தமிழ்| telugu

» ఇతరములు

సృష్టి యొక్క సరిహద్దులు

భగవంతుడు మనకు వర్షం అనుగ్రహించినప్పుడు ఉరుములతోను, మెరుపులతోను అనుగ్రహించియున్నాడు. ఆ వర్షపు నీరు అనేది సముద్రం, నది, కాలువలోను కాకుండా, మురికి గుంటలో పడి కలుషితం అయినను, ఆ సూర్యుడు తన వేడి చేత ఆ నీటిని తిరిగి ఆవిరి రూపములో తీసుకొనుచున్నాడు. ఇది ప్రకృతి యొక్క ప్రక్రియ. ఇదేవిధముగా భగవంతుడు మనుష్యులను పంచేంద్రియ ముల స్వభావము వల్ల భూమికి పంపించి తిరిగి వైంకుంఠమునకు తీసుకొనుచున్నాడు. ఉదాహరణకు చూచినట్లయితే, భగవంతుడు మనకు వర్షం ఉరుములతోను, మెరుపులతోను అనుగ్రహించి యున్నాడు. ఈ ఉరుములు, మెరుపులు అనేది ఆయన యొక్క కోపముగా వున్నది. ఆ వర్షపు నీరు భూమి మీద పడటం అనేది మనుష్యుని యొక్క పంచేంద్రియముల స్వభావము వలన భూమికి పంపివేయుటగా వున్నది. ఆ వర్షపు నీరు అనేది మురికి గుంటలో పడి కలుషితం అవుతుంది. ఈ మురికి కలుషితం అనేది మనుష్యుని యొక్క పంచేంద్రియ స్వభావముగా వున్నది. ఆ కలుషితం అయిన మురికి నీటి నుండి సూర్యుడు తన వేడి చేత (వేడి అనేది భగవంతుడు మనలను పరీక్ష చేయుటగా వున్నది) మురికిని భూమి మీద విడిచిపెట్టి, ఆవిరి రూపములో ఆ నీటిని ఏవిధముగా తీసుకుంటున్నాడో అదేవిధముగా మన యొక్క విశ్వసించి చూచే స్థితిలో కంటికి … Read entire article »

Filed under: ఇతరములు

నటరాజ లహరిలోని తత్వ రహస్యం

”ఓం బూర్‌ బృహస్వహా తత్సవితుర్‌ వరేణ్యం బర్గోదేవా స్వదీమహి ద్వియో యోన ప్రచోద యత్‌” స్వయంభుగా వెలసిన జీవదాత అయిన పరమేశ్వరుడు జీవమును ఇచ్చి తిరిగి తీసుకొనే శక్తి సామార్థ్యాలు ఆది నుండి కలిగినవాడై యున్నాడు. పరమపురుషుడు తప్ప స్వర్గలోకములోకి ఎక్కి పొయిన వాడు ఎవడూ లేడు. ఈయనే ఆది మధ్యాంత రహితుడు అనే పరమార్థం. మన భారతీయులు ఈశ్వరుడిని లింగరూపంలో ఆరాధిస్తారు. దాని పరమార్థం స్త్రీ పురుషుల కలయికలో రానైయున్న పరమపురుషుడు. అదే శివుడిని నటరాజ దక్షిణా మూర్తిగా కొలుస్తారు. నటరాజ నృత్యభంగిమ నాట్యం కాదు ఇది, ఆనంద నటనా తత్వ భావం. ఈ ఆనంద నటనా భంగిమ వెనుక సృష్టి రహస్యం దాగి ఉంది. ఈ జగత్‌ అంతా సృష్టి స్థితి లయ నాట్య విన్యాసం. ఈ సమస్త విశ్వ ప్రక్రియలు ఆ నీతి సూర్యుడైన పరమ పురుషునిలోని ఒక భాగమే. ఆయనే అన్నింటికీ మూలం. ఎటువంటి ప్రసరణ లేకుండా జీవము లేదు అనుట అందరికి తెలిసిన సిద్ధాంతము. ఈ ప్రపంచంలోని సమస్త పద్ధతులు కూడ ఎల్లప్పుడు వృత్తాకార కదలికను కలిగియున్నది. మనుష్య శరీరం సజీవముగా ఉండుటకు శరీరమంతయు రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో అలాగే అన్ని గ్రహములు తమ తమ గ్రహ పదములలో సూర్యుని … Read entire article »

