Read entire article »

Filed under: పాఠకుల అభిప్రాయాలు

కవితామాల

సువిశాల యశోమహావిశ్వానికే రారాజు, శంఖు, చక్ర, గధాధరుండు, సద్భావనమూర్తి, సుగుణాల సంపన్నుడు, సువర్లోక, భూలోక – ఏడేడు పద్నాలుగు లోకాలకు సృష్టికర్త, సౌందర్య మానసమూర్తి, సౌశీల్య నడవడి కీర్తి, భవ్య నవ్య దివ్య విధివిధాన బోధనా క్రాంతి, సర్వ జన సౌహార్థమైత్రి, సంస్కార శోభానయానమూర్తి, సత్యశాంతి, సుగతిశక్తి, రాగతికీర్తి, నిండు సంస్కృతి సంస్తూయ, ప్రస్తుతీ ప్రశంసాంస యశోమూర్తి! పాల్గుణ మాసాన ఇరువది నాల్గవ తేదీన రాసయ్య, నేసమ్మాళ్‌ ముద్దులొలికే మురిపాల బిడ్డగా జనియించి, పండితులచే వేనోళ్ళ పొగడబడుతున్న పాల్‌ నామధేయుండవై, నీ అనురాగ ప్రియ వధువు కొరకే దివి నుండి భువికేతెంచిన పరమపావన మూర్తి పాలోయమ్మ పాలు – నా దేహమెరుగని పాలు యని ప్రవక్త వీరబ్రహ్మం వాణివై! ”ఎల్‌” అక్షర నామధేయుండు, నల్లనివాడు, అఖండ విశ్వాన్నే పాలిస్తాడని బ్రన్‌హాము నోటిమాటవై! మూడు మతాల జనులను ఏకంచేసేవాడు – ముక్కూడల్‌ మార్గాన వస్తావని ముత్తుకుట్టి సుమధుర ప్రవచనమువై! జనగణమన అధినాయక జయమే యని, భారతభాగ్యవిధాతవని రవీంధ్రనాథ్‌ ఠాగూర్‌ రాగ దీపికవై దేవదూతలు దేవదుందుబులు మ్రోగించుచుండగ – జూలై మాసాన ఇరువది ఒకటివ దినాన్న – చికాగో నగరాన చైతన్యమూర్తివై లైఫ్‌ టెబర్నికల్‌ ప్రాంతాన – సర్వ భూతలానికి లైఫ్‌నిచ్చే ఆశాకిరణానివై నీ ప్రసంగాలే ప్రపంచానికి ప్రచండ జ్యోతులై ప్రజ్వరిల్లుచుండగా నీవే జగత్‌ సృష్టికర్తవని నమ్మే – మానవాళి … Read entire article »

Filed under: కవితలు

అన్నమాచార్యులు రచించిన కీర్తన

పల్లవి : భావములోనా బాహ్యమునందును గోవిందా గోవిందయని కొలువవో మనసా     || భావములోనా || 1.     హరి యవతారములే యఖిల దేవతల హరిలోనివే బ్రహ్మాండంబులు హరి నామములే అన్ని మంత్రములు హరి హరి హరి హరి యనవో మనసా         || భావములోనా || 2.    విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకని మనసా         || భావములోనా || 3.    అచ్యుతుండితడే ఆదియునంత్యము అచ్యుతుండే యసురాంతకుడు అచ్యుతుండు శ్రీవేంటాద్రి మీదనిదె అచ్యుత యచ్యుత శరణనవో మనసా         || భావములోనా || భావము : భావించడములోనూ కంటికి కనబడె ప్రత్యక్షదైవము అక్షయమైన దేవుడు. క్షయమైన మనుష్యుడుగా మనస్సున కొలువదగినవాడు గోవిందుడైన హరి. హరి అవతారములే అన్ని దేవతలు. బ్రహ్మాండము అతనిలోనిదే. ఆయన నామములే మంత్రములు. అందుకే హరి లహరి అని మనస్సున స్మరించు. విష్ణుని పొగిడేవే వేదములు. ఆయన ఒక్కడే విశ్వకర్మ. విష్ణువే లహరి అని వేదములలో వెదకండి. అచ్యుతుడు (పరలోకములో ఉన్న దేవుని తేజస్వరూపమైన మనుష్యుడు). ఆది అంతము లేనివాడు, రాక్షసులను సంహరించేవాడు అయిన ఆ వేంకటాద్రి (సీయోను) కొండమీద నిలుచున్న వాడిని మనసార భావములోను శరణువేడుకో. – సేకరణ : హేమేంధర్‌, విశాఖపట్నం … Read entire article »

