தமிழ்| telugu

» ఆత్మీయ బోధనలు

అవతారములు సాధారణ మానవులా?

అవతారము అనగా నిత్యజ్యోతి స్వరూపుడు ఈ ప్రకృతిలో ఒక రూపము దాల్చి రావడము అని అర్థము. మరియు ఈ సృష్టిలో నుండి ఏ చరాచర వస్తువులోనైనను ఆయన క్రియ చేయగలడు. మానవుల సంరక్షణ కొరకు ఏ రూపమునైననూ తీసుకొని రాగలడు. దీనినే హిందువులు అవతారములని పిలుచుచున్నారు. శ్రీమద్భాగవతములో వేదవ్యాసుడు 24 అవతారముల గురించి, వారు చేసిన దివ్యమహిమలను వివరించుచున్నాడు. ఆ విధముగా పరమాత్మ యొక్క దివ్య జ్ఞానమును పొందిన ఎందరో ఋషులు, ప్రవక్తలు మనుష్యులచే పూజింపబడుచున్నారు. కారణం ఆ పరమాత్మ యొక్క దివ్యశక్తి వారిలో క్రియ చేయుట వలననే! పరమాత్మ తీసుకొనిన ప్రతీ రూపము లేదా అవతారము చేసిన మహిమలను సాధారణ మనుష్యులెవ్వరూ చేయలేరు. పరమపురుషునిగాను, ఆది పురుషునిగాను ఏకైక దేవునిగాను పిలువబడు వానిని, ఎవరూ చంపలేరు. ప్రతీయుగములోను పరమాత్మ తీసుకొనిన ఆ రూపమును ఆయన అనుగ్రహం లేకుండా ఎవరూ ఆయనే దైవమని గ్రహించలేరు. భవిష్యపురాణం అనుసరించి దక్షిణామూర్తియై వచ్చియున్నాడు. ఇతర యుగములలో ఆయన అవతరించిన రూపములు ఆయా యుగములలో బాధింపబడినవారిని విడిపించుటకు వచ్చినారు. కావున వారిని సాధారణ మానవులుగా మనము తలంచరాదు. మానవులు వారి ద్వారా ఆ యుగమునకైన ధర్మాచరణను నేర్చుకొని వారి సహాయముతో ఆ యుగ సమాప్తియైన ప్రళయకాలము నుండి తప్పించుకొని … Read entire article »

Filed under: ఆత్మీయ బోధనలు

మానవాళికి హెచ్చరికలు

ఇవన్నియు మానవాళికి హెచ్చరికలు. దేవుని రోజు చాలా సమీపములో వున్నది అనుటకు సూచన. దేవుడు మానవునిగ వచ్చి పలికిన ప్రతి మాట తప్పక నెరవేరును. ”ఆకాశము భూమి గతించినను నా మాటలు గతించవు.” అంటే తప్పక నెరవేరును అని దేవుడు పలికియున్నాడు. లోకములోనే అతి ఉన్నత శిఖరమైన ఎవరెస్టు శిఖరము నందు బీటలు ఏర్పడి అది భూమి క్రిందికి కొంచెము దిగిపోయినది అని సైంటిస్టులు కనుగొనియున్నారు. నరనారాయణుడు శ్రీలహరికృష్ణ పలికిన ప్రతి ప్రవచనము తప్పక నెరవేరును అని యింతవరకు జరిగిన సంఘటనలు ధృవపరచుచున్నవి. ”లోకములో ఒక్కొక్క దినమున అనేక మార్పులు మనకు తెలియకుండానే జరుగుచున్నవి. 2000 సంవత్సర ప్రారంభముననే ఏదో ఒక గొప్ప కార్యము సంభవించునని అందరూ ఎదురుచూసారు. లోకములో జరుగబోయే మార్పుల గురించి ఈ దినమున అతి తెలివైన జ్ఞానులు సహితము కనిపెట్టలేక పోవుచున్నారు. ఇది యీ విధముగ జరుగబోవుచున్నది అని తీర్మానించి గట్టిగ చెప్పలేకపోవుచున్నారు. ప్రకృతి మానవునికి కావల్సినవన్నీ ఏర్పాటు చేసింది. అయితే ప్రకృతికి అనుకూలంగా మనం మారాలి. అంతేకాని ప్రకృతిని మానవుడు ఎన్నడూ తన అధీనములోనికి తెచ్చుకొనలేడు. అది ఆ భగవంతుని అధీనములోనే వుంది. భూకంపం వచ్చాక, సునామి వచ్చాక, అగ్ని పర్వతం బ్రద్దలయ్యాక, తుఫాను వచ్చాక, కుంభ వృష్టి కురిశాక నేటి … Read entire article »

