தமிழ்| telugu

» శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు

శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి ఉపమానములు

దొరకకుండాపోయిన బంగారు నిధి బంగారు బొక్కిషమును వెతుక్కుంటూ ఒక వ్యక్తి వెళ్ళెను. తన కుక్కను కూడా తనతోపాటు తీసుకువెళ్ళెను. ఒక స్థలములో అతనికి బంగారము దొరికెను. అతను చాలా సంతోషముతో తిరిగి వచ్చుచున్నాడు. అతడు ఒక సత్రములో విశ్రాంతి తీసుకొనవలసి వచ్చెను. ఆ సమయములో కుక్క అతనిని కాపలా కాయుచుండెను. అతను తన బంగారపు మూటను తలక్రింద పెట్టుకొని నిద్రపోతూ వుండెను. అప్పుడు రాత్రిలో ఒక దొంగ వచ్చెను. అప్పుడు కుక్క మొరిగినది. వెంటనే దొంగ వెళ్ళిపోయాడు. అతని నిద్రను కుక్క పాడుచేసినదని అతనికి చాలా కోపము వచ్చినది. మరలా ఆ దొంగ చాలా దగ్గరకు వచ్చెను. ముందువలే కుక్క అదేవిధముగా మొరిగినది. అతను కుక్కను చూసి, నోరు ముయ్యి. నాకు కోపము రప్పించకు అని చెప్పెను. దొంగ వెళ్ళిపోయాడు. దాని తరువాత ఒక అరగంట సమయము అయిన తరువాత దొంగ తిరిగి వచ్చెను. కుక్క అతనిని చూసి మరలా మొరిగినది. యజమాని కుక్కను నీవు మరలా మొరిగితే నిన్ను కాల్చేస్తాను అని చెప్పాడు. కుక్క మొరిగినది. అతను తుపాకీని తీసుకొని కుక్కను చంపివేసాడు. బంగారమును తన యింటికి తీసుకెళ్ళవచ్చును అనే నమ్మకము ఆ యజమానికి వుండెను. ఆ కుక్క చనిపోయినది. అతనికి యివ్వబడిన హెచ్చరికను … Read entire article »

Filed under: శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు

మన నోరు బాగా తెరిచి భగవంతుని స్తుతించాలి

ఆదిపత్యము, అధికారము, ఏ జీవరాశి అయినను, సృష్టింపబడిన మరియేదైనను మన ప్రభువైన క్రీస్తుయేసునందలి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవు. ఆ ప్రేమ ఎప్పుడు వచ్చింది? ఆ ప్రభువే క్రీస్తుయేసు అని మనము తెలుసుకొనినప్పుడు ఆ ప్రేమ పరిపూర్ణమగుచున్నది. ఇక మనలను ఏదియు వేరుచేయలేదు. ఎందుకు మన నోరులు బాగా తెరచి దేవుని స్తోత్రించాలి? ఆయన మన కొరకు సమస్తమును చేసియున్నాడు. నేను నా సమయమును వృధా చేయకుండా నా సమయమును బైబిలు చదువుటలో గడిపినయెడల నేను ఒక మంచివ్యక్తిగా వుండగలను. ఇప్పుడు కొంతమంది జీవితముల కొరకు నా సమయమును నేను వృధా చేసినందుకు ఈ రోజున నేను బాధపడుచున్నాను. క్రీస్తుయేసు మీ కొరకు ఏమి చెల్లించాడని మీకు తెలుసా? ఆయన న్యాయం తీర్చు అధికారమును, సృష్టించే శక్తిని యిచ్చియున్నాడు. సృష్టింపబడిన జగత్తు అంతయు మీ చేతులలోకి వచ్చును. ప్రతీ దినము మిమ్ములను నోరు బాగుగా తెరచి దేవుని స్తుతించండి, చప్పట్లు కొట్టండి అని చెప్పవలసి వస్తుంది. కాని వధువుకైతే ఒక మాట సరిపోతుంది. దేవుడు మనకు పూర్తిగా శిక్షణ యిచ్చియున్నాడు. ఇప్పుడు మనము లేచి ప్రకాశించవలసియున్నది. జయించు శక్తిని మనము పొందుకొనియున్నాము. ఇప్పుడు జయించు శక్తిని పొందుకొనినప్పుడు దానిని మీరు పరీక్షించారా? దాని అనుభవమును పొందుకొనినారా? … Read entire article »

