தமிழ்| telugu

» Archive

గోపికల వర్ణన

శ్రీకృష్ణుడు నిద్రలేచి వీడి వీడని కన్నులతో తమను చూడవలసినదని గోపికలు అర్థించుచున్నారు. శ్రీకృష్ణ నేత్రములకు అసమాన ఉపమానములను వర్ణించుచున్నారు. సన్నగా రేకులు వీడి, ఆ రేకుల మధ్య నుండి ఎర్రదనము కనిపిస్తూ తామర పూవు వుంటే ఎలా వుంటుందో, అలా నీ రెప్పలు కొంచెం కదిలి ఆ మధ్య నుండి నీ ఎర్రని నేత్ర కాంతి ప్రసరించేలా విప్పాలి. ఉపమానం మీద ఉపమానం చెప్తున్నారు. ఆ చూపు, తామరపూవు కింకిణివలే విచ్చుకోవాలట. కింకిణి అంటే చిరుమువ్వ. ఆ చిరుమువ్వలో చిన్న రాయి వుంటుంది. కాని జారిపడదు. లోనున్న తుమ్మెద కనబడుతూ పూర్తిగా వీడకుండా వుండే తామరపువ్వు ఆ కింకిణివలె వుంటుంది. నేత్రములో నల్లగుడ్డు కనబడుతూ ఎర్రని కాంతులు విరజిమ్ముతూ అరవిచ్చిన నేత్రములను విచ్చి స్వామి చూడాలి. ఏం మనమే చూస్తేనో! మనం చూస్తే స్వామి కనబడడు. స్వామి చూస్తేనే మనకు స్వామి కనబడతాడు. ఇదేం విడ్డూరం! మనం చూస్తే కనబడడా? తెల్లవారుజామున సూర్యుడిని చూడగలమా? మనం చూడాలనుకున్నా చూడలేము. మరెట్లా? సూర్యుడే మెలమెల్లగా కొంచం కొంచం పైకి లేచి తన కిరణాలను ప్రసరింపజేస్తే, ఇంతసేపూ ఉన్న చీకటిని తొలగిస్తే, మన కంటికి తాను కనబడతాడు. అట్లాగే స్వామి సన్నిధికి చేరడం కూడా మన ప్రయత్నం … Read entire article »

Filed under: హిందూ పురాణములు

”ఓం నమో భగవతే శ్రీలహరికృష్ణాయ నమః”

ప్రియమైన సహోదర సహోదరీలారా, శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ నామములో మా శుభాకాంక్షలు. గడచిన ఫిబ్రవరి 20వ తేదీ నుండి 24వ తేదీ వరకూ మనుజ్యోతి ఆశ్రమమునందు శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ మహిమ దిన వుత్సవములు బ్రహ్మాండముగా జరిగినవి. మీటింగులు జరిగిన దినములన్నియూ ఆవరణము అంతటా శ్రీమన్నారాయణ మహిమ ప్రసన్నతతో నిండియున్నది. వీటిలో కలుసుకొనిన వారందరికీ చాలా ఆశీర్వాదముగా వుండినది. ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రమున సౌందర్య లహరి సంగీత కచేరి కార్యక్రమముతో ప్రారంభించబడిన ఈ ఉత్సవములు 24వ తేదీ రాత్రి ముగించబడినవి. 24వ తేదీ ముఖ్యమైన పండుగ దినముగా ఆచరించబడినది. ఆ దినమున  అనేకమంది ముఖ్యమైన అతిధులు కూడా విచ్చేసియున్నారు. ఈ ఉత్సవములలో సమస్త వేదముల అధ్యాయనము జరిగినది. శ్రీదేవాశీర్‌ లారి గారి కుమారులు శ్రీ డి. పాల్‌ ఉపాజ్‌ లారిగారు, శ్రీ డి. లియో పాల్‌ సి. లారిగారు వేదముల నుండియు,  శ్రీలహరికృష్ణగారి సందేశముల నుండియు అనేక కార్యములను భక్తులకు వివరించారు.  ఈ ఉత్సవములలో వేద గ్రంధముల నుండి భగవంతుని రాజరీక సంతతి (భగవంతుని భక్తులు లేదా దేవరులు) ఆది నుండి ఏవిధముగా భధ్రపరచబడి తీసుకొని రాబడుచున్నారనియు, మనుష్యుని యొక్క స్వార్ధము ఏవిధముగా లోకములో పనిచేయు చున్నదనియు, భగవంతుని సంకల్పము అనేది ఏవిధముగా క్రియచేయుచున్నదనియు వివరించబడినది. మరి ముఖ్యముగా ఈ … Read entire article »