Filed under: ఆత్మీయ బోధనలు

నక్షత్ర ప్రభావము

ఈ ఆరుకోణముల నక్షత్రములను ఏదో ఒక సమయాన ఏదో ఒక చోట ప్రతి ఒక్కరు తప్పక చూచివుంటారు. దీని ముఖ్యత్వమును తెలియకనే ఒక నక్షత్రమని అనుకొనివుంటారు. భారతదేశములో వేద కాలము నుండి యీనాటి వరకు యీ నక్షత్రము వాడుకలో వుంటున్నది. దేవాలయములలో, వినాయకుడు మున్నగు ప్రతిమలయందు, ఆనాటి ఋషుల కుటీరములలో, పర్ణశాలలో, ప్రాచీన త్రవ్వకాలలో స్తంభముల మీదను, గోడలమీదను యీ గుర్తు వుంటూనే వున్నది. యూదులు సహితము యీ నక్షత్రమును దావీదు నక్షత్రమని తమ జాతీయ పతాకములో చిహ్నముగ ముద్రించుకొనియున్నారు. ఈ నక్షత్రము యొక్క ముఖ్యత్వము ఏమిటి? ఇది దివికి, భువికి రారాజైన పరమ పురుషుడైన ఆదినారాయణుని రాజముద్ర. రెండు ముక్కోణములు కలవడము వలన యీ నక్షత్రము ఏర్పడుచున్నది. మొదటి ముక్కోణములోని వెడల్పు భాగముపైనను, దాని మొనవైపు క్రిందికి వున్న యీ ముక్కోణము నాశనము చేయునట్టి ముక్కోణము. రెండవ ముక్కోణము మొన పైకి వున్నది. వెడల్పు భాగము క్రిందికి వున్నది. ఇది నిర్మించే శక్తిగల ముక్కోణమని పిలువబడుచున్నది. ఈ రెండు ముక్కోణములు కలిసి అన్ని రహస్య శక్తులను తనలో యిముడ్చుకొని యున్న నక్షత్రమును రూపించుచున్నది. మొదటి ముక్కోణము ప్రళయకాల, అనంతమైన, అతి భయంకరమైన భగవంతుని రౌద్రమునకు సూచనగా వున్నది. ఇది సమస్తమును దహించివేయు శక్తిగ … Read entire article »

Filed under: ఆత్మీయ బోధనలు

గీతా నిత్యజీవము

సాధారణంగా ఎవరినైనా భోగం, త్యాగం, యోగం ఈ మూడింటిలో ఏమి కావాలో కోరుకొమ్మని అడిగితే… భోగమే కావాలని అంటారు. ఇందుకు కారణం చాలా స్పష్టం. భోగం అంటే సుఖం. త్యాగం అంటే అన్నింటకీ సర్వసమాన భావం. అయితే ఈ మూడింటిలో త్యాగం, యోగం అనేవి కష్టసాధ్యాలు. భోగం సులభమైంది. మనిషికి ఇష్టమైంది కూడా! ఎందువలనంటే మనిషి సహజంగా స్వార్థపరులైనందువలన తనకు సుఖాన్ని కలిగించే మార్గాలునే ఎంచుకుంటాడు. కష్టతరమైన త్యాగాలవైపు వెళ్ళడు. కనుక మనిషి సర్గికంగా భోగ పారాయణుడే కానీ యోగ పారాయణుడు కాదు. భోగం, యోగం, త్యాగం అనే ఈ మూడింటిలో ఏది గొప్పదని భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుడ్ని ప్రశ్నించినప్పుడు భగవంతుడు ఏమన్నాడో తెలుసా? ”ఓ అర్జునా, లోకములో అందరికంటే కర్మయోగి శ్రేష్టుడు. కర్మయోగమే అన్నిటికీ సమాధానం. అదే శ్రేయస్కరం. కాబట్టి నీవు కర్మయోగివి కావాలి. గాని భోగివి కాకూడదు” అన్నాడు. భగవంతుడే స్వయంగా ఉపదేశించిన మాటలను ఎవరు కాదనగలరు. ఈ కలియుగములో శ్రీమన్నారాయణుడు నరుని రూపం శ్రీలహరికృష్ణగా అవతరించి తను స్వయం సంపూర్ణుడై ఉన్నప్పటికీ తను స్థాపించిన ఆనందాశ్రమంలోనే కర్మయోగిగా జీవించడం, తనకు తారసపడిన భోగాల్ని విసర్జించడం ఒక అద్భుత క్రియగా వర్ణించవచ్చు. అయితే శ్రీకృష్ణుని మాటలు విన్న అర్జునునికి చాలా సందేహాలు కలిగాయి. కర్మయోగం సులభతరమైంది … Read entire article »

Filed under: ఆత్మీయ బోధనలు

గ్రుడ్డివానికి గ్రుడ్డివాడు త్రోవచూపితే!

