தமிழ்| telugu

» ఒకే దేవుడు! ఒకే దేశము!

”ఒకే దేవుడు! ఒకే దేశము!”

రావుల పాలెంలో జరిగిన సర్వమత సమావేశము శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి దివ్య సముఖమున, మనుజ్యోతి ఆశ్రమ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో గత మే నెల 17వ తేదీ, బుధవారం సాయంత్రంన హైస్కూల్‌ గ్రౌండ్‌ పరిధిలో ‘సర్వమత సమావేశము మరియు దేశీయ సమైక్యతా సమావేశము’ ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమములో ఎందరో ఆధ్యాత్మిక వక్తలు, కవులు, రాజకీయవేత్తలు, పలు ప్రముఖులు మరియు శ్రీలహరికృష్ణగారి భక్తులు పాల్గొన్నారు. మొదటిగా ఈ కార్యక్రమము సంగీత కచ్చేరి కార్యక్రమముతో ప్రారంభమైనది, తరువాత మిమిక్రీ, భరత నాట్య కార్యక్రమములతో ముందుకు సాగింది. ఈ సమావేశమునకు నరసాపురం వాస్తవ్యులు, వ్యాఖ్యాత కేసరి అయినటువంటి శ్రీ రెడ్డప్ప ధవేజీగారు అధ్యక్షత వహించారు. ఆధ్యాత్మిక సంబంధము గురించి, వేదముల నుండి భగవంతుడు పలికిన మంచి సందేశములను ఆయన వివరించి, మనుజ్యోతి ఆశ్రమము గురించియు మరియు శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి గురించిన పలు విషయములను వివరించారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమములలో పాల్గొనుట వలన వచ్చే మంచి ఆశీర్వాదములను తెలుపుతూ కార్యక్రమమును ముందుకు కొనసాగించారు. ఇందులో పలు వక్తలు ప్రసంగించిన వాటిలో నుండి కొన్నింటిని మీ ముందు పెడుతున్నాము. మొదటిగా ఎ.పి.యస్‌. ఆర్‌.టి.సి., తెలుగు బుక్‌ ఆఫ్‌ అవార్డ్స్‌ కో – ఆర్డినేటర్‌, తాడేపల్లిగూడెం నుండి వచ్చిన శ్రీ సాయిశ్రీ గారు మాట్లాడుతూ, … Read entire article »

Filed under: ఒకే దేవుడు! ఒకే దేశము!

అల్లా, నారాయణ, క్రీస్తుయేసు – ఒకే దేవుడా? లేదా వెవ్వేరు దేవుళ్ళా?

ఒక రోజు నేను ”నారాయణ” అని చెప్పడానికి భయపడేవాడిని. ”అల్లా” అని చెప్పడానికి భయపడేవాడ్ని. కాని యేసుక్రీస్తు అని పిలవడానికి చాలా సంతోషించేవాడిని. ఇవన్నీ మనలో వున్న భావనలు మాత్రమే. కానీ ఒక రోజు నాకు ఏమని ఆలోచన వచ్చిందంటే, అల్లాయే న్యాయతీర్పు దినమునకు నాయకుడని, క్రీస్తుయేసే న్యాయతీర్పు దినమునకు న్యాయాధిపతియని, నారాయణుడే న్యాయము తీర్చేవాడని వ్రాయబడింది. ఒక తీర్పు తీర్చడానికి ముగ్గురు న్యాయాధిపతులుంటారా? అనే సందేహం వచ్చింది. ముగ్గురు న్యాయాధిపతులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారా? ఈ ముగ్గురు మూడు వెవ్వేరు దేవుళ్ళా? నేను భవిష్యపురాణములో ఏమని కనుగొన్నానంటే, నారాయణుడే ఆదాము – అవ్వను సృష్టించాడనే విషయం నన్ను పూర్తిగా కదిలించింది. ఆ నారాయణుడే ఆదాము, అవ్వను సృష్టించాడా? అల్లాయే ఆదాము – అవ్వను సృష్టించాడని ఖురాన్‌ చెబుతుంది. ప్రభువైన క్రీస్తుయేసే ఆదాము, అవ్వను సృష్టించాడని బైబిలు చెబుతుంది. కానీ అల్లాను ఎవరు సృష్టించారని ఎక్కడా చెప్పబడలేదు. నేను ఆశ్చర్యపడి బాగా ఆలోచించాను. అలా అయితే ముగ్గురు ఆదాములు సృష్టించబడ్డారా? ముగ్గురు అవ్వమ్మలు సృష్టించబడ్డారా? మూడు ప్రక్కటెముకలు తీయబడినవా? ముగ్గురు కయీనులు, ముగ్గురు హానోకులు వున్నారా? ఇది అలా అయ్యుండదనుకున్నాను. అయితే ఎందుకు జనులు దెబ్బలాడుకుంటున్నారు? అని కనుగొన్నాను. బైబిలులో ఏమని వ్రాయబడినదంటే, ప్రతీ … Read entire article »

Filed under: ఒకే దేవుడు! ఒకే దేశము!

