தமிழ்| telugu

» Archive

శ్రీకృష్ణభగవానునికి కష్టాలు ఏమిటి?

శ్రీరాముని కంటే ఎక్కువ సందర్భాలలో కష్టనష్టాలను చవి చూసినవాడు శ్రీకృష్ణుడు. కృతయుగములో శ్రీరామునిగా మనకు ఎన్నో ఆదర్శాలను బోధించినవాడు శ్రీమహావిష్ణువే! మళ్ళీ ద్వాపరయుగములో శ్రీకృష్ణునిగా జన్మించి ఎన్నో బాధలనూ, కష్టాలను అనుభవిస్తూ, మనకెన్నో ధర్మ సందేశాలను అందించాడు. శ్రీకృష్ణునిది విలాస జీవితం అని అనుకొంటారు ఎంతోమంది. నిజానికి శ్రీరాముని కంటే హెచ్చు సందర్భాల్లో కష్టనష్టాలను చవి చూసినవాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా, ఏనాడూ ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు, మనకు కష్టాలుగా కనిపించవు. శ్రీరాముని జీవితమే మనకు కష్టాలమయంగా కనిపిస్తుంటుంది. ఈ విషయంపై ఒకసారి దృష్టి సారిద్దాం. శ్రీరాముని శైశవం, బాల్యం బహుసుఖంగానే గడిచాయి. సీతను వివాహమాడిన అనంతరం కొన్నేళ్ళు సుఖంగా జీవించాడు. ఆ తర్వాత 14 సంవత్సరాల అరణ్యవాసం, ఉత్తరకాండలో సీతావియోగం. ఇవీ శ్రీరామునికి వచ్చిన ముఖ్యమైన కష్టాలు. కొంత కాలం కష్టాలు అనుభవించినా, ఆయన సుఖపడిన సంవత్సరాలు చాలా వున్నాయి. ఇక శ్రీకృష్ణుని సంగతి చూద్దాం. పైకి సుఖంగా, హాయిగా వున్నట్లు కనిపించినా, పుట్టింది మొదలు దేహత్యాగం చేసేవరకూ కూడా ఎన్నో కష్టాలు, సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై, స్థిరజీవనం లేకుండా కాలం గడిపాడు శ్రీకృష్ణుడు. ఆ వివారాలను క్లుప్తంగా తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు … Read entire article »

Filed under: హిందూ పురాణములు

తల్లికి కపిలుడి తత్త్వ బోధ

ఆడపిల్లలు అత్తవారిళ్ళకి వెళ్ళిపోయారు. భర్త సన్యసించి మోక్షగామియై తపోవనాలకి వెళ్ళిపోయాడు. ఇక నా గతి ఏమిటి?’ అని చింతించిన దేవహూతి ఒకనాడు ధ్యాననిష్ఠుడై వున్న కపిల మహర్షిని సమీపించింది. తల్లి రాకలోని ఆంతర్యాన్ని గ్రహించిన కపిలుడు ప్రసన్న మందహాసం చేసి ”అమ్మా… నీ మనస్సులో చెలరేగుతున్న సంక్షోభాన్ని గుర్తించాను. స్వాయంభువ మనువుకి పుత్రికగా జన్మించావు. కర్ధమమహర్షి వంటి ఉత్తముడిని భర్తగా పొంది లోటులేని సంసారజీవనం సాగించావు. పదిమంది సంతానానికి జన్మనిచ్చి మాతృమూర్తిగా గృహిణిగా గృహధర్మాన్ని నిర్వర్తించావు. నీలాంటి ఉత్తమ జన్మ అనునది కోటికి ఒక్కరికి వస్తుంది. ‘లేదూ…’ అన్నది లేకుండా చక్కటి జీవితాన్ని గడిపిన నీకు యీ దిగులు దేనికమ్మా?” అని అడిగాడు. ”నాయనా… నువ్వన్నది నిజమే. నా తండ్రి స్వాయంభువ మనువు అల్లారుముద్దుగా నన్ను పెంచాడు. ఏ లేటూ లేకుండా తండ్రి నీడలో నా బాల్య జీవితం గడిచింది. అటుపై గృహస్థాశ్రమంలో నా భర్త చాటున ఏ కొరతా లేకుండా నా వైవాహిక జీవితం గడిచింది. తొమ్మిది మంది ఆడపిల్లలకి, ఒక సుపుత్రుడికి తల్లినైనందున నా గృహస్థజీవితం కూడా సంతృప్తిగా గడిచింది. నా అంతటి భాగ్యశాలి లేదనుకొని సంతోషిచాను. కానీ, నాయనా… నాకు వివాహం చేసి తన బాధ్యత తీరిందనుకున్నాడు నా తండ్రి. నన్ను … Read entire article »

