தமிழ்| telugu

» సంపాదకీయం

”ఓం నమో భగవతే శ్రీలహరికృష్ణాయ నమః”

ప్రియమైన సహోదర సహోదరీలారా, శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ నామములో మా శుభాకాంక్షలు. గత శీర్షికలో మీకు తెలియజేసిన విధముగా శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి మహిమ సన్నిధిలో మహిమ ఉత్సవములు మనుజ్యోతి ఆశ్రమములో బ్రహ్మాండముగా జరిగినవి. ఆంధ్ర, తమిళ్‌నాడు, భారతదేశములోని పలు ప్రాంతముల నుండియు మరియు జర్మనీ, మలేషియా దేశముల నుండి అనేకమంది శ్రీలహరికృష్ణగారి భక్తులు వచ్చి ఈ కూటములలో కలుసుకొని వెళ్ళారు. అది వారికి చాలా ఆశీర్వాదకరముగా వుండినది. ఈ కూటముల తరువాత అస్సాం, సిక్కిం రాష్ట్రములను మరియు మలేషియా దేశమును సందర్శించి, ఈ కూటములలో కలుసుకోలేని శ్రీలహరికృష్ణగారి భక్తులను కలుసుకొని వచ్చితిమి. అది మాకు చాలా ఆశీర్వాదముగా వుండినది. అదేవిధముగా మీకు ముందుగానే తెలియజేసిన విధముగా మే నెలలో విధ్యార్ధులకు నిర్వహించిన వేసవి శిక్షణా తరగతులు (సమ్మర్‌ క్యాంపు) మనుజ్యోతి ఆశ్రమము నందును మరియు విశాఖ జిల్లాలో వున్న ఏజెన్సీ ప్రాంతమైన అసరాడలోనూ శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి కృప వలన చాలా బాగుగా జరిగినవి. దానిలో అనేకమంది విధ్యార్ధినీ విధ్యార్ధులు కలుసుకొన్నారు. వారికి వేదముల నుండి అనేక వేదప్రవచనములను నేర్పించడమే కాకుండా శరీర వ్యాయామములు కూడా నేర్పించారు. ముఖ్యముగా సమిష్టి జీవితము, ఆధ్యాత్మిక ఆలోచన, భగవంతుని ఏవిధముగా పూజించుట మొదలగు కార్యములన్నీ వారికి నేర్పించబడినవి. మరియు ఈ కలియుగములో కలి … Read entire article »

Filed under: సంపాదకీయం

”ఓం నమో భగవతే శ్రీలహరికృష్ణాయ నమః”

ప్రియమైన సహోదర సహోదరీలారా, శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ నామములో అందరికీ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. గత సంచికలో తెలిపిన విధముగా జనవరి నెల 8వ తేదీన విజయవాడలో జింఖానా గ్రౌండ్స్‌నందు శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి మహిమ సన్నిధిలో ”సర్వమత సమ్మేళనము మరియు దేశీయ సమైక్యతా సమావేశము” చాలా బ్రహ్మాండముగా జరిగినది. ఈ కార్యక్రమములో ఆధ్యాత్మిక కవులు, రాజకీయ నాయకులు, మత పెద్దలు, ఇంకా చాలా మంది వచ్చి కలుసుకున్నారు. అందరూ వారి వారి భావనలతో భగవంతుని గురించి గొప్పగా చెప్పుచూ, ”భగవంతుడు ఒక్కడే!” అని చాటిచెప్పారు. వారు మాట్లాడిన సందేశములను మీరు లోపలి పేజీలలో చూడవచ్చు. అదేవిధముగా ఫిబ్రవరి నెలలో మనుజ్యోతి ఆశ్రమములో 22వ తేదీ నుండి 25వ తేదీ వరకు ”మహిమ దిన ఉత్సవములు” చాలా అద్భుతముగా జరిగినవి. ఈ మీటింగులకు ఆంధ్రా నుండి మాత్రమే కాకుండా తమిళ్‌నాడు, బొంబాయి, అస్సాం మొ|| పలు రాష్ట్రముల నుండియు మరియు మలేషియా, బర్మా దేశముల నుండియు కూడా శ్రీలహరికృష్ణగారి భక్తులు వచ్చి కలుసుకొని, ఆశీర్వాదములు పొందుకొనివెళ్ళారు. ఈ మీటింగులలో ఎన్నో ఆధ్యాత్మిక సందేశములు మరియు వారి వారి జీవితములలో పొందుకొనిన ఆత్మీయ అనుభవములు జనులు చెప్పుట జరిగినది. 24వ తేదీన శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి జన్మ దినము మరియు ఆయన మహిమలో … Read entire article »

