தமிழ்| telugu

» ఆత్మీయ కధలు

ఏది కన్నులు కప్పెను

ఒక యౌవనస్థుడు ముక్తి పొందాలనే వాంఛతో సద్గురువును వెదుక్కుంటూ వెళ్ళాడు. తనతోబాటు ఒక దయ్యము రావటమును అతను ఎరుగక వుండెను. ఆ విధముగ అతను ప్రయాణము చేస్తూ కొన్ని రోజులకు ప్రక్కనున్న రాజ్యములో ప్రవేశించాడు. అతనితో వచ్చిన దయ్యము వూరుకోలేదు. ఆ రాజ్యమునకు వారసుడు లేడని తెలుసుకొని ఆ రాజు ఇతనినే కలుసుకొనేటట్లు చేసినది. రాజు ఆ యౌవనస్థుని బలమును, అందమును చూచి ప్రసన్నుడై తన రాజ్యమునకు తనను రాజుగ చేస్తానని చెప్పగా యౌవనస్థుడు దానిని అంగీకరించక తన లక్ష్యమును రాజుకు తెలియజేసి అక్కడ నుండి బయలుదేరి తన లక్ష్యమువైపు వెళ్ళెను. ఈ శోధనను దాటి వచ్చిన అతనికి ఇంకొక శోధన కాచుకొనియుండెను. దయ్యము తన ఓటమికి బాధపడక మరియొక పోటీకి సిద్ధపడినది. యౌవనస్థుడు ఇంకొక రాజ్యములో ప్రవేశించాడు. అక్కడ జనులు పండుగ చేసుకొంటూ వుత్సవములతో చాలా సంతోషముగ వుండిరి. ఇతను వీటిని చూస్తూ ముందుకు సాగిపోయెను. అతనితో వచ్చిన దయ్యము తన పనిని ప్రారంభించినది. ఈ పండుగ వుత్సవాలు ఏమిటని విచారించి ఇది ఆ రాజ్యపు యువరాణికి స్వయంవరమని తెలుసుకొని అతనిని అక్కడికి నడిపించినది. ఇతను ఒక ప్రక్కగ నిలబడి గమనించుచుండెను. అటుగ వచ్చిన యువరాణి ఇతని యవ్వనమును, బలమును చూచి మోహించి … Read entire article »

Filed under: ఆత్మీయ కధలు

గొప్పలు చెప్పుకోకు

వెంకటేశ్వర స్వామి గుడి పూజారి పురంధరయ్యగారి సతీమణి సత్యవతి, ఆ రోజు ప్రసాదంలోకి, కరివేప ఆకు దొరక్క, అది లేకుండానే పులిహోర, దద్ధోజనం తయారు చేసింది. ఆమె తన పుత్రులతో ”బాబూ! మీరు ఎక్కడైనా ఓ కరివేప మొక్కను తెచ్చి నాటకూడదు! స్వామి వారి ప్రసాదంలోకి ఈరోజు కరివేపాకు దొరకనే లేదు….” అంది. మర్నాడు పిల్లలు అశ్వని, రోహిణి ఒక పెద్ద కరివేప మొక్క తెచ్చి వాకిట్లో నాటారు. అశ్వని మిత్రుడు రాజు ”అశ్వనీ! ఇదిగో రా! వేప మొక్క. దీన్ని వాకిట్లో నాటితే, వేసవిలో కమ్మని గాలి, గుడికి వచ్చి పోయేవారికి మంచి నీడను యిస్తుంది” అంటూ, తానూ సాయం చేసి వేపమొక్క నాటాడు. రోహిణి స్నేహితురాలు జయ వచ్చింది. ”రోహిణీ! ఇలా రావే. ఈ రోజు మా ఇంట్లో చాలా అరటి పిలకలు వుంటే, అందరికీ ఇస్తున్నా, ఇదిగో నీకూ తెచ్చాను. దీనిని ఇంటిముందర నాటావంటే, గుడికి ప్రసాదానికి వెళ్ళేటప్పుడు ఎంచక్కా ఓ అరటి ఆకు తీసుకెళ్ళవచ్చు” అంటూ, ఇద్దరూ కలిసి అరటిపిలక నాటారు. ఒకే రోజు, కరివేప, వేప, అరటి మూడు మొక్కలు అందంగా వాకిట చేరాయి. సత్యవతి, పిల్లలు నాటిన మొక్కలు చూసి, ముఖ్యంగా అరటి పిలకను, కరివేపను చూచి ఎంతో … Read entire article »

