தமிழ்| telugu

» Archive

ఘటము – ఘట లక్షణములు

ఘటమనగా మట్టి కుండ, వేదాంత అర్థము మానవ దేహం. కనుక ఈ దేహం కూడా మట్టి కుండ వలే యుండి, కొన్నాళ్ళకు పాడైపోవును. పాడై పగిలిన కుండ పనికిరాని విధంగా, ఈ పాడైన దేహం ఉపయోగపడదు. ఘటాకాశము శూన్యమగునట్లు, దేవాత్మ కార్మాను సారముగా ఏదో ఒక జీవియై సృష్టియందు ఉద్భవించును. ఇట్లు ఉద్భవించిన జీవికి సప్త ఆవరణములు కలుగును. దుఃఖము, శరీర పరిగ్రహణం, కర్మం, రాగద్వేషములు, అభిమానము, అవివేకము, అజ్ఞానం, దుఃఖము, కర్మ, శరీర పరిగ్రహం వలన వచ్చినవి. కర్మ, రాగ ద్వేషములు వలన వచ్చినది. రాగద్వేషాదుల వలన అభిమానము వచ్చినవి. అభిమానము, అవివేకము వలన వచ్చినది. అవివేకము, అజ్ఞానము వలన వచ్చినది. ఈ అజ్ఞానమనునది అనాధి నుండి వున్నది. ఇది తొలగి పోవాలంటే సద్గురు వాక్యానుసారము క్రమం తప్పక సద్గురు సూత్ర మూల మెరిగి ఆచరణలో వుండాలి. ఇదియే ఋషి ప్రోక్తమైన ఆచరణ. ఈవిధంగానే మానవులు తరించిరి. ఆత్మ అనగా నేమి? జగత్తు ఆకారముగా తోచబడిన వస్తు సముదాయమునకు అంతటా నిండినదీ ఆత్మ. అందుచేతను సద్గురు సన్నిధిని చేరి చతుర్విద శుష్రుషలు చేసి స్వరూప సాక్షాత్‌కారమును తెలుసుకున్న పిమ్మట, తానెవరో తెలియబడును. పై విధంగా తెలుసుకున్నవారు సప్త ఆవరణ దాటిన వారగుదురు. వీరే జ్ఞానులు. … Read entire article »

Filed under: పాఠకులకు గమనిక, శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు

శ్రీ వామన అవతారము

పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుని మనవడు బలి పాతాళానికి చక్రవర్తి అయ్యాడు. అతను కూడా విష్ణు భక్తుడు. త్రికాలములలో శ్రీమన్నారాయణ నామస్మరణ చేయనిదే గంగ కూడా ముట్టడు. అయితే దానవ జాతిలో జన్మించినందున తమ దాయాదులైన దేవతలతో ఘర్షణలు తప్పలేదు. అలాంటి సందర్భంలోనే ‘అమృతం’ కోరి దేవతలతో చేయి కలిపి ‘క్షీరసాగర మధనం’ చేయించగా శ్రీహరి ‘కూర్మావతారం’ ధరించి సాగర మధనానికి సహకరించి, ‘అమృతోకలశం’ రాగానే… ‘మోహిని’ అవతారం దాల్చి అమృతాన్ని దేవతలకి మాత్రమే పంచి వారిని అమరులని గావించాడు. బలి చక్రవర్తి ఆవేదనతో శ్రీహరిని నిందించగా, శ్రీహరి మందహాసం చేసి ”బలీ… నీవు నా భక్తుడివి. మీ తాత ప్రహ్లాదుడివలే నాకు ఇష్టుడివి. అయితే ఒక్క విషయం. ఆనాడు ధర్మరక్షణార్థం నా భక్తుడైన ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడిని సంహరించక తప్పలేదు. అట్లే, ఈనాడు నీవు నా భక్తుడివే అయినా ధర్మపరిరక్షణార్థం అధర్మవర్తనులైన దానవులకి అమృతం దక్కకుండా చేశాను… లోకక్షేమం వహించిన నేను స్వ, పరధర్మాలు పాటించను. అయినా త్వరలో నా భక్తుడివైన నిన్ను ఉద్ధరిస్తాను” అని చెప్పాడు. బలి చక్రవర్తి రాక్షసరాజు. విష్ణుభక్తుడైన ప్రహ్లాదుని మనుమడు. అతడు వ్యక్తిగా సుగుణాలరాశి. నిత్యదాననిరతుడు. సత్యవ్రతుడు. అయితే అజన్మవైరులైన దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుని చేతిలో ఓడిపోయాడు. ఇప్పుడు అతని … Read entire article »

Filed under: శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు

”ఓం నమో భగవతే శ్రీలహరికృష్ణాయ నమః”