Filed under: ఇతరములు

ఆ ది బ లి

ఆదియందు నారాయణుడు ఆకాశమును భూమిని సకల జగత్తును సృష్టించెను. ఆ సమయమున సముద్రముగాని మరణము గాని పాతాళము గాని లేదు. అది ఒక దైవీక పరిపాలన! శ్రీమన్నారాయణుడు వైకుంఠములో జ్యోతిలో ఆసీనుడై, రాజులకు రాజుగ, ప్రభువులకు ప్రభువుగ పరిపాలించుచుండెను. ఆ సమయములో ఆయనకు విరోధులుగాని శత్రువులుగాని ఎవ్వరూ లేరు. ఆ దేవలోక ప్రజలు ఆ జ్యోతిని చూచుచు ఆయన ఒక్కడే పరిశుద్దుడని స్తుతించుచుండెడివారు. వారందరూ ఒకే దేవుడు ఒకే జాతి అనే సిద్ధాంతములో వుండెడివారు. అప్పుడు జాతి, కుల, మత, వర్ణ బేధములు ఏమీ లేవు. మనుష్యులందరూ ఇతరులను ప్రేమించు చుండెడివారు. చాలా రాజ్యములు వుండెను. కాని యుద్ధములు లేవు. భూలోక వాసులకు, భగవంతుని జ్యోతి గురించి తెలుసు గాని ఆ జ్యోతిలో నివసించుచున్న పరమపురుషుడు ఎవరో వారికి తెలియదు. వారు శ్రీమన్నారాయణుని చూడలేదు. ఆ సమయముననే శ్రీమన్నారాయణుడు దేవలోక ప్రజల క్షేమం కొరకై ఒక బలిని నిర్వహించెను. దాని ద్వారా చిరకాలము జీవించి అమరత్వము పొందుడని వారికి చెప్పి, వారిని దీవించెను. అది మాత్రమే కాకుండా శ్రీమన్నారాయణుడు ఒక మనుష్యునిగ వారికి కనిపించి, ”నేనే వైకుంఠమునకు, భూమికి రాజునని” ప్రకటించెను. దీనికి దేవలోక ప్రజలు నీవు మానవునిగ ఎట్లు రాగలవు అని ప్రశ్నించితిరి. … Read entire article »

Filed under: ఇతరములు

ఆత్మజ్ఞానం

ఈ లోకములో చెప్పడం, వినడానికి సంబంధించి మూడు విషయాలు వున్నవి. ఈ మూడింటికి మూడు ప్రత్యేకతలు వున్నాయి. 1. వ్యాకరణం, 2. కవిత్వం, 3. వేదాంతం. వీటిలో మొదటిది వ్యాకరణం చెప్పేవాడికి కష్టం, దానిని వినేవాడికి కష్టం. రెండవది కవిత్వం చెప్పేవాడికి కష్టం. కాని వినేవాడు సుఖంగా కూర్చొని విని బాగుందనో, బాగా లేదనో ఒక మాట విసిరేసి వెళ్ళిపోతాడు. మూడోది వేదాంతం. ఈ వేదాంతం యొక్క నేటి పరిస్థితి ఎలా వుందంటే ఏదైనా చెప్పవచ్చు. ఎక్కడైనా మొదలు పెట్టవచ్చు. ఎక్కడైనా ఆపేయ్యవచ్చు. వినేవాడు కూడా ఎంతసేపైనా వినవచ్చు. ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఆవిధంగా వుంటుంది. కాని ఈ వేదాలలో ప్రవచనాలను విని వదిలేయకుండా నిత్యజీవితంలో ఆచరణలో పెట్టేవారు నేడు చాలా తక్కువమంది మాత్రమే కానవస్తారు కాని వేదాంతోపన్యాసాలను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తే, అంతకంటే సుఖజీవి మరొకడు వుండడు. అయితే మనం విన్నవాటిని ఆచరణలో పెట్టాలంటే ఆత్మ తత్వాన్ని గ్రహించాలి. అయితే ఏమిటీ ఆత్మ తత్వం? మొదటిగా ప్రతీ వ్యక్తి నేను ఎవరిని? అన్న ప్రశ్నకు సమాధానం పొందగలగాలి. ఆత్మ నిస్సందేహంగా ప్రతీ జీవి హృదయంలోనూ వుంది. దేహ అస్తిత్వానికి అవసరమైన సర్వ శక్తులకూ అది ఆధారం. ఆత్మ తాలుకు శక్తి దేహమంతటా వ్యాపించి వుంటుంది. దానినే … Read entire article »

