தமிழ்| telugu

» Archive

46వ కల్కిజయంతి ఉత్సవములు

మనుజ్యోతి ఆశ్రమములో బ్రహ్మాండముగా జరిగిన 46వ కల్కిజయంతి ఉత్సవములు ఓం నమో భగవతే శ్రీలహరికృష్ణాయ నమః” ప్రియమైన సహోదర సహోదరీలారా, శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ నామములో అందరికీ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. మీకు తెలియజేయబడిన విధముగా 2015 జూలై 15 నుండి 22వ తేదీ వరకు 46వ కల్కిజయంతి ఉత్సవములు మనుజ్యోతి ఆశ్రమ ప్రాంగణములో బ్రహ్మాండముగా జరిగినవి. ఈ ఉత్సవములకు భారతదేశములో అనేక ప్రాంతముల నుండియు ఇంకా బర్మా, జర్మనీ, అమెరికా, మలేషియా ప్రాంతములనుండియు భక్తులు హాజరయ్యారు. జూలై 1వ తేదీన నారాయణుని ప్రేమపతాకమును ఎగురవేసి, ఆశ్రమము చుట్టూ ఊరేగింపు నిర్వహించబడినది. అలాగే ప్రపంచ మంతటిలోనున్న శ్రీలహరికృష్ణ స్తుతిధ్యాన కేంద్రములన్నిటిలోనూ ప్రేమ పతాకము ఎగుర వేయబడినది. భక్తులు కుటుంభసమేతముగా విచ్చేసి, వారి గుడారములను వారే వేసుకొని ఈ ఉత్సవముల కొరకు సిద్దము చేసుకొన్నారు. కల్కిజయంతి ఉత్సవములు 15వ తేదీ, సాయంత్రమున సౌందర్య లహరి సంగీత కచ్చేరి కార్యక్రమముతో ప్రారంభము అయినవి. మొదటి దినమునకే వేల మంది భక్తులు హాజరుకావడము విశేషముగా కనిపించినది. ఈ ఉత్సవములలో స్త్రీలకు ప్రత్యేక సమావేశము మరియు సర్వమత సమావేశము, దేశీయ సమైక్యతా సమావేశము, చిన్న పిల్లల సాంస్కృతిక కార్యక్రమములు, నాటకములు, పిల్లల ఆటల పోటీలు చోటుచేసుకొనినవి. సర్వమత సమావేశము తెలుగు భాషయందే గాక, తమిళము, హిందీ భాషలలో కూడా జరిగినది. వీటిలో … Read entire article »

Filed under: వైకుంఠలోక ఉత్సవములు

గజేంద్ర మోక్షము

శ్రీహరి లీలలు వర్ణనాతీతం. అంతేకాదు, తన భక్తులు ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి విపత్తులో నున్నా ఏమాత్రం జాగుచేయకుండా పరుగు పరుగున వచ్చి ఆదుకునే దయామయుడు చక్రి. తన భక్తులైన మానవులు, దేవతలు, దానవులనే గాక జంతువులను కూడా సంరక్షించి మోక్షాన్ని ప్రసాదించే కరుణాంతరంగుడు శ్రీమన్నారాయణుడు. ఈ సత్యాన్ని ‘గజేంద్రమోక్షం’ గాధ తెలియజేస్తుంది. ఒకప్పుడు ద్రవిడ దేశాన్ని ఇంధ్రద్యుమ్నుడు పాలించేవాడు. అతను గొప్ప హరిభక్తుడు. నిరంతర శ్రీమన్నారాయణా మంత్రజప నిష్ఠాగరిష్ఠుడు. ప్రజలని కన్నబిడ్డల వలే పాలిస్తూ అనేక సంవత్సరాలపాటు రాజ్యపాలన చేసిన ఆ రాజు కౌమార దశకి రాగానే తన కుమారుడికి రాజ్యాధికారం అప్పగించి, వానప్రస్థ ఆశ్రమం స్వీకరించి, ఉత్తర దిశకి వెళ్ళి ఒక ఆశ్రమం నిర్మించుకొని, మౌనదీక్ష వహించి శ్రీహరి నామధ్యాన తపస్సులో మునిగిపోయాడు. అలా చాలాకాలం గడిచాక, ఒకనాడు అగస్త్యమహర్షి తన అర్థాంగితో వచ్చాడు. ఆ సమయంలో రాజు తీవ్రమైన తపోనిష్ఠలో ఉన్నాడు. పైగా మౌని. అందుచేత అగస్త్య దంపతుల రాకని గమనించలేదు. అగస్త్యుడే పలకరించినా మారు పలకలేదు. కన్నెత్తి చూడలేదు. అర్ఘ్యపాద్యాది కనీస సత్కారాలు కూడా చెయ్యలేదు. అపర రుద్రావతారుడైన అగస్త్యుడు ఆ అవమానానికి ఆగ్రహించాడు. ”ఓరీ… వానప్రస్థ ఆశ్రమధర్మాన్ని విస్మరించి, అతిధి అభ్యాగతులకు కనీస సత్కారాలైనా చేయక ‘మదగజం’ వలె ప్రవర్తించిన నీవు … Read entire article »