Filed under: సంపాదకీయం

వేదములు – మతములు

మనుష్యుడు దేవుని పొందుకొనుటను గురించి యీనాడు మానవుడు మాటలాడుచున్నాడు. ”1000 మంది యోగాభ్యాసము చేసిన యెడల ఒకడు శాంతిని పొందుకొనును” అని భగవద్గీతలో చెప్పబడియున్నది. ఈరోజున అందరూ యోగ యోగ అంటూ మాకు శాంతి లభించింది అని అంటూ వుంటారు. ”మీరు వివాహము చేసుకొనిన యెడల మీకు దేవుడు లేడు” అని కొంతమంది అంటూవుంటారు. ఒక మనుష్యుడు భగవద్గీతను తెలుసుకొంటే ఏ ఏ మాటలు నిజమని తెలుసుకుంటాడు. కాని యీ రోజున జనులు దానిని చదవడము లేదు. ఖురాన్‌ను తీసుకొనుడి. ఇక నా తరువాత వేరే ప్రవక్త లేడు అని మహమ్మదు చెప్పియున్నాడు. అది భయంకరమైన అబద్దము. అతనను దానిపైన ఒక మతమును స్థాపించాడు. ఈ రోజున ప్రతి ఒక్కరు వారి వెనుకన తలుపును మూసివేయాలనే ప్రయత్నించుచున్నారు. నా తరువాత యిక ఎవరూ రారు అని వారు అంటూవుంటారు. కాని ఒక నిజమైన ప్రవక్త లేక ఒక నిజమైన అవతార పురుషుడు తన తరువాత రానున్న  అతనిని గురించి తెలియజేయును. అతను రానున్న అతనికోసం రంగమును సిద్ధపరచును. ఈ రోజున మతమును గురించి మాటలాడుచున్నది మతనాయకులే. వారికి దేవుడు లేడు. ఇతరులు దేవుని దగ్గరికి రావడానికి వారు అనుమతించరు. మీరు భగవద్గీత చదివిన యెడల, కురాన్‌ను చదివినయెడల, … Read entire article »

Filed under: శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు

ప్రకృతి వివేకము

నిత్యము ఎదురయ్యే పలు అనుభవాల సమాహారమే జీవితం. ఊహించని, ఆశించని ఎన్నో అనుభవాలు జీవితంలో తటస్థపడతాయి. జీవితం కంటే విచిత్రమైనది యింకొకటి లేదు. అనివార్యతను ఆహ్వానించి, సత్యమునందు నిలిచి యుండటమే పరిపూర్ణ మానవుని యొక్క లక్షణం. ఊహించని పరిణామం (మార్పు) అనేది మనిషి సహా ప్రకృతి అంతగా సంభవిస్తుంది. అయితే ఆ సహజ మార్పును ప్రకృతి స్వీకరిస్తుంది. మనిషి స్వీకరించడానికి యిష్టపడడు. అనగా మనిషి తనకు అనువుగాని పరిస్థితుల్లో కూడా ఫలితాన్ని ఆశించి ప్రయత్నం సాగిస్తూ వుంటాడు. సమస్యల్లో చిక్కుకొంటూ వుంటాడు. మానవునికి ఆలోచన వుంది, విచక్షణ వుంది, విశ్లేషణ కూడా వుంది. అయినప్పటికీ ఫలితమన్నది భగవంతుని దయ అన్న స్పృహలేని మానవుని యొక్క జీవితం అనేది శోచనీయం. దీనికి కారణం దైవజ్ఞలను ధిక్కరించి పరోపకార జీవన విధానం అలవరచుకోక పోవడమే అన్నది వేదాల ఉద్భోద. సృష్టిలో పరిమళాలు వెదజల్లే ఎన్నో పుష్పాలను వికసింపజేసే మొక్కలు తమ పుష్పాలలో వున్న మకరందాన్ని అనేక కీటకాలు జుర్రుకుపోతాయని తెలిసి, అవి మళ్ళీ మళ్ళీ తమ పుష్పాలను వికసింపజేస్తాయి. తమకు ఎదురయ్యే సంభవాల పట్ల నిబద్దతను ప్రదర్శిస్తాయి. నలుగురికీ తమ పరిమళాన్ని మరియు మకరందాన్ని పంచిపెట్టడం నిలిపివేయవు. నేటి రోజుల్లో విచక్షణ వున్న మానవుడు తల్లిదండ్రులకు పెట్టిన అన్నానికి కూడా లెక్క … Read entire article »