Filed under: ఇతరములు

ఆచారాలు మనిషికి హానికరం

ఆచరాలు మనిషికి హానికరం. నిజమైన మనుజ్యోతి ఆశ్రమాన్ని నిర్మించిన శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ దేవునికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. ఎందుకంటే ఆయన పలికిన ప్రతీ పలుకు మరణాన్ని జయించడానికి దారి చూపినట్లుగా వున్నాయి. ఆయన తీసుకువచ్చిన సత్యమేమిటో తెలుసా? ”ఒకే దేవుడు! ఒకే దేశము!” ఇక్కడ ఫలించే ప్రతీ వేదము ఒకే దేవుని కొరకు చెప్పుతున్నాయి. కాని మనం ఏమి చెప్తున్నాము? కులానికో దేవుడు, మతానికో దేవుడు అని అంటున్నాము. ఇటువంటి కాలములో దేవుని ఏవిధముగా కనుగొనగలము? దీనికి ఒక కధను చూద్దాము. ఒక వూరిలో ఒక రాజు వుండేవాడు. ఆ వూరిలో అన్ని రకాల ఆచారాలు, మత సాంప్రదాయాలు పాటించే జనాభా చాలా ఎక్కువ. కులాల పేరులతో, మతాల పేరులతో వాళ్ళు ఎప్పుడూ కొట్టుకొంటూనే వుంటున్నారు. ఆ రాజుకు ఏమి చేయాలో తోచలేదు. రాజ్యంలో ప్రజలంతా ‘నా దేవుడు గొప్ప, నా మతం గొప్ప’ అని చెప్పుకుంటూ, మనిషికి మనిషే శత్రువులుగా మారిపోయారు. ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం కనిపెడదామని రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రతీ మతం వారికి ఒక్కొక్క గుడి, ఆలయం కట్టడం ప్రారంభించాడు. హిందువులకు ఆలయములను, క్రైస్తవులకు చర్చీలను, ముస్లీములకు మసీదులను కట్టడం ప్రారంభించాడు. ఇలాగైన వారి మధ్యలో మార్పు … Read entire article »

Filed under: ఇతరములు

అర్చావతారము

మృత్యుంజయ లహరి దర్శనం భగవంతుడు ఎవరిలోనో ఒక గుంపు జీవులలోనికి ప్రవేశించుటకు కొన్ని వేల సంవత్సరములుగా ప్రయత్నించుచున్నాడు. ఆ మర్మము అన్ని మత గ్రంధాలలోను ప్రవక్తల ద్వారా బయలుపరచెను. ఆ యుగాంత సమయము వచ్చినప్పుడు ఆయన ఒక పరమ పురుషునిలా అగుపించుచున్నాడు. ఈ రోజు ఆయన ఒక సాధారణ మనుష్యునిలా భూమిపై తిరుగుచుచున్నాడు. మీరు ఏ మతమునకు చెందినవారని ఆయన చూడటము లేదు. సర్వ మానవ ముక్తికై ఆ శాంతిని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ కలియుగాంతములో భగవంతుడు తన నాయకత్వం క్రిందుగా ధర్మయుగమును రామరాజ్యమును స్థాపించియున్నాడు. దానికి సూచనగానే భూలోకవైకుంఠమైన మనుజ్యోతి ఆశ్రమమును స్థాపించియున్నాడు. నిత్య జీవముతో మనుష్యునికి మరణము లేని అమరత్వమును ఈ మనుజ్యోతి ఆశ్రమము ఇచ్చుచున్నది. ఈ రోజున ఆయన శబ్దమును, సువార్త సందేశమును విని మన హృదయములను తెరిచి ఆ వెలుగును ఇవ్వటానికి ఆయన ప్రయత్నించుచున్నాడు. చేతిలో పరిశుద్ద గ్రంధము, భగవద్గీత, ఖురాన్ ఉన్నంత మాత్రమున మనకు మెక్ష ప్రాప్తి కలుగనేరదు. అవి అన్నియు ఈ ఒకే భగవంతుని వలన ప్రవక్తల ద్వారా పలుకబడినవే అని నమ్మి, మనస్సు మార్చుకొని ఆ ఏకైక పరమపురుషుని హృదయముతో స్వాగతించి, ఆయనను చేరుకొనే ప్రయత్నము అతి వున్నతమైనది. అహంబ్రహ్మ అస్మి – నేను బ్రహ్మను వున్నాను, … Read entire article »

Filed under: ఇతరములు