Filed under: హిందూ పురాణములు

”ఓం నమో భగవతే శ్రీలహరికృష్ణాయ నమః”

ప్రియమైన సహోదర సహోదరీలారా, శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ నామములో అందరికీ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. ముందు సంచికలో తెలిపినట్లుగా అక్టోబర్ నెల 3వ తేదీన ‘ధర్మయుగ స్థాపన దిన ఉత్సవము’ మనుజ్యోతి ఆశ్రమములో సాధారణముగా జరుపుకొనుట జరిగినది. అదేవిధముగా ప్రపంచమంతటను వున్న శ్రీలహరికృష్ణ స్తుతి ధ్యాన కేంద్రములన్నిటిలోను కూడా ఈ పండుగను శ్రీలహరికృష్ణగారి భక్తులు ఎంతో వైభవంగా, ప్రేమ పతాకమును ఎగురవేసి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ప్రస్తుత దేశ పరిస్థితిని చూస్తే, నల్లధనంపై ప్రభుత్వం చేపట్టిన నిర్ణయములను బట్టి, ఎక్కడ చూచినా బ్యాంకులు, ఎటిఎంల వద్ద ప్రజలు డబ్బులు మార్చుకొనుట కొరకు, అలాడే డబ్బులు తీసుకొనుట కొరకు నిద్రాహారాలు మాని, ఎండ అనక, వాన అనక పడిగాపులు కాస్తున్నారు. కారణం ఈ రోజు డబ్బు లేకపోతే మనిషి జీవించడం చాలా కష్టం. ప్రతీ వస్తువు, ప్రతీ విషయం కూడా డబ్బుతోనే ముడిపడి వుంది. కాని డబ్బుతో సంపాదించలేని, డబ్బే అవసరంలేని కొన్ని కార్యాలు కూడా వున్నాయి అని మనిషి గుర్తించవలసి యున్నది. ఈ రోజు మానవుడు డబ్బు లేకపోతే యిక ఏమీ లేదు అని అనుకొంటున్నాడు. కాని డబ్బు కంటే విలువైనది ఒక ప్రాణి యొక్క జీవం. ఆ జీవం ఎక్కడ నుండి వస్తుంది అని ఆలోచిస్తే, అది … Read entire article »

Filed under: సంపాదకీయం

భగవంతుని ఏవిధముగా ముట్టుకొనగలరు?

మీరు దేవుని ఆత్మను కలిగివుంటేనే తప్ప దేవుని ఎప్పటికీ అర్ధం చేసుకొనలేరు. ఈ రోజున క్రైస్తవులు క్రమముగ చర్చీకి వెళ్తూ వుంటారు. అది మిమ్ములను దైవీక మనుష్యునిగ చేయజాలదు. ఒక కారు షెడ్డులోనికి మీరు ప్రతీ రోజూ వెళ్ళడము ద్వారా అది మిమ్ములను ఒక అంబాసిడర్‌ కారుగ చేయజాలదు. కాని గుడికి వెళ్ళడము ద్వారా వారు దైవ జనులుగ మారగలమని జనులు అనుకుంటూ వుంటారు. నాకు ఒక కధ తెలుసు. బహుశా మీకు ఆ కధ తెలిసి వుండవచ్చును. ఒక రాజు వుండేవాడట. తన కోసం ఒక ప్రత్యేకమైన శ్రేష్టమైన షర్టును చేయించుకోవాలని ఆశించాడట. అందుకే ప్రతిసారి ‘ఈ షర్టు మంచి షర్టు కాదు’ అని అనేవాడట. ఒక రోజున ముగ్గురు మనుష్యులు రాజు దగ్గరికి వచ్చారట. ”మేము మీ కొరకు ఒక మంచి వస్త్రమును నేస్తాము. ఆ విధముగ వేరే ఏ మనుష్యుడు నేయలేడు” అని చెప్పారట. ”మీరు దానిని చేయగలరా?’ అని రాజు అడిగి ‘సరే’ అన్నాడట. కాని మీరు దాని కోసం కొంత డబ్బును, కొంత సమయమును ఇవ్వాలి’ అని అడిగారట. దానికి రాజు ‘సరే’ అని అన్నాడట. వారికి ఒక గది ఇవ్వబడినది. ఉదయమే వారు గదిలోనికి వచ్చేవారు. వారు … Read entire article »