Filed under: కవితలు

కవిత

నరుడై వచ్చెన్‌ నారాయణుడు నింగిని వదిలి హరిని నరుడని ఎంచి మిగిలెన్‌ నరులు తామసమున పరము జేరెను లహరి నేలను వదిలి హరియే నరుడని తెలిసినంతలో ! కన్నవారు లేరు కష్టమున సేదతీరుటకు తోబుట్టువులు జరిగిరి బంధతీరములు దాటి నాకు ఫనము లేక చూచితిరా? ఈ ఇరైవొకటో శతాబ్ద బంధములు? శతాబ్ది ఏదైనను శ్రీ లహరిబంధమేర్పడగ వ్యద భరిత జీవితం ఏల నీకు? మనలన్‌ పరము చేర్చగ ప్రభులహరి ఉండగ! పాడైపోయెను ఈ ధరిత్రి – దయగల వారు లేరు ఈ పుడమి మీద రాజుల కోటలు రాలిపోయినా – భూస్వాముల భూములు భస్మమయినా అవగతము కాదు ఈ అవని జనులకు – హరి ఆగ్రహ జ్వాలతో భగ్గున మండ సంపద వద్దు నాకు ఈ లోకంలో – లాభనష్టములొద్దు ఇహలోకంలో రూకలుకు నూకలు రాని రోజులలో – ధనము దయ చూపదు లాభము లభ్యపడదు లహరి నామ సంపదే ఉన్నతము – ఇహ పరాలలో సంఘజీవి అయిన ఓ మనిషి… స్వార్థజీవి ఆయెను ఈ లోకంలో నాది నేనని చెప్పి నానావస్థలు వద్దు నీకు – లహరి తప్ప సకలం ఉన్నవారి కన్నను లహరి తప్ప ఏమి లేనివారు శ్రేష్టులు కాపాడితివయ్యా శ్రీలహరికృష్ణా – కామక్రోధ మీద మత్సర్యములను జయించ ఇచ్చ ఆరోహ అవరోహ క్రమమాడి అందు – తీవ్రవ్యధ భరిత నన్ను క్రమ మొనర్చిన విశ్వాగ్రగణ్యా !  శ్రీలహరి … Read entire article »

Filed under: కవితలు

సత్యమేవజయతే!

మిత్రమా – ఎందుకు – బాధపడుచున్నావు అయ్యిందేదో అయింది – పోయిందేదో పోయింది లోకానికి వచ్చేటప్పుడు వట్టి చేతులతోనే వచ్చావు వెళ్ళేటప్పుడు లగేజీలతో వెళ్ళాలని అనుకొంటున్నావు అందుకే నీకీతపన – ఇందుకే నీకీ తాపత్రయము నీవే ఏదైతే పొందావో – అది ఇక్కడ నుండే పొందావు నీవు ఏదైతే పోగొట్టుకొన్నావో అది ఇక్కడ సంపాదించిన దానిలో నుండే పోగొట్టుకున్నావు నీవు ఇవ్వాళ సొంతము అనుకొన్నదంతా నిన్న వేరొకరి సొంతము కాదా! నీవు నిద్రించిన తరువాత ఇది అంతా మరొకరి సొంతము కాగలదు కావున జరిగేదేదో – జరుగక మానదు కనుక అనవసరముగ ఆందోళన చెందకు ఆంధోళన అనారోగ్యానికి మూలము లోపము లేకుండా ప్రయత్నించు – ఫలితము మంచి అయినా చెడు అయినా దైవ ప్రసాదముగా భావించు కారులేదని చింతించవద్దు – కాళ్ళు ఉన్నందుకు సంతసించు కాలం విలువైనది – రేపు అనుదానికి రూపు లేదు మంచి పనులు వాయిద వేయకు – హింసను విడనాడు అహింసను పాటించు ఉపకారము చేయలేకపోయినా ఫరవాలేదు కాని అపకారము తలపెట్టకు మతిని శుద్దం చేసేది మనస్సు – మానవత్వము లేనిమతం – మతం కాదు దేవునిని ప్రార్థించుచూ – ప్రాణకోటికి సహకరించు తద్‌ ద్వారా నీ ఇంట – నీ వంట శాంతి చేకూరును. ఇదే జీవిత గీతా సారాంశము అయిన భగవత్‌ గీత… ఇదే మానవ శరీర రహస్యము 1. సువర్ణాభరణాలు ధరిస్తే ఆయుర్వుద్ది 2. చక్కని దుస్తులు ధరిస్తే తేజస్సు … Read entire article »

Filed under: ఒకే దేవుడు! ఒకే దేశము!