Filed under: కవితలు

ప్రవక్తల ప్రవచనములు

”శ్రీలహరికృష్ణగారి గురించి మునులు, ప్రవక్తలు ఏమని వర్ణించారు?” ”ఏకం సత్‌ విద్రహా బహుదా వదంతీ – సత్యం అనగా భగవంతుడు ఒక్కడే. కాని జనులు ఆయనను పలు నామములతో పిలుస్తున్నారని వేదములు చాటిస్తున్నాయి. భగవద్గీత 4:8వ శ్లోకం : పరిత్రాణాయ సాధూనాం – వినాశయ చ దుష్కుృతామ్‌ ధర్మసంస్థాపనర్థాయ – సంభవామి యుగే యుగే! భావం : సాధుసజ్జనులను సంరక్షించుటకు, దుర్మార్గులను వినాశమొనర్చుటకును, ధర్మమును లెస్సగా స్థాపించుటకు నేను ప్రతీయుగమందును అవతరించుదును. మనుష్యుల ఈ నిరీక్షణను ఆసరా చేసుకొని, ప్రతీ ఒక్కరు నేనే ”ఆ వ్యక్తిని” ”నేనే ఆ అవతారపురుడిని” అని చాటించుకొనుచున్నారు. తమ స్వలాభం కొరకు ఆ విధంగా ప్రకటించినా, ఏవో కొన్ని శక్తులు, మహిమలు వున్నంత మాత్రాన వారే ఆ కల్కి మహావతార పురుషులు కాలేరు. కల్కి పురాణం 2వ అధ్యా, 3-4 శ్లోకములు : ఓ దేవతలారా! మీ విన్నపం అనుసరించి నేను సుమతి గర్భాన, శంబల గ్రామమున విష్ణు యశస్సుని భార్య అయిన కన్య సుమతి గర్భములో జన్మిస్తాను. కల్కిపురాణం 1వ అధ్యా. 15వ శ్లోకం : ఆ ప్రభువు కల్కి అవతారపురుషుడుగ మానవునిగ, మాధవమాసమున శుక్లపక్షం పన్నెండవ దినమున (ఫాల్గుణం – ఫిబ్రవరి నెల మధ్య నుండి మార్చి నెల మధ్య వరకు) జన్మించును. వివరణ : శ్రీ … Read entire article »

Filed under: వేదములలోని మర్మములు

శివయోగ రహస్యము

వేదములలో, మరీ ముఖ్యముగ యజుర్వేదంలో చెప్పబడియున్న యజ్ఞయాగాదులను మనలో కొంతమంది పాటిస్తున్నా, వాటిని వేదములలో వున్నదున్నట్లుగ చేయడము లేదు. వాటి మూలార్ధమును మరిచి, వాటిని కేవలం ఒక తంతుగా, ఆడంబరముగా తమ గొప్పతనాన్ని చాటించుకోవడానికి ఆచరించడమే తప్ప, వాటి విధి విధానాలను అనుసరించి చేసి పొందాల్సిన ఫలితాలు పొందుకొనడము లేదు. పరమపురుషుడే ఆదియోగి. ఆది గురువు కూడ! నేడు మనకు తెలిసిన యగమునకు మూలము ఆయనే. యోగం అంటే కేవలం శిరసాసనము వేయడము, ఊపిరి స్తంభింప చేయడము కాదు. అసలు జీవం ఏలా వుద్భవించినది? దానికి మూలము ఏమిటి? తిరిగి ఎక్కడికి చేరుకొంటున్నది? అనే అంశాలను వివరించే శాస్త్ర సంకేతిక పరిజ్ఞానమే యోగం. ఇదే ఆదిబలి అని వర్ణించబడినది. యోగం అంటే విలీనం – భగవంతునిలో ఐక్యపడుట. తనను తాను తెలుసుకొనినవాడు మాత్రమే యోగి. తనను తాను తెలుసుకున్న స్థితిలో యోగి తన అస్తిత్వాన్ని కోల్పోతాడు. అస్తిత్వాన్ని కోల్పోవడమే భగవంతునిలో లీనమవడము. అనగా జీవాత్మ పరమాత్మలో ఐక్యపడటము. ఆ పరమాత్ముని చేరుకొనే యోగ మార్గమును పరమపురుషుడైన యోగీశ్వరుడు తనను తానే బలిగ అర్పించుకొని మనకు బోధించి యున్నాడు. అన్ని మత గ్రంధములలోను యీ ఆదియజ్ఞము వివరించబడియున్నది. పలు వేద శ్లోకములలో సూచింపబడి యీ నాటికి ముఖ్యత్వమును … Read entire article »

Filed under: వేదములలోని మర్మములు