தமிழ்| telugu

» వేదములలోని మర్మములు » మీరు భగవంతుని తప్పక తెలుసుకోవాలి

మీరు భగవంతుని తప్పక తెలుసుకోవాలి

భగవంతుని ఎవరూ చూచియుండలేదు. భగవంతుడు ఆత్మగా వున్నాడు. ఈ విశ్వమంతా ఆయన నిండియున్నాడు. ఈ లోకములోనున్న సమస్తములోను ప్రవేశించగలడు. అందుకే భగవంతుడు యిక్కడ వున్నాడు, అక్కడ లేడని చెప్పలేము. భగవంతుడు మనుష్యవర్గమునకు తన స్వభావమును బయలుపరచాలని ఆశించుచున్నాడు. దానికొరకు మాత్రమే భగవంతుడు ప్రారంభములో ఆదిలో గొప్ప పురుషుని సర్వోన్నతుడ్ని సృష్టించెను. ఎవరూ విద్యుచ్ఛక్తిని చూడలేరు. ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ లేకుండా విద్యుచ్ఛక్తిని పొందుకోలేరు. ట్రాన్స్‌ఫార్మర్‌ అధిక విద్యుచ్ఛక్తిని పొందుకొని అవసరమైనదాన్ని పంపిస్తుంది. దానితో మీకు ఫేన్‌, ట్యూబ్‌లైట్‌, రిఫ్రిజిరేటర్‌, ఎ.సి. మొదలగు అనేకవిధాలైన సౌకర్యాలు అనుభవిస్తున్నాము. కరెంటు గురించి తెలిసిన వ్యక్తి ఫేన్‌, ట్యూబ్‌లైట్‌, రిఫ్రిజిరేటర్‌ను ఆరాధించడు. కరెంటు గురించి తెలియనివాళ్ళే ఆరాధిస్తారు. విద్యుచ్ఛక్తి వీటినన్నిటినీ పని చేయునట్లు చేయుచున్నది. అందుకే భగవంతుని గురించి స్పష్టమైన అవగాహన కలిగియుండాలి. భగవంతుని మీరు తప్పక సత్యముతోను, ఆత్మతోను ఆరాధించాలి.

సత్యము అంటే ఏమిటి? పరమపురుషుని నోటి నుండి ఏది వచ్చునో అదే సత్యము. ఈ పరమపురుషుడు ఎవరు? ఆయన ఒక ట్రాన్స్‌ఫార్మర్‌గా వున్నాడు. ఆత్మ స్వరూపియైన భగవంతుని శక్తినంతటినీ కలిగియుండునట్లు ఆయన మాత్రమే చేయబడియున్నాడు. కనబడని భగవంతుని మనము చూడలేము. కానీ పరమపురుషుని చూడగలము. ఆయననే హిందువులు శ్రీమన్నారాయణుడు అనియు, క్రైస్తవులు క్రీస్తుయేసు అనియు, ముస్లీములు అల్లా అనియు పిలుస్తున్నారు. ఆయనే భవిష్యత్తులో లోకమంతటికీ న్యాయాధిపతిగా వున్నాడు. అందుకే అవతార పురుషులు వచ్చి, కనబడని ఆత్మ యొక్క నిజమైన గుణాతిశయములను చూపించారు. ఇందుమూలముగా మనకు ఎటువంటి భగవంతుడు వున్నాడని అర్థం చేసుకోవాలి. ఒక మనుష్యుడు ఆయనను ముట్టుకున్నప్పుడు జీవమును పొందుకొంటున్నాడు. ఆ నారాయణుడు మాత్రమే జీవమును కలిగియున్నాడు. ఆ జీవమే మనుష్యులకు వెలుగైయున్నది. మహర్షులు, ప్రవక్తలు సూచించిన ఆ పరమ పురుషుడు ఎవరూ అనే విషయం మనం తప్పక తెలుసుకోవాలి.

ఆదిశంకరాచార్యునికి – ఆనందలహరి, సుధానంద లహరి, గానలహరి అనే నామము బయలుపరిచాడు.

వీరబ్రహ్మంగారికి – పాలోయమ్మ పాలు, నా దేహమెరుగని పాలు. ఆయన ఆనందాశ్రమములో అమరియుంటాడని తెలియ జేయబడింది.

ముత్తుకుట్టి స్వామికి – మూడు నూతులు గల మండపం – మండపంలో శివలింగం – అదే నారాయణుడు నివసించే స్థలమని పలుకబడింది.

విలియం బ్రన్‌హాము – 200 పౌండ్లు బరువుగల నల్లటి వ్యక్తి దక్షిణ భారతదేశం నుండి వస్తాడని, ఆయనే రాబోయే క్రీస్తని తెలియజేయబడింది.

రవీంధ్రనాథ్‌ఠాగూర్‌ – భారతదేశ భవిష్యత్తును నిర్ణయించే భాగ్య విధాత నీకే విజయం, విజయం, విజయం అని జాతీయ గీతం ద్వారా ప్రవచించారు. ”గీతాంజలి” పుస్తకములో నల్లటివ్యక్తి చేతులు వెనక్కు కట్టుకొని రోడ్లపై చెప్పులు లేకుండా నడుస్తాడని, ఆయనను ఎవరూ కనుగొనలేరని బయలుపరిచారు.

కాబట్టి ప్రియమైన స్నేహితులారా! ఆ వ్యక్తే పరమపురుషుడని గ్రహించి, భూలోక వైకుంఠమైన తిరునల్వేలి జిల్లాలో మనుజ్యోతి ఆశ్రమములో వెలిసియున్నారు. ఆయన్ను తెలుసుకొని మరణములేని అమరత్వమును పొందుకొనుడి.

– కూర్పు: పైడిరాజు మాస్టార్‌, పెందుర్తి

Filed under: వేదములలోని మర్మములు