1. Home
  2. »
  3. చిత్రపటములు
  4. »
  5. మీ మెయిల్‌ – మీ మాట….
మీ మెయిల్‌ – మీ మాట….
గౌరవనీయులైన మనుజ్యోతి ఆశ్రమ సంపాదక మహాశయులువారికి నమస్కారములు. ఆర్యా! తమరు విడుదల చేస్తున్న మనుజ్యోతి త్రైమాసిక పత్రికను ఓ ప్రముఖ జర్నలిస్టు నాకు యిచ్చారు. అది చదివి నేను ఆనందించాను. మత సామరస్యమే ధ్యేయంగా పత్రికను నడిపిస్తున్నట్లు గ్రహించాను. అన్ని వేదముల సారాంశమును ఏకీకృతం చేసి రాస్తున్నందుకు ఎంతో అనుభూతిని పొందాను. ”ఒకే దేవుడు – ఒకే దేశము” భావనతో పత్రికలోని ప్రతీ పేజీ ప్రతిబింబింపజేస్తోంది. మాకు యింకా మీ పుస్తకములు, భగవద్గీత, ఖురాన్‌ వంటివి పంపించగలరని ఆశిస్తూ…. – జె. గోవింధరావు, శ్రీకాకుళం. శ్రీ మనుజ్యోతి ఆశ్రమ అధ్యక్షులకు, ఎడిటర్‌ గార్కి నమస్కరించి వ్రాయునది. మీరు ప్రచురించే మనుజ్యోతి త్రైమాసిక పత్రికను చదివాను. చాలా బాగుంది. అన్ని మతములను ఒకటిగా చూపించు చున్నందుకు చాలా సంతోషం. ఆ పత్రికలను మాకు తరుచూ పంపించవలసిందిగా కోరుచూ… – తోరం తమయ్య, మండపేట. శ్రీ మనుజ్యోతి ఆశ్రమము వారికి, మనుజ్యోతి పత్రిక ఎడిటర్‌ గార్కి నమస్కరించి వ్రాయునది, అయ్యా మీ యొక్క మనుజ్యోతి త్రైమాసిక పత్రికను చదివాము. భగవంతుడు మనకు చెప్పిన ప్రతీ విషయమును మన మనస్సులో వుంచుకొని ప్రవర్తించినచో నిశ్చయముగా భగవంతుని యొక్క భద్రత మనకు ఎల్లప్పుడూ వుంటుంది. మనకే కాకుండా, మన కుటుంభమునకు, మన ప్రాంతమునకు, మన దేశమునకు కూడా ఆయన యొక్క భద్రత ఎల్లప్పుడూ వుంటుంది. కనిపించని భగవంతుని కోసం మన ఆత్మ ఎంతో వేదన చెందుతుంది. కాని కనిపించే శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారే నిజమైన దేవుడు. ఈ ప్రపంచంలో అందరూ బాగుండాలి. మీ పత్రిక చదివి మేము చాలా ఆధ్యాత్మిక విషయములను తెలుసుకున్నాము. మాకు యింకా సి.డి.లు, పుస్తకములు పంపించ వలసిందిగా కోరుచూ… – డి. అప్పలరాజు, విశాఖపట్నం. శ్రీ మనుజ్యోతి ఎడిటర్‌ పాల్‌ ఉపాజ్‌ గార్కి హృదయపూర్వక నమస్కారములు. మీ మనుజ్యోతి పత్రికను చదివాను. అందులో ప్రచురించే ప్రతీ అంశము నాకు చాలా బాగా నచ్చింది. ఒకే దేవుడు! ఒకే దేశము! గురించి శ్రీలహరికృష్ణగారు చెప్పే ప్రతీ మాటలు నిజమైనవి. మా కుటుంభమంతా ఆ పత్రికను చదివాము. మాకు యింకా మనుజ్యోతి ఆశ్రమము గురించి, లహరికృష్ణగారి గురించి తెలుసుకోవాలని వుంది. దయచేసి మాకు పుస్తకములు, డి.వి.డి.లు పంపించవలసిందిగా ఆశిస్తూ…. – కె. ప్రసాద్‌, విజయనగరం. శ్రీ మనుజ్యోతి ఆశ్రమము వారికి మరియు ఎడిటర్‌ గార్కి నమస్కారములు. మీ ‘మనుజ్యోతి’ త్రైమాసిక పత్రికను చదివాను. చాలా మంచి మంచి విషయములు ప్రచురిస్తున్నారు. బైబిలు, భగవద్గీత, ఖురాన్‌ అన్ని గ్రంధముల నుండియు సేకరించి జనులకు మంచి సందేశములను అందించుచున్నారు. ఒక మంచి మార్గమును, ఒక మంచి ఆత్మీయ దృష్టిని జనులకు తెలియజేస్తున్నారు. మంచి ఆలోచన! నాకు యింకా మీ పుస్తకములు పంపించగలరని ఆశించుతూ…. – వి. కొండలరావు, వరంగల్‌
Scroll to Top