Filed under: సంపాదకీయం

”ఓం నమో భగవతే శ్రీలహరికృష్ణాయ నమః”

ప్రియమైన సహోదర సహోదరీలారా, శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ నామములో అందరికీ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. ముందు సంచికలో తెలిపినట్లుగా అక్టోబర్ నెల 3వ తేదీన ‘ధర్మయుగ స్థాపన దిన ఉత్సవము’ మనుజ్యోతి ఆశ్రమములో సాధారణముగా జరుపుకొనుట జరిగినది. అదేవిధముగా ప్రపంచమంతటను వున్న శ్రీలహరికృష్ణ స్తుతి ధ్యాన కేంద్రములన్నిటిలోను కూడా ఈ పండుగను శ్రీలహరికృష్ణగారి భక్తులు ఎంతో వైభవంగా, ప్రేమ పతాకమును ఎగురవేసి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ప్రస్తుత దేశ పరిస్థితిని చూస్తే, నల్లధనంపై ప్రభుత్వం చేపట్టిన నిర్ణయములను బట్టి, ఎక్కడ చూచినా బ్యాంకులు, ఎటిఎంల వద్ద ప్రజలు డబ్బులు మార్చుకొనుట కొరకు, అలాడే డబ్బులు తీసుకొనుట కొరకు నిద్రాహారాలు మాని, ఎండ అనక, వాన అనక పడిగాపులు కాస్తున్నారు. కారణం ఈ రోజు డబ్బు లేకపోతే మనిషి జీవించడం చాలా కష్టం. ప్రతీ వస్తువు, ప్రతీ విషయం కూడా డబ్బుతోనే ముడిపడి వుంది. కాని డబ్బుతో సంపాదించలేని, డబ్బే అవసరంలేని కొన్ని కార్యాలు కూడా వున్నాయి అని మనిషి గుర్తించవలసి యున్నది. ఈ రోజు మానవుడు డబ్బు లేకపోతే యిక ఏమీ లేదు అని అనుకొంటున్నాడు. కాని డబ్బు కంటే విలువైనది ఒక ప్రాణి యొక్క జీవం. ఆ జీవం ఎక్కడ నుండి వస్తుంది అని ఆలోచిస్తే, అది … Read entire article »

Filed under: సంపాదకీయం

”ఓం నమో భగవతే శ్రీలహరికృష్ణాయ నమః”

ప్రియమైన సహోదర సహోదరీలారా, శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ నామములో మీ అందరికీ మా శుభాకాంక్షలు. గత సంచికలో మీకు తెలిపినట్లుగా గడిచిన జూలై నెల 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి మహిమ సన్నిధిలో 47వ కల్కి జయంతి ఉత్సవములు మనుజ్యోతి ఆశ్రమములో బ్రహ్మాండముగా జరిగినవి. అనేకవేల మంది భక్తులు ఈ ఉత్సవములలో కలుసుకొనిరి. అదేవిధముగా ఆగష్టు 15వ తేదీన భారతదేశము 70వ స్వాతంత్య్రదిన వేడుకలు ఆర్భాటముగా జరుపుకొనినది. అయినప్పటికి అనేక కార్యములు మనకు తీరని లోటుగానే వుండి పోతున్నాయి. స్వాతంత్య్రము వచ్చినది అని మనము బయటకు కనబడుటకు పండుగలు చేసుకొనినప్పటికీ ప్రతీ ఒక్కరి హృదయాంతరంగములలో ”ఇది నిజమైన స్వాతంత్య్రమా?” అనే ప్రశ్న ఊగిసలాడుతూనే వున్నది. ఎందుకంటే ప్రక్కదేశములతో పోరాడుటకే సమయము, సంపద సగం ఖర్చుఅయిపోతున్నది. దేశములో పేదరికమును మాత్రము నిర్మూలన చేయలేకపోవు చున్నాము. ఒక ప్రక్కన సుసంపన్నమైన దేశములు ఉగ్రవాదమును ప్రోత్సహిస్తూ వుంటున్నాయి. హింసావాదము ఎన్నడూ ఎవరికీ ఎటువంటి ప్రయోజనం యివ్వలేదు. ఈ  లోకములో మనము చూచినట్లయితే, ఉగ్రవాదము చేతను, హత్యల చేతను ప్రపంచమంతా వణికిపోతుంది. మనిషి మనిషిని చంపుకొనుటయే నాగరికత అనుకొనుచున్నారు. కాని ఒక ప్రక్కన విజ్ఞానము అభివృద్ధి చెందినప్పటికిని మనుష్యుని జ్ఞానము మాత్రము పెరుగుట లేదు. ఎంత పెద్ద విధ్యాభ్యాసము … Read entire article »

