1. Home
  2. »
  3. హిందూ పురాణములు
  4. »
  5. భగవద్గీతాసారము
భగవద్గీతాసారము
1. నీ మనస్సును పరమపురుషునియందే లగ్నముగావించి అహంకారమును విడనాడి నీ కర్తవ్యమును నిర్వహించుము. 2. మొదట నీ పంచేంద్రియములను అదుపులో వుంచుకొని పాపముతో కూడిన కోరికలను అక్షయయోగము యొక్క సహనముతో నాశనము చేయుము. 3. పరమాత్మ నీ జ్ఞానమునకు అతీతుడని తెలుసుకొని, పరమపురుషుని యొక్క జీవాత్మచే నీ మనస్సును అదుపులో వుంచుకొని, కోరిక అను శత్రువును చంపుము. 4. అక్షయమైన యోగము యొక్క సువార్త గురించిన జ్ఞానమను ఖడ్గముతో పరమపురుషుని గూర్చిన సందేహములను ఖండించుము. మరియు అక్షయమైన యోగము నందు స్థిరముగా వుండుము! లేచి నిలబడుము. 5. సర్వోన్నత బలికి కారకుడును, ముగించువాడునైన నన్నెల్లప్పుడు జ్ఞాపకము చేసుకొనుము. మరియు నీ కర్తవ్యమును నిర్వహించుము. నీ మనస్సును, వివేకమును నాయందే స్థిరముగా వుంచినచో, నా వద్దకే వచ్చెదవు. 6. ఎల్లప్పుడు సర్వోన్నత బలి యొక్క సువార్తయందే స్థిరముగా వుండుము. 7. నీ మనస్సును నాయందే స్థిరముగా వుంచుము. నాకు భక్తుడుగ వుండుము. నీ జీవితమును నా కొరకు అర్పించుము. నీవు నన్ను చేరుకొందువు. నీవు సజీవయాగముగా వుండవలెను.
Scroll to Top