தமிழ்| telugu

» Archive

పరిపూర్ణ పురుషుడు ఎవరు?

ఒక గ్రామంలో ఒక వేశ్య వుండెను. ఆమెకు తన జీవితమును ఎట్లు ఉద్దరించుకొనవలెనను ఆలోచన కలిగెను. దాని కొరకు ఆమె సాధువుల వద్దకు వెళ్ళెను. వారిట్లు చెప్పిరి. నీవు సాధు సాంగత్యము చేయుము. సాధువులు త్యాగము కలవారు. వారికి నీవు సేవ చేసిన నీకు క్షేమమగును అని చెప్పిరి. తరువాత ఆమె బ్రాహ్మణుల వద్దకు వెళ్ళగా వారిట్లు చెప్పారు. మేము జన్మతః బ్రాహ్మణులము. బ్రాహ్మణులు అందరికీ గురువులు. వారికి సేవ చేసినచో నీకు శుభము కలుగును. అటు పిమ్మట బైరాగుల వద్దకు ఆమె వెళ్ళగా వారు ఈ విధముగా పలికిరి. బైరాగులు అందరికంటే తేజసంపన్నులు కనుక వారికి సేవ చేయుము. నీకు మంచి జరుగును. అంతట ఆమె మత గురువుల వద్దకు వెళ్ళెను. వారందరు ఈ విధముగా చెప్పిరి. ఇతరులందరు పాషండులు. కాని మేమైతే సర్వోత్కృష్టులము. నీవు మాకు శిష్యురాలవు కమ్ము. అప్పుడు మేము మంచిమాట చెప్పెదము. దానివలన నీకు తప్పక క్షేమము కలుగును. ఈ ప్రకారముగా ఆమె ఎక్కడెక్కడకు వెళ్ళెనో అక్కడివారు వారి వర్ణ, ఆశ్రమ, మత సాంప్రదాయముల పట్ల ఘోర పక్షపాతము చూపించెను. ఇదంతా చూచిన తరువాత ఆమె ఇట్లనుకున్నది. ఇప్పుడు అసలు తత్వము తెలిసినది. యుక్తి చేతికి తగిలినది. సాధువులు, సన్యాసులు, … Read entire article »

Filed under: శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు

కలియుగ విషయములు

ఒకసారి పాండవులలో నలుగురు (యుధిష్ఠరుడు తప్ప) కృష్ణుని యిలాగా అడిగారు. ”కృష్ణా! కలియుగం అంటే ఏమిటి? కలియుగములో ఏమి జరుగును?” అని పలికారు. దానికి కృష్ణుడు నవ్వి ”కలియుగములో జరిగే సంఘటనలు మీకు వివరిస్తాను” అని పలికి తన యొక్క విల్లు, నాలుగు అంబులను తీసుకొని వాటిని నాలుగు దిక్కులలో వేసి, నలుగురు పాండవులను వెళ్ళి వాటిని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించెను. మొదటిగా అర్జునుడు బాణం తీయుటకు వెళ్ళినప్పుడు, అతనికి ఒక తీయని గొంతు వినబడెను. తను చుట్టూ తిరిగి చూచినప్పుడు అది ఒక కోయిల గొంతు. అది చాలా తీయగా పాడుతుంది. కాని అది ఒక బ్రతికియున్న కుందేలు యొక్క మాంసమును పీక్కొని తింటుంది. ఆ కుందేలు చాలా వేదనతో వుంది. అటువంటి దైవీకమైన పక్షి యొక్క భయంకరమైన నడవడికను చూచి అర్జునుడు ఆశ్చర్యచకితుడై ఆ స్థలమును విడిచి వెంటనే తిరిగి బాణమును తీసుకొని వెళ్ళిపోయెను. భీముడు తన యొక్క బాణమును తీయుటకు వెళ్ళినప్పుడు, ఆ స్థలములో ఐదు బావులు వుండెను. మధ్యలో ఒక బావి దాని చుట్టూ నాలుగు బావులు వుండెను. చుట్టూ వున్న నాలుగు బావులలో మాత్రమే నిండుగా తియ్యని నీరు వుండెను గాని మధ్యలో వున్న బావిలో మాత్రం నీరు లేదు. అది … Read entire article »

Filed under: శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు

”ఓం నమో భగవతే శ్రీలహరికృష్ణాయ నమః”