Filed under: ఆత్మీయ కధలు

మంచి ముత్యము

బాగా తయారైన ముత్యము ఆల్చిప్పలో నుండి బయటకు తీయబడినది. ఆ ముత్యమునకు ఒక్కటే ఆనందం. ఆహా! ఎంత కాంతి, ఎంత గాలి! అని ఆనంద పడినది. అది ఇప్పటివరకు నివసించిన ఆల్చిప్పను చూచి ఈ విధముగా చెప్పినది. చీకటి గదిలో భయంకరమైన చలి మధ్యలో నీవద్ద నేను ఇంతకాలము నివసించాను. ఈ దినమున నీవద్ద నుండి నాకు విడుదల దొరికినది అని చెప్పుకొనుచూ బయటకు పోయినది. మత్యము తన పుట్టిన చోటును గురించి ఆ విధముగా మాట్లాడుటను విని ఆల్చిప్ప కన్నీరు విడిచినది. కొన్ని దినములు గడిచిపోయినవి. అందమైన మాలలో అమర్చబడి, అలంకార అద్దములలో ముత్యముల మధ్యలో పొదిగి వుంచబడినది. మెడలో వేసుకొనుటకు తయారు చేయబడిన మాలలో, మధ్యలో ఆ ముత్యము అమర్చబడి యున్నది. అది ఆ షాపులో ఎంతో ప్రకాశవంతంగా విరజిల్లుతూ వున్నది. అప్పుడు దానికి చాలా గర్వము వచ్చినది. ఆ ముత్యము పొదగబడిన ఆ మాలను ధనవంతుల కుటుంభ స్త్రీలు తీసుకొనుట, చూచుట, వేసుకొని అద్దములో చూసుకొని సంతోషపడుట, ఖరీదు మాట్లాడుట, ఆ షాపువాడు వెల తగ్గించనని అనుటయు ఇవన్నియు ఆ ముత్యమునకు చాలా అతిశయముగా కనిపించినవి. ఒక రోజున ఒక శ్రీమతి తన భర్తతో ఆ షాపుకు వచ్చినది. ఆమె … Read entire article »

Filed under: ఆత్మీయ కధలు

ఉపకారము

పక్షులన్నిటికీ రాజైన గరుడపక్షి తన ప్రజలనందరినీ సమావేశ పరిచి, వారి కష్ట సుఖాలను విచారించ సాగింది. ”ప్రియమైన పక్షులారా! మీరందరూ మా పాలనలో సుఖంగా ఉన్నారని భావిస్తాం. మీరు ఏమైనా చెప్పదలచుకుంటే సంశయించకుండా చెప్పండి” అని చెప్పింది. ”పక్షిరాజా! మీ చల్లని పాలనలో మా పిల్లా పాపలతో మేం సుఖంగా జీవిస్తున్నాం” అని చెప్పాయి ముక్తకంఠంతో. ”కానీ నేను అడిగేది మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? మీరందరూ ఏవిధంగా జీవిస్తున్నారు?” అనే విషయం గురించి. ”మహారాజా! మా కోయిల జాతి చక్కగా పాటలు పాడుతూ అందరినీ సంతోషపెడుతున్నది. మా పాటలు వినగానే వసంతకాలం వచ్చిందని అందరూ ఆనందిస్తారు. అందుకే అందరూ మేం కాకిలాగా నల్లగా ఉన్నాకూడా మమ్మల్ని ఇష్టపడుతున్నారు. మా బాధల్లా కాకి మా రంగులో ఉందే అని మాత్రమే. భగవంతుడు దయామయుడు కనుక మాకు కాకిస్వరం మాత్రం ఇవ్వలేదు. కాకి రంగు ఇచ్చినా” అని కోకిల విన్నవించింది వెనుకగా ఎక్కడో ఉన్న కాకిని చూస్తూ. ”రాజా! మా చిలుక జాతి, మానవులు పలికిన మాటలన్నీ తిరిగి పలికి, వారికి స్నేహితులుగా ఉంటున్నాం. వారి పిల్లల మాటలను ‘చిలక పలుకులు’ అని మా పేరున అంటూంటారు. మాకు బాగా మాగిన పండ్లను తీసుకొచ్చి పెడతారు. వారి తోటల్లో మేం కొరికిన … Read entire article »