Filed under: శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు

శ్రీలహరికృష్ణగారి అనుభవములు

శ్రీలహరికృష్ణగారు శ్రీలంకలో పొందుకొనిన అనుభవములు 1. భగవంతుని హస్తం : ఒక సమయమున శ్రీలంకలో నేను సైకిల్మీద వెళ్తూ వున్నాను. నేను సైకిల్ మీద వెళ్తున్నప్పుడు హఠాత్తుగా ఒక కారు నా వెనుక వచ్చినది. కంటికి కనబడని ఒక చేయి నన్ను ప్రక్కకు గెంటివేసినది. నేను క్రింద పడిపోయాను. నేను క్రిందపడి ఎవరు నన్ను క్రిందకు త్రోసారు అని చూసాను. అక్కడ ఎవరూ లేరు. కాని నా వెనుక వచ్చుచున్న కారు ఒక స్థంభమును ఢీకొనినది. (ఆవిధముగా నేను కాపాడబడ్డాను). మీరు సైన్యములో వుండవచ్చును. ఎన్నోసార్లు మీరు ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చును. ఆ సమయముననే భగవంతుడు మీతో మాట్లాడును. 2. ధర్మము నిన్ను రక్షిస్తుంది : శ్రీలంకలో సింహళీయులు మాత్రమే జీవించాలని యిష్టపడుతున్నారు. ఒకరోజున అక్కడ ఒక సమస్య ఏర్పడినప్పుడు నేను అక్కడ వున్నాను. ఆ సమయమున ప్రధానమంత్రి అయిన ప్రేమదాసు నాకు తెలుసు. నేను శ్రీలంకలో ఫుట్బాల్ ఆటగాడిగా వున్నాను. శ్రీలంకలో ఆడే ఒకే ఒక భారతీయుడను నేనే. శ్రీలంకవాసులు నన్ను చాలా ప్రేమించేవారు. ఆ సమయములో నేను, నా భార్య పిల్లలు రోడ్డుమీద వెళ్తున్నాము. ఆ సమయమున చాలా భయంకర పోరాటము ఏర్పడినది. వారు తమిళవాసులను, భారతీయులను చంపుటకు యిష్టపడ్డారు. నా స్నేహితురాండ్లలో ఒకామె … Read entire article »

Filed under: శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు

బలి – యజ్ఞము – బక్రీదు

ఈ రోజు మనము యుగములను గురించియు, ప్రతి యుగమునకైన నియమములను గురించియు చూద్దాము. ప్రతి యుగములోను, మనుష్యుల స్వభావమును, సామర్థ్యమును అనుసరించి దేవుడు వారికి ఒక శోధనను యిచ్చుచుండెను. ఆ శోధనను జయించిన వారు శిక్షింపబడలేదు. కాని ఇతరులు నాశనము చేయబడిరి. అందుకే దీనిని మనము ప్రతియుగమునకు పెట్టుకోవాల్సి యున్నది. ఇది ఒక మనుష్యుడు ఏలా ప్రసంగించుచున్నాడని గాని, ఒక మనుష్యుడు వ్యాధులను ఏలా స్వస్థపరచుచున్నాడు అని గాని, ఒక మనుష్యునికి ఎంత పెద్ద నోరు వుందని గాని కాదు. అందుకే యుగము అంటే, ఇది ఒక డాక్టరు లాగ. అతను వ్యాధిని పరిశోధించి మందు యిస్తాడు. ఆ వ్యాధిగ్రస్థుడు ఆ మందు తీసికొని స్వస్థతను పొందుకోవాలి. వారు మందు తీసికొని వ్యాధినుండి కోలుకోవాలి అని నా కుమారుడు చెప్పియున్నాడు. ఇది యుగము అని పిలువబడుచున్నది. ఈరిరీచీలిదీరీబిశిరిళిదీ మనము ఈరిరీచీలిదీరీబిజీగి అని ఎందుకు అంటున్నాము! ఈరిరీచీలిదీరీలి అంటే సరైన మందు యివ్వటము. అందుకే యీ లోకము. చాలా కాలము క్రితము నుండి వుంటున్నది. 600 లక్షల సంవత్సరముల నుండే యీ లోకము వుంటున్నదని అనేక హిందూ పురాణములు చెప్పుచున్నవి. మొట్టమొదటగ దేవుడు క్రీస్తుయేసును సృష్టించెను. జగత్పునాధికి ముందే ఆయనలో వున్న వారందరు సృష్టించబడిరి. ఈ … Read entire article »