ప్రియమైన సహోదర సహోదరీలారా, శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ నామములో మా శుభాకాంక్షలు. గత శీర్షికలో మీకు తెలియజేసిన విధముగా విధ్యార్ధుల సమ్మర్‌ క్యాంపు మనుజ్యోతి ఆశ్రమము నందును మరియు విశాఖ జిల్లాలో వున్న ఏజెన్సీ ప్రాంతములో అసరాడ ప్రాంతములోనూ బాగుగా జరిగినది. దానిలో అనేకమంది విధ్యార్ధినీ విధ్యార్ధులు కలుసుకొన్నారు. వారికి శరీర వ్యాయామములు, వేదముల నుండి అనేక వేదప్రవచనములను నేర్పించారు. ఈ కలియుగములో కలి ప్రభావము నుండి (నవీన నాగరికతనుండి) ఏవిధముగా కాపాడబడవలెనని పిల్లలకు నేర్పించబడినది. వారు నేర్చుకొనిన వాటిలో నుండి వారికి పరీక్షలు, ఆటల పోటీలు నిర్వహించబడినవి. ఉత్తీర్ణులయిన వారికి బహుమతులు కూడా యివ్వబడినవి. అంతే కాకుండా క్యాంపులో పాల్గొనిన ప్రతీ విద్యార్థికి సర్టిఫికేట్‌, బహుమతులు యివ్వబడినవి. ఈ సమ్మర్‌క్యాంప్‌లో పాల్గొనిన విధ్యార్థులకు మరియు ఉపాధ్యాయులందరికీ చాలా ఆశీర్వాదకరముగా వుండినది. రాజకీయపరముగా మన భారతదేశ ప్రస్తుత పరిస్థితిని మనము ఎల్లప్పుడు గమనించుకోవాలి. అదేవిధముగా ఆత్మీయముగా మన జీవన విధానమును కూడా మరిచిపోకూడదు. ఆవిధముగా మరిచిపోయినప్పుడే భగవంతుడు మనలను ముట్టుకుంటాడు. ప్రస్తుత కాలములో పెట్రోల్‌, డీసిల్‌, వంటగ్యాస్‌, కాయగూరల ధరలు, మన ఖర్చులు రోజు రోజుకూ పెరుగుతూనే వున్నాయి గాని వాటిలో తరుగుదల కనిపించడము లేదు. పల్లెలన్నీ పట్టణాలుగా మారుచున్నవి. భారతదేశము అన్ని దేశములతోను ఒప్పందములను బలోపేతము చేసుకొనుచున్నది. దీనితో … Read entire article »

Filed under: వైకుంఠలోక ఉత్సవములు

సోమరితనము

”వివాహములు స్వర్గములో చేయబడుచున్నవని” అందరూ అంటూ వుంటారు. నాకు ఒక స్నేహితుడు వుండేవాడు. ”నీకోసం యింకను ఒక వధువును వారు వెదుకలేదా?” అని నేను అతనిని అడుగుతూ వుండేవాడిని. ”నా కోసం ఒక వధువును చూశారంటే, ఆమె తప్పక తెల్లగా వుండాలి. గిల్లితే రక్తం రావాలి. ఆమె తప్పకుండ అంత తెల్లగా వుండాలి. ఆమె తప్పకుండా ఒక తెల్ల అమ్మాయిగానే వుండాలి” అని అతను అనేవాడు. కాని అతనికి దొరికిన వధువు చాలా నల్లగ బొగ్గు తునకలాగ వుండినది. అంటే అది సాధారణ నలుపు కాదు. అప్పుడు అతను నాతో ‘నేను ఎంతగ కలలు కన్నాను. కోటలు కట్టాను. కాని ఇప్పుడు నా కోటలన్నియు చెదిరిపోయినవి!’ అని అన్నాడు. ఇంకనూ అతను ”నీవు ఎక్కడైనను యిటువంటి నలుపు చూచియున్నావా? ఇటువంటి నలుపును నీవు ఎక్కడైనను చూచావా?” అని అన్నాడు. ”ఈ నలుపు తాటిచెట్టుపై నీళ్ళు పోసినంత నలుపు! కాని ఆమె గుణము బంగారం.” కొన్నిసార్లు తెల్లగ వున్నవారికి మంచి గుణము వుండదు. నల్లగ వున్నవారు మంచి గుణమును కలిగివుంటారు. రెండు ప్రాణాత్మలు ఒకటిగ ఐక్యపడటము అంత తేలిక కాదు! అనేక సంవత్సరముల తరువాతనే ఆ ప్రేమ అంటే ఏమిటని మీరు తెలుసుకుంటారు. ఒక అమ్మాయిని చూచినవెంటనే … Read entire article »

