தமிழ்| telugu

» Archive

ఏది కన్నులు కప్పెను

ఒక యౌవనస్థుడు ముక్తి పొందాలనే వాంఛతో సద్గురువును వెదుక్కుంటూ వెళ్ళాడు. తనతోబాటు ఒక దయ్యము రావటమును అతను ఎరుగక వుండెను. ఆ విధముగ అతను ప్రయాణము చేస్తూ కొన్ని రోజులకు ప్రక్కనున్న రాజ్యములో ప్రవేశించాడు. అతనితో వచ్చిన దయ్యము వూరుకోలేదు. ఆ రాజ్యమునకు వారసుడు లేడని తెలుసుకొని ఆ రాజు ఇతనినే కలుసుకొనేటట్లు చేసినది. రాజు ఆ యౌవనస్థుని బలమును, అందమును చూచి ప్రసన్నుడై తన రాజ్యమునకు తనను రాజుగ చేస్తానని చెప్పగా యౌవనస్థుడు దానిని అంగీకరించక తన లక్ష్యమును రాజుకు తెలియజేసి అక్కడ నుండి బయలుదేరి తన లక్ష్యమువైపు వెళ్ళెను. ఈ శోధనను దాటి వచ్చిన అతనికి ఇంకొక శోధన కాచుకొనియుండెను. దయ్యము తన ఓటమికి బాధపడక మరియొక పోటీకి సిద్ధపడినది. యౌవనస్థుడు ఇంకొక రాజ్యములో ప్రవేశించాడు. అక్కడ జనులు పండుగ చేసుకొంటూ వుత్సవములతో చాలా సంతోషముగ వుండిరి. ఇతను వీటిని చూస్తూ ముందుకు సాగిపోయెను. అతనితో వచ్చిన దయ్యము తన పనిని ప్రారంభించినది. ఈ పండుగ వుత్సవాలు ఏమిటని విచారించి ఇది ఆ రాజ్యపు యువరాణికి స్వయంవరమని తెలుసుకొని అతనిని అక్కడికి నడిపించినది. ఇతను ఒక ప్రక్కగ నిలబడి గమనించుచుండెను. అటుగ వచ్చిన యువరాణి ఇతని యవ్వనమును, బలమును చూచి మోహించి … Read entire article »

Filed under: ఆత్మీయ కధలు

వివేక జీవనము

సూర్యోదయం అనేది రోజు జరిగే ప్రక్రియే అయినా అది నిత్య నూతనంగా ఉంటుంది. అది వెలుగు యొక్క స్వచ్ఛతకు సంకేతం. మేఘం నుండి నేలకు జారిపడే వాన చినుకు, విత్తనాన్ని చీల్చుకొని భూమిపైకి వచ్చే లేత అంకురాలు, చిగురాకు దళాలు, కురిసే మంచు, హిమ శిఖరాలు, వీచే గాలి, జల ప్రవాహం, పచ్చని ప్రకృతి అన్ని స్వచ్ఛతకు ప్రతిరూపాలు. మానవుడు కూడా స్వచ్ఛతకు ప్రతిరూపంగానే సృష్టింపబడ్డాడు.   సృష్టిలో భగవంతుడు సృష్టించే ప్రతి అంశం స్వచ్ఛతకు ప్రతిరూపంగానే నిలుస్తుంది. అందుచేత మానవుని జీవన శైలి స్వచ్ఛమైన ఆలోచనలతో శ్రేష్టమైన జీవనం గడపాలి. అందుకు వివేకం కావాలి. వివేకం స్థిరచిత్తం నుండి వస్తుంది. స్థిరచిత్తం, శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ నుండి మాత్రమే వస్తుంది.   అయితే స్వచ్ఛమైన ఆలోచనలు అంటే ఏమిటి? మనకు ముందుగా మనసులో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఆపై దాని తాలుకా ఆలోచనలు, పురి విప్పుతాయి. అలా కార్యరూపంగా బయటకు వచ్చే ఆలోచనలు లేదా అభిప్రాయాలు మంచి గంధం వలే గుభాళించాలి. మంచిగంధం, సువాసన మన దగ్గర ఎప్పుడు గుభాళిస్తుంది? ఒకటి మంచి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు లేదా మంచి గంధాన్ని మనం పూసుకున్నప్పుడు.   ఈ లోకంలో మంచి గంధంలాంటి విషయాలతో పాటు ద్వేషం, అహంకారం, అసూయ, పేరాశ, కామక్రోధాలు వంటి … Read entire article »