Filed under: సంపాదకీయం

సంపాదకీయం

”ఓం నమో భగవతే శ్రీలహరికృష్ణాయ నమః” ప్రియమైన సహోదర సహోదరీలారా, శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ నామములో అందరికీ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. ముందు సంచికలో తెలిపినట్లుగా అక్టోబర్‌ నెల 3వ తేదీన ‘ధర్మయుగ స్థాపన దిన ఉత్సవము’ మనుజ్యోతి ఆశ్రమములో సాధారణముగా జరుపుకొనుట జరిగినది. అదేవిధముగా ప్రపంచమంతటను వున్న శ్రీలహరికృష్ణ స్తుతి ధ్యాన కేంద్రములన్నిటిలోను కూడా ఈ పండుగను శ్రీలహరికృష్ణగారి భక్తులు ఎంతో వైభవంగా, ప్రేమ పతాకమును ఎగురవేసి వరుసగా మూడు రోజులు ఘనంగా జరుపుకొన్నారు. ప్రస్తుత లోక పరిస్థితిని మనము గమనించి నట్లయితే, అన్ని దేశములు కూడా మన భారతదేశమును మాత్రమే దృష్టించి చూచుచున్నవి. మతపరముగా గాని, రాజకీయపరముగా గాని, అభివృద్ది సోపానంలో మన దేశము ముందంజ వేయుటను ఇతర దేశములు అంచనా వేయలేక పోవుచున్నవి. కారణం మన దేశ భవిష్యత్తు భగవంతుడైన శ్రీమన్నారాయణుని చేతిలో వుండటమే. ఎంతమంది దేశనాయకులు వున్నా, ప్రముఖులు వున్నా, మన దేశ పురోగతి ఎవరూ ఊహించలేనిది. ఇంకొక కోణంలో చూస్తే, ప్రపంచములో మన దేశమునకు హాని చేయాలని తలంచే ప్రతీ దేశము కూడా నాశనము అవుటను చూడగలుగుచున్నాము. కాని అది బహిర్గతము అవ్వడము లేదు. ఊహించలేని భూకంపములు, తుఫానులు, అతివృష్టి, అనావృష్టి ఈ విధముగా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు సంభవించి లక్షలకొలది జనులు తమ … Read entire article »

Filed under: సంపాదకీయం

సంపాదకీయం

”ఓం నమో భగవతే శ్రీలహరికృష్ణాయ నమః” ప్రియమైన సహోదర సహోదరీలారా, శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ నామములో అందరికీ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. మీకు తెలియజేయబడిన విధముగా 2015 జూలై 15 నుండి 22వ తేదీ వరకు 46వ కల్కిజయంతి ఉత్సవములు మనుజ్యోతి ఆశ్రమ ప్రాంగణములో బ్రహ్మాండముగా జరిగినవి. ఈ ఉత్సవములకు భారతదేశములో అనేక ప్రాంతముల నుండియు ఇంకా బర్మా, జర్మనీ, అమెరికా, మలేషియా ప్రాంతములనుండియు భక్తులు హాజరయ్యారు. జూలై 1వ తేదీన నారాయణుని ప్రేమపతాకమును ఎగురవేసి, ఆశ్రమము చుట్టూ ఊరేగింపు నిర్వహించబడినది. అలాగే ప్రపంచ మంతటిలోనున్న శ్రీలహరికృష్ణ స్తుతిధ్యాన కేంద్రములన్నిటిలోనూ ప్రేమ పతాకము ఎగుర వేయబడినది. భక్తులు కుటుంభసమేతముగా విచ్చేసి, వారి గుడారములను వారే వేసుకొని ఈ ఉత్సవముల కొరకు సిద్దము చేసుకొన్నారు. కల్కిజయంతి ఉత్సవములు 15వ తేదీ, సాయంత్రమున సౌందర్య లహరి సంగీత కచ్చేరి కార్యక్రమముతో ప్రారంభము అయినవి. మొదటి దినమునకే వేల మంది భక్తులు హాజరుకావడము విశేషముగా కనిపించినది. ఈ ఉత్సవములలో స్త్రీలకు ప్రత్యేక సమావేశము మరియు సర్వమత సమావేశము, దేశీయ సమైక్యతా సమావేశము, చిన్న పిల్లల సాంస్కృతిక కార్యక్రమములు, నాటకములు, పిల్లల ఆటల పోటీలు చోటుచేసుకొనినవి. సర్వమత సమావేశము తెలుగు భాషయందే గాక, తమిళము, హిందీ భాషలలో కూడా జరిగినది. తెలుగులో జరిగిన సర్వమత సమావేశమునకు … Read entire article »

Filed under: సంపాదకీయం