విజయవాడలో జరిగిన సర్వమత సమ్మేళనము

ఒకే దేవుడు ! ఒకే దేశము! భగవాన్‌ శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి దివ్యసముఖమున విజయవాడలో జనవరి 8వ తేదీన జింఖాన గ్రౌండ్స్‌లో ‘సర్వమత సమ్మేళనము మరియు దేశీయ సమైక్యతా సమావేశము’ మనుజ్యోతి ఆశ్రమ ఆధ్వర్యంలో నిర్వహించబడినది. ఈ కార్యక్రమములో మాట్లాడిన పలు ఆధ్యాత్మిక వక్తల సందేశములు యిచ్చట మీకు యివ్వబడినవి. మొదటిగా సభకు అధ్యక్షత వహించినటువంటి విజయవాడకు చెందిన ఆర్థవిద్యా భూషణ ఆగమనాచస్పతి, సుప్రసిద్ధ టి.వి. వ్యాఖ్యాత డా|| శ్రీ వేందాంత రాజగోపాల చక్రవర్తి, ఎం.ఎ. పిహెచ్‌.డి. గారు మాట్లాడుతూ… ”ఈ రోజు మన నవ్యాంధ్ర ప్రదేశ్‌లో మొదటిసారిగా నిర్వహించబడిన ఈ సర్వమత సమావేశము అనునది చాలా అద్భుతమైన విషయము. ఇది చరిత్రలోనే లిఖించదగ్గ గొప్ప రోజు. ఆంధ్ర ప్రదేశ్‌ మరలా నూతనముగా ఏర్పడిన ఈ సమయములో, అమరావతి తిరిగి తన పూర్వ వైభవమును సంతరించుకొని రాజధానిగా ఏర్పడిన సమయములో, ప్రభుత్వానికి కూడా అన్ని మతాలు ఒక్కటే మరియు భగవంతుడు కూడా ఒక్కడే అనే మంచి సందేశమును అందించే ఈ శుభసందర్భంలో ఈ సర్వమత సమావేశమును ఏర్పాటు చేసిన శ్రీలహరికృష్ణగారి భక్తులకందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకొంటున్నాను. ఈ రోజు భారతదేశములోనే మాత్రమే కాకుండా యావత్‌ ప్రపంచమంతటినీ ఒకే విధముగా భావించి చెప్పిన మహా మంత్రం, ప్రధానమైన మతాల … Read entire article »

Filed under: ఒకే దేవుడు! ఒకే దేశము!

ఒకే దేవుడు! ఒకే దేశము!

భగవాన్ శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ నామములో పాఠకులందరికీ మా కృతజ్ఞతలు. గడిచిన మూడునెలల్లో భగవంతుని దయ వలన అనేక ప్రాంతాల్లో ‘ఒకే దేవుడు! ఒకే దేశము!’ అనే కార్యక్రమము ఆంధ్రాలోను, పలు రాష్ట్రములలోను చాలా అద్భుతముగా జరిగినది. సెప్టెంబర్ నెలలో ఒడిస్సా రాష్ట్రములోని కోరాపుట్లోను, అక్టోబర్ నెలలో ఆంధ్రాలో ఏజెన్సీ ప్రాంతమైన పాడేరులోను శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి మహిమ సన్నిధిలో, మనుజ్యోతి ఆశ్రమ ఆధ్వర్యంలో ‘సర్వమత సమావేశము మరియు దేశీయ సమైక్యతా సమావేశము’ ఎటువంటి కుల, మత, ప్రాంతీయ బేధము లేకుండా చాలా బ్రహ్మాండముగా జరిగినవి. ఈ కార్యక్రమములకు ఆయా ప్రాంతాలలోనున్న శ్రీలహరికృష్ణగారి భక్తబృందం మాత్రమే గాక ప్రభుత్వ అధికారులు, స్థానిక రాజకీయ నాయకులు మరియు ఆధ్యాత్మిక ఆసక్తి కలిగిన కవులు, పెద్దలు చాలా మంది విచ్చేసి ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని భగవంతుని ఆశీర్వాదములు పొందుకొని వెళ్ళారు. ఆ విధముగా పాడేరులో జరిగిన కార్యక్రమములో పలువురు మాట్లాడిన సందేశములను మనము ఇక్కడ చూద్దాము! అక్టోబర్ నెలలో 16వ తేదీన ఆంధ్రాలో విశాఖజిల్లా ఏజెన్సీ మన్యప్రాంతమైన పాడేరులో జరిగిన ‘సర్వమత సమావేశము మరియు దేశీయ సమైక్యతా సమావేశము’నకు విశాఖపట్నంకు చెందిన తెలుగు అధికార భాష సంఘ అధ్యక్షులు, కవి అయినటువంటి శ్రీ కె. నరసింహనాయుడు గారు అధ్యక్షత వహించారు. శ్రీమన్నారాయణ … Read entire article »

Filed under: ఒకే దేవుడు! ఒకే దేశము!

ఒకే దేవుడు! ఒకే దేశము!

