1. Home
  2. »
  3. శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు
  4. »
  5. శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి ఉపమానములు
శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి ఉపమానములు
దొరకకుండాపోయిన బంగారు నిధి బంగారు బొక్కిషమును వెతుక్కుంటూ ఒక వ్యక్తి వెళ్ళెను. తన కుక్కను కూడా తనతోపాటు తీసుకువెళ్ళెను. ఒక స్థలములో అతనికి బంగారము దొరికెను. అతను చాలా సంతోషముతో తిరిగి వచ్చుచున్నాడు. అతడు ఒక సత్రములో విశ్రాంతి తీసుకొనవలసి వచ్చెను. ఆ సమయములో కుక్క అతనిని కాపలా కాయుచుండెను. అతను తన బంగారపు మూటను తలక్రింద పెట్టుకొని నిద్రపోతూ వుండెను. అప్పుడు రాత్రిలో ఒక దొంగ వచ్చెను. అప్పుడు కుక్క మొరిగినది. వెంటనే దొంగ వెళ్ళిపోయాడు. అతని నిద్రను కుక్క పాడుచేసినదని అతనికి చాలా కోపము వచ్చినది. మరలా ఆ దొంగ చాలా దగ్గరకు వచ్చెను. ముందువలే కుక్క అదేవిధముగా మొరిగినది. అతను కుక్కను చూసి, నోరు ముయ్యి. నాకు కోపము రప్పించకు అని చెప్పెను. దొంగ వెళ్ళిపోయాడు. దాని తరువాత ఒక అరగంట సమయము అయిన తరువాత దొంగ తిరిగి వచ్చెను. కుక్క అతనిని చూసి మరలా మొరిగినది. యజమాని కుక్కను నీవు మరలా మొరిగితే నిన్ను కాల్చేస్తాను అని చెప్పాడు. కుక్క మొరిగినది. అతను తుపాకీని తీసుకొని కుక్కను చంపివేసాడు. బంగారమును తన యింటికి తీసుకెళ్ళవచ్చును అనే నమ్మకము ఆ యజమానికి వుండెను. ఆ కుక్క చనిపోయినది. అతనికి యివ్వబడిన హెచ్చరికను అతను పోగొట్టుకున్నాడు. తరువాత దొంగ వచ్చి అతనిని చంపి బంగారమును తీసుకొని వెళ్ళిపోయాడు. రాబోయే నాశనముల గురించి భగవంతుడు యిచ్చే హెచ్చరికలను మనము నిరాకరించితే మనము కూడా మన యొక్క బంగారపు నిధిని పోగొట్టుకొనవలసి వస్తుంది. మనుష్యుని కాపాడలేని మతము ఒక మనుష్యుడు బావిలో పడిపోయాడు అని అనుకొందాము. నేను ఒక త్రాడును వేసి, నువ్వు దానిని పట్టుకో. నేను నిన్ను బయటకు లాగుతాను అని చెప్తాను. కాని ఆ మనుష్యుడు ఏమని అంటున్నాడో తెలుసా? నేను గంగకు వెళ్ళి మునిగివస్తాను, దేవాలయమునకు వెళ్ళివస్తాను అని చెప్పినట్లయితే అతను బావినుండి బయటకు రాలేడు. అతడు భగవంతునికి కానుకను చెల్లిస్తాను అని అంటున్నాడు. మొదటిగా ఒక రక్షకుడు అవసరమని మీరు గ్రహించుకోవాలి. బయటవున్న ప్రజలు ఏమంటున్నారు? ఎందుకు నీవు క్రిందకు పడిపోయావు. నీవు చూసుకొని వెళ్ళకూడదా? అని అంటున్నారు. నీ గురించి అందరూ కలిసి ఆలోచించి నిర్ణయించుకొనిన తరువాత నిన్ను బావిలోనుండి బయటకు తీస్తాము అని అంటే, అంతలోగా ఆ మనుష్యుడు చనిపోతాడు. రక్షించగలిగే ఆ త్రాడు అక్కడ వున్నప్పటికీ కూడా, మతము అతనిని రక్షించలేదు. కాపాడలేదు. మీరు కూడా రక్షింపబడలేరు. ఒక పేదరాలిని వివాహము