தமிழ்| telugu

» హిందూ పురాణములు

విష్ణుభక్త అంబరీషుడు

సూర్యవంశములో సుప్రసిద్ధుడు అంబరీషుడు. అతను హరి పూజ ధురంధరుడు. సద్గుణ సంపన్నుడు. నిరాడంబరుడు. పరిపాలనా దక్షుండు. పూర్వ జన్మ సుకృతం వల్ల అతనికి బాల్యం నుంచి హరి భక్తి ఏర్పడినది. మనోవాక్కాయ కర్మలతో మహా విష్ణువునే ఆరాధించడం అతనికి నిత్యకృత్యం అయినది. విష్ణు భక్తుల్ని ఆదరిస్తూ విష్ణు కీర్తనలను ఆలపిస్తూ విష్ణు మందిరాన్ని పరిశుభ్రం చేస్తూ అతడు కాలం గడిపేవాడు. ఫలాపేక్ష లేకుండా సరస్వతి నదీ తీరంలో అనేక యజ్ఞాలు కావించి రాజర్షి అనే పేరు పొందాడు అంబరీషుడు. కొంతకాలనికి అంబరీషుడు సంసార బంధాలకు అతీతుడై సత్యమార్గంలో ధర్మ నిష్టతో ప్రవర్తింపసాగాడు. విష్ణువు అతని భక్తికి మెచ్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయగల సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు. అంబరీషుడు విష్ణుదేవుని కరుణా కటాక్షములకు పొంగి పులకించాడు. ఒకసారి అంబరీషుడు తన తోడు నీడ వంటి అర్థాంగి లక్ష్మితో కలిసి ద్వాదశ వ్రతాన్ని ఆచరించాడు. వ్రత సమాప్తి చేయడానికి కార్తీక మాసంలో మూడు రాత్రులు ఉపవాసం వుండి విష్ణువుకు షోడశోపాచారములతో అర్చించాడు. బ్రాహ్మణులకు గోవులను దానం యిచ్చాడు. యధావిదిగా వేదవేత్తలను ఆరాధించి ద్వాదశీపారాయణ చేయటానికి సిద్ధమైనాడు. సరిగ్గా అదే సమయంలో భాసుర తపో విలాసుడు, నిరంతర యోగాభ్యాసుడు అయిన దుర్వాస మహర్షి అక్కడకు వచ్చాడు. అనుకోకుండా … Read entire article »

Filed under: హిందూ పురాణములు

భగవద్గీతాసారము

1. నీ మనస్సును పరమపురుషునియందే లగ్నముగావించి అహంకారమును విడనాడి నీ కర్తవ్యమును నిర్వహించుము. 2. మొదట నీ పంచేంద్రియములను అదుపులో వుంచుకొని పాపముతో కూడిన కోరికలను అక్షయయోగము యొక్క సహనముతో నాశనము చేయుము. 3. పరమాత్మ నీ జ్ఞానమునకు అతీతుడని తెలుసుకొని, పరమపురుషుని యొక్క జీవాత్మచే నీ మనస్సును అదుపులో వుంచుకొని, కోరిక అను శత్రువును చంపుము. 4. అక్షయమైన యోగము యొక్క సువార్త గురించిన జ్ఞానమను ఖడ్గముతో పరమపురుషుని గూర్చిన సందేహములను ఖండించుము. మరియు అక్షయమైన యోగము నందు స్థిరముగా వుండుము! లేచి నిలబడుము. 5. సర్వోన్నత బలికి కారకుడును, ముగించువాడునైన నన్నెల్లప్పుడు జ్ఞాపకము చేసుకొనుము. మరియు నీ కర్తవ్యమును నిర్వహించుము. నీ మనస్సును, వివేకమును నాయందే స్థిరముగా వుంచినచో, నా వద్దకే వచ్చెదవు. 6. ఎల్లప్పుడు సర్వోన్నత బలి యొక్క సువార్తయందే స్థిరముగా వుండుము. 7. నీ మనస్సును నాయందే స్థిరముగా వుంచుము. నాకు భక్తుడుగ వుండుము. నీ జీవితమును నా కొరకు అర్పించుము. నీవు నన్ను చేరుకొందువు. నీవు సజీవయాగముగా వుండవలెను. … Read entire article »

