தமிழ்| telugu

» Archive

భగవంతుని నామ మహిమ

ఒక గ్రామం మధ్యలో మంచి దేవాలయము ఒకటి వుండినది. ఆ ఆలయములో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పెద్దాయన సత్సంగమును జరిపించడము ఆనవాయితీ. ఒకరోజు భగవంతుని నామము గురించి ఒకరు బోధిస్తూవున్నారు. భగవంతుని యొక్క నామమును జపించినట్లయితే (ఈ లోకములోను, పైలోకములోను) జయించవచ్చును. ఇహపర లోకములలో సమస్త మేలులను పొందుకొంటారు అని ఒక వ్యక్తి బోధిస్తున్నాడు. అప్పుడు ఒక యవ్వనుడు ఆ పెద్దాయనను చూచి, హేళనగా ”భగవంతుని యొక్క నామమును ప్రార్థించినట్లయితే సమస్త మేలులు కలుగుతాయి అని చెప్పుచున్నారు కదా! తినుటకు భోజనం దొరుకుతుందా?” అని అడిగాడు. వెంటనే ఆ పెద్దాయన ‘నాయనా! భగవంతుని యొక్క నామమును జపించినట్లయితే, భోజనము దొరుకుతుంది, అవసరమైతే నీ దగ్గరికి ఆయనే వచ్చి నీకు తినిపిస్తాడు’ అని బదులుచ్చాడు. ఈ యవ్వనునికి ఆ మాటలు వినగానే వైరాగ్యం కలిగింది. ఏవిధముగానైనా భగవంతుని యొక్క నామమును జపించినట్లయితే, భోజనం దొరుకుతుందా లేదా అనే తలంపుతో బయలుదేరాడు. ఇంటికివెళ్ళి ”భగవంతుడా, భగవంతుడా అని ధ్యానిస్తూ వుంటే నాకు ఒకవేళ మైకం వచ్చినట్లయితే, నన్ను వైద్యుని వద్దకు తీసుకుపోతారు. అందువలన అడవికి వెళ్ళాలి” అని అడవికి బయలుదేరాడు. ఒక చెట్టుక్రింద కూర్చొన్నాడు. ఒకవేళ అడవిలోనున్న మృగములు నన్ను చంపి తినివేయును. అటువంటి పరిస్థితి ఏర్పడినట్లయితే, ఆ … Read entire article »

Filed under: ఆత్మీయ కధలు

నాలుగు ప్రశ్నలు

ఒక రాజుకు ఒక కుమారుడు వున్నాడు. అతను సకల కళా కోవిధుడు. అతడు చూడడానికి చాలా అందముగా వుంటాడు. అతనికి వివాహము చేయుటకు అనేక దేశముల నుండి అమ్మాయిలను తీసుకువచ్చారు. కాని రాజు తను అడిగే నాలుగు ప్రశ్నలకు ఎవరైతే సరైన సమాధానం చెప్తారో ఆ స్త్రీయే తనకు కోడలుగా రాగలదు అని ఖచ్చితమైన నిర్ణయముతో వుండెను. కాని వచ్చిన రాజకుమార్తెలు ఎవరూ రాజుగారు అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానమును యివ్వలేకపోయారు. ఒక రోజు ఒక పాలమ్మాయి రాజు వద్దకు వచ్చి నమస్కరించి, ”ప్రభూ! మీ ప్రశ్నలకు నేను జవాబు చెప్పుటకు పదవి, ధనం, అంతస్తు ఇవి అన్నీ అవసరమా?” అని అడిగెను. రాజు ఆమె ధైర్యానికి మెచ్చి ”అవేమీ అవసరము లేదు” అని చెప్పెను. ”అయితే నేను రేపు సభకు వస్తాను” అని చెప్పి వెళ్ళిపోయింది. చెప్పిన విధముగానే ఆమె మరుసటి రోజు సభకు హాజరైనది. అప్పుడు రాజు ఆమె వద్ద మొదటి ప్రశ్నను అడిగెను. ”నిరంతరం కరుగుచుండేది ఏది?” అని అడుగగా, దానికి బదులుగా ఆ పాలమ్మాయి ”అది ఆయుష్షు. మనం పుట్టినప్పటి నుండి మన ఆయుష్షు కరుగుచూనే వుంటుంది. ఒకసారి కరిగిపోయిన ఆయుష్షు అనేది తిరిగి రాదు” అని జవాబు చెప్పెను. రెండవ ప్రశ్న: … Read entire article »

Filed under: ఆత్మీయ కధలు