தமிழ்| telugu

» పాఠకులకు గమనిక

ఘటము – ఘట లక్షణములు

ఘటమనగా మట్టి కుండ, వేదాంత అర్థము మానవ దేహం. కనుక ఈ దేహం కూడా మట్టి కుండ వలే యుండి, కొన్నాళ్ళకు పాడైపోవును. పాడై పగిలిన కుండ పనికిరాని విధంగా, ఈ పాడైన దేహం ఉపయోగపడదు. ఘటాకాశము శూన్యమగునట్లు, దేవాత్మ కార్మాను సారముగా ఏదో ఒక జీవియై సృష్టియందు ఉద్భవించును. ఇట్లు ఉద్భవించిన జీవికి సప్త ఆవరణములు కలుగును. దుఃఖము, శరీర పరిగ్రహణం, కర్మం, రాగద్వేషములు, అభిమానము, అవివేకము, అజ్ఞానం, దుఃఖము, కర్మ, శరీర పరిగ్రహం వలన వచ్చినవి. కర్మ, రాగ ద్వేషములు వలన వచ్చినది. రాగద్వేషాదుల వలన అభిమానము వచ్చినవి. అభిమానము, అవివేకము వలన వచ్చినది. అవివేకము, అజ్ఞానము వలన వచ్చినది. ఈ అజ్ఞానమనునది అనాధి నుండి వున్నది. ఇది తొలగి పోవాలంటే సద్గురు వాక్యానుసారము క్రమం తప్పక సద్గురు సూత్ర మూల మెరిగి ఆచరణలో వుండాలి. ఇదియే ఋషి ప్రోక్తమైన ఆచరణ. ఈవిధంగానే మానవులు తరించిరి. ఆత్మ అనగా నేమి? జగత్తు ఆకారముగా తోచబడిన వస్తు సముదాయమునకు అంతటా నిండినదీ ఆత్మ. అందుచేతను సద్గురు సన్నిధిని చేరి చతుర్విద శుష్రుషలు చేసి స్వరూప సాక్షాత్‌కారమును తెలుసుకున్న పిమ్మట, తానెవరో తెలియబడును. పై విధంగా తెలుసుకున్నవారు సప్త ఆవరణ దాటిన వారగుదురు. వీరే జ్ఞానులు. … Read entire article »

Filed under: పాఠకులకు గమనిక, శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి బోధనలు

పాఠకులకు గమనిక

ఈ మనుజ్యోతి పత్రికను తరుచుగా చదువవలెనని ఆసక్తి గలవారు ప్రధానకేంద్ర చిరునామాకు వుత్తరము వ్రాసి మీ అడ్రసులను నమోదు చేయించుకొనవలెను. మా పత్రికలు మీకు నేరుగానో లేక తపాలా ద్వారానో ఉచితముగా పంపించబడును.  ఈ పత్రిక గురించి మీ జీవితములో పొందుకొనిన ఆత్మీయ అనుభవములను మాకు వ్రాసి పంపించినట్లయితే మా సంచికలో సంధర్భమును బట్టి ప్రచురించగలము. మనుజ్యోతిలో చోటు చేసుకొనే కవితలు, సారాంశములు కల్కిమహా అవతార పురుషుడైన శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి మహిమార్థమై సమర్పించబడుచున్నవి. శ్రీలహరికృష్ణగారి ఉపన్యాసములనుండియు మరియు వేదములలోని రహస్యములను ఈ పత్రికలో ప్రచురించుచున్నాము. తరుచుగా వెలువడే ఈ మనుజ్యోతి పత్రికలో భగవద్గీత సారాంశము మరియు పరిశుద్ద ఖురాన్‌ యొక్క సారాంశము అను పుస్తకములలోని భాగములను అంచెలంచెలుగా ప్రచురించుచున్నాము. ఈ పుస్తకములు ప్రత్యేకముగా కావాలనుకొనేవారు మా చిరునామాను సంప్రదించగలరు.  ఇతర మతములవారు ఈ ఉపన్యాసములను అంగీకరించుటకు నిరాకరించవచ్చును. అందువలననే యిది శ్రీలహరికృష్ణగారి సిద్దాంతములను వెంబడించేవారి కొరకును, ”ఒకే దేవుడు – ఒకే దేశము” అనే చైతన్యమును నమ్మి దాని కొరకు వేచియున్నవారి నిమిత్తమును ఈ పత్రిక ఒక ప్రైవేటు సర్క్యులేషన్‌గా ప్రచురించబడుచున్నది. ఇతర మతములవారిని బాధించుటకు మాత్రము కాదు. భగవంతుని గ్రహించుటకు మతమును మార్చుకొనవలసిన అవసరము లేదు గాని మనస్సును మార్చుకొంటే చాలు అని చాటించుచున్నాము. కావున … Read entire article »

Filed under: పాఠకులకు గమనిక