Filed under: శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు

ప్రాణమును కాపాడే ఆహారము

నేను మాంసమును తినేటప్పుడు నాకు మూలవ్యాధి, రక్తపోటు అనే వ్యాధులు వుండినవి. నేను కాయగూరలు మాత్రమే తినే శాఖాహారిగా మారిన తరువాత ఒక నెలలోపు నా వ్యాధులన్నీ పోయినవి. నేను యిప్పుడు చాలా ఆరోగ్యముగా వున్నాను. వృద్దులుగా వున్న మీరు ఆరోగ్యముగా వుండాలనుకొంటే కాయగూరలను మాత్రమే తినండి. నేను యవ్వనస్థుల గురించి చెప్పుట లేదు. ఇంకా కొంచెం కాలం జీవితాన్ని అనుభవించండి. కాని మరణించడానికి సిద్ధముగా వున్న వృద్దులు కాయగూరలు తినేవారిగా మారినట్లయితే యింకా కొంచెం ఎక్కువ కాలము జీవించవచ్చును. లేకపోయినట్లయితే మీరు ఆత్మహత్యను చేసుకొంటున్నారు. కాని కాయగూరల భోజనము మీకు దీర్ఘాయుష్షును యిస్తుంది. మనము దేనిని చంపవలసిన అవసరము లేదు. కాబట్టి ఈ రోజు మీరు భగవంతుని మీద నమ్మకము పెట్టుకొనుడి. మీరు భగవంతుని మీద నమ్మకము వుంచి, తరువాత జీవకారుణ్యమునకు రండి. జీవకారుణ్యము లేకుండా భగవంతుని నమ్మి ఏమి ప్రయోజనము? కాబట్టి హిందువులు క్రైస్తవులను నమ్మడము లేదు. ఎందుకంటే క్రైస్తవులు కోడిని తిని, దేవుడా, దేవుడా అని అంటారు. దానికి కారణము మీ దగ్గర జీవకారుణ్యము లేదు. ఎందుకంటే ఎవరూ దానిని మనకు నేర్పించలేదు. మీరు ఇతర దేశములకు వెళ్ళి చూడండి. మాంసాహారములో కూడా చాలా రకములు వున్నవి. కాని భగవంతునికి వందనము. … Read entire article »

Filed under: శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు

భగవంతుని ఏవిధముగా ముట్టుకొనగలరు?

మీరు దేవుని ఆత్మను కలిగివుంటేనే తప్ప దేవుని ఎప్పటికీ అర్ధం చేసుకొనలేరు. ఈ రోజున క్రైస్తవులు క్రమముగ చర్చీకి వెళ్తూ వుంటారు. అది మిమ్ములను దైవీక మనుష్యునిగ చేయజాలదు. ఒక కారు షెడ్డులోనికి మీరు ప్రతీ రోజూ వెళ్ళడము ద్వారా అది మిమ్ములను ఒక అంబాసిడర్‌ కారుగ చేయజాలదు. కాని గుడికి వెళ్ళడము ద్వారా వారు దైవ జనులుగ మారగలమని జనులు అనుకుంటూ వుంటారు. నాకు ఒక కధ తెలుసు. బహుశా మీకు ఆ కధ తెలిసి వుండవచ్చును. ఒక రాజు వుండేవాడట. తన కోసం ఒక ప్రత్యేకమైన శ్రేష్టమైన షర్టును చేయించుకోవాలని ఆశించాడట. అందుకే ప్రతిసారి ‘ఈ షర్టు మంచి షర్టు కాదు’ అని అనేవాడట. ఒక రోజున ముగ్గురు మనుష్యులు రాజు దగ్గరికి వచ్చారట. ”మేము మీ కొరకు ఒక మంచి వస్త్రమును నేస్తాము. ఆ విధముగ వేరే ఏ మనుష్యుడు నేయలేడు” అని చెప్పారట. ”మీరు దానిని చేయగలరా?’ అని రాజు అడిగి ‘సరే’ అన్నాడట. కాని మీరు దాని కోసం కొంత డబ్బును, కొంత సమయమును ఇవ్వాలి’ అని అడిగారట. దానికి రాజు ‘సరే’ అని అన్నాడట. వారికి ఒక గది ఇవ్వబడినది. ఉదయమే వారు గదిలోనికి వచ్చేవారు. వారు … Read entire article »

Filed under: శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు