தமிழ்| telugu

» Archive

విష్ణుభక్త అంబరీషుడు

సూర్యవంశములో సుప్రసిద్ధుడు అంబరీషుడు. అతను హరి పూజ ధురంధరుడు. సద్గుణ సంపన్నుడు. నిరాడంబరుడు. పరిపాలనా దక్షుండు. పూర్వ జన్మ సుకృతం వల్ల అతనికి బాల్యం నుంచి హరి భక్తి ఏర్పడినది. మనోవాక్కాయ కర్మలతో మహా విష్ణువునే ఆరాధించడం అతనికి నిత్యకృత్యం అయినది. విష్ణు భక్తుల్ని ఆదరిస్తూ విష్ణు కీర్తనలను ఆలపిస్తూ విష్ణు మందిరాన్ని పరిశుభ్రం చేస్తూ అతడు కాలం గడిపేవాడు. ఫలాపేక్ష లేకుండా సరస్వతి నదీ తీరంలో అనేక యజ్ఞాలు కావించి రాజర్షి అనే పేరు పొందాడు అంబరీషుడు. కొంతకాలనికి అంబరీషుడు సంసార బంధాలకు అతీతుడై సత్యమార్గంలో ధర్మ నిష్టతో ప్రవర్తింపసాగాడు. విష్ణువు అతని భక్తికి మెచ్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయగల సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు. అంబరీషుడు విష్ణుదేవుని కరుణా కటాక్షములకు పొంగి పులకించాడు. ఒకసారి అంబరీషుడు తన తోడు నీడ వంటి అర్థాంగి లక్ష్మితో కలిసి ద్వాదశ వ్రతాన్ని ఆచరించాడు. వ్రత సమాప్తి చేయడానికి కార్తీక మాసంలో మూడు రాత్రులు ఉపవాసం వుండి విష్ణువుకు షోడశోపాచారములతో అర్చించాడు. బ్రాహ్మణులకు గోవులను దానం యిచ్చాడు. యధావిదిగా వేదవేత్తలను ఆరాధించి ద్వాదశీపారాయణ చేయటానికి సిద్ధమైనాడు. సరిగ్గా అదే సమయంలో భాసుర తపో విలాసుడు, నిరంతర యోగాభ్యాసుడు అయిన దుర్వాస మహర్షి అక్కడకు వచ్చాడు. అనుకోకుండా … Read entire article »

Filed under: హిందూ పురాణములు

భగవద్గీతాసారము

1. నీ మనస్సును పరమపురుషునియందే లగ్నముగావించి అహంకారమును విడనాడి నీ కర్తవ్యమును నిర్వహించుము. 2. మొదట నీ పంచేంద్రియములను అదుపులో వుంచుకొని పాపముతో కూడిన కోరికలను అక్షయయోగము యొక్క సహనముతో నాశనము చేయుము. 3. పరమాత్మ నీ జ్ఞానమునకు అతీతుడని తెలుసుకొని, పరమపురుషుని యొక్క జీవాత్మచే నీ మనస్సును అదుపులో వుంచుకొని, కోరిక అను శత్రువును చంపుము. 4. అక్షయమైన యోగము యొక్క సువార్త గురించిన జ్ఞానమను ఖడ్గముతో పరమపురుషుని గూర్చిన సందేహములను ఖండించుము. మరియు అక్షయమైన యోగము నందు స్థిరముగా వుండుము! లేచి నిలబడుము. 5. సర్వోన్నత బలికి కారకుడును, ముగించువాడునైన నన్నెల్లప్పుడు జ్ఞాపకము చేసుకొనుము. మరియు నీ కర్తవ్యమును నిర్వహించుము. నీ మనస్సును, వివేకమును నాయందే స్థిరముగా వుంచినచో, నా వద్దకే వచ్చెదవు. 6. ఎల్లప్పుడు సర్వోన్నత బలి యొక్క సువార్తయందే స్థిరముగా వుండుము. 7. నీ మనస్సును నాయందే స్థిరముగా వుంచుము. నాకు భక్తుడుగ వుండుము. నీ జీవితమును నా కొరకు అర్పించుము. నీవు నన్ను చేరుకొందువు. నీవు సజీవయాగముగా వుండవలెను. … Read entire article »

Filed under: హిందూ పురాణములు

”ఓం నమో భగవతే శ్రీలహరికృష్ణాయ నమః”

ప్రియమైన సహోదర సహోదరీలారా, శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ నామములో మా శుభాకాంక్షలు. గత శీర్షికలో మీకు తెలియజేసిన విధముగా శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి మహిమ సన్నిధిలో మహిమ ఉత్సవములు మనుజ్యోతి ఆశ్రమములో బ్రహ్మాండముగా జరిగినవి. ఆంధ్ర, తమిళ్‌నాడు, భారతదేశములోని పలు ప్రాంతముల నుండియు మరియు జర్మనీ, మలేషియా దేశముల నుండి అనేకమంది శ్రీలహరికృష్ణగారి భక్తులు వచ్చి ఈ కూటములలో కలుసుకొని వెళ్ళారు. అది వారికి చాలా ఆశీర్వాదకరముగా వుండినది. ఈ కూటముల తరువాత అస్సాం, సిక్కిం రాష్ట్రములను మరియు మలేషియా దేశమును సందర్శించి, ఈ కూటములలో కలుసుకోలేని శ్రీలహరికృష్ణగారి భక్తులను కలుసుకొని వచ్చితిమి. అది మాకు చాలా ఆశీర్వాదముగా వుండినది. అదేవిధముగా మీకు ముందుగానే తెలియజేసిన విధముగా మే నెలలో విధ్యార్ధులకు నిర్వహించిన వేసవి శిక్షణా తరగతులు (సమ్మర్‌ క్యాంపు) మనుజ్యోతి ఆశ్రమము నందును మరియు విశాఖ జిల్లాలో వున్న ఏజెన్సీ ప్రాంతమైన అసరాడలోనూ శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి కృప వలన చాలా బాగుగా జరిగినవి. దానిలో అనేకమంది విధ్యార్ధినీ విధ్యార్ధులు కలుసుకొన్నారు. వారికి వేదముల నుండి అనేక వేదప్రవచనములను నేర్పించడమే కాకుండా శరీర వ్యాయామములు కూడా నేర్పించారు. ముఖ్యముగా సమిష్టి జీవితము, ఆధ్యాత్మిక ఆలోచన, భగవంతుని ఏవిధముగా పూజించుట మొదలగు కార్యములన్నీ వారికి నేర్పించబడినవి. మరియు ఈ కలియుగములో కలి … Read entire article »

Filed under: సంపాదకీయం

శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి ఉపమానములు

దొరకకుండాపోయిన బంగారు నిధి బంగారు బొక్కిషమును వెతుక్కుంటూ ఒక వ్యక్తి వెళ్ళెను. తన కుక్కను కూడా తనతోపాటు తీసుకువెళ్ళెను. ఒక స్థలములో అతనికి బంగారము దొరికెను. అతను చాలా సంతోషముతో తిరిగి వచ్చుచున్నాడు. అతడు ఒక సత్రములో విశ్రాంతి తీసుకొనవలసి వచ్చెను. ఆ సమయములో కుక్క అతనిని కాపలా కాయుచుండెను. అతను తన బంగారపు మూటను తలక్రింద పెట్టుకొని నిద్రపోతూ వుండెను. అప్పుడు రాత్రిలో ఒక దొంగ వచ్చెను. అప్పుడు కుక్క మొరిగినది. వెంటనే దొంగ వెళ్ళిపోయాడు. అతని నిద్రను కుక్క పాడుచేసినదని అతనికి చాలా కోపము వచ్చినది. మరలా ఆ దొంగ చాలా దగ్గరకు వచ్చెను. ముందువలే కుక్క అదేవిధముగా మొరిగినది. అతను కుక్కను చూసి, నోరు ముయ్యి. నాకు కోపము రప్పించకు అని చెప్పెను. దొంగ వెళ్ళిపోయాడు. దాని తరువాత ఒక అరగంట సమయము అయిన తరువాత దొంగ తిరిగి వచ్చెను. కుక్క అతనిని చూసి మరలా మొరిగినది. యజమాని కుక్కను నీవు మరలా మొరిగితే నిన్ను కాల్చేస్తాను అని చెప్పాడు. కుక్క మొరిగినది. అతను తుపాకీని తీసుకొని కుక్కను చంపివేసాడు. బంగారమును తన యింటికి తీసుకెళ్ళవచ్చును అనే నమ్మకము ఆ యజమానికి వుండెను. ఆ కుక్క చనిపోయినది. అతనికి యివ్వబడిన హెచ్చరికను … Read entire article »