Filed under: హిందూ పురాణములు

సంపాదకీయం

”ఓం నమో భగవతే శ్రీలహరికృష్ణాయ నమః” ప్రియమైన సహోదర సహోదరీలారా, శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ నామములో అందరికీ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. మీకు తెలియజేయబడిన విధముగా 2015 జూలై 15 నుండి 22వ తేదీ వరకు 46వ కల్కిజయంతి ఉత్సవములు మనుజ్యోతి ఆశ్రమ ప్రాంగణములో బ్రహ్మాండముగా జరిగినవి. ఈ ఉత్సవములకు భారతదేశములో అనేక ప్రాంతముల నుండియు ఇంకా బర్మా, జర్మనీ, అమెరికా, మలేషియా ప్రాంతములనుండియు భక్తులు హాజరయ్యారు. జూలై 1వ తేదీన నారాయణుని ప్రేమపతాకమును ఎగురవేసి, ఆశ్రమము చుట్టూ ఊరేగింపు నిర్వహించబడినది. అలాగే ప్రపంచ మంతటిలోనున్న శ్రీలహరికృష్ణ స్తుతిధ్యాన కేంద్రములన్నిటిలోనూ ప్రేమ పతాకము ఎగుర వేయబడినది. భక్తులు కుటుంభసమేతముగా విచ్చేసి, వారి గుడారములను వారే వేసుకొని ఈ ఉత్సవముల కొరకు సిద్దము చేసుకొన్నారు. కల్కిజయంతి ఉత్సవములు 15వ తేదీ, సాయంత్రమున సౌందర్య లహరి సంగీత కచ్చేరి కార్యక్రమముతో ప్రారంభము అయినవి. మొదటి దినమునకే వేల మంది భక్తులు హాజరుకావడము విశేషముగా కనిపించినది. ఈ ఉత్సవములలో స్త్రీలకు ప్రత్యేక సమావేశము మరియు సర్వమత సమావేశము, దేశీయ సమైక్యతా సమావేశము, చిన్న పిల్లల సాంస్కృతిక కార్యక్రమములు, నాటకములు, పిల్లల ఆటల పోటీలు చోటుచేసుకొనినవి. సర్వమత సమావేశము తెలుగు భాషయందే గాక, తమిళము, హిందీ భాషలలో కూడా జరిగినది. తెలుగులో జరిగిన సర్వమత సమావేశమునకు … Read entire article »

Filed under: సంపాదకీయం

పరమపురుషుని సందేశము

ఈ అంత్య దినముల వరకు భగవంతుని యొక్క పూర్తి రూపము జనులకు చూపబడలేదు. జనములను విమోచించుటకై ఆయన 6000 సంవత్సరములు వేచియుండవలసి యున్నది. నారాయణుడు కనబడని పరమాత్మచే సృష్టింపబడెను. ఆయన పాపము లేకుండా ఆ శరీరమును ప్రత్యేకముగ శుద్దీకరించియున్నాడు. నారాయణుడు తన నోటి ద్వారా సమస్తమును సృష్టించెను. తన సృష్టిలోని ప్రతి ప్రాణిని సృష్టించెను. ఆయన దేవుని ఆత్మను కలిగివున్నను, దేవునికి నరునికి మధ్యన ఆయన మధ్యవర్తిగ వున్నాడు. తను మరణించలేడు అని నిరూపించుటకే ఆయన అతి గొప్ప బలిని నిర్వహించెను. బలి తరువాత ఆయన యొక్క పరిశుద్దాత్మ – జీవాత్మ వెలుపలికి పోయినది. ఒక మనుష్యునిగ ప్రభువు యొక్క ఆత్మ – పరమాత్మ ఆయనను ఆవరించినది. అది ఒక శరీరప్రకారమైన మనుష్యుడు కాదు గాని ఆత్మీయ మనుష్యుడు. మనుష్యుడు ఎన్నటికీ దేవుని చేరుకోలేడు. కాని ఆయన ప్రేమ మనలను చేరుకొంటున్నది. దానిని మీరు గ్రహించినప్పుడు మీ హృదయము విరిగి నలిగిపోతుంది. ఆయన మళ్ళీ లేచినప్పుడు ఆయనకి యధార్థముగ వున్న విశ్వాసపు జనులలోనికి ఆయన ఆత్మ ప్రవేశించినది. పరలోకమునంతటిని, విశ్వమునంతటిని నిర్వహించు ఆత్మ ఆయనకు అధీనము చేసినది. అదే నిత్యనిత్యముగ ఎగురుచున్న నారాయణుని ప్రేమ పతాకము. కాని స్వయము వలన భూమి దానిని పోగొట్టుకొనినది. … Read entire article »