Filed under: వేదములలోని మర్మములు

ఘనతకు ముందు వినయం – నాశనమునకు ముందు గర్వం

మొదటగ మనుష్యునికి స్వయము అనునది ఒకటి వున్నది. ఇదే ఆ ప్రాణాత్మ. ఆ ప్రాణాత్మకు ఏది ఇష్టము? ‘నేను’ అని చెప్పాలనే అది ఆశిస్తుంది. ఆ ‘నేను’ అనునదే ప్రాణాత్మ. దానికై ప్రాణాత్మ ఏమి చెప్పాలని ఆశిస్తుంది. ‘నేను-నేను-నేను!’ అని చెప్పాలని ఆశిస్తుంది. ఇతరులు ఏ విధముగ చెప్పాలని అది ఆశిస్తుంది? ‘సార్‌! దేవుడు మిమ్ములను ఎక్కువగా ఆశీర్వదించియున్నాడు. సార్‌ మీరు గుర్రపు స్వారీ బాగుగ చేస్తున్నారు.’ వెంటనే అతని ఛాతి పైకి వస్తుంది. ఆ తరువాత ఇంకొకడు వస్తాడు. ‘నీవు గుర్రపు స్వారీ బాగా చేస్తున్నావు. ఆ తరువాత ఒక రోజున గుర్రము అతనిని క్రింద పడేస్తుంది. ఒక వూరేగింపును మేము చూడడానికి వెళ్ళాము. అక్కడ ఆ పోలీసు బ్యాండులో ఒకడు క్రొత్త సూటు వేసుకొని గుర్రము మీద కూర్చొని వుండెను. ‘డే! డే!’ అని అతను కేకలు వేయుచున్నాడు. ఉన్నట్టుండి గుర్రము అతనిని క్రింద పడేసింది. ‘దబ్‌’ అని అతను క్రింద పడిపోయాడు. ఎక్కువగా దెబ్బలు తగిలినవి. అతను లేచి బట్టలు సర్దుకున్నాడు. ఆ తరువాత ‘జాగ్రత్త! నిన్ను ఒక రోజున జాటీతో బాగుగా కొట్తాను. ఒక రోజు తిండి పెట్టకుండ మాడ్చేస్తాను’ అని గుర్రము మీద కేకలు వేసినాడు. ఆ … Read entire article »

Filed under: వేదములలోని మర్మములు

పరిశుద్ద బైబిలు గ్రంధము

హెబ్రీయులకు వ్రాసిన గ్రంధము 4:12  అనుసరించి., ”దేవుని వాక్యమనే ఆయన” సజీవముగలవాడై బలము గలవాడై రెండంచులుగల యెటువంటి ఖడ్గము కంటెను వాడిగా వుండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను  ఆలోచనలను శోధించుచున్నాడు.” బైబిలు అంటే ప్రభువైన దేవుడు ఒక వ్యక్తిగా నేరుగా ప్రవక్తలకు ఆజ్ఞాపించి, వారి ద్వారా వ్రాయబడిన వాక్యముగా వున్నది. ‘ఏడు ఉరుముల సందేశములు’ అనేవి ప్రకటన 10వ అధ్యాయములో చెప్పిన బలమైన దూతగా ప్రభువైన దేవుడు చివరి దినములలో శ్రమలకాలమునకు ముందుగా ఒకగుంపు ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడిన వాక్యమగును. యెహెజ్కేలు 12:21-28. ”21వ వా. మరియు ప్రభువు వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. 22వ వా. -నరపుత్రుడా దినములు జరిగిపోవుచున్నవి, ప్రతి దర్శనము నిరర్థకమగుచున్నది అని ఇశ్రాయేలీయుల దేశములో మీరు చెప్పుకొను సామెత యేమిటి? 23వ వా. కావున నీవు వారికి ఈమాట తెలియజేయుము – ప్రభువైన దేవుడు సెలవిచ్చునదేమనగా – ఇకమీదట ఇశ్రాయేలీయులలో ఎవరును ఈ సామెత పలుకకుండ నేను దానిని నిరర్థకము చేసెదను గనుక నీవు వారితో ఇట్లనుము – దినములు వచ్చుచున్నవి. ప్రతి దర్శనము నెరవేరును. 24వ వా. వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదెగాండ్రమాటలైనను ఇశ్రాయేలీయులలో ఇకను వుండవు. 25వ వా. ప్రభువునైన నేను మాట యిచ్చుచున్నాను, నేనిచ్చు … Read entire article »

Filed under: మనుజ్యోతి ఆశ్రమము