Filed under: ఇతరములు

భూలోక వైకుంఠము

గో శబ్ధమునకు మనుష్య శరీరములో విశిష్ట గుణములు గల జీవుడు అని అర్ధము. గో శరీరమును విందుగా యిచ్చిన వాడు ఆదిబలి గోవిందుడు. ఆయనయే అంత్య దినములలో గోపాలుడై భూమిపై అవతరించెను. ఆదిశంకరాచార్యులు ”భజగోవిందం గోవిందం భజ మూఢమతే” గోవిందుని భజించిన వారికి మూఢమతి తొలగుతుంది అని మనసు మార్చుకొని గోవింద నామస్మరణాన్ని కీర్తించాడు. అందుకే యేసు ఆదిబలి ప్రత్యక్షతతో గోవిందుని గోపాలునిలో చూచెను.   యోహాను 6:53-55. ”కావున యేసు ఇట్లనెను. – మీరు మనుష్య కుమారుని (గోవిందుని) శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని, మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నారక్తము నిజమైన పానమునైయున్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాని యందును నిలిచియుందుము. మనుష్యపుత్రుని (గోపాలుని) ఆదిబలి శరీరమును భుజించిన వాడే పరలోక రాజ్యమునకు అర్హుడు అని యేసు బోధించెను. ఆదిబలిలో గోవిందుని శరీరమును ఆత్మను స్వీకరించిన ఇంధ్రాదులు భూమిపై అవతరించి దేవుని ఆది సంకల్పమును భూమిపై నీడలా చూపించి పరమపదమును గోపాలునిలో పొందుకుంటారు.   జాతీయ చిహ్నములో నాలుగు సింహములు క్రింద ధర్మ … Read entire article »

Filed under: ఇతరములు

రాష్ట్రీయ స్వయం సేవక్‌

భగవాన్‌ శ్రీలహరికృష్ణగారు ఆర్‌.ఎస్‌.ఎస్‌. వారి గురించి తన సందేశములో చెప్పిన కొంత భాగమును యిక్కడ మనము చూద్దాం! ”ఈ రాష్ట్రీయ స్వయం సేవాకా సంఘము (ఆర్‌.ఎస్‌.ఎస్‌.) జనులు భారతీయ హిందూ సాంప్రదాయము కొరకే పోరాడుచున్నారని తెలుసుకున్నాను. వారు ఆ విధముగా చేయకపోయిన యెడల భారతదశపు సాంప్రదాయము, నాగరికత ముక్క చెక్కలై పూర్తిగ రూపు మాసిపోయి వుండెడిది. నా ప్రియమైన స్నేహితులారా! బ్రిటీష్‌వారు ఇక్కడి వారినందరినీ మార్చలేదు. మహ్మదీయులు మార్చలేకపోయారు. వారు 2000 సంవత్సరముల వరకు మన దేశాన్ని పరిపాలించియున్నారు. అక్కడక్కడ కొంత మంది జనులు మారియున్నారు. కాని నిజమైన సారం గల జనులు భారతదేశంలోనే వున్నారు. విదేశీ మతముల ప్రమేయము వారిపై పడలేదు. మహ్మదీయులు మక్కావైపు చూస్తారు. క్రైస్తవులు రోమా పట్టణమువైపు చూస్తారు. నిజమైన హిందువులు ఎటు చూస్తారు? ఇది వారి దేశము. వారు భగవంతుని వైపు మాత్రమే చూడగలరు. తను దిగివచ్చి వారికి సహాయము చేస్తానని దేవుడు వారికి వాగ్ధానము చేసియున్నాడు. అతను దిగివచ్చిన సరియైన సమయమును మనము తెలుసుకోవాలి. అదే ముఖ్యము. అతను దిగివచ్చినప్పుడు యిక విజయము మనదే. అందుకే హిందువులందరూ ఐక్యము కావాలి. మీ హృదయములలో ఏముందని నాకు తెలుసు. పోపు భారతదేశమునకు వచ్చినప్పుడు దానిని ఎదిరించినవారు ఎవరు? అందరూ … Read entire article »

Filed under: ఇతరములు

ఒకే దేవుడు! ఒకే దేశము!

