1. Home
  2. »
  3. కవితలు
  4. »
  5. నీ నామ మాధుర్యం
నీ నామ మాధుర్యం
లహరికృష్ణ నీ నామం ఎంతో మధురం ఘణ ఘణ మ్రోగే కంచువలే ప్రతిధ్వనిస్తుంది, నీ నామం ప్రపంచమంతయు నీ నామం వినగానే, ప్రజల గుండెల్లో ఏదో తెలియని సంతోషం అది వినడానికి ఒక తియ్యని మాధుర్యం! వస్తారు భక్తులు నీ నామాన్ని తెలుసుకోవడానికి, నీ సన్నిధికి ఆతృతతో వెళ్తారు నీ యొక్క ఆశీర్వాదములను పొందుకొని మనఃశ్శాంతితో నీ నామం వినగానే పులకిస్తుంది తనువు నీ నామంలోనే వుంది జీవము! నీ నామాన్ని జపించగానే, తీరెను ఎన్నో కష్టాలు! కలి యొక్క కదలికను సైతం జయిస్తుంది నీ యొక్క గొప్ప నామం వేదములలో చెప్పబడిన విధముగా కలియుగములో కల్కిమహావతారమైన లహరి అనే నామముతో దిగివచ్చావు అదే శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణ నీ నామం – ఎస్‌. శాంతకుమారి, కొరుట్ల. మన ఆదిబలి జెండా! సర్వలోకములు ఎగిరే జెండా మన ప్రేమ జెండా దేవుని ప్రేమకు అర్ధం ఆ జెండా సత్యమును తెలిపే ఆ జెండా – మనకు అండగా నిలిచే ఆ జెండా సర్వశక్తిగల ఆ జెండా – మనకు భద్రతను యిచ్చే జెండా ఏడు వర్ణములు కలిగిన ఆ జెండా – సత్యం, నీతి, ధర్మానికి అర్థం ఆ జెండా విష్ణువు చేతిలో తిరుగుచున్న చక్రం – గెలుపుకు ఆయుధంగా వున్నది ఆ జెండా ఆదిబలిని తెలిపే ఆ జెండా – దేవుని నీతిని చూపే తెల్లని ఆ గీత సత్య సమాధానములే పచ్చని గీత – మధ్యనున్న తెలుపుకాంతి తేజోమయం ఇలా భగవంతుని సంకల్పమును ఏకంగా తెలిపే ఆ జెండా మన ఆదిబలి జెండా – చివరి వరకు నిలిచే జెండా మన రాజు యొక్క జెండా ఇదియే పరమ పురుషుని నిత్యమైన ప్రేమ జెండా – హవీలా, మనుజ్యోతి ఆశ్రమము. కోటి కోటి వందనాలు లహరి కోటాను కోటి స్తుతులకు మూలము లహరి కోటి సూర్యుల కాంతిలో వెలుగైయున్నవాడు లహరి కోటి కిరణాల కిరీటమును ధరించినవాడు లహరి కోదండ రాముడే లహరి – కోరిన వరములు తీర్చువాడు లహరి కోకిల గానము లహరి – హృదయమనే కోవెలలో నివసించువాడు లహరి కోపములేని శాంతం గలవాడు లహరి కొదమ సింహము యొక్క భుజంగములను అణగద్రొక్కువాడు లహరి కొండలను పిండి చేయువాడు లహరి – సీయోను కొండపై వెలిసినవాడు లహరి కోట్లకొలది జనులను సమకూర్చువాడు లహరి కోటి కోటి వందనములు నీకు లహరి – కొలిచెద కోటి కోటి పూజలతో నిన్ను లహరి! – మధులత, మనుజ్యోతి ఆశ్రమము సృష్టిని చూచి నేర్చుకో ! భగవంతుని చిత్రాంలకారమే ఈ ప్రకృతి విశ్వంను కలుగజేసిన ఓ విశ్వరూపి – విశ్వ విచిత్రాన్ని వింతగా చూపే సుంధరమూర్తి! ఎన్నెన్నో వర్ణాలు – అన్నింటా అందాలు ప్రకృతి రంగులు – చిరు చిరు గాలులు పరిమళాలు విరజిల్లు – వికసించు పుష్పాలు ప్రకృతి నీ రాకకై సంగీతం పాడేను – చప్పట్లు కొట్టి స్వాగతం తెలిపే పశుపక్ష్యాదులు చేసే నీ త్యాగం – ఫలవృక్షాలు తెలిపే నీ యజ్ఞ ఫలం! చిలుక తన పలుకులతో రాగం తీసే – గానం చేసే కోయిల గాన లహరికై! పక్షులన్నీ నీకై స్వరమెత్తి పాడేను – నాట్యమాడేను మయూరి ఆనంద లహరికై! ఉచ్చరించే నదులు సంగీత లహరిని – స్వాగతించే అలలు సౌందర్య లహరిని! నీ మహిమను తెలిపే నీ అమోఘాలు! – నీ ఘనతను చాటే నింగిలోని వింతలు! హద్దులు మీరని అంతరిక్షం – నీ ఆజ్ఞకై పయనించు సూర్య చంద్రులు! చిత్ర విచిత్రం నీ సృష్టి – నీ ఆనందముకై పరుగులెత్తే ప్రకృతి చక్రం! చివరికి నీలో కలిసిపోవాలి అని ఆశించే ఈ సృష్టి ! కాని మానవునికి ఏమైనదో … సృష్టికర్తను విడిచి సృష్టినే పూజించే అజ్ఞానంతో… సృష్టిని చూచి నేర్చుకో పామరుడా – ఓ మానవుడా! – బి. రాజేష్‌, గోదావరిఖని నిదరోకురా నరుడా! చూడ మాయేగా ఈ లోకము నీడ నిజమని తలచెరా నరుడా! నిదరోకురా, కాచుకొని వుంది కారు చీకటి మనుజ్యోతి కాంతిలో శాంతినొంద లహరి ధరి చేరరా! నిజ ధర్మమెరుగలేని జన్మమేలరా నీకు వ్యర్థమేగా ధర్మాచరణ లేని నీ జన్మము నమ్మకురా వంచనకై తిరుగు కలి ఈ లోకసంచారము తనే కల్కినని చాటుకునే కలి ప్రచారము అబద్దానికి అప్పు పడిన తప్పదురా ముప్పు నీకు కల్కిమహావతారుడు శ్రీలహరికృష్ణుని విడిచెనో కలికి బలిగా మిగిలేవురా ఓదార్పు లేని నిట్టూర్పు కాలమిది నా లహరికృష్ణుని నిత్య జీవ వాక్కులకై రానున్న క్షామమది నమ్మరా సోదరా! మాధవుడే మానవుడై దిగివచ్చి చెప్పిన సత్యమిది! – రంజిత్‌, కొరుట్ల
Scroll to Top