ప్రియమైన సహోదర సహోదరీలారా, శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ నామములో మా శుభాకాంక్షలు. గడచిన ఫిబ్రవరి నెలలో 19వ తేదీ నుండి 24వ తేదీ వరకూ మనుజ్యోతి ఆశ్రమమునందు శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ మహిమ దిన వుత్సవములు బ్రహ్మాండముగా జరిగినవి. మీటింగులు జరిగిన దినములన్నియూ ఆవరణము అంతటా శ్రీమన్నారాయణ మహిమ ప్రసన్నతతో నిండియున్నది. వీటిలో కలుసుకొనిన వారందరికీ చాలా ఆశీర్వాదముగా వుండినది. ఫిబ్రవరి 19వ తేదీ సాయంత్రమున సౌందర్య లహరి సంగీత కచేరి కార్యక్రమముతో ప్రారంభించబడిన ఈ ఉత్సవములు 24వ తేదీ రాత్రి ముగించబడినవి. 24వ తేదీ ముఖ్యమైన పండుగ దినముగా ఆచరించబడినది. ఆ దినమున  అనేకమంది ముఖ్యమైన అతిధులు కూడా విచ్చేసియున్నారు. ఈ ఉత్సవములలో సమస్త వేదముల అధ్యాయనము జరిగినది. శ్రీదేవాశీర్‌ లారి గారి కుమారులు శ్రీ డి. పాల్‌ ఉపాజ్‌ లారిగారు, శ్రీ డి. లియో పాల్‌ సి. లారిగారు వేదముల నుండియు,  శ్రీలహరికృష్ణగారి సందేశముల నుండియు అనేక కార్యములను భక్తులకు వివరించారు. భగవాన్‌ శ్రీలహరికృష్ణగారు తన అమూల్యమైన సందేశములో ఈ విధముగా చెప్పియున్నారు. ”భగవంతునితో నడుచుట అంటే అర్ధము ఏమిటి? దేవునితో సహవాసమును కలిగియుండుట అని అర్ధము.  రెండు వేరే వేరే రకములకు చెందిన జీవుల మధ్యన ఎటువంటి సహవాసము వుండనేరదు. కప్ప, ఎలుక సహవాసమును కలిగియుండలేవు. ఆవు, … Read entire article »

Filed under: వైకుంఠలోక ఉత్సవములు

శ్రీలహరికృష్ణగారి అనుభవము

నేను శ్రీ జయేంద్ర సరస్వతిని ‘శ్రీ శంకరాచార్య కంచి కామకోటి పీఠము’ను కలిసియున్నాను. నేను అతనిని చూడడానికి వెళ్ళియున్నాను. ”సహోదర జయేంద్ర స్వామి! మీ మీటింగులో నేను సాక్ష్యము చెప్పాలి” అని అన్నాను. అతను జగద్గురు జయేంద్ర స్వామి అని పిలువబడిన వాడు. ”నేను మిస్టర్‌ లారీని. నేను వచ్చియున్నాను. నేను యీ మీటింగులలో నా సాక్ష్యము చెప్పవచ్చా!” అని అడిగాను. ”సరే సహోదరుడా! మీరు యివ్వవచ్చును. ఈ స్థలము మీకు ఎప్పుడూ తెరువబడే వుంటుంది” అని చెప్పారు. కాని క్రైస్తవులు ”మీకు లైసెన్స్‌ వుందా?” అని అడుగుతారు. పనికిమాలిన వారు, పరిశుద్దాత్మ లేని వ్యక్తుల నుండి నేను లైసెన్సు తీసుకోవాలట! దేవునిచే పిలువబడిన వ్యక్తి ఎవరి దగ్గర లైసెన్సు తీసుకోవాలట? అది ఏలా సాధ్యము? కాని యిక్కడ జయేంద్రస్వామి నన్ను ప్రసంగించమని చెప్పుచున్నాడు. మన ఆర్కెస్ట్రా అక్కడ మధురైలో సంగీతం వాయించినది. ఆ తరువాత అందరూ అతని పాదాలకు నమస్కారము చేయుచున్నారు. ”నేను మీ పాదములకు నమస్కరించాలా?” అని అతనిని అడిగాను. ”లేదు! లేదు! మీరు దానిని చేయకూడదు. చేయవలసిన పనిలేదు. మీరు ఒక దేవుని బిడ్డ. మీకు నచ్చినది మీరు చేయండి.” వారి దారాళగుణమును చూడండి! ఈ రోజున అటువంటి దానిని … Read entire article »

Filed under: వేదములలోని మర్మములు

భయము కూడా భక్తేనా?