సర్వమత సమావేశము – దేశీయ సమైక్యతా సమావేశము ”ఏకం సత్‌ విబ్రాహ బహుధా వధంతి” – భగవంతుడు ఒక్కడే! జ్ఞానులు ఆయనను పలు పేర్లతో పిలుచుచున్నారు అనేది దీని అర్థం. భగవంతుడు ఒక్కడే. ఆయననే హిందువులు నారాయణ అనియు, యూదులు యెహోవా అనియు, క్రైస్తవులు క్రీస్తుయేసు అనియు, ఇస్లామీయులు అల్లా అనియు పిలుచుచున్నారు అని చెప్పడము మాత్రమే కాకుండా కార్యసాధనలో ముందడుగు వేస్తుంది మనుజ్యోతి ఆశ్రమము. 47వ కల్కిజయంతి ఉత్సవములో కూడా సర్వమత సమావేశము అంటే సర్వమతముల సమ్మేళనమును ఏర్పాటుచేయడము జరిగినది. అన్ని మతములకు చెందిన మతనాయకులు, గురువులు, బిషప్‌లు, మహ్మదీయ మత గురువులను ఆహ్వానించి ఒకే వేదికపైన సర్వమత సమావేశము మరియు దేశీయ సమైక్యతా సమావేశమును తెలుగు కార్యక్రమమును ఏర్పాటు చేసారు. ఆ సమావేశమునకు ఆంధ్రప్రాంతము నుండి అనేకమంది ప్రముఖులు విచ్చేసియున్నారు. ఆ సమావేశమునకు ఆర్యవిథ్యాభూషణ ఆగమనాఛస్పతి డాక్టర్‌. వి. రాజగోపాలచక్రవర్తిగారు అధ్యక్షత వహించారు. ఆయన తన అధ్యక్ష ఉపన్యాసములో… ఈ మూడు వర్గముల వారు యిక్కడ ఒకే పందిరి క్రింది కలవడము, నాకు త్రివేణి సంగమము గుర్తుకు వస్తుంది. గంగ, సరస్వతి, యమున. ఈ రోజు ఈ పవిత్రమైన కల్కిజయంతి మహోత్సవముల సందర్భముగా మనము, భగవాన్‌ శ్రీలహరికృష్ణగారి ఉపదేశ స్నానం మనమందరము ఈరోజున చేసాము. ఈ రోజు … Read entire article »

Filed under: ఒకే దేవుడు! ఒకే దేశము!

మకరజ్యోతి

దీపం వెలిగించి కుంచం క్రింద పెట్టరు ఇంటనుండు వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్థంభం మీద పెట్టెదరు దీపం అనగా ఈ మనుజ్యోతి పత్రికయే! ఈ మనుజ్యోతి అనే దీపం మీ గృహములో వెలుగించుకొనవలెను ఇది క్రొవ్వొత్తి కాదు, క్రొవ్వొత్తి వలే వెలుగిచ్చును క్రొవ్వొత్తి కరిగిపోవును గాని ఈ మనుజ్యోతి కరిగిపోదు! ఈ మనుజ్యోతియే నిజమైన మకరజ్యోతి ఇది మనుష్యులకు వెలుగినిచ్చు దివ్యమైన జ్యోతి ధర్మయుగంలో శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణయే నిజమైన మకరజ్యోతి మనుజ్యోతి ఆశ్రమంలో కల్కిజయంతి ఉత్సవములలో శ్రీలహరికృష్ణ తన దైవీక పిల్లలతో దర్శనమిచ్చుటయే నిజమైన మకరజ్యోతి! ఈ మనుజ్యోతి పత్రికను తరుచుగా చదివి, వెంబడించి, నాశనం లేకుండా, ధర్మయుగంలో అడుగుపెట్టి మనమంతా ఆ దర్శనమునకై వేచియుందాం! మనుజ్యోతి ఆశ్రంలో మకరజ్యోతియైన శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ దర్శనం పొంది ధన్యులమగుదాం! ఎవరు ఎవరు నీవారెవరు! పంతముకై నిలిచే వారెవరు! అంతమున నీతో రానివారు! కారెవ్వరు నీకు సొంతవారు! నవ్వగా నిలిచే నలుగురు! నువ్వు నలిగిపోగా రారు ఒక్కరు! మరి మారెదెవరు? మార్చెదెవరు? మార్చలేరు ఏ ఒక్కరిని ఎవరూ! సదా మారని వాడు ఒక్కరే! ఆయనే శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ!!! సుదా మధుర కిరణాల అరుణోదయం లహరికృష్ణయ్య కరుణామయుని శరణు తరుణోదయం తెరవెనుక హృదయీలు వెలుగైనవి…. మరణాల చెరసాల మరుగైనది. దివి రాజుగా భూమికి దిగినాడని… రవి రాజుగా యిలను మిగిలాడని నవలోక గగనాలు తెరిచాడని … పరలోక భవనాలు పిలిచాయని ఆరని జీవన జ్యోతిగా…. వెలిగే తారొకటి వచ్చింది ఆ జన్మ నామమే – ఒక మర్మ – లహరి బంధం ఆ బంధమే అనుభంధం… నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడై … Read entire article »

Filed under: కవితలు