Filed under: శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు

గొప్ప వెలుగు

అందరికీ యీ వెలుగును ప్రసాదించే ఆ గొప్ప వెలుగుకే సమస్త మహిమ కలుగును గాక! ఆ గొప్ప వెలుగు పూర్తిగ దయతో నిండియున్నదని మీకు తెలుసా? ఒక మూలలో గొప్ప నిధి దాచియుంచబడియున్నదని నేను చెప్పిన యెడల ఒక మరణించిన వ్యక్తి కూడా తన నోరు తెరుస్తాడు. డబ్బు వుందంటే ఒక శవము కూడా నోరు తెరుస్తుంది. నిజానికి ఈ లోకములో వున్నవన్నియు పరలోకములో వున్నవాటికి నీడగ వున్నవి. ఇది నిజ స్వరూపము కాదు. ఊహ మాత్రమే అనుటను నేను ఏ మాత్రం నమ్మలేకపోవుచున్నాను. పరలోకము నిజమైనది. ఇది దాని ఛాయా రూపము. మనమందరము ఆ నిజవస్తువునే వెదుకుచున్నాము. భారతదేశములోని వేర్వేరు ప్రాంతముల నుండి మీరు వచ్చియున్నారు. నా జీవితమును ఆశీర్వదించిన ఆ గొప్ప వెలుగు నామమున మీకందరికి నా శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. దానిని మీరు ఏ పేరుతోనైనను పిలువవచ్చును. దానిని మీరు ‘పంచదార’ అని పిలువవచ్చును. లేక ‘కాకరకాయ’ అని పిలువవచ్చును. కాని నాకైతే సమస్తము ఆ గొప్ప వెలుగులోనే యిమిడియున్నది. ఒకప్పుడు యితర మతములను చాలా భయంకరముగా ద్వేషించేవాడిని. దానికి కారణము అప్పుడు దేవుని గురించిన జ్ఞానము నాలో చాలా తక్కువగా వుండినది. ఒకప్పుడు నేను, నా తండ్రి ఆ విషయమై చాలా … Read entire article »

Filed under: శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు

శంబల రహస్యము

వేదములను అనుసరించి యీ కలియుగ అంతమున ధర్మమును స్థాపించుటకై దశావతారముగ ఆ భగవంతుడు శ్రీ కల్కిమహావతార పురుషునిగ తన స్వంత రూపముతో తన స్వంత నామములో శంబల గ్రామమున అవతరించవలసియున్నది. ఈ శంబల గ్రామమును గురించిన వ్రచనములను అన్ని మత గ్రంధములలోను మనము కనుగొనవచ్చును. వేదవ్యాసుడు భాగవతము 11వ స్కంధములో 5వ అధ్యాయము 39వ శ్లోకములో ”తామ్రపర్ణి, క్రితమాలా(చేయారు), పయస్విని (పాలార్), కావేరి నదులు ప్రవహించు ద్రావిడ దేశమున ఆయన అవతరించును”అని చెప్పియున్నాడు. భాగవతము, భవిష్యపురాణము, కల్కిపురాణములోను యీ శంబల గ్రామము వర్ణించబడినది. బుద్ధుడు, వీరబ్రహ్మం, ముత్తుకుట్టిస్వామి, గురునానక్, పాశ్చాత్య ప్రవక్తలు అయిన నాస్టర్ డామ్స్, జోసఫ్ స్మిత్ మున్నగువారు ‘సీయోను’ అని ‘హిడెన్ సిటీ’ అని శంబలను వర్ణించియున్నారు. పరిశుద్ధ బైబిలు గ్రంధములోను సీయోనుగ యీ పరిశుద్ధ స్థలము వర్ణించబడియున్నది. ప్రకృతి నడుమ శంబల ప్రాంతము అందరికీ కనిపించదు. అది కనిపించాలన్నా, అక్కడికి చేరుకోవాలన్నా మానసికంగా, శారీరకంగా ఎంతో కష్టపడాలి. ఎందుకంటే అది అతి పవిత్రమైన ప్రదేశము. ఎవరుపడితే వారు అందులో ప్రవేశించలేరు. అక్కడ దేవతలు, పరిశుద్దులు సంచరిస్తూ వుంటారు. సాక్షాత్తు శివుడు కొలువుండే స్థలము. ఈ పుణ్యభూమి అంతయు అద్భుతమైన సువాసన అలుముకొని వుంటుంది. ఈ శంబలను దర్శించటము ఒక మధురానుభూతి. ఇక్కడ … Read entire article »

Filed under: వేదములలోని మర్మములు