தமிழ்| telugu

» మనుజ్యోతి ఆశ్రమము

మనుజ్యోతి ఆశ్రమము

శ్రీ లహరికృష్ణగారి సందేశములను లోకమంతటను తెలియజెప్పాలి అనుటయే మనుజ్యోతి ఆశ్రమములో జరుగు ముఖ్యమైన పని. శ్రీలహరికృష్ణగారి ప్రసంగములు వీడియో కేసట్లుగాను, ఆడియో కేసట్లగాను. పుస్తక రూపములలోను, కరపత్రికలుగాను ఆంగ్లములో నుండి యితర భాషలలో, అనగా జర్మనీ, హిందీ, తెలుగు, తమిళము, కన్నడము, మళయాళము భాషలలో తర్జుమా చేయబడి జనులకు అందజేయబడుచున్నది. రికార్డింగు, కంప్యూటర్‌, టైపింగ్‌ పనులన్నియు ఆశ్రమములోనే జరుగుతూ వుంటాయి. ఆశ్రమములో వున్నవారు ఎవరూ సోమరులుగ వుండరు. ప్రతి ఒక్కరు వారికి తెలిసిన, చేతనైన పనులు చేస్తుంటారు. ఈ సమిష్టి జీవితములో, వంటపని, కట్టడములు కట్టేపని, వడ్రంగిపని, కుట్టుపని, కాయగూరలు తరగడం, పాత్రలు కడగటం, ఆశ్రమ పరిసర ప్రాంతములను శుభ్రముగ వుంచుకోవటము, తోటపనులు అన్నిటిని ఆశ్రమవాసులే వంతులు వారిగ చేస్తుంటారు. అందరూ కలిసి ఒకే కుటుంభముగ జీవిస్తూవుంటారు. ఆశ్రమవాసులందరూ శాఖాహారులే! అతి సాధారణమైన భోజనమే వడ్డించబడుతుంది. ఎంత చదువుకున్నను, ఎంతధనికులైనను, ఎంత పెద్ద వుద్యోగస్తులుగ వుండినను, ఎటువంటి తారతమ్యము లేక నిరాడంబరముగా, అతి కొద్ది సౌకర్యములతో ఆశ్రమములో దిగివచ్చిన పరమపురుషుని సేవిస్తూ మహిమలో వెళ్ళటమే తమ ధ్యేయముగా వుంటున్నారు. బైబిలులో చెప్పబడిన సీయోను పర్వతము, వేదములలో చెప్పబడిన మేరు పర్వతము యీ సీయోను అయిన మనుజ్యోతి ఆశ్రమమే! పరిశుద్ధబైబిలు గ్రంధములో యెషయా 4:5లో చెప్పబడిన విధముగ … Read entire article »

Filed under: మనుజ్యోతి ఆశ్రమము

మనుజ్యోతి ఆశ్రమము

భగవంతుడు నివసించే స్థలము పరలోకము లేక వైకుంఠము అని పిలువబడుచున్నది. కనిపించని దేవుడు కనిపించే విధముగ మనుష్యరూపములో వచ్చి ఒక స్థలమును తాను నివసించే స్థలముగా ఏర్పాటు చేసుకొనెను. భూమిపైన దేవుడు నివసించే స్థలమే భూలోక వైకుంఠము. అది ‘మనుజ్యోతి’ అను పేరున వెలసియున్నది. మనుష్యులను దేవుని జ్ఞానముతో నింపి వెలుగు నిచ్చునదే యీ మనుజ్యోతి ఆశ్రమము. లోకములో లక్షలకొలది ఆశ్రమములు వున్నాయి. కొన్ని అనాధ బాలబాలికలను చేరదీసేవి గాను మరికొన్ని సమాజ సేవయే ధ్యేయముగాను వున్నవి. వీటికి నడిపించే సంస్థలు, సహాయముచేసే సంస్థలు, ధనవంతులు వుంటారు. లేకుంటే చందాలు, డొనేషన్సు వసూలు చేసి నడిపిస్తుంటారు. సహాయము చేసేవారిని గొప్పగ ఘనపరుస్తూ వుంటారు. వీటిలో వుదయకాలపు ప్రార్థన తరువాత తమ దినచర్యలలో లీనమైపోతారు. దేవుని గురించి బోధించటము గాని, దేవునికి ప్రియమైన జీవితము గడపడానికి శిక్షణ గాని, దేవునిపై ఆధారపడి జీవించే విధానముగాని యీ ఆశ్రమములు బోధించడము లేదు. కాని యీ మనుజ్యోతి ఆశ్రమము ఇతర ఆశ్రమముల నుండి అన్ని విధాల వేరుపడియున్నది. ఇది పూర్తిగ దేవునిపై ఆధారపడియున్నది. ఈ ఆశ్రమము యొక్క ప్రతి అవసరమును దేవుడే తీర్చాలి. దేవుని నడిపింపును అనుసరించే యిది నిర్వహించబడుచున్నది. ఈ ఆశ్రమములో దేవుడే సమస్తములో సమస్తమైయున్నాడు. ఈ … Read entire article »

Filed under: మనుజ్యోతి ఆశ్రమము