Filed under: శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు

మన నోరు బాగా తెరిచి భగవంతుని స్తుతించాలి

ఆదిపత్యము, అధికారము, ఏ జీవరాశి అయినను, సృష్టింపబడిన మరియేదైనను మన ప్రభువైన క్రీస్తుయేసునందలి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవు. ఆ ప్రేమ ఎప్పుడు వచ్చింది? ఆ ప్రభువే క్రీస్తుయేసు అని మనము తెలుసుకొనినప్పుడు ఆ ప్రేమ పరిపూర్ణమగుచున్నది. ఇక మనలను ఏదియు వేరుచేయలేదు. ఎందుకు మన నోరులు బాగా తెరచి దేవుని స్తోత్రించాలి? ఆయన మన కొరకు సమస్తమును చేసియున్నాడు. నేను నా సమయమును వృధా చేయకుండా నా సమయమును బైబిలు చదువుటలో గడిపినయెడల నేను ఒక మంచివ్యక్తిగా వుండగలను. ఇప్పుడు కొంతమంది జీవితముల కొరకు నా సమయమును నేను వృధా చేసినందుకు ఈ రోజున నేను బాధపడుచున్నాను. క్రీస్తుయేసు మీ కొరకు ఏమి చెల్లించాడని మీకు తెలుసా? ఆయన న్యాయం తీర్చు అధికారమును, సృష్టించే శక్తిని యిచ్చియున్నాడు. సృష్టింపబడిన జగత్తు అంతయు మీ చేతులలోకి వచ్చును. ప్రతీ దినము మిమ్ములను నోరు బాగుగా తెరచి దేవుని స్తుతించండి, చప్పట్లు కొట్టండి అని చెప్పవలసి వస్తుంది. కాని వధువుకైతే ఒక మాట సరిపోతుంది. దేవుడు మనకు పూర్తిగా శిక్షణ యిచ్చియున్నాడు. ఇప్పుడు మనము లేచి ప్రకాశించవలసియున్నది. జయించు శక్తిని మనము పొందుకొనియున్నాము. ఇప్పుడు జయించు శక్తిని పొందుకొనినప్పుడు దానిని మీరు పరీక్షించారా? దాని అనుభవమును పొందుకొనినారా? … Read entire article »

Filed under: శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు

మీరు భగవంతుని తప్పక తెలుసుకోవాలి

భగవంతుని ఎవరూ చూచియుండలేదు. భగవంతుడు ఆత్మగా వున్నాడు. ఈ విశ్వమంతా ఆయన నిండియున్నాడు. ఈ లోకములోనున్న సమస్తములోను ప్రవేశించగలడు. అందుకే భగవంతుడు యిక్కడ వున్నాడు, అక్కడ లేడని చెప్పలేము. భగవంతుడు మనుష్యవర్గమునకు తన స్వభావమును బయలుపరచాలని ఆశించుచున్నాడు. దానికొరకు మాత్రమే భగవంతుడు ప్రారంభములో ఆదిలో గొప్ప పురుషుని సర్వోన్నతుడ్ని సృష్టించెను. ఎవరూ విద్యుచ్ఛక్తిని చూడలేరు. ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ లేకుండా విద్యుచ్ఛక్తిని పొందుకోలేరు. ట్రాన్స్‌ఫార్మర్‌ అధిక విద్యుచ్ఛక్తిని పొందుకొని అవసరమైనదాన్ని పంపిస్తుంది. దానితో మీకు ఫేన్‌, ట్యూబ్‌లైట్‌, రిఫ్రిజిరేటర్‌, ఎ.సి. మొదలగు అనేకవిధాలైన సౌకర్యాలు అనుభవిస్తున్నాము. కరెంటు గురించి తెలిసిన వ్యక్తి ఫేన్‌, ట్యూబ్‌లైట్‌, రిఫ్రిజిరేటర్‌ను ఆరాధించడు. కరెంటు గురించి తెలియనివాళ్ళే ఆరాధిస్తారు. విద్యుచ్ఛక్తి వీటినన్నిటినీ పని చేయునట్లు చేయుచున్నది. అందుకే భగవంతుని గురించి స్పష్టమైన అవగాహన కలిగియుండాలి. భగవంతుని మీరు తప్పక సత్యముతోను, ఆత్మతోను ఆరాధించాలి. సత్యము అంటే ఏమిటి? పరమపురుషుని నోటి నుండి ఏది వచ్చునో అదే సత్యము. ఈ పరమపురుషుడు ఎవరు? ఆయన ఒక ట్రాన్స్‌ఫార్మర్‌గా వున్నాడు. ఆత్మ స్వరూపియైన భగవంతుని శక్తినంతటినీ కలిగియుండునట్లు ఆయన మాత్రమే చేయబడియున్నాడు. కనబడని భగవంతుని మనము చూడలేము. కానీ పరమపురుషుని చూడగలము. ఆయననే హిందువులు శ్రీమన్నారాయణుడు అనియు, క్రైస్తవులు క్రీస్తుయేసు అనియు, ముస్లీములు అల్లా అనియు … Read entire article »

Filed under: వేదములలోని మర్మములు