தமிழ்| telugu

» Archive

ధర్మములు

”శ్రేయాన్‌ స్వధర్మో విగుణః పరధర్మాత్‌ స్వనుష్ఠితాత్‌ | స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ” తాత్పర్యం : చక్కగా అనుష్టింపబడిన పరధర్మము కన్నను గుణములేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను శ్రేయోధాయకమే. పరధర్మము భయంకరమైనది. ఆచరణకు అనుచితమైనది. – భగవద్గీత 3:35. ”ధర్మములు మిదం జగత్‌”. ఈ జగత్తు ధర్మమూలము. ధర్మమే ఈ జగత్తునకు ఆధారము. ధర్మోహి పరమో లోకే సత్యం ప్రతిష్టితమ్‌. లోకములో ధర్మమే గొప్పది. ధర్మమునందు సత్యము ప్రతిష్టితమై యున్నది. ధర్మమునందు ధర్మార్థ కామములన్నియు కలవు. ధర్మము వలన అర్థము, సుఖము కలుగును. పరదారాసక్తత, వైరము లేకుండా చంపుట, అసత్యవాక్యము అనునవి కామము వలన కలుగు వ్యసనములు. కామము వలన కలుగు వ్యసనములకు దూరముగా వున్నవాడే ఈ లోకమున ధర్మాచరణ చేయగలడు. ఇందు అసత్యము గొప్ప వ్యసనము. ధర్మము : దేవతలు ధర్మమును, రాక్షసులు అధర్మమును ఆశ్రయించి వుందురు. ధర్మము అధర్మమును అణగత్రొక్కునప్పుడు కృతయుగము. అధర్మము ధర్మమును అణగత్రొక్కునప్పుడు కలియుగము. వేద ప్రణీతము ధర్మము. వేద ప్రణీతము కాని అవైదికము అధర్మము. ధర్మమును పుణ్యమని, అధర్మమును పాపమనీ చెప్పుదురు. ప్రాణులకు పుణ్య పాపములు అనుభవంబులు కాని ఊరకపోవు. అనగా వాటి ఫలితములు ఏదో ఒక రోజు తప్పక అనుభవించవలసియే ఉండును. ధర్మము చాలా … Read entire article »

Filed under: హిందూ పురాణములు

”ఓం నమో భగవతే శ్రీలహరికృష్ణాయ నమః”

ప్రియమైన సహోదర సహోదరీలారా, శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ నామములో మా శుభాకాంక్షలు. గత శీర్షికలో మీకు తెలియజేసిన విధముగా విధ్యార్ధుల సమ్మర్‌ క్యాంపు మనుజ్యోతి ఆశ్రమము నందును మరియు విశాఖపట్టణము సమీపమున వున్న ఆసరాడ ప్రాంతములోనూ బాగుగా జరిగినది. దానిలో అనేకమంది విధ్యార్ధినీ విధ్యార్ధులు కలుసుకొన్నారు. వారికి శరీర వ్యాయామములు, వేదముల నుండి అనేక వేదప్రవచనములను నేర్పించారు. ఈ కలియుగములో కలి ప్రభావమునుండి (నవీన నాగరికతనుండి) ఏవిధముగా కాపాడబడవలెనని పిల్లలకు నేర్పించబడినది. వారు నేర్చుకొనిన వాటిలో నుండి వారికి పరీక్షలు నిర్వహించబడినవి. ఆటల పోటీలు నిర్వహించబడినవి. ఉత్తీర్ణులయిన వారికి బహుమతులు కూడా యివ్వబడినవి. అంతే కాకుండా క్యాంపులో పాల్గొనిన ప్రతీ ఒక్కరికి సర్టిఫికేట్‌ యివ్వబడినది. విధ్యార్ధులందరికీ సమ్మర్‌ క్యాంపు చాలా ప్రయోజనకరముగా వుండినది. అదేవిధముగా విశాఖ జిల్లా, సబ్బవరం మండలం, మొగలిపురం అనే గ్రామములో మే నెల 15వ తేదీన ‘సర్వమత సమావేశము’ అనే కార్యక్రమము చాలా బ్రహ్మాండముగా నిర్వహించబడినది. ఈ కార్యక్రమము శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి దివ్య సముఖంలో, మనుజ్యోతి ఆశ్రమ ఆధ్వర్యంలో, శ్రీ లహరికృష్ణగారి భక్తుల మధ్యలో, విశాఖజిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్‌ మాజీ అధికార భాషా సంఘఅధ్యక్షులు శ్రీ కె. నరసింహనాయుడుగారి అధ్యక్షతన జరిగినది. స్థానిక రాజకీయ వేత్తలు, కవులు, ప్రముఖులు, వ్యాపార వేత్తలు, వార్తా విలేకరులు మరియు … Read entire article »