Filed under: హిందూ పురాణములు

శ్వేత వరాహావతారము

కశ్యప ప్రజాపతి భార్య అదితికి ఇంద్రాది దేవతలు జన్మించారు. వారు వైకుంఠవాసుడైన శ్రీహరి అండదండలతో మహాబలవంతులై అనేకసార్లు తమ దాయాదులైన దానవుల మీద దాడులు చేసి తరిమికొట్టారు. అలా భూలోకం మీద ఆశ్రయం కోల్పోయిన దానవులు  ఆశ్రయం లేని వారవడంతో తన సవతి మీద పగబట్టిన దితి వేళగాని వేళ ౖఅసుర సంధ్య వేళలో భర్తతో సంగమించి హిరణాక్ష, హిరణ్యకశిపులను కన్నది. వీరే వైకుంఠ ద్వారపాలకులైన జయ, విజయులు. దానవులూ దేవతలూ కూడా బ్రహ్మవంశవారసులే …. కశ్యప ప్రజాపతి సంతానమే అయినా సవతులైన వారి తల్లుల మధ్య ఏర్పడిన కక్ష కాస్తా ద్వేషంగా మారి ప్రతీకారానికి దారి తీసింది. పైగా దేవతలకి అండగా విష్ణువు నిలవడం వల్ల దానవులకి విష్ణువు కూడా దేవతలతో పాటు విరోధి అయ్యాడు. విష్ణువే బ్రహ్మ వంశమునకు మూలపురుషుడు, విష్ణువు నాభి కమలంలోనించే బ్రహ్మ జన్మించాడు. ఆవిధంగా దేవతలతో పాటు దానవులకి కూడా తాత అయిన విష్ణువు సమాన న్యాయం పాటించకుండా దేవతలకి కొమ్ముకాయడం దానవుల ఆగ్రహానికి కారణమైంది. అయితే విష్ణువు మహా బలవంతుడు మాయావి. క్షీర సముద్రంలో నివసించే విష్ణువు ఎప్పుడు రూపు ధరిస్తాడో ఎక్కడ దాగి వుంటాడో ఎవ్వరూ చెప్పలేదు. అందుకే ముందుగా విష్ణువుని సంహరించి అనంతరం దుర్భలులైన దేవతల … Read entire article »

Filed under: హిందూ పురాణములు

శ్రీకృష్ణభగవానునికి కష్టాలు ఏమిటి?

శ్రీరాముని కంటే ఎక్కువ సందర్భాలలో కష్టనష్టాలను చవి చూసినవాడు శ్రీకృష్ణుడు. కృతయుగములో శ్రీరామునిగా మనకు ఎన్నో ఆదర్శాలను బోధించినవాడు శ్రీమహావిష్ణువే! మళ్ళీ ద్వాపరయుగములో శ్రీకృష్ణునిగా జన్మించి ఎన్నో బాధలనూ, కష్టాలను అనుభవిస్తూ, మనకెన్నో ధర్మ సందేశాలను అందించాడు. శ్రీకృష్ణునిది విలాస జీవితం అని అనుకొంటారు ఎంతోమంది. నిజానికి శ్రీరాముని కంటే హెచ్చు సందర్భాల్లో కష్టనష్టాలను చవి చూసినవాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా, ఏనాడూ ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు, మనకు కష్టాలుగా కనిపించవు. శ్రీరాముని జీవితమే మనకు కష్టాలమయంగా కనిపిస్తుంటుంది. ఈ విషయంపై ఒకసారి దృష్టి సారిద్దాం. శ్రీరాముని శైశవం, బాల్యం బహుసుఖంగానే గడిచాయి. సీతను వివాహమాడిన అనంతరం కొన్నేళ్ళు సుఖంగా జీవించాడు. ఆ తర్వాత 14 సంవత్సరాల అరణ్యవాసం, ఉత్తరకాండలో సీతావియోగం. ఇవీ శ్రీరామునికి వచ్చిన ముఖ్యమైన కష్టాలు. కొంత కాలం కష్టాలు అనుభవించినా, ఆయన సుఖపడిన సంవత్సరాలు చాలా వున్నాయి. ఇక శ్రీకృష్ణుని సంగతి చూద్దాం. పైకి సుఖంగా, హాయిగా వున్నట్లు కనిపించినా, పుట్టింది మొదలు దేహత్యాగం చేసేవరకూ కూడా ఎన్నో కష్టాలు, సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై, స్థిరజీవనం లేకుండా కాలం గడిపాడు శ్రీకృష్ణుడు. ఆ వివారాలను క్లుప్తంగా తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు … Read entire article »