మత్తయి 15:14. ”గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా!” గ్రుడ్డితనముగా చూడలేకపోవుట. దానికి మూడు కారణములు వుండవచ్చును. మొదటిది, ఒక వ్యక్తి కళ్ళకు దృష్టిలేక గ్రుడ్డివాడుగ వుండుట. రెండవది, చూచుటకు సరైన వెలుతురు లేక, చూడవలసిన వస్తువు మీద వెలుతురు లేక కనిపించకపోవుట. అనగా వారి కనుదృష్టి బాగానే వున్నది. వెలుతురు లేక వారు చూడలేకపోవుట. మూడవది వారి కనుదృష్టి బాగానే వుండినను, వెలుతురు బాగా వుండినను, వారు తమ గర్వము వలన ఆ వెలుగును చూచుటకు నిరాకరించుట. అప్పుడు యేసు ”చూడనివారు చూడవలెను. చూచువాడు గ్రుడ్డివాడు కావలెను అను తీర్పు నిమిత్తము నేనీ లోకమునకు వచ్చితి”నని చెప్పెను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని – మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. అందుకే యేసు – మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని, చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పెను. (యోహాను 9:39-41). ఒక వేళ, నాయకులు గ్రుడ్డివారైనచో, వారి అనుచరులు చూపు గలిగినవారైతే వారి నాయకులను సరిదిద్దుదురు లేదా ఆ నాయకులను వదిలి, వెలుతురు ఉన్న ప్రదేశములకు వెళ్ళెదరు. కాని ఇచ్చట బాధాకరమైన సంగతేమనగా అనుచరులు కూడ తమ … Read entire article »

Filed under: ఆత్మీయ బోధనలు

మహమ్మదు ప్రవచనములు

మాజార్‌-జాన్‌-ఇ-జనాన్‌ : ఇతను 18వ శతాబ్దమునకు చెందిన మరియొక సూఫి సెయింటు. ఇతను ఢిల్లీలో సమాధి చేయబడెను. ఇతను హిందూ వేదములను బాగుగా చదివిన పండితుడు. వేదములన్నియు అల్లాహ్‌చే బయలుపరచబడిన వేద వాక్యములని, యీ విధముగ అల్లాహ్‌ హిందువులను నడిపించెననియు భారతీయులచే ఘనముగ ఆరాధింపబడుచున్న రాముడు, కృష్ణుడు అల్లాహ్‌చే పంపబడిన ప్రవక్తలని భావించెను. ‘ప్రతి జాతికి, ప్రతి దేశమునకు నేను ఒక ప్రవక్తను, ఒక మార్గదర్శిని పంపించియున్నానని’ అల్లాహ్‌ కురాన్‌లో వాగ్థానము చేసియుండటమే దీనికి కారణము. ఆలాగున్నప్పుడు గొప్ప భారతదేశమునకు ‘ఒక ప్రవక్తను పంపించుటకు అల్లాహ్‌ ఏ విధముగ మరిచిపోతాడు?’ ఈ దేశములో అనేక గొప్ప ఋషులు. మునీశ్వరులు జన్మించియున్నారు. వీరందరూ అల్లాహ్‌ యొక్క ప్రవక్తలే! అది మాత్రమే కాకుండా ‘హిందువులు బ్రహ్మ అని పిలుచుచున్నారు. మనము ఆదాము అని పిలుచుచున్నాము’ అని అంటూ కురాన్‌లో చెప్పబడిన ప్రధమ ప్రవక్త ఆదామే బ్రహ్మ అని వర్ణించుచున్నారు. కురాన్‌ ఏ ప్రవక్తను తృణీకరించడము లేదు గాని అందరిని అంగీకరించుచున్నది. కాని వారి పేర్లు ప్రత్యేకముగ కురాన్‌నందు చెప్పబడలేదు. అందుకే మహమ్మదు, జొరాష్టరు పేరును ఖురాన్‌నందు చెప్పకపోయినను ఆయనను ప్రవక్తగ అంగీకరించెను. మహమ్మదు భారతదేశమునకు వచ్చినప్పుడు ఆయన హిందువులను అంగీకరించి వారితో ఒప్పందము చేసుకొనెను. వారు హిందువులని, మహ్మదీయులని … Read entire article »

Filed under: ఆత్మీయ బోధనలు