Filed under: సంపాదకీయం

కుల మత దేశ బేధములను విడిచిపెట్టండి

ఈ సంతతిలో ఒక గుంపు జనులు మరణమును చూడకుండ వెళ్ళనైయున్నారు. ఎల్లప్పుడూ అందరూ మరణిస్తూ వుండటము వలన మరణము సదా వుంటుందని మనము అనుకుంటున్నాము. మరణము లేకుండ ఒక గుంపు జనులను తీసుకొని వెళ్ళడానికే దేవుడు వచ్చియున్నాడు. మరణించిన వారు లేస్తారు. అతి త్వరలో ఒక గుంపు జనులను దేవుని శక్తిచే నింపబడినవారిని నిత్యత్వము ధరించుకొనునట్లు దేవుడు మార్చబోవుచున్నాడు. ఉదయం 5 గంటలకు మేమందరము దేవుని స్తుతించుచు దేవునికై వేచివుంటాము. మీ ఇంటిలో వుండే ఆ సమయమున మీరు మాతో కలిసిన యెడల మీ కుటుంభములో దేవుని శక్తిని మీరు చూడగలరు. ప్రపంచమంతటను 5 నుండి 6 వరకు అందరూ ధ్యానము చేస్తూ వుంటారు. మాలో కలవండి మీ మతము గురించి మీరు మరచిపొండి. మీ ద్వేషములను మరచిపోండి. రాష్ట్రపరమైన ఆలోచనలను మరచిపోండి. మీ కులబేధములను, మీ వర్ణ బేధములను మరచిపోండి. గొప్ప ఉద్ధేశము కొరకు నిర్ణయింపబడిన మానవులుగ మిమ్ములను మీరు తలంచుకొనుడి. భారతీయులు అనుభవించిన బాధలు చాలు. ఇప్పుడు దేవుడు మిమ్ములను ఆశీర్వదించుటకు వచ్చియున్నాడు. చాలా మంది చాలా వాటిని చెప్పవచ్చును. కాని యిప్పుడు మీకు సమయము వచ్చియున్నది. దేవుడు తన స్థానమును వదలి మీ కొరకు వచ్చియున్నాడు. అందుకే అతనిని అంగీకరించుడి. … Read entire article »

Filed under: శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు

భగవంతుని సంకల్పమా? లేదా మన సంకల్పమా?

ఈ రోజు ప్రతీ ఒక్కరు యోగా గురించియు, యోగాభ్యాసమును గురించియు మాట్లాడు చున్నారు. దేవుని నుండి శాంతిని పొందుకోవాలని ప్రయత్నించు చున్నారు. అదే సమయములో లోకములో వున్న సమస్తమును అనుభవించా లనియు ఆశపడుచున్నారు. మనము మన జీవితమును ప్లాను చేసుకొంటాము. డాక్లరు కావాలని, ఇంజనీరు కావాలని లేదా చాలా గొప్పగా కావాలని ఆశిస్తారు. కాని మన కొరకు భగవంతుడు వేరే ప్లానును కలిగి వుంటాడు. ఈ రెండు ప్లానులు ఒక దాని కొకటి వ్యతిరేకముగ వుంటాయి. మీరు భగవంతుని, మనిషిని ఒకేసారి వెంబడించలేరు. ఇప్పుడు మనుష్యులము అయిన మనము మన స్వంత ఆలోచనలను వెంబడించాలా లేక దేవుని వేద గ్రంధ వాక్యములు చెప్పినట్లు చేయాలా? ఈ లోకములో యీ రెండింటి మధ్య ఎప్పుడూ పోరాటమే! లోకములో మూడు రకములైన జనులు వున్నారు. ఒక రకం పూర్తిగ లోకప్రకారమైన జనులు. ఇంకొక రకం మధ్య రకం. అతనికి దేవుడూ కావాలి, ఈ లోకమూ కావాలి. మూడవ రకం వ్యక్తి పూర్తిగ దేవుని వెంబడించేవాడు. మొదటి రకం వ్యక్తి లోక ప్రకారమైనవాడు అతను యీ లోకమును ఎన్నుకోవాలి లేక దేవుని ఎన్నుకోవాలి. అతను లోకమును దేవుని శ్రద్దగా పరీక్షించి చూస్తాడు. లోకములో బంధపాశములు వున్నవి. అందులో కీర్తి ప్రతిష్టలు … Read entire article »

