தமிழ்| telugu

» వైకుంఠలోక ఉత్సవములు

మహా వైభవముగా మనుజ్యోతి ఆశ్రమములో

47వ కల్కి జయంతి ఉత్సవములు ఓం నమో భగవతే శ్రీలహరికృష్ణాయ నమః శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణయ్య అద్భుతమైన నామములో మనుజ్యోతి పాఠకులందరికీ కల్కిజయంతి శుభాకాంక్షలు తెలియజేయుటకు సంతోషపడుచున్నాము. మునుపటి పత్రికలో తెలియజేసిన విధముగా కల్కిజయంతి ఉత్సవములు మనుజ్యోతి ఆశ్రమములో మహావైభవముగా జరిగినవి. దానికి అనేక వేలమంది భక్తులు, కవులు, పండితులు, వేదాంత పుంగవులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు వచ్చి కలుసుకున్నారు. కాని ఎటువంటి జాతి, కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంతీయ, దేశ బేధములు లేకుండా ప్రపంచములో పలు దేశముల నుండియు, భారతదేశములో పలు రాష్ట్రముల నుండియు జనులు యిక్కడకు వచ్చి ”ఒకే దేవుడు – ఒకే దేశము” అను తారక మంత్రమును ఒకే నోట ఉచ్చరించినప్పుడు చూచుటకు చూడముచ్ఛటగా వున్నది. ఈ ఉత్సవములు జూలై 15వ తేదీ నుండి 23వ తేది వరకూ మనుజ్యోతి ఆశ్రమము నందు బ్రహ్మండముగా నిర్వహించబడినవి. అనేక వేల మంది ఈ ఉత్సవములలో కలుసుకున్నారు. అవి వారందరికీ చాలా ఆశీర్వాదకరముగా వుండినవి. భారతదేశములో అన్ని ప్రాంతముల నుండియు, అమెరికా, మలేషియా, బర్మా నుండియు చాలా మంది ఈ మీటింగులలో కలుసుకొనిరి. జూలై 1వ తేదీన ఆశ్రమములో జెండా ఎగురవేయబడినది. చుట్టుప్రక్కల జిల్లాలలోని కొందరు, ప్రక్క రాష్ట్రములలోనుండి కొంతమంది దానిలో కలుసుకొనిరి. జూలై 10వ … Read entire article »

Filed under: వైకుంఠలోక ఉత్సవములు

”ఓం నమో భగవతే శ్రీలహరికృష్ణాయ నమః”

ప్రియమైన సహోదర సహోదరీలారా, శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ నామములో మా శుభాకాంక్షలు. గత శీర్షికలో మీకు తెలియజేసిన విధముగా విధ్యార్ధుల సమ్మర్‌ క్యాంపు మనుజ్యోతి ఆశ్రమము నందును మరియు విశాఖ జిల్లాలో వున్న ఏజెన్సీ ప్రాంతములో అసరాడ ప్రాంతములోనూ బాగుగా జరిగినది. దానిలో అనేకమంది విధ్యార్ధినీ విధ్యార్ధులు కలుసుకొన్నారు. వారికి శరీర వ్యాయామములు, వేదముల నుండి అనేక వేదప్రవచనములను నేర్పించారు. ఈ కలియుగములో కలి ప్రభావము నుండి (నవీన నాగరికతనుండి) ఏవిధముగా కాపాడబడవలెనని పిల్లలకు నేర్పించబడినది. వారు నేర్చుకొనిన వాటిలో నుండి వారికి పరీక్షలు, ఆటల పోటీలు నిర్వహించబడినవి. ఉత్తీర్ణులయిన వారికి బహుమతులు కూడా యివ్వబడినవి. అంతే కాకుండా క్యాంపులో పాల్గొనిన ప్రతీ విద్యార్థికి సర్టిఫికేట్‌, బహుమతులు యివ్వబడినవి. ఈ సమ్మర్‌క్యాంప్‌లో పాల్గొనిన విధ్యార్థులకు మరియు ఉపాధ్యాయులందరికీ చాలా ఆశీర్వాదకరముగా వుండినది. రాజకీయపరముగా మన భారతదేశ ప్రస్తుత పరిస్థితిని మనము ఎల్లప్పుడు గమనించుకోవాలి. అదేవిధముగా ఆత్మీయముగా మన జీవన విధానమును కూడా మరిచిపోకూడదు. ఆవిధముగా మరిచిపోయినప్పుడే భగవంతుడు మనలను ముట్టుకుంటాడు. ప్రస్తుత కాలములో పెట్రోల్‌, డీసిల్‌, వంటగ్యాస్‌, కాయగూరల ధరలు, మన ఖర్చులు రోజు రోజుకూ పెరుగుతూనే వున్నాయి గాని వాటిలో తరుగుదల కనిపించడము లేదు. పల్లెలన్నీ పట్టణాలుగా మారుచున్నవి. భారతదేశము అన్ని దేశములతోను ఒప్పందములను బలోపేతము చేసుకొనుచున్నది. దీనితో … Read entire article »

Filed under: వైకుంఠలోక ఉత్సవములు

”ఓం నమో భగవతే శ్రీలహరికృష్ణాయ నమః”

ప్రియమైన సహోదర సహోదరీలారా, శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ నామములో మా శుభాకాంక్షలు. గడచిన ఫిబ్రవరి నెలలో 19వ తేదీ నుండి 24వ తేదీ వరకూ మనుజ్యోతి ఆశ్రమమునందు శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ మహిమ దిన వుత్సవములు బ్రహ్మాండముగా జరిగినవి. మీటింగులు జరిగిన దినములన్నియూ ఆవరణము అంతటా శ్రీమన్నారాయణ మహిమ ప్రసన్నతతో నిండియున్నది. వీటిలో కలుసుకొనిన వారందరికీ చాలా ఆశీర్వాదముగా వుండినది. ఫిబ్రవరి 19వ తేదీ సాయంత్రమున సౌందర్య లహరి సంగీత కచేరి కార్యక్రమముతో ప్రారంభించబడిన ఈ ఉత్సవములు 24వ తేదీ రాత్రి ముగించబడినవి. 24వ తేదీ ముఖ్యమైన పండుగ దినముగా ఆచరించబడినది. ఆ దినమున  అనేకమంది ముఖ్యమైన అతిధులు కూడా విచ్చేసియున్నారు. ఈ ఉత్సవములలో సమస్త వేదముల అధ్యాయనము జరిగినది. శ్రీదేవాశీర్‌ లారి గారి కుమారులు శ్రీ డి. పాల్‌ ఉపాజ్‌ లారిగారు, శ్రీ డి. లియో పాల్‌ సి. లారిగారు వేదముల నుండియు,  శ్రీలహరికృష్ణగారి సందేశముల నుండియు అనేక కార్యములను భక్తులకు వివరించారు. భగవాన్‌ శ్రీలహరికృష్ణగారు తన అమూల్యమైన సందేశములో ఈ విధముగా చెప్పియున్నారు. ”భగవంతునితో నడుచుట అంటే అర్ధము ఏమిటి? దేవునితో సహవాసమును కలిగియుండుట అని అర్ధము.  రెండు వేరే వేరే రకములకు చెందిన జీవుల మధ్యన ఎటువంటి సహవాసము వుండనేరదు. కప్ప, ఎలుక సహవాసమును కలిగియుండలేవు. ఆవు, … Read entire article »

Filed under: వైకుంఠలోక ఉత్సవములు

46వ కల్కిజయంతి ఉత్సవములు

మనుజ్యోతి ఆశ్రమములో బ్రహ్మాండముగా జరిగిన 46వ కల్కిజయంతి ఉత్సవములు ఓం నమో భగవతే శ్రీలహరికృష్ణాయ నమః” ప్రియమైన సహోదర సహోదరీలారా, శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ నామములో అందరికీ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. మీకు తెలియజేయబడిన విధముగా 2015 జూలై 15 నుండి 22వ తేదీ వరకు 46వ కల్కిజయంతి ఉత్సవములు మనుజ్యోతి ఆశ్రమ ప్రాంగణములో బ్రహ్మాండముగా జరిగినవి. ఈ ఉత్సవములకు భారతదేశములో అనేక ప్రాంతముల నుండియు ఇంకా బర్మా, జర్మనీ, అమెరికా, మలేషియా ప్రాంతములనుండియు భక్తులు హాజరయ్యారు. జూలై 1వ తేదీన నారాయణుని ప్రేమపతాకమును ఎగురవేసి, ఆశ్రమము చుట్టూ ఊరేగింపు నిర్వహించబడినది. అలాగే ప్రపంచ మంతటిలోనున్న శ్రీలహరికృష్ణ స్తుతిధ్యాన కేంద్రములన్నిటిలోనూ ప్రేమ పతాకము ఎగుర వేయబడినది. భక్తులు కుటుంభసమేతముగా విచ్చేసి, వారి గుడారములను వారే వేసుకొని ఈ ఉత్సవముల కొరకు సిద్దము చేసుకొన్నారు. కల్కిజయంతి ఉత్సవములు 15వ తేదీ, సాయంత్రమున సౌందర్య లహరి సంగీత కచ్చేరి కార్యక్రమముతో ప్రారంభము అయినవి. మొదటి దినమునకే వేల మంది భక్తులు హాజరుకావడము విశేషముగా కనిపించినది. ఈ ఉత్సవములలో స్త్రీలకు ప్రత్యేక సమావేశము మరియు సర్వమత సమావేశము, దేశీయ సమైక్యతా సమావేశము, చిన్న పిల్లల సాంస్కృతిక కార్యక్రమములు, నాటకములు, పిల్లల ఆటల పోటీలు చోటుచేసుకొనినవి. సర్వమత సమావేశము తెలుగు భాషయందే గాక, తమిళము, హిందీ భాషలలో కూడా జరిగినది. వీటిలో … Read entire article »

Filed under: వైకుంఠలోక ఉత్సవములు