చేసుకొనిన గొప్ప ధనవంతుడు ఒక కంపెనీలో పనిచేస్తున్న చాలా పేదరాలైన ఒక అమ్మాయిని వివాహము చేసుకొనిన అమెరికాకు చెందిన గొప్ప ధనవంతుని యొక్క కధ నాకు తెలుసు. ఆమె జర్మనీకి చెందిన ఒక పేద అమ్మాయి. ఇతను ఆమెను చూచెను. దాని తరువాత ఆమెను, నన్ను వివాహము చేసుకొనుట నీకు యిష్టమా అని అడిగెను. దానికి ఆమె నేను ధరించుకొనిన వస్త్రముతోనే నేను వస్తాను. నా సంపాదనతోనే వివాహము కొరకు కావలసిన వస్త్రములను తీసుకొంటాను. అంతవరకు నేను జర్మనీ అమ్మాయిగానే వుంటాను. వివాహము అయిన తరువాత కావాలంటే మీరు ఏదైనా యివ్వవచ్చును అని తన నిర్ణయమును చెప్పినది. దానికి అతను అంగీకరించాడు. ఆమె వివాహమునకు సాధారణ వస్త్రములతోనే వచ్చినది. ఆమె యొక్క తండ్రి ఆమె చేతిని వరుని చేతికి అప్పగించెను. ఆ ధనవంతుడు కూడా ఒక పేదవానిలాగే వచ్చెను. ఎందుకంటే అతను ధనవంతుడని తెలియకూడదు. ఆమె యింటిలోనే భోజనము చేయాలి. భోజనము సరిగ్గా లేనప్పటికీ, పెండ్లికూతురు యింటివారు బాధపడకూడదు అని అతను ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే అతనికి కావలసినది అమ్మాయి మాత్రమే. పెండ్లి జరిగిన తరువాత పెద్ద విమానము వచ్చింది. వారికొరకు అది కాచుకొనియున్నది. ఆమెకు క్రొత్త బట్టలు, ఆభరణాలు యివ్వబడినవి. యింతకు ముందు ఆమె విమానములో ఎక్కనేలేదు. ఇప్పుడు ఆమె విమానము ఎక్కుచున్నది. తరువాత ఆమె అమెరికాకు తీసుకొనివెళ్ళబడినది. ఇప్పుడు ఆమెకు పనిచేయుటకు అక్కడ చాలామంది సేవకులు వున్నారు. ఆ ధనవంతుని యొక్క పేరు రాక్‌ఫెల్లర్‌. అక్కడికి వెళ్ళిన తరువాతనే అతని యొక్క నిజమైన గొప్పతనమును ఆమె గ్రహించగలిగినది. దాని తరువాత ఆమెకు ఎటువంటి కష్టము కూడా లేదు. ఆహా, ఆయన ఇంత గొప్ప ధనవంతుడు అని నేను తలంచలేదు అని ఆశ్చర్యపడినది. ఈ విధముగానే భగవంతుడు తన సగభాగమైన ఒక గుంపు ప్రజలను వెదకి ఈ లోకములో ఒక సాధారణ మనుష్యునివలే వచ్చి, వారి కొరకు అన్ని కష్టములను భరించెను. ఈ కధలోని అమ్మాయివలే వారు కూడా భగవంతుని యొక్క మహాత్యమును గ్రహించక వున్నారు. నిజము – నీడ ఉదాహరణకు వెయ్యి రూపాయలకు మీరు ఒక చీరను కొన్నారనుకొందాము. అదేవిధముగా దానిని పోలినట్లుగానే యింకొక చీరను వందరూపాయలకు మీరు కొనగలరు. కాని వెయ్యి రూపాయలకు మీరు చీరను కొన్నప్పుడు అందులో ఒక విశేషమైన అమరిక వుంటుంది. కాని మనము దానిని పోలినటువంటి చీరను తీసుకోవడానికే యిష్టపడుచున్నాము. కాని ముగింపులో మనము తృప్తి పొందలేము. ఎందుకంటే ప్రత్యేకమైన ధర వుండాలి. నీడగానున్న, సాధారణమైన తృప్తిని యిచ్చేది వస్తువు. స్థిరమైన, నిజమైన, నిరంతరమైన, అసలైన తృప్తిని యిచ్చేది భగవంతుని కృప. – సేకరణ : శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి సందేశముల నుండి…
Scroll to Top