Filed under: శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు

అబ్రహాము విశ్వాసమునకు తండ్రి

అతని భూలోక మరియు పరలోక సంతానము నిమ్రోదు రాజుగా వున్నప్పుడు లోతు, ఎలియాజరుతో కలిసి అబ్రాము భారతదేశమునుండి దేశ బహిష్కరణ చేయబడెను. అబ్రహాము తన తండ్రియైన తెరహు యొక్క విగ్రహములను పగులగొట్టెను. దానిని చేయడము వలన అతనిని అగ్నిగుండములో పడవేయమని ఆజ్ఞ యివ్వబడినది. కాని అతను చంపబడలేదు. అతను మంత్రవాది లేదా చిల్లంగితనము చేసేవాడు అని అనుకొని దేశమునుండి బయటకు పంపించాలనుకొన్నారు. ఎందుకంటే అతను దేవుని విత్తును మోసుకొని వెళ్ళు ఏకైక దేవుని విశ్వసించువాడు. తన యొక్క దేశమును, జాతిని, తండ్రి యింటిని విడిచి దేవుడు చూపించిన దేశమునకు వెళ్ళునట్లు ఆజ్ఞాపింపబడినాడు. అతనితో ఆయన ఒక నిబంధన చేసియున్నాడు. లోతు, ఎలియాజరు అతనితో వెళ్ళారు. ‘నీవు అనేక జనములకు తండ్రివగుదువు’ అని ప్రభువు అతనితో చెప్పి, అతని పేరును అబ్రాము నుండి అబ్రహాము అని మార్చి జాతులను, రాజులను అతనిలో నుండి ఉద్భవింపజేస్తాను అని వాగ్దానము చేసెను. ఆకాశ నక్షత్రముల వలే పరలోక పిల్లలును, ఇసుక రేణువులవలే భూలోక పిల్లలును అతని సంతతి నుండి పుట్టి, పరలోకమును, భూలోకమును స్వతంత్రించుకొంటారు అని వాగ్దానము చేసారు. హాగరు మూలముగా అబ్రహాము సంతతి అయిన ఇష్మాయేలు పుట్టెను. కాని శారా ద్వారా పుట్టిన ఇస్సాకు క్రీస్తు అయిన విత్తును జనియింపజేసెను. గలతీ … Read entire article »

Filed under: శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు

ప్రవక్త అయిన జోసఫ్‌స్మిత్‌ ప్రవచనములు

‘డాక్టరిన్‌ అండ్‌ కవనెంన్ట్స్‌’ ప్రతీ యుగములోను అవతరించిన భగవంతుడు, తనకు ముందుగా తన ప్రవక్తలను, దూతలను పంపియున్నాడు. ఆవిధముగా పంపబడినవారిలో జోసఫ్‌ స్మిత్‌ ఒకరు. 1831 సంవత్సరములో ప్రవక్తకు యీ కార్యములు బయలుపరచబడినవి. అనేక మతశాఖలు వున్నవి గదా! అందులో ఏది సరి అయినదని తెలుసుకొని అందులో చేరడానికై ప్రభువు దానిని అతనికి తెలియపరచాలని అతను ప్రభువును వేడుకొనెను. అతి త్వరలో అతనికి ప్రత్యుత్తరము లభించినది, వెలుగులో తనకుపైగా రూపం దాల్చిన ప్రముఖుని ”ఏది సరిఅయినది  (నేను ఎందులో చేరాలి)? అని ప్రశ్నించగా ”ఎందులోనూ చేరవద్దు. అవి అన్నియు సరిఅయినవి కావు. వాటి మత సిద్దాంతములన్నియు నాదృష్టిలో అసహ్యమైనవిగా వున్నవి. వాటి బోధకులందరూ చెడిపోయిన వారే. నోటిమాటతో పెదవులతో నన్ను సమీపించుచున్నారు. వారి హృదయములు నాకు చాలా దూరముగ నున్నవి. వారు మనుష్యుల ఆజ్ఞలనే సిద్దాంతములుగ బోధించుచున్నారు. అవి దైవ స్వరూపమును కలిగియున్నవి గాని శక్తిని తిరస్కరించుచున్నవి” అని చెప్పెను. నాకు భయపడే వారికి నేను దయను, కృపను చూపిస్తాను, చివరి వరకు సత్యముతోనూ నీతితోనూ నన్ను ఆరాధించేవారిని ఘనపరచుటలో నేను సంతోషిస్తాను. వారికి యివ్వబడే ప్రతిఫలము చాలా గొప్పగ వుంటుంది, వారి మహిమ నిత్యముగా వుంటుంది. వారికి నా మర్మములన్నిటిని బయలుపరుస్తాను, పురాతన కాలమునుండి మరుగు చేయబడిన … Read entire article »

Filed under: వేదములలోని మర్మములు