Filed under: ఆత్మీయ కధలు

మేకపిల్ల – తంగేడు పువ్వులు

వైశాఖ మాసంలో ఒక చిన్నమేకపిల్ల తన తల్లివద్ద ఆడుకొంటోంది. ఉల్లాసంగా అదొక కుప్పిగంతు వేసి, తల్లితో అంది. ”అమ్మా! అమ్మా! అవిగో, తండేడు చెట్లు. వాటి పువ్వులను నేను కడుపార మేస్తాను.” అందుకు తల్లిమేక ఇలా అంది. ”బిడ్డా! ఆ పువ్వులను మేయటం నీకంత సులభం కాదు. తండేడు పువ్వులు నీ చేజిక్కటానికి ముందు అనేక గండాలు గడువవలసి వున్నాయి. రాబోయే భాద్రపదాశ్వయుజ మాసాలు నీకంతగా శుభదినాలు కావు! ఎవరైనా నిన్ను ఎత్తుకొనిపోయి దుర్గాదేవికి బలి యివ్వవచ్చు. అది తప్పితే భయానకమైన కాళీపూజ వస్తోంది; అదృష్టవశాత్తు ఆ గండం కూడా తప్పితే, ఇంకా జగద్ధాత్రీపూజ వుంది. ఆ సమయములో మన జాతిలో మిగిలివున్న మగసంతతినంతా దాదాపుగా జాతరలో కడతేరుస్తారు. మహా అదృష్టవశాన నువ్వీ గండాలన్నిటిని గడిచి బతికి పెద్దవాడవైతే దీపావళినాటికి తంగేడుపువ్వుల విందును ఆరగిద్దువుగానిలే! అప్పుడు మంచి తంగేడు పువ్వులు దొరుకుతాయి కూడా.” ఈ కథలోని మేకపిల్ల మాదిరి మన నవ యౌవనోత్సాహం కల్పించే మనోరథాలన్నిటికీ తలలూపకూడదు – వాటిని తీర్చుకొందామనే అత్యుత్సాహం కూడదు. మరేమంటే, జీవనయాత్రలో సంభవించే గండాలు అనేకాలని మనస్సులో జ్ఞప్తి వుంచుకొని గొంతెమ్మ కోరికలను సాధ్యమైనంత వరకు చంపుకోవటమే ఉత్తమం. – కూర్పు : సుబ్రమణ్యం, వైజాగ్‌ … Read entire article »

Filed under: ఆత్మీయ కధలు

తల్లి తరువాతనే భార్య

భారతీయ పరదేశి కొంగని కధ ఓం నమో భగవతే శ్రీలహరికృష్ణాయ నమః భగవంతుడే శరణం! భగవంతునికే సమస్తం సమర్పణం! ఒక గ్రామములో వృద్దురాలు ఒకామె వుండినది. ఆమెకు ఒక కొడుకు వున్నాడు. ఈమె కష్టపడి, వానిని బాగుగా పెంచుతూ వచ్చినది. ఎటువంటి కష్టము లేకుండా అతడు పెరిగి, యవ్వనుడయ్యాడు. ఆ వృద్దురాలు ఒక రోజు తన కొడుకును చూచి, ”నాకు యిప్పుడు వయస్సు ఎక్కువైంది. ఇంటి బాధ్యతలు కోడలుకు అప్పగించి, నేను భగవంతుని స్మరిస్తూ నా జీవిత కాలమును నెమ్మదిగా గుడుపుదామనుకొంటున్నాను. నీవు త్వరగా, ఒక అమ్మాయిని చూచి నిశ్చయము చేసుకొని తీసుకొని రా!” అని చెప్పినది. దానికి అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు. ”అమ్మా! నీవు ఇంటిలోనే వుండు. నేను కష్టపడి ధనమును సంపాదించుకొని వస్తాను. కోడలు వచ్చిన తరువాత నీవు వంటగదికి కూడా వెళ్ళవలసిన అవసరము వుండదు” అని చెప్పి తల్లిని ఓదార్చాడు. అబ్బాయికి వివాహము జరిగింది. నూతన దాంపత్య జీవితములో అతడు గొప్ప ఆనందమును పొందాడు. వచ్చిన క్రొత్తలో సాధువుగా కనబడిన కోడలు కాలము గడిచే కొలది తన నిజ స్వరూపమును చూపించుట ప్రారంభించినది. వృద్దురాలికి ఎటువంటి అధికారము లేదు. కోడలే ఆమెకు అన్నం పెడుతూ వున్నది. కొడుకు తల్లిని పట్టించుకొనడము లేదు. ఉదయమున పనికి వెళ్ళి, … Read entire article »

Filed under: ఆత్మీయ కధలు