సర్వమత సమావేశము – దేశీయ సమైక్యతా సమావేశము ”ఏకం సత్‌ విబ్రాహ బహుధా వధంతి” – భగవంతుడు ఒక్కడే! జ్ఞానులు ఆయనను పలు పేర్లతో పిలుచుచున్నారు అనేది దీని అర్థం. భగవంతుడు ఒక్కడే. ఆయననే హిందువులు నారాయణ అనియు, యూదులు యెహోవా అనియు, క్రైస్తవులు క్రీస్తుయేసు అనియు, ఇస్లామీయులు అల్లా అనియు పిలుచుచున్నారు అని చెప్పడము మాత్రమే కాకుండా కార్యసాధనలో ముందడుగు వేస్తుంది మనుజ్యోతి ఆశ్రమము. 47వ కల్కిజయంతి ఉత్సవములో కూడా సర్వమత సమావేశము అంటే సర్వమతముల సమ్మేళనమును ఏర్పాటుచేయడము జరిగినది. అన్ని మతములకు చెందిన మతనాయకులు, గురువులు, బిషప్‌లు, మహ్మదీయ మత గురువులను ఆహ్వానించి ఒకే వేదికపైన సర్వమత సమావేశము మరియు దేశీయ సమైక్యతా సమావేశమును తెలుగు కార్యక్రమమును ఏర్పాటు చేసారు. ఆ సమావేశమునకు ఆంధ్రప్రాంతము నుండి అనేకమంది ప్రముఖులు విచ్చేసియున్నారు. ఆ సమావేశమునకు ఆర్యవిథ్యాభూషణ ఆగమనాఛస్పతి డాక్టర్‌. వి. రాజగోపాలచక్రవర్తిగారు అధ్యక్షత వహించారు. ఆయన తన అధ్యక్ష ఉపన్యాసములో… ఈ మూడు వర్గముల వారు యిక్కడ ఒకే పందిరి క్రింది కలవడము, నాకు త్రివేణి సంగమము గుర్తుకు వస్తుంది. గంగ, సరస్వతి, యమున. ఈ రోజు ఈ పవిత్రమైన కల్కిజయంతి మహోత్సవముల సందర్భముగా మనము, భగవాన్‌ శ్రీలహరికృష్ణగారి ఉపదేశ స్నానం మనమందరము ఈరోజున చేసాము. ఈ రోజు … Read entire article »

Filed under: ఒకే దేవుడు! ఒకే దేశము!

భిన్నత్వములో ఏకత్వము

క్రీస్తుకు పూర్వము 2000 సంవత్సరాల కాలంలో అబ్రహాం ప్రవక్త ఆనాటి బహు దైవారాధన చేసే సమాజమునకు ఏకేశ్వరోపాసన ప్రబోధం చేసినట్లు దైవ గ్రంధాలైన తాల్మూద్‌, బైబిల్‌, ఖురాన్‌లు పేర్కొన్నాయి. యూదులు మరియు క్రైస్తవులు అయినను అబ్రామ్‌/అబ్రహమ్‌ అనియు ఇస్లాం వారు ఇబ్రహీం అంటున్నారు. వ్యక్తి ఒక్కరే! హిబ్రూ భాషలో అబ్రహము మరియు అరబీ భాషలో ఇబ్రహీం అని సంబోధిస్తున్నారు. అబ్రహమ్‌ ప్రవక్త మెసపటోమియాలోని యూఫ్రటీస్‌ నది ఒడ్డున ఉన్న ఉర్‌ పట్టణంలో జన్మించారు. ఆ కాలంలో అచటి ప్రజలు బహు దైవారాధన చేస్తూ పంచ భూతాల మరియు నవగ్రహాల విగ్రహాలను పూజించేవారు. ఆయన తండ్రి విగ్రహాలను చెక్కి రాజు మరియు ప్రజలకు అమ్మేవారు. పరమాత్మ యెహోవా/అల్లా అబ్రహాంను యుక్త వయసులో ప్రవక్తగా ఎన్నుకొన్నట్లు గాబ్రియేల్‌ దూత ద్వారా తెలుస్తున్నది. ఆనాటి నుండి అబ్రహాం గారికి దైవవాక్కు అవతరిస్తుంది. వారు ప్రవక్తగా సమాజమునకు ఏకేశ్వరోపాసన ప్రబోధం చేసారు. పూజ కొరకు విగ్రహాలను చెక్కుట పాపమని తండ్రిని నిరోధించాడు. నోవాహు ప్రవక్తకు దైవవాక్కు ఇచ్చిన యెహోవా/అల్లాయే తనకు గాబ్రియేల్‌ దూత ద్వారా సందేశాన్ని పంపిస్తున్నట్లు చెప్పేవారు. దేవుని తప్ప మరొకరిని ఆరాధించకూడదని సద్ధర్మాచరణ గల జీవిత విధానమును ఆచరించాలని ప్రచారం చేసేవారు. విగ్రహారాధన చేస్తున్న నమ్రోద్‌ రాజుకు పరమాత్మ … Read entire article »

Filed under: ఒకే దేవుడు! ఒకే దేశము!