Filed under: శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు

గర్వము వలన నాశనమునకు లోనైన ఇద్దరు వ్యక్తుల ఉదాహరణ

సూరా 8:32-34. ప్రవక్తా! వారి ముందు ఒక ఉపమానం పేర్కొను : ఇద్దరు వ్యక్తులు వుండేవారు. వారిలో ఒకనికి మేము రెండు ద్రాక్షతోటలు ఇచ్చాము. వాటి చుట్టూ ఖర్జూరపు చెట్ల కంచెను పెంచాము. ఇంకా వాటి మధ్య సేద్యపు భూమిని ఉంచాము. ఆ రెండు తోటలు పుష్కలంగా పండాయి. పండటంలో అవి ఎంత మాత్రమూ కొరత చూపలేదు. ఆ తోటల మధ్య ఒక కాలువను ప్రవహింపజేశాము. యజమానికి మంచి లాభాలు వచ్చాయి. ఇదంతా పొంది కూడా అతడు ఒకనాడు తన పొరుగు మిత్రునితో మాట్లాడుతూ ఇలా అన్నాడు : ”నేను నీకంటే ఎక్కువ ధనం కలవాణ్ణి. ఎక్కువ బలవంతులైన జనం కలవాణ్ణి.” 35-43వ: తరువాత అతడు తన ద్రాక్షతోటలోనికి ప్రవేశించాడు. తన ఆత్మకు అన్యాయం చేసుకున్నవాడై ఇలా ప్రకటించాడు. ”ఈ సంపద ఎన్నటికి నశించదు. ఎప్పటికైనా ప్రళయఘడియ వస్తుందనే నమ్మకం కూడా నాకు లేదు. అయినప్పటికీ, ఒకవేళ ఎప్పుడైనా నా ప్రభువు సన్నిధికి మరలింపబడినట్లయితే తప్పకుండా దీనికంటే ఉన్నతమైన స్థానాన్ని పొందుతాను.” అప్పుడు అతని పొరుగువాడు మాట్లాడుతూ అతనితో ఇలా అన్నాడు: ”నిన్ను మట్టితోనూ, తరువాత వీర్య బిందువుతోనూ పుట్టించి ఒక సంపూర్ణ మానవునిగా తీర్చిదిద్దిన ఆయనయందు నమ్మకము లేదా? ఇక నా విషయము – నా … Read entire article »

Filed under: వేదములలోని మర్మములు

పరిశుద్ద గ్రంధము యొక్క వివరణ

పరిశుద్ద గ్రంధము వెవ్వేరు కాలములలో వ్రాయబడిన 66 ప్రవచన పుస్తకములను కలిగియున్నప్పటికినీ ఇప్పటికాలములో పరిశుద్ద గ్రంధము అనేది ఒకే పుస్తకముగా వున్నది. ఆదికాండము అను పుస్తకము ఒకే దేవుని గూర్చి వెవ్వేరు కాలములలో వేరు వేరు మార్గములలో ఆయన మాట్లాడినదియు, ఆయన క్రియచేయుచున్న దాని గురించియు సాక్ష్యమిచ్చుచున్నది. యుగయుగములుగా ఇది విమోచనా కధను వివరించుచున్నది. ఇది అద్భుతములు, రక్షణ, పరిశుద్దాత్మను పొందుకొనుటతో ప్రారంభమై చివరిగా విమోచన గురించి చెప్పుచున్నది. దానిని ఎన్నుకొనుట మీకు చెందినది. బైబిలు గ్రంధము రాబోవు దేవుని రాజ్యమును గురించి, అది ఏవిధముగా నెరవేర్చబడును అనుట గురించి చెప్పుచున్నది. దావీదుకుమారునిగా తనను తానే బయలుపరచుకొనిన క్రీస్తు అయిన వాక్యమనే ఆయనయే ధర్మశాస్త్రము యొక్క ముగింపుగా వుండెను. పరిశుద్ద గ్రంధము పరలోకమును మెట్టు మెట్టుగా ఒక్కొక్క స్థితిగా వివరించుచున్నది. క్రీస్తు మనుష్యకుమారునిగా వచ్చువరకు ఒకే సారి లేక హఠాత్తుగా ప్రత్యక్షపరచబడలేదు. ధర్మశాస్త్రము అనేది ఒక మొక్క లేదా చెట్టు ఏలాగు పెరుగునో ఆ విధముగా వున్నది. మొదటిగా మొలక లేదా ఆకులు వస్తుంది. తరువాత కొమ్మలు దాని తరువాత పువ్వులు దాని తరువాత పండ్లు లేదా ధాన్యం, దాని తరువాత విత్తనము వచ్చుచున్నవి. దినములు గతించగా ఒక సందేశము లేదా గ్రంధకర్తను ఒక తరము వారు అర్ధము … Read entire article »

Filed under: వేదములలోని మర్మములు