”చతుర్విధా భజంతే మాం జనాస్సు కృతినోఃఅర్జున! ఆర్తో జిజ్ఞాసు రర్థార్థి జ్ఞానీచ భరతర్షభ|| ” – (భగవద్గీత 7:16) ఆర్తులు, జిజ్ఞాసులు, సంపదలు కోరేవారు, జ్ఞానులు – ఇలా తనను సేవించేవారు నాలుగు విధాలుగా ఉంటారని శ్రీకృష్ణుడు చెప్పాడు. దీనిని బట్టి ఎందుకోసమని ఎవరు దండం పెట్టినా వాళ్ళందరూ దైవభక్తులేనని, దేవుడు వారిని ఆదుకుంటాడనీ అన్వయించుకుంటూ వుంటాం. కానీ ఈ శ్లోకంలో ఒక సూక్ష్మం ఉంది. సుకృతులైన జనం ఆపదలో ఉండిగాని, తత్త్వం తెలుసుకోవాలనిగాని, జ్ఞానార్థులైగాని తనను సేవిస్తే తరిస్తారు అని ఈ శ్లోక భావం. ఇందులో ‘తనను’ సేవించడం అనేది ప్రధానం. సుకృతులు అంటే పుణ్యం చేసేవారని సామాన్యార్థం. మంచి పనులు చేసేవారని విశేషార్థం. తమ అవసరాలకై నరాధములను సేవించే కంటే నారాయణున్ని సేవిస్తే మంచిదే గదా! నమ్ముకున్న దైవాన్నికన్న ఎవర్ని అడుగుతాడు భక్తుడైనవాడు? అయితే, లోకంలో భక్తులుగా చలామణీ అవుతున్నవారెందరూ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. భగవానుడు ”మీ అవసరాలను నాకు నివేదించండి. మీకు ఎప్పుడు ఏది ఎంతవరకు అవసరమో నాకు తెలుసు కాబట్టి మీరు అడిగినదాన్ని కాక, మీరు తరించడానికి, కావలసినదాన్ని నేను ఇస్తూ వుంటాను” అంటాడు. నిజమే కదా! మనకు ఏమి కావాలో మనకంటే దేవునికే గదా ఎక్కువగా తెలిసేది! కోరికలు తీర్చి అనుగ్రహించటం ఒక విధం. … Read entire article »

Filed under: మనుజ్యోతి ఆశ్రమము

మనుష్యుని మొదటి స్థితి

ఇప్పుడు మనము పరిశుద్ద గ్రంధమైన బైబిలు నుండి చూద్దాము. మంచి చెండుల జ్ఞానము నిచ్చు సందేశమును యిచ్చే వృక్షము (మనము కూడా దేవుడు కాగలము అనుదానిని) యిచ్చి ఆదామును, అవ్వను వారు దిగంబరులని పిశాచి గ్రహించేటట్లు చేసినప్పుడు వారు భగవంతునితో ఐక్యతను లేదా పరలోక సంబంధమును కోల్పోయారు. ప్రభువైన దేవుడు వారిని వెతుకుకుంటూ వచ్చాడు. కాని ఆశ్చర్యపడు విధముగా వారు తోటలో చెట్టు వెనుక దాగుకొనియున్నారు. ప్రభువైన దేవుడు సర్పమును, అవ్వను శపించాడు. ఆదామును శపించలేదు. దానికి బదులుగా భూమి శపించబడినది. వారి యొక్క జలశరీరము వారి నుండి వేరైపోయినది. అతను ఏదేను తోట నుండి త్రోసివేయబడెను. వారికి మట్టిశరీరము యివ్వబడినది. దాని తరువాత ఆయన యొక్క బలి ద్వారా ఒక గొఱ్ఱెపిల్లను బలి యిచ్చుట ద్వారా ఆదాము ఆయనను పిలువవచ్చును అని ఆయన నేర్పించాడు. చర్మపు దుస్తులు (శరీరము) వారికి యివ్వబడినది. జీవవృక్షమునకు వెళ్ళే మార్గము అగ్నిజ్వాలల ఖడ్గములతో మూయబడియున్నది. దాని తరువాత కయీను, హేబేలు జన్మించారు. ఆదాము ద్వారా వారు గొఱ్ఱెపిల్లను బలి యివ్వడమును నేర్చుకొన్నారు. కయీను పరిశుద్దమైనవానిగా వున్నాడు. కాని ఆదాము పడిపోవుట తరువాత గొఱ్ఱెపిల్లను బలియిచ్చుటలో కయీనును సాతాను మాయ చేసి శపించబడిన భూమిలో నుండి కాయగూరలను అర్పించునట్లుగా శోధించెను. దానితో అతను మాంసం తినకుండా … Read entire article »

Filed under: మనుజ్యోతి ఆశ్రమము