Filed under: హిందూ పురాణములు

తల్లికి కపిలుడి తత్త్వ బోధ

ఆడపిల్లలు అత్తవారిళ్ళకి వెళ్ళిపోయారు. భర్త సన్యసించి మోక్షగామియై తపోవనాలకి వెళ్ళిపోయాడు. ఇక నా గతి ఏమిటి?’ అని చింతించిన దేవహూతి ఒకనాడు ధ్యాననిష్ఠుడై వున్న కపిల మహర్షిని సమీపించింది. తల్లి రాకలోని ఆంతర్యాన్ని గ్రహించిన కపిలుడు ప్రసన్న మందహాసం చేసి ”అమ్మా… నీ మనస్సులో చెలరేగుతున్న సంక్షోభాన్ని గుర్తించాను. స్వాయంభువ మనువుకి పుత్రికగా జన్మించావు. కర్ధమమహర్షి వంటి ఉత్తముడిని భర్తగా పొంది లోటులేని సంసారజీవనం సాగించావు. పదిమంది సంతానానికి జన్మనిచ్చి మాతృమూర్తిగా గృహిణిగా గృహధర్మాన్ని నిర్వర్తించావు. నీలాంటి ఉత్తమ జన్మ అనునది కోటికి ఒక్కరికి వస్తుంది. ‘లేదూ…’ అన్నది లేకుండా చక్కటి జీవితాన్ని గడిపిన నీకు యీ దిగులు దేనికమ్మా?” అని అడిగాడు. ”నాయనా… నువ్వన్నది నిజమే. నా తండ్రి స్వాయంభువ మనువు అల్లారుముద్దుగా నన్ను పెంచాడు. ఏ లేటూ లేకుండా తండ్రి నీడలో నా బాల్య జీవితం గడిచింది. అటుపై గృహస్థాశ్రమంలో నా భర్త చాటున ఏ కొరతా లేకుండా నా వైవాహిక జీవితం గడిచింది. తొమ్మిది మంది ఆడపిల్లలకి, ఒక సుపుత్రుడికి తల్లినైనందున నా గృహస్థజీవితం కూడా సంతృప్తిగా గడిచింది. నా అంతటి భాగ్యశాలి లేదనుకొని సంతోషిచాను. కానీ, నాయనా… నాకు వివాహం చేసి తన బాధ్యత తీరిందనుకున్నాడు నా తండ్రి. నన్ను … Read entire article »

Filed under: హిందూ పురాణములు

దైవబలం ముందు మరేబలం సాటిరాదన్న సత్యం

వేదమనే మాటకు బ్రహ్మ, శ్రుతి, జ్ఞానం మొదలయిన అనేక పేర్లున్నాయి. లౌకిక జీవనానికి, అలౌకిక జీవనానికి కావలసిన జ్ఞానమూ, కర్మలూ అన్నీ వేదములలో జన్మిస్తాయి. సమస్త ధర్మములకు మూలాలు వేదములలోనే వున్నాయి. యుగాలు గడిచే కొలది జీవుల ఆయుర్ధాయం, మేధాశక్తి తగ్గుతూ వుంటాయి. కనుక విపరీత వ్యాఖ్యలు చేసే అల్పబుద్ధులు పుట్టుకొస్తాయి. వాటిని ఈ కలియుగములో విపరీతముగా చూడవచ్చును. కాబట్టి వేదార్ధం అందరికీ సులభముగా బోధపడేలా వేదవిజ్ఞానం అవిచ్ఛన్నముగా కొనసాగేలా చూడడానికి, ప్రతి యుగములో వేదములు క్రోడీకరించే పని జరుగుతూనే వుంటుంది. అసలు చూచినట్లయితే ఒక్కొక్క కార్యాన్ని నిర్వర్తింపచేయడానికి పరమాత్ముడు తన అంశతో ఒక్కొక్క అవతారాన్ని ఉద్భవింపచేస్తాడు. వ్యాసుడు కూడా అటువంటి అవతార విశేషమే. వాస్తవముగా నారాయణునికి జన్మించిన మానసపుత్రుడు. అప్పుడతని పేరు అపాంతరముడు. అంటే లోపలి చీకటిని (అజ్ఞానాన్ని) తొలగించుకొనిన వాడన్నమాట. బ్రహ్మ ముఖము నుండి ప్రకటించిన వేదాలను శ్రద్దగా విని వాటిని విభజించమని అపాంతరముని నారాయణుడు ఆదేశించాడు. అపాంతరముడు ఆ ఆజ్ఞను ఎంతో శ్రద్దగా చక్కగా నిర్వర్తిస్తాడు. బ్రహ్మ ఎంతో సంతోషించి వేదవ్యాసుడు అను బిరుదు యిచ్చి, ప్రతి మన్నంతరములోనూ (యుగము ముగింపులోనూ) ఈ విధముగా వేదవిభాగము చేస్తూ వుండమని కోరాడు. ఈ విధముగా ఆ పేరు ఒక పదవినీ, హోదాను సూచించేదిగా … Read entire article »